గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, సెప్టెంబర్ 2019, సోమవారం

సంస్కృతము, ప్రాకృతము, తెలుఁగు అక్షరములు

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఆలస్యస్య కుతో విద్యా......మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో. ఆలస్యస్య కుతో విద్యా? అవిద్యస్త కుతో ధనం?
అధనస్య కుతో మిత్రమ్? అమిత్రస్య కుతః సుఖమ్?

తే.గీ. సోమరికి విద్య లభియించునేమిగతిని?
ధనమవిద్యనెటులమరు తరచి చూడ?
ధనములేకున్న మిత్రులన్ దనరుటెట్లు?
మిత్రహీనుడు సుఖమెట్లు మేదినిఁగను?

భావం:-
సోమరికి చదువెక్కడిది. చదువులేని వాడికి ధనమెక్కడిది? ధనం లేని వాడికి మిత్రులెక్కడ? మిత్రులు లేని వాడికిసుఖమెక్కడ?కాబట్టి సుఖం కావలెనన్నచో మిత్రులుండవలెను. మిత్రులుండవలెనన్నచో ధనం ఉండవలెను. ధనం ఉండవలెనన్నచో చదువుండవలెను. చదువుండవలెన్నచో  సోమరితనము ఉండకూడదు. అనగా సోమరితనమును పారద్రోలవలెను.
జైహింద్.

28, సెప్టెంబర్ 2019, శనివారం

డా.జీ.యం.రామశర్మ శతావధాని సుందరకాండ ప్రవచనము.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

ధర్మాదర్థ: ప్రభవతి....మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ధర్మాదర్థ: ప్రభవతి
ధర్మాత్ ప్రభవతే  సుఖమ్.
ధర్మేణ లభతే సర్వమ్
ధర్మసార మిదం జగత్.

తే. గీ. ధర్మమునప్రభవించును ధనము మనకు.
ధర్మమునసుఖమమరునుతరచి చూడ.
ధర్మమున సర్వమమరును ధరణి నయిన.
ధర్మసారంబుజగతిని తలపనిదియె.

భావం:- ధర్మం వల్ల సంపదలు లభిస్తాయి.ధర్మం వల్ల సుఖమ్ లభిస్తుంది.ధర్మం చేత సర్వమూ
లభిస్తుంది. ఈ జగత్తుకు ఆధారమే ధర్మం. మన యితిహాసాలన్నీ ఈ నీతినే బోధిస్తున్నాయి.

ఈ నీతిని ఆదికవి వాల్మీకి అరణ్యకాండలో సీతాదేవి చేత చెప్పించారు.
జైహింద్.

26, సెప్టెంబర్ 2019, గురువారం

గతికా,శ్రీవర్ధన,నరసా,నరజతయా,సత్య,ప్రామాణిక,వినుత,బుధనుత,నిజమెంచు,పామోద,గర్భ"-పసందౌ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ

0 comments

జైశ్రీరామ్.
గతికా,శ్రీవర్ధన,నరసా,నరజతయా,సత్య,ప్రామాణిక,వినుత,బుధనుత,నిజమెంచు,పామోద,గర్భ"-పసందౌ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ,

