ఆర్యులారా! వరంగల్ జిల్లా, రఘునాథపల్లి మండలం, అశ్వారావుపల్లి గ్రామంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ గుప్త ప్రసన్న భక్తాంజనేయ స్వామివారి తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత ఘనంగా జరగబోతున్నాయి. మీరంతా అవకాశం కల్పించుకొని స్వామివారి సేవలో పునీత జీవనులై, ఆయురారోగ్య సౌభాగ్య ఆనందాలను శాశ్వితంగా పొందగలరని భావిస్తున్నాను. ఆ స్వామి వారి కరుణ మీపై సదా ప్రసరించును గాక. కార్యక్రమాల వివరాలను చూడండి.
ఆ.వె. వ్యసన మృతులలోన వ్యసనమే కష్టము. వ్యసన విరహితుండు పడయు దివిని. వ్యసన పరుఁడు పొందు ననుపమ దుర్గతి పతనమగుటఁ జేసి పాప గతిని. భావము. ఎవరైనా వ్యసన మృత్యువు లలో ఏది కష్టము అని అడిగితే, వ్యసనమే కష్టమని చెప్పాలి. స్వర్యాత్ అవ్యసనీ మృతః, అంటే ఏ వ్యసనమూ లేనివాడి మృత్యువు తన సత్కర్మల వలన స్వర్గానికి ఎదిగేలా చేస్తుంది, కానీ వ్యసన్యా అధో అధో వ్రజతి అంటే వ్యసనపరుడికి ఒక్కటే మార్గం అధో అధో అంటే కింద కిందకి దిగజారటమే.
ఆర్యులారా! అత్యున్నత సంస్కారాన్నందించడంతో పాటు అత్యంత విలువైన విద్యను కూడా మన పిల్లలకు అందించే అవకాశం ఆ తిరుమలేశుఁడు మనకు కలిగించాడు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో విద్యనభ్యసించిన వారు అనేకమంది మహనీయులుగా గౌరవ పురస్కారములందుకొంటున్న విషయం జగద్విదితమే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనగలరు.