ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చోడవరం, (విశాఖపట్టణం జిల్లా)లో నేను తెలుగు ఉపన్యాసకుఁడుగా విధులు నిర్వహించే రోజులలో విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు వీలుగా లిఖిత ద్వైమాసపత్రిక "యువతరంగం" పేరుతో ప్రారంభించినాను. విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే సహృదయులైన మహనీయులకీ విషయం తెలిపి, వారి ఆశీర్వాదం అర్థించేవాడిని. వారు పత్రిక చదివి, ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులతోపాటు ఆ పత్రికలో ప్రచురితమైన రచయితలైన విద్యార్థులకందరికీ ఆరితోషకం ఇచ్చేవారు. నా ఉద్యోగ జీవితంలో విజయానికి ఇది ఎంతగానో సహాయపడటమే కాక, అనేకమంది విద్యార్థులు ర్ర్ ప్రోత్సాహంతో ఎంతగానో అభివృద్ధిపొంది నేడు చక్కని ఉద్యోగాలు చేసుకొంటూ ఆదర్శ భారతీయులుగా జీవిస్తున్నారు. 2005 నుండి 2008 వరకు నిరాఘాటంగా ఈ ప్రక్రియను కొనసాగించగలిగాను. 30-6-2006ని నేను పదవీ విరమణ చేసిననాడు కూడా ఒక పత్రిక విడుదలచేయడం జరిగింది. దురదృష్ట వశాత్తు ఆ పత్రిక అప్పటితో ఆగిపోయింది.
31 - 12 - 2007 న ఆవిష్కరించిన యువతరంగం - కళాశాల విద్యార్థుల ద్వైమాసిక పత్రిక.
ఉత్సాహవంతులైన విద్యార్థులే ఈ పత్రికా నిర్వహణబు కొనసాగించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఆదైవ కృప ఎలాగుందో తెలియదు.
ఆర్యులారా! ఆంధ్రామృత పాఠకులైన మీ అందరి ప్రోత్సాహం నా చేత యాదాద్రి శ్రీనృసింహశతకరచనను చేయించిమ్ది. ఆ శతకమును చదివిన ప్రజాపత్రిక యాజమాన్యం వారి పత్రికలో ఈ శతకం విషయం ప్రస్తావించింది.
ఈ విషయం మీముందుకు తేవడం, ప్రోత్సాహకులైన మీ అందరికి నా ధన్యవాదాలు తెలియజేయడం నా ధర్మంగా భావించి ఆ పత్రికా ప్రచురణ మీముందుంచుచున్నాను.
ప్రత్యక్షంగా పరోక్షంగా నా కవితాపాటవానికి మూలమైన
మీ అందరికీ ఈ విధంగా నన్ను ప్రోత్సహించుచున్న ప్రజాపత్రిక వారపత్రిక యాజమాన్యమునకు, దూరవాణిద్వారా నన్నభినందించుచున్న మహనీయులందరికి, నా ధన్యవాదాలు తెలియఁ జేసుకొంటున్నాను.
ఆర్యులారా! చూచారా ఈ అనంత కాలంలో మన జీవన ప్రమాణం ఎంత చిన్నదో. చూడండి.
చూచారు కదా! ఆశ్చర్యం వేస్తోంది కదూ?
ఇంత తక్కువ జీవనావలాశాన్ని మాత్రమే పొందిన మనం ఆ జగన్మాతలో ఐకఒం ఐపోగలిగేటంతటి సత్ఫలితాన్ని సాధించే అవకాశం ఇచ్చిన ఆ పరమాత్మ ఎంతటి దయామయుఁడు!
ఇంతటి మహదవకాశన్ని మనం అనవసర విషయాసక్తితో వృధా చేసుకుంటే అంతకు మించిన అవివేకం వేరే ఉంటుందా? అలోచించండి. సన్మార్గ ప్రవృత్తి చాలు ఆ అమ్మ మనలను తనదగ్గరికే చేర్చుకోవడానికి. సత్ప్రవర్తనతో సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ జన్మకు సార్థకత కల్పించుకుందాం
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు.
సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.
ఫల శృతి:
రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.
అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము! అని పలికెను.
ఆర్యులారా! ౦౧ - ౦౩ - ౧౯౭౪ వ తేదీన నేను శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్ లో ప్రథమాంధ్రోపాధ్యాలుగా బాధ్యత చేపట్టినాను. ౮వతరగతి నుండి చదివి పదవ తరగతి పరీక్షలకు వెళ్ళిన విద్యార్థినీ విద్యార్థులు, నాతోపాటు ఆనందోత్సాహాలతో ఉపాధ్యాయ వృత్తి నెరపుచున్న నా మిత్రులు. అందరూ ఆదర్శ జీవనులే. వారందరిలోని మంచి లక్షణములన్నీ నన్ను చేరుట చేతనే నేను చెడ్డవాడిగా అనిపించుకోవటానికి అవకాశం లేక మంచు పేరు నా కాపాదింపబడింది.
నిరతము మిత్ర సంస్కృతిని నేర్పున నన్గని మెల్గుచుండి, నన్
గరుణను ప్రోత్సహించుచు ప్రకాశముఁ గొల్పిరి తోటి వారలా
గురువులు నాకు మిత్రులును, కోవిదులున్, గురు సన్నిభుల్. సదా
కరుణను చూపు వారలకు గౌరవమొప్ప నమస్కరించెదన్.
వారందరికీ నా అభినందన పూర్వక కృతజ్ఞతలు.
ఈ నా విద్యార్థులనేకమంది తాము చేపట్టిన వృత్తులలో నిపుణత చూపి మాకు మంచి పేరు తెచ్చి, పదవీ విరమణ కూడా చేసియున్నారు.
తెలుగు భాష ఎలా పుట్టింది?
-
తెలుగు భాష ఎలా పుట్టింది?
సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాక్రుత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ
శబ్దభవమైన తి-అలింగ (ప్రాక్రుతం) పదం నుండిగానీ లేదా...
తర్పణం ఎలా వదలాలి?
-
తర్పణం ఎలా వదలాలి?
ముఖ్య గమనిక తండ్రి బతికి ఉంటే పితృ తర్పణాలు చేయరాదు!
కావలసిన సామగ్రి:
దర్భలు,నల్ల నువ్వులు, తడిపిన తెల్ల బియ్యం, చెంబులో మంచినీరు (ఆ...