"-పసందౌ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.త.య.జ.స.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఎవరిగొప్ప వారు చెప్ప!యేముంది?పసందందునన్!ఎదుటివారు చెప్పవలెన్!
భువి నెంతవర్కు నిల్చు?భూమాత నిజంబెంచదే?బుధులుమెచ్చ నిల్వవలెన్!
దివిజ ఖ్యాతి నొంద నెంచు! ధీమం బది!తప్పే యగున్!తిధులు మారు కాలంబునన్?
భవమదెంచి బల్కు మోయి!ప్రామాణిక మౌనే?తుదిన్!బదులుబల్క భావితరమె?
1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
ఎవరిగొప్ప వారుచెప్ప!
భువినదెంత వర్కు నిల్చు?
దివిజ ఖ్యాతి నొంద నెంచు!
భవ మదెంచి!బల్కు మోయి!
2.గర్భగత"-శ్రీవర్ధన"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.య.లగ.గణములు.వృ.సం.77.
ప్రాసనియమము కలదు.
ఏముంది!పసందందునన్?
భూమాత నిజం బెంచదే?
ధీమంబది!తప్పేయగున్?
ప్రామాణిక మౌనె?తుదిన్?
3.గర్భగత"-నరసా"-వృత్తము.
బృహతీఛము.న.ర.స.గణములు.వృ.సం.216.
ప్రాసనియమము కలదు.
ఎదుటి వారు చెప్పవలెన్?
బుధులు మెచ్చ నిల్వ వలెన్?
తిధులు మారు కాలంబునన్!
బదులు చెప్ప భావి తరమె?.
4.గర్భగత"-నరజతయా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.త.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఎవరి గొప్ప!వారుచెప్ప!యేముంది!పసందందునన్?
భువి నదెంత వర్కు నిల్చు?భూమాత!నిజంబెంచదే?
దివిజ ఖ్యాతి నొంద నెంచు!ధీమంబది!తప్పే యగున్?
భవ మదెంచి బల్కు మోయి!ప్రమాణిక మౌనె?తుదిన్!
5.గర్భగత"-సత్య"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.జ.స.జ.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏముంది!పసందందున్?ఎదుటివారు చెప్పవలెన్?
భూమాత!నిజంబెంచదే?బుధులు మెచ్చ నిల్వ వలెన్?
ధీమంబది!తప్పేయగున్?తిధులు మారు కాలంబునన్?
ప్రామాణిక మౌనె?తుదిన్!బదులు చెప్ప భావి తరమె?
6.గర్భగత"-ప్రామాణిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.జ.స.జ.జ.స.జ.గల.గణములు.యతలు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏముంది!పసందందునన్?ఎదుటివారు!చెప్పవలెన్?ఎవరిగొప్ప!వారుచెప్ప!
భూమాతనిజంబెంచదే!బుధులు మెచ్చనిల్వవలెన్?భువినదెంతవర్కునిల్చు!
ధీమంబది!తప్పేయగున్?తిధులు మారు!కాలంబునన్?దివిజ ఖ్యాతి నొందనెంచు?
ప్రామాణికమౌనెతుదిన్!బదులుచెప్పభావితరమె!భవమదెంచిబల్కుమోయి?
7.గర్భగత"-వినుత"-వృత్తము.
ధృతిఛందము.న.ర.స.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఎదుటివారు చెప్పవలెన్?ఎవరిగొప్ప వారు చెప్ప!
బుధులు మెచ్చ నిల్వవలెన్?భువి నదెంత వర్కు!నిల్చు?
తిధులుమారు కాలంబునన్?దివిజఖ్యాతి నొంద నెంచు!
బదులు చెప్ప! భావితరమె?భవమదెంచి బల్కుమోయి?
8.గర్భగత"-బుధనుత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.స.న.ర.జ.త.య.లగ.గణములు.యతులు.10,19,
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఎదుటివారు చెప్పవలెన్?ఎవరిగొప్ప వారుచెప్ప!ఏముంది!పసందందునన్?
బుధులుమెచ్చ నిల్వవలెన్?భువినదెంతవర్కు నిల్చు!భూమాతనిజంబెంచదే!
తిధులుమారు కాలంబునన్?దివిజ ఖ్యాతినొంద నెంచు!ధీమంబది!తప్పేయగున్?
బదులుచెప్పభావితరమె?భవమదెంచిబల్కుమోయి!ప్రామాణికమౌనెతుదిన్!
9.గర్భగత"-నిజమెంచు"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.జ.స.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏముంది పసందందునన్?ఎవరి గొప్ప వారు చెప్ప?
భూమాత నిజంబెంచదే!భువి నదెంత వర్కు నిల్చు!
ధీమంబది తప్పే యగున్?దివిజ ఖ్యాతి నొంద నెంచు!
ప్రామాణిక మౌనె?తుదిన్!భవ మదెంచి బల్కు మోయి!
10.గర్భగత"-పరామోద"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.జ.స.జ.భ.స.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏముంది పసందందునన్?ఎవరి గొప్ప వారుచెప్ప!ఎదుటివారు చెప్పవలెన్!
భూమాత నిజంబెంచదే!భువినదెంతవర్కునిల్చు!బుధులుమెచ్చనిల్వ వలెన్
ధీమంబది తప్పేయగున్?దివిజ ఖ్యాతి నొందనెంచు!తిధులు మారు కాలంబునన్?
ప్రామాణిక మౌనె?తుదిన్!భవ మదెంచి బల్కుమోయి!బదులుచెప్ప!భావితరమె?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

25, సెప్టెంబర్ 2019, బుధవారం

గతికాద్వయ,మృదుమానస,నరజయుగళీద్వయ,నిరక్షర,చేతనా,రసత్రిజా,ద్వయ,క్షుదార్తి,గర్భ"-మూగబోవు"-ద్వయవృత్తములు. రచన;-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
గతికాద్వయ,మృదుమానస,నరజయుగళీద్వయ,నిరక్షర,చేతనా,రసత్రిజా,ద్వయ,క్షుదార్తి,గర్భ"-మూగబోవు"-ద్వయవృత్తములు. రచన;-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

   "-మూగబోవు"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.చదువుకున్నవాడె!శుంఠ!చదువులేనివాడె!గొప్ప!సాగె!నిక్కలియందులే?
  పదునుదప్పె!లోకతీరు!బదులు పల్క నేరమౌను!బాగునౌనె?సుఖాలకున్?
మొదలుచెడ్డ!బేరమాయె!ముదిరె స్వార్ధచింత యెంతొ?మూగియై జన వాణియున్!
సుధలుచింద!కల్లగాదె?సుధలు దీరుటెల్ల మిధ్య!జోగిణేయన బొల్చుతన్?

2.చదువులేనివెడె!గొప్ప!చదువుకున్నవాడు శుంఠ!సాగె నిక్కలియందులే?
   బదులు పలక నేరమౌను!పదునుదప్పె లికతీరు!బాగునౌనె?సుఖాలకున్?
   ముదిరె స్వార్ధచింత యెంతొ?మొదలుచెడ్డబేరమాయె!మూగయైజన వాణియున్?
  సుధలుదీరుటెల్ల మిధ్య!సుధలు తీర కల్లగాదె?జోగిణేయన బొల్చుతన్?

జోగిణి=స్త్రీ దేవత(శిలా రుపిణియైన అమ్మవారు),

2.గర్భగత"-గతికా"-ద్వయ వృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
1.చదువుకున్నవాడు!శుంఠ!    2.చదువులేనివాడె!గొప్ప!
   పదును దప్పె లోకతీరు!         బదులు పల్క నేరమౌను!
   మొదలుచెడ్డ బేరమాయె!      ముదిరె!స్వార్ధచింత యెంతొ?
   సుధలుచింద కల్లగాదె?         సుధలు తీరుటెల్ల మిధ్య!

