గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2023, గురువారం

మాన రకష,ధర్మ తెరవు,ధీరతేజ,రక్షిత ధర్మ, శ్రీపాద,ధర్మ రక్ష, గోవర్ధన, గర్భ స్థి ధర్మ వృత్తము. రచన;-వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి. జుత్తాడ. .

 జైశ్రీరామ్.

మాన రకష,ధర్మ తెరవు,ధీరతేజ,రక్షిత ధర్మ, శ్రీపాద,ధర్మ రక్ష, గోవర్ధన,
గర్భ స్థి ధర్మ వృత్తము.
                               స్థిర ధర్మ వృత్తము
                              ============÷
                                               రచన;-వల్లభవఝల అప్పల
                                                                      నరసింహ మూర్తి.
                                                         జుత్తాడ.

కురులే!కౄర విషాసులై!కురు క్షేత్రం బేర్చెన్గదా!గోపాల ధర్మ రక్షార్ధమై!
తిరిగెన్మానము కాపునై!తిరుగే!లేదంచున్భువిన్!గోపార్ణవమున్మునిగెన్!
సిరియౌ ద్రౌపది హిసకున్!చెరెపె న్నీచాళుల్ సిరుల్!శ్రీపాద కీర్తులే!భవ్యమై!
ధర క్షోభిల్లెను నిత్యమున్!తెరవౌ!ధర్మం బెంచగన్!దీపించు ధీరమున్!
                                                                                   తేజమున్!!

భావము;-సిరి స్వరూపిణి! ద్రౌపదీ మాతను,నిండు సభకునీడ్చే గాక,
వలలువలు పెరికిన దూశ్శాశను ని దురాగతమునకు,కురు క్షేత్రంబున
కురు వంశ నిర్మూలనమై,గోపాలు డా శ్రీకృష్ణుని రక్ష,ధర్మ రక్షయై లోకము
నకు"-ధర్మో రక్షతి రక్షిత యని నిరూపించెను!
పాప సంహారా ర్ధమై భగవంతు డవతార.మెత్తి ధర్మము ను రక్షించును.
అధర్మమును ఛేదించును.యుగ ధర్మము ద్వాపరమున సగము సత్యము
సగ మసత్యముతో విలసిల్లును.నేటి కలియుగాన అసత్యమే వర్తిలును.

పై పద్యము శ్రీ వల్లభేయ ఛందోమదనము"-సృజనాత్మక గర్భ కవితా
స్రవంతి యంలిఅనిరుద్ఛంమున ఉత్కృతి నుండి గ్రహింప బడినది.
ప్రాస నియమము కలదు.యతులు 10,17,యక్షరములు.

1.గర్భగత"-మాన రక్షా వృత్తము.
అభిజ్ఞా ఛందమందలి బృహతీ ఛందము.
ప్రాస నియమము కలదు.

కురులే?కౄర విషాసులై!
తిరిగె న్మానము కాపునై!
సిరి యౌ ద్రౌపది హింసకున్!
ధర క్షో భిల్లెను నిత్యమున్!

2.ధర్మ తెరవు"-వృత్తము
అభిజ్ఞా ఛందము.నందలి అనుష్టుప్ఛందము.
ప్రాస నియమము కలదు.

కురు క్షేత్రం బేర్చె న్గదా?
తిరుగే!లేదంచున్భువిన్?
చెరిపె న్నీ చాళు  ల్సిరుల్!
తెరవే!ధర్మం బెంచగన్!

3.ధీర తేజ"-వృత్తము.
అభిజ్ఞా ఛందము నందలి బృహతీ ఛందము.
ప్రాస నియమము కలదు.

గోపాల ధర్మ  రక్షా ర్ధమై!
గోపార్ణంబు. న్మునిగెన్?
శ్రీపాద కీర్తులే!భవ్యమై!
దీపించు ధీరము న్తేజమున్!

4.రక్షిత ధర్మ వృత్తము"-
అణిమా ఛందము నందలి అత్యష్టీఛందము
ప్రాసనియమము కలదు.10,యక్రమునకు యతి చెల్లును.
పాదమునకు  17 యక్షరములుండును.

కురులే!కౄర విషాసులై! కురు క్షేత్రం బేర్చెన్గదా?
తిరిగెన్మానము కాపునై!తిరుగే! లేదంచు న్భువిన్?
సిరియౌ!ద్రౌపది హింసకున్!చెరిపె న్నీ చాళు ల్సిరుల్?
ధర క్షోభిల్లె ను నిత్యమున్!తెరవే! ధర్మం బెంచగన్!!

5..శ్రీపాద వృత్తము.
అణిమా ఛందమందలి అత్యష్టీఛందము.
ప్రాసనియమము కలదు.9,వ యక్షరము యతి చెల్లును.
పాదమునకు 17,యక్షరములుండును.

కురు క్షేత్రం బేర్చె న్గదా? గోపాల ధర్మ రక్షా ర్ధమై!
తిరుగే!లే దంచున్ భువిన్?గోపార్ణ వంబు న్మునింగెన్!
చెరిపె న్నీచాళుల్ సిరుల్!శ్రీపాద కీర్తులే! భవ్యమై!
తెరవే?ధర్మం బెంచగన్!దీపించు ధీరమున్!తేజమున్!

6.ధర్మ రక్ష"-వృత్తము"-
అణిమా ఛందమందలి ధృతి ఛందము.
ప్రాస నియమము కలదు.10,వ యక్షరముతో యతి చెల్లును.
పాదమునకు 18,యక్షరము లుండును.

కురులే! కౄర విషాసులై! గోపాల ధర్మ రక్షా ర్ధమై!
తిరుగే?లేదంచున్ భువిన్!గోపార్ణ వంబు న్మునింగెన్!
చెరిపె న్నీ చాళుల్ సిరుల్!శ్రీపాద కీర్తులే!. భవ్యమై!
తెరవే!ధర్మం బెంచగన్!దీపించు ధీరమున్!తేజమున్!

7.గోపార్ణవ"-వృత్తము.
అణిమా"-ఛంద మందలి అత్యష్టీఛందము.
ప్రాస నియమము కలదు.10,వ.యక్షరముతో యతి చెల్లును.
పాదమునకు 17,వ యక్షరముతో యతి చెల్లును.

గోపాల ధర్మ రక్షా ర్ధమై!కురులే!కౄర విషాసులై!
గోపార్ణవంబు న్మునిగెన్!తిరుగే!లేదంచున్ భువిన్!
శ్రీపాద కీర్తులే! భవ్యమై!చెరిపె న్నీచాళుల్ సిరుల్!
దీపించు ధీరమున్!తేజమున్!తెరవే!ధర్మం బెంచగన్య!!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.