3.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.
ప్రాసనియము కలదు.
సాగె!నిక్కలియందులే?
బాగు నౌనె?సుఖాలకున్?
మూగయైజన వాణియున్?
జోగిణే!యన బొల్చుతన్?

4.గర్భగత"-నరజయుగళీద్వయ"-వృత్తములు.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం .
1.చదువుకున్నవాడు!శుంఠ!చదువు లేనివాడె!గొప్ప!
   పదును దప్పె!లోకతీరు! బదులు పల్క నేరమౌను!
   మొదలుచెడ్డ బేరమాయె!ముదిరె స్వార్ధచింత యెంతొ?
   సుధలు చింద కల్లగాదె?సుధలు తీరుటెల్ల!మిధ్య!
2.చదువులేనివాడె!గొప్ప!చదువుకున్నవాడు శుంఠ!
   బదులు పల్క నేరమౌను!పదునుదప్పె!లోకతీరు!
   ముదిరె!స్వార్ధచింత యెంతొ?మొదలుచెడ్డ బేరమాయె!
  సుధలు తీరుటెల్ల?మిధ్య!సుధలు చింద కల్లగాదె?

5.గర్భగత"-నిరక్షర"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చదువు లేనివాడె!గొప్ప!సాగె నిక్కలియందు లే?
బదులు పల్క నేరమౌను!బాగునౌనె?సుఖాలకున్?
ముదిరె!స్వార్ధచింత యెంతొ?మూగయైజన వాణియున్?
సుధలు తీరుటెల్ల?మిధ్య!జోగిణేయన?బొల్చుతన్?

6.గర్భగత"-చేతనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.స.జ.జ.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చదువులేనివాడె!గొప్ప!సాగె నిక్కలియందులే!చదువుకున్నవాడు!శుంఠ!
బదులుపల్క నేరమౌను!బాగునౌనె?సుఖాలకున్?పదునుదప్పె!లోకతీరు?
ముదిరె!స్వార్ధచింతయెంతొ?మూగయైజన వాణియున్?మొదలు చెడ్డ బేరమాయె?
సుధలు తీరుటెల్ల మిధ్య?జోగిణేయన బొల్చుతన్?సుధలు చింద కల్లగాదె?

7,గర్భగత"-రసత్రిజా"-ద్వయవృత్తములు..
అత్యష్టీఛందము.ర.స.జ.జ.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.సాగె నిక్కలియందులే?చదువుకున్నవాడె!శుంఠ?
  బాగునౌనె?సుఖాలకున్?పదునుదప్పె!లోకతీరు!
  మూగయైజన వాణియున్మొదలుచెడ్డ బేరమాయె?
జోగిణే యన బొల్చుతన్సుధలు చింద కల్లగాదె?
2.సాగె నిక్కలియందులే?చదువు లేనివాడె!గొప్ప?
   బాగునౌనె?సుఖాలకుం?బదులు పల్క నేరమౌను!
   మూగయైజన వాణియున్!ముదిరె!స్వార్ధచింత యెంతొ?
   జోగిణే!యన బొల్చుతన్?సుధలు తీరుటెల్ల మిధ్య?

8.గర్భగత"-క్షుదార్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.జ.జ.భ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాగె నిక్కలియందులే?చదువుకున్న వాడు?శుంఠ!చదువులేనివాడె!గొప్ప!
బాగునౌనె?సుఖాలకున్?పదునుదప్పె!లోకతీరు!బదులు పల్క నేరమౌను?
మూగయైజన వాణియున్?మొదలుచెడ్డ బేరమాయె?ముదిరె!స్వార్ధ చింత యెంతొ?
జోగిణే!యన బొల్చుతన్?సుధలు తీరుటెల్ల?మిధ్య!సుధలు చింద కల్లగాదె!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

మంత్ర సిద్ధి ఎలా కలుగుతుంది? . . . బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ.

0 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ.
ఒకప్పుడు ధ్వజదత్తుడు అనే ఒక మహాత్ముడు ఉండేవాడుట. అతడు వేదవేదాంగ పండితుడు. సామాన్యుడు కాదు. పైగా అనేక శాస్త్రములలో నిష్ణాతుడు. ఆయనని ఆధారం చేసుకొని అనేకమంది శిష్యులు విద్యనేర్చుకొనేవారు. విద్య నేర్పేవారు. వచ్చినవాడు నేర్చుకోవడానికి అర్హుడా? లేదా? అనే చూసేవారు గానీ ఇవ్వగలడా లేదా అని చూసేవారు కాదు. గురువుయొక్క లక్షణం విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రమే. కానీ చిత్రమేమిటంటే ఈయనకి పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదట. ఎవరికి? ధ్వజదత్తుడికి. విద్యంటే కావలసినంత ఉన్నది. పండితునిగా గౌరవమున్నది. కానీ ఆర్థికంగా పుష్టిలేదు. కానీ ఆ ఇల్లాలు ఎంత గొప్ప తల్లి అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే. ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా ఎక్కడా లేమిని చెప్పేది కాదుట ఆ తల్లి. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలుండేవి. తానూ, తన పిల్లలు తినీ తినక ఈయనకి ఈ దరిద్రం కనపడకుండా చూసుకున్నారట. అలా భర్తను గమనించుకున్నారు. చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం. ఒక సమయంలో విద్యనేర్పుతూ ఎప్పుడూ తనతో పాటు వేదం వల్లె వేసే కుర్రవాడు కనపడకపోయే సరికి ఎక్కడున్నాడురా? అని తను లోపలికి వెళ్తాడు. ఆకలితో ఉన్న పిల్లవాడికి పండు పెడుతూందిట తల్లి. అది చూస్తాడు తండ్రి. ఏమిటి? భోజనం లేదా? పండు పెడుతున్నావు అంటే మాకు భోజనం లేక చాలారోజులైంది. దొరికిన పండు, నీళ్ళే త్రాగుతున్నాం అనగానే కళ్ళనీళ్ళు తిరుగుతాయి. భార్య ఎలా ఉందో, ఏంచేస్తోందో కూడా గమనించకుండా నా విద్య, నా వ్యాపకంలో పడిపోయానే, ఎంత తప్పు చేశాను. నువ్వు మహా పతివ్రతవు. నీలాంటి పతివ్రతను బాధపెడితే నాకు పాపం వస్తుంది అన్నాడు. భార్యాభర్తల అనుబంధం చూడండి. అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడో ఇక్కడ పతిధర్మం అంత చెప్పాడు. ఆమె ఆవిధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్నా ఈయన నిన్ను ఇంత బాధ పెట్టాను అని దుఃఖితుడయ్యాడు. ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటుంది. ఇంట్లో దరిద్రం లేకుండా చూడవలసిన బాధ్యత గృహస్థుది. ఇంటి యజమానిగా నాబాధ్యత. అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి నాలాంటి వేదవేత్తలకి మార్గములేమిటి? చెప్తాడు. ౧. అధ్యాపనము ౨. దానము ౩. జపము. ఈ మూడింటితో ప్రస్తుతము నేనున్ దుర్దశనుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ, సంపద కానీ ఇవాళ ప్రయత్నం వల్ల రాదు. ప్రారబ్ధం బట్టి వస్తూంటాయి. కనుకనే ఇంత పండితుడైనా, ఇంత మంది విద్యార్ధులకి విద్య నేర్పుతున్నా, తన దారిద్ర్యానికి కారణం పూర్వజన్మయొక్క పాపమే. దానినుంచి బయటపడాలి అంటే దానికి అనేక పరిహారాలున్నాయి. ౧. తాను దైన్యాన్ని ఆశ్రయించి కొన్ని యాచించాలి. లేదా మంత్రాన్ని ఆశ్రయించి జపం చేయాలి. అందులో ముఖ్యంగా విప్రుడికి చెప్పిన పెద్ద ఉపాయమేంటంటే "జప్యేనైవతి సిద్ధ్యంతే" - జపం చేతనే ఏదైనా సాధింపజేసుకోవాలి. ఇది ప్రధానం. అందుకు నేను ఈ దరిద్రం నుంచి బయట పడడానికి ఏదైనా మంత్రం గురువును ఆశ్రయించి స్వీకరించి తరించుతాను. అప్పుడు ఆధనాన్ని స్వీకరించి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తాను. మంత్రసిద్ధితో దరిద్రం నుంచి బయటపడాలి అనుకున్నాడు. సరియైన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరాడట. అంతమంది మహర్షులకీ ఆశ్రయమైన చోటు ఒకటుంది - నైమిశారణ్యం. ఆ నైమిశారణ్యంలో పుష్కరుడు అనే మహాత్ముడు ఉన్నాడు. ఆయన గురించి విని ఆయనను శరణు వేడాడు. స్వామీ! నేను దరిద్రంలో బాధపడుతున్నాను. దీనినుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుష్కరుడు బాగా ఆలోచన చేసి తనదైన దైవాన్ని ధ్యానిస్తే ఆ దైవం ప్రేరణ ఇచ్చాడట ఇతనికి హనుమన్మంత్రం ఇవ్వు అని. ఎందుకంటే ఆయన హనుమదుపాసకుడు కనుక వెంటనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. దీనిని స్వీకరించి జపం చెయ్యి అని. పైగా ఈయన పండితుడు గదా! అదొచ్చింది బాధ. పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం, లేకపోతే మరో ప్రమాదం. పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది. దానితో ఇచ్చిన గురువును పట్టించుకోకుండా ఇది మంత్రం, అది దైవం. ఆ దైవం మంత్రం ఆయన ఇచ్చాడు అంతే. ఒక వస్తువు ఇచ్చినట్లు మంత్రం ఇచ్చాడు. ఇక గురువును ప్రక్కన పెట్టాడు.
మంత్రాన్ని మాత్రం జపం చేశాడు చాలా జాగ్రత్తగా. ఈ మంత్రం సిద్ధినిస్తుంది అనే ఆశతో పైగా పండితుడు గదా ఆయనకి తెలుసు మంత్రం అక్షర లక్షలు చేయడం, దశాంశ హోమం చేయడం, దశాంశం తర్పణం చేయడం, దశాంశం అన్నదానం ఇవన్నీ చేశాడు. అలా ఈ మంత్రానికి అనేక పురశ్చరణలు చేశాడట. కానీ మంత్రం సిద్ధించలేదు. పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది. నేనేమిటి? అనేక వేదములు తెలిసినవాడిని. ఆ వేదములలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేయచ్చుగా. ఇక్కడికెందుకు రావాలి? నా ప్రారబ్ధం ఇలా ఉన్నది. వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు. అదేదో హనుమన్మంత్రంట. ఇది అసలు ఆభాస మంత్రమా? అసలు మంత్రమా? ఆలోచిస్తున్నాడు. ఇచ్చిన ఆయనలో లోపమో, మంత్రంలో లోపమో, దేవతలోనో లోపముంది. అందుకు ఈ మంత్రం పండలేదు అనుకున్నాడట. ఇన్ని పురశ్చరణలు చేశాను అని ఒక నైరాశ్యంలో ఉన్నాడు.
ఆ సమయంలో ఒక దొంగ రోగిష్టియై అటు వస్తున్నాడు. ఎందుకంటే ఒళ్ళు బాగున్నప్పుడు దొంగతనాలు, పాపాలు ఎన్నో చేశాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. ఈ తప్పులనుంచి ఎలా బయటపడతాను? ముందు రోగం నుంచి ఎలా బయటపడతాను? అని కాదు. ఇన్ని పాపాలనుంచీ ఎలా బయటపడతాను అని ఆర్తితో అటు వస్తూ ఉన్నాడు. ఈయన జపం చేసుకుంటూ కనపడ్డాడు (ధ్వజదత్తుడు). ఆయన దగ్గరికి వచ్చాడు ఈ దొంగ. ఆయన పేరు గాలుడు. ఒక బోయ జాతికి చెందినటువంటి చోరుడితను. ఈయన ఎవరు నువ్వు? అని అడిగాడు. దాచుకోకుండా విషయాలు చెప్పాడు. నేను తరించడానికి ఈ నైమిశారణ్యంలో ఎందఱో మహాత్ములుంటారు కనుక ఏ మహర్షియైనా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురుచూస్తున్నాను అన్నాడు. అయితే ఈయన చెప్పాడు ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను మంత్రాలూ లేవు, దేవుళ్ళూ లేరు, ఫలించడం అంతకంటే లేదు. ఇదంతా కొంతమంది చేసిన ఒకానొక వంచన మాత్రమే. నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్లు అక్షర లక్షలు ఏమిటి అక్షర కోట్లే చేశాను, పురశ్చరణ హోమాలు ఎన్నో చేశాను. కనుక ఇవన్నీ అబద్ధమే. లేదా ఇవన్నీ అబద్ధం కాకపొతే గురువైనా అబద్ధం అయి ఉండాలి. గురువులో బలం లేదు. అందుకని ఇంకొక్క మాట చెప్తున్నాను నా దగ్గరా పండించుకునే మంత్రములేమీ లేవు, తేలిపోయింది. గురువులెవరైనా ఉంటారా అంటే ఇక్కడ పుష్కరుడు అని ఉన్నాడు, ఆయన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరైనా తీసుకో అన్నాడు. అతను వంచకుడు. అతని వల్లే నాకాలమంతా వ్యర్తమైంది. అతను ఇచ్చిన ఆభాస మంత్రం పట్టుకొని ఇంతకాలం జపం చేస్తూ పాడయ్యాను, అందుకు ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు అన్నాడట. ఈ దొంగ ఆయన దగ్గరికే వెళ్ళాడు. చూద్దాంలే కొంతకాలం ఆగు అన్నాడుట. ఈయన చూద్దాంలే అన్నాడు కానీ గాలుడు వదలలేదు. ఆయన కంటి చూపులో పడేటట్లుగా ఆయనకి శుశ్రూష చేయడం మొదలుపెట్టాడట. కావలసినవన్నీ సమకూర్చడం, దణ్ణం పెట్టడం..ఈయన శ్రద్ధను గమనిస్తున్నాడు. అలా కొంతకాలం గమనించాక జాలి కలిగిందిట. ! ఇతనికి ఏ మంత్రం ఇవ్వను? ఏ మంత్రం ఇవ్వాలో నేను నిర్ణయించడం ఏమిటి? నా బుద్ధికి కూడా ప్రేరణ నా దైవము, నా సర్వస్వము అయిన ఆంజనేయస్వామి. అనుకోని ఒక్కసారి హనుమంతుణ్ణి ధ్యానం చేసాడట. స్వామీ! ఇతను ఆర్తిపరుడు. నిజమైన పశ్చాత్తాపం ఇతనియందు ఉన్నది. ఇన్నాళ్ళూ నా కనుసన్నలలోనే మసలుతూ ఉన్నాడు. రోజూ తెల్లవారుఝామున స్నానం చేయడం, పవిత్రంగా ఇక్కడ కూర్చోవడం, ఏదో భగవన్నామం జపం చేసుకుంటూ ఉండడం, పువ్వులు పండ్లు తీసుకు వచ్చి నా యజ్ఞానికి కావలసిన సంబారములు దూరం నుండే సమకూర్చుతూ నియమబద్ధంగా ఉన్నాడు. ఇతనిపై నాకు జాలి కలుగుతోంది. ఏమంత్రం ఇస్తే యితడు సిద్ధి పొందుతాడో చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు "నా మంత్రములు అనేకములున్నాయి. నా మంత్రానికి అన్ని వర్ణముల వారూ అర్హులే. ప్రతివారూ నామంత్రానికి అర్హులే. అయితే వాడికి నాపై నిష్కపటమైన భక్తి ఉంటే తప్పకుండా మంత్రానికి అర్హుడవుతాడు. కాబట్టి నామంత్రం ఇతనికి ఇవ్వు అని ఆంజనేయస్వామి వారే ఉపదేశించారు. మొత్తానికి నువ్వు భాగ్యవంతుడివయ్యావయ్యా, నీకు మంత్రం ఇమ్మని హనుమంతుడే ఆదేశించాడు అని చెప్పి హనుమన్మంత్రం ఇచ్చాడట. మంత్రం పుచ్చుకుంటూనే శిష్యుడు పరవశించి పోయాడు గురువు కృప లభించింది అని. అయితే ఈ మంత్రం ఇచ్చేముందు ఒక పధ్ధతి చెప్పాడట. ముందు వెళ్ళి నదిలో స్నానం చేసిరా అన్నాడు. నదీ స్నానం కంటే మీ పాద జలం ఇంకా గొప్పది కనుక అది నాపై జల్లండి అన్నాడుట. ఆశ్చర్యపోయాడు గురువు. చెప్పిన ప్రకారంగా కాళ్ళు కడిగిన నీళ్ళు జల్లాడట. ఇదే నాకు సర్వనదీ స్నానము, మంత్రమివ్వు అన్నాడు. గురుభక్తి - అదీ ప్రధానం. అది చూశాడు. ఆమంత్రాన్నివ్వగానే ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు? గురుసన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడుట. గురుసేవ చేసుకుంటూ జపమాల తీసుకొని అష్టోత్తర శతం తిప్పగానే హనుమత్ దర్శనం అయింది మహానుభావుడికి. ఆనంద పరవశుడై నమస్కారం చేస్తున్నాడు. హనుమంతుడు నీకేం కావాలి? అని అడిగాడు. నాకేమీ అక్కరలేదు, ఎందుకంటే నాకు గురుకృప లభించింది, నీ కృప లభించింది, ఇంకేం కావాలి నాకు? అన్నాడు. నువ్వు ఆధివ్యాధులతో ఇక్కడికి వచ్చావు. గురుపాదజలం నీమీద పడగానే నీ రోగాలన్నీ పోయాయి. అది తెలుసా నీకు? ఎందుకంటే నిరంతర మంత్రజప పరాయణుడైన గురువు శరీరం మంత్రమయం. అలాంటి పాదాలను కడిగి వచ్చిన నీరు అది మంత్రమయం. అది నీపై పడింది కనుక నువ్వు శుద్ధుడివైపోయావు అప్పుడే. ఎల్లవేళలా నా అనుగ్రహం నీకుంటుంది. నాకింతకంటే వరం ఇంకొకటి అక్కరలేదయ్యా, నువ్వు నాకుంటే చాలు అన్నాడు. ధన్యుదవయ్యావు అన్నాడు. వెంటనే వచ్చి నాకు స్వామి దర్శనమయ్యిందండీ అన్నాడుట. చాలా సంతోషం నాయనా! కానీ మంత్రం సిద్ధించింది అని చెప్పి జపం మానేయకు. ఇది నిరంతరం చేయవలసిందే. మంత్రం జాపకుడికి అహంకారం కూడదు. అది లభించిన దగ్గరి నుంచీ సిద్ధింప జేసుకోవాలి అని తపన ఉండాలి. అందుకు గురుభక్తి చాలా ముఖ్యం.
"యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ!" ఉపనిషత్తు చెప్తోంది. సాధకుడికి దేవతయందు పరమ భక్తికలిగిఉండాలి.దేవతయందు ఎంత భక్తి ఉందో గురువుయందు అంత భక్తీ ఉండాలి. నీకు మంత్రం సిద్ధించి గనుక ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను. మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు మీ దగ్గరే ఉంటాను అన్నాడు. కాదు, నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి వెళ్ళు. ధర్మ బద్ధములైన భోగములు అనుభవించు. ధర్మబద్ధమైన సంపదని ధర్మకార్యాలకి వినియోగించు. ఇంతవరకూ అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించావు. ఇప్పుడు ధర్మముగా సంపాదించి త్యాగానికి వినియోగించు. ధనాన్ని త్యాగానికి వినియోగించు, స్వార్థానికి వినియోగించకు. తద్వారా నీవు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ పోగొట్టుకొంటావు. ఒకప్పుడు ఆర్జనా దోషం నీదగ్గర ఉంది. ఆర్జన దోషం పోవాలి అంటే త్యాగముతో పోగొట్టుకోవాలి. మంత్రాన్ని ఎప్పుడూ వీడకు. ఇది నా ఆజ్ఞ నువ్వు వెళ్ళు అన్నాడుట. గురుపాదాల దగ్గర ఏడ్చాడట. గురువును విడిచి వెళ్ళవలసి వస్తోందే అని ఏడ్చాడు. కానీ గురువాజ్ఞను శిరసా వహించి వెళుతూ ఉన్నాడు అరణ్యంలో ధ్వజదత్తుడు ఉన్న చోటునుంచి. దూరంనుంచి ధ్వజదత్తుడు చూసి పిలిచాడట. ఆయనకి దొరకకుండా పరుగెత్తడం మొదలుపెట్టాడు. మిత్రమా ఉండు అని వెనక్కి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు ధ్వజదత్తుడు. ఏంటి అలా పరుగెడుతున్నావు? ఒకప్పుడు దీనుడవై ఇటునుంచి వెళ్లావు. ఇప్పడు చాలా కళకళలాడుతూ ఉన్నావు. ఏం జరిగిందేమిటి? అన్నాడు. నేను నీకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురునింద చేస్తావు. గురునింద వినకూడదు. అందుకే పారిపోతున్నాను అన్నాడు. ఎందుకంటే ఉత్తమ సాధకుడు ఆత్మస్తుతి, గురునింద ఈరెండూ వినడు. గురునింద వింటే మహాపాపం. నిష్కృతి లేదు. నేను వినకూడదని బయలుదేరాను. పొరపాటున కూడా నువ్వు ఒక్కమాట అనకూడదు. అన్నాడు. ఏంటి అలా అంటున్నావు? నోరు తెరిచి ఎక్కడ తిడతాడో అని భయం గాలునికి. నేను ఈ స్థితి పొందడానికి కారణం నా గురుపాదజలం. అంతేకానీ మంత్ర మహిమ అనలేదు. గురువు వల్ల నాకు హనుమంతుని అనుగ్రహం లభించింది. ఎంత పురశ్చరణ చేశావేంటి? ఎన్ని కోట్లు చేశావేం? అన్నాడు. కోట్లు తెలియవు. ఒక మాల త్రిప్పాను అన్నాడు. వెంటనే ఆశ్చర్యచకితుడై పోయాడు ధ్వజదత్తుడు. అంత పొగరు ఇప్పుడు దిగింది. అంత పురశ్చరణ చేశా, ఇన్ని హోమాలు చేశా, ఇన్ని చేశా ఏమైంది నాకు? ఏమీ లేదే! అని దుఃఖితుడయ్యాడు. ఎవరింతకీ గురువు? అన్నాడు. ఎవరేమిటి? పుష్కర స్వామే నా గురువు అన్నాడు. వెంటనే ఏడుపు వచ్చింది. ఛీ ఏమిటి ఈ పాండిత్యం? ఏమిటి ఈ అహంకారం? అని అహంకార రహితమైన వైరాగ్యం కలిగి పుష్కర స్వామి వద్దకు వెళ్ళి కాళ్ళమీద పడి ఏడ్చాడు. లేలే మంత్రం పండిందా? అని అడిగాడట స్వామి. స్వామీ! ముందు గురుభక్తి పండకపోతే మంత్రం కూడా పండదు అని బుద్ధి ఇప్పుడు వచ్చింది అన్నాడు. అందుకు గురుభక్తి లేనివాడికి ఎన్ని మంత్రములు చేసినా ప్రయోజనం లేదు. అందుకు నీ కృప కావాలి నాకు. అప్పడు ధ్వజదత్తుడు ధ్యానంలో చెప్పాడు. నీకు గురువుయందు శ్రద్ధ లేకపోవడం వల్లనే మంత్రం పండలేదు అని హనుమంతుడు చెప్పిన మాట. మంత్రము ఇచ్చినప్పుడు ఆ మంత్ర దేవత గురుమూర్తిగా అనుగ్రహిస్తోంది. గురువే ఆ మంత్రముయొక్క దేవత అని ముందు తెలుసుకోవాలి. అని చెప్పి ఒక్కసారి ధ్యానం చేసి ఒక్కమాట చెప్తున్నాడు.
"మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ" - స్వయంగా పుష్కరుడు చెప్పిన మాట. మంత్రమునందు, తీర్థమునందు, ద్విజునియందు, దైవముయందు, దైవజ్ఞునియందు, ఔషధమునందు, గురువుయందు, నీకు ఎలాంటి భావన ఉంటే సిద్ధి అలా ఉంటుంది. అది చాలా ముఖ్యమైన అంశం. మనం చేస్తూ అంత చేశాను కానీ నిజమేనా అని డౌట్ పడితే అసలు జరుగదు. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అనే మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యములయందు విశ్వాసం, మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ -ఇదీ తెలుసుకోవలసినటువంటి అంశం.ఆ విధంగా ఆశ్రయించు అంటే ఇంక గురువును వదలకుండా మంత్రజపం చేసి సిద్ధి పొందాడు ధ్వజదత్తుడు అనే కథ పరాశరసంహితలో చెప్పబడినటువంటిది.
జైహింద్.

23, సెప్టెంబర్ 2019, సోమవారం

నవవిధ భక్తిమార్గములు.

0 comments

జైశ్రీరామ్.
సీ. చరితార్థ! నీ కథల్ శ్రవణముఁ జేయుచు చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
స్ఫూర్తిదా! నిను కీర్తనమును చేసి చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
నిరుపమ! నిన్ను సంస్మరణము చేయుచున్ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
పరమాత్మ! నీ దివ్య పాదసేవనమునఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
సద్భాస! నీపదార్చనముఁ జేయుచు నేనుఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
పరమాత్మ! నీకు నే వందనమును జేసి చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
దృస్యమానుఁడవైన దాస్యము చేయుచుఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
సన్మాన్య! నీతోడ సఖ్యము నెరపుచుఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
మహితుండ! నీకునాత్మనివేదనము చేసి చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
గీ. వరద! నవవిధ భక్తుల వరలు నన్ను చేర్చుకొనుమయ్య నీలోనఁ జేర్చుకొనుము.
దుష్ట పరిదాహ! గుణ మోహ! శిష్ట గేహ! చిత్త సమ్మోహ! యాదాద్రి శ్రీ నృసింహ!
జైహింద్.

22, సెప్టెంబర్ 2019, ఆదివారం

పింగళి సూరనామాత్యుని చిత్ర కవిత్వం

0 comments

జైశ్రీరామ్
పింగళి సూరనామాత్యుని చిత్ర కవిత్వం
పింగళి సూరనామాత్యుని గురించి తెలియని సాహిత్యాభిమానులు ఉండరు. ఆయన రచించిన కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నము, రాఘవ పాండవీయం మెదలైన ప్రతికావ్యంలో కవిత్వంలోని అనేకమైన ప్రయోగాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిత్రకవిత్వం చెప్పటంలో ఆయన దిట్ట. కళాపూర్ణోదయంలో అలాంటి రెండు పద్యాలను తెలుసుకుందాం.

కం :  మా య మ్మాన సు వీవే
        రాయల వై కావ దేవరా జే జే జే!
        మా యాతుమ లానినయది
        పాయక సంతోస మున్న పల పల సామి

ఈ పద్యాన్ని మాములుగా చూసినప్పుడు గ్రామ్య భాషలో చెప్పిన తెలుగు పద్యం. కానీ జాగ్రత్తగా పదవిభజన చేస్తే సంస్కృతశ్లోకంగా అన్వయిస్తుంది. అంటే ఒకేపద్యంలో రెండు అర్థాలను చూపించిన ఒక చిత్ర కవిత్వం అన్నమాట. అదెలాగో చూద్దాము.

సూరన్న గారే పైన చెప్పిన పద్యము ఎలా చదువుకోవాలో సూచించారు.


సీ; ఆయనంబు సరకు సేయకుము, శోభన మూల
         ధనుఁడ! ధనం బచ్చిదంబు ముఖ్య
    మైనయట్టిది, తంపు నదియ ఱేని, కజు య
         జించువానికి లక్ష్మి చేరుఁ, బాత
    కములు చేరవు, రక్షకా! కోవిదులు కల్గి
         రా  యస మొదుండవై యరుగకు,
    సమ్మిశ్రభావంబు సలుపు మా! యా 'లక్ష్మి
         కోవిదు ' లనియెడు దేవభాష


ఆ:  వరుసఁ బద విభాగ విరచనతో నర్థ
     మరయః దోఁచుచున్న యది కరంబు
     తెలియఁ జూడుఁ, దేతదీ యాంధ్ర వచన సం
     దర్భమునను శబ్ధ తంత్రవిదులు.


తెలుగు పద్యంగా పదవిభజన చేస్తే: మా, అమ్మ, ఆన, చు, నీవె, రాయలవై, కావన్, దేవరా, జే, జే, జే, మా, ఆతుమలు, అనిన యది, పాయక, సంతోసము, ఉన్న వల్ము, ఇల సామి,

అర్థము: దేవరా=ఓ రాజా! జే జే జే=జయము జయము జయము, ఇలసామి=ఓ భూపతి, వే రాయలవై= ప్రభువువై, రావన్=కాపాడుటచే, సంతోసము=ఆనందము, పాయక=వదలక, మా ఆతుమలు= మా మనసులను, ఆనినయది=పొందియున్నది, ఉన్న వలము=ఇది మాకు గలిగిన ఫలము, మా+అమ్మ+ఆన+చు+మా=మా తల్లి తోడు సుమా.

రాజా ! నీకు జయము జయము, జయము! మా తల్లిపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నారము. నీవు రాజువై రక్షించుటచే మా మనసులానంద భరితములైనవి.

ఇదే పద్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే సంస్కృత శ్లోకంగా కూడా చదువ వచ్చును. అదెలాగునో చూద్దాం.
సంస్కృత శ్లోకానికి ఈ క్రింది విధముగా పద విభాగము చేసుకొనవాచ్చును.

మా, ఆయం, మాన, సునీవే, రాః, అలనా, ఏకా, ఆవత్,
ఏవ, రాజే, అజేజే, మా, ఆయాతు, మాలాని, న, యది, పాయక,
సంతః, అసముత్, న, పల, మిల, సా, అమీ,

ఇప్పుడు అర్థం చూద్దాం.

సు నీవె=శుభమైన మూల ధనము గల ఓ రాజా! ఆయం=రాబడిని, మామాన=సరకుగొనకుము, అలవా=తరుగని, రాః=ధనము, ఏక+ఏవ=ఒక్కటియే, ఆవత్స్(రాజును) కాపాడును, అజేజే=భగవంతు నారాధించు, రాజే=రాజు కొరకు, మా=లక్ష్మి, ఆయాతు=వచ్చును, మలాని=పాపములు, న=చేరవు, ఆయక=ఓ రక్షకుడా! సంత్సః=పండితులు, యది=అయినచో, అసమత్=సంతోషము లేనివాడవై, న వల=తొలగిపోకుము, మిల=వారిని కలిసికొనుము, అమీ=ఈ పండితులే, సా=ఆ లక్ష్మి.

భావము:  ఓ రాజా! రాబడిని నమ్మి మూలధమ్మును వమ్ము సేయకుము. తరుగని సంపదయే నృపతికి కమిత మోదమును గూర్చునది. భగవంతుని గొలుచు రాజును సర్వ సంపదలు చేరును. పాతకములు దరికి రావు. ప్రభూ! పండితులను గాంచినంతనే పరాజ్ముఖుడవు కాకుండుము. వారి సాంగత్యము నభిలషింపుము. ఆపండితులే 'లక్ష్మి ' అను సూక్తిని గుర్తింపుము.

ఒకే పద్యంలో తెలుగు సంస్కృత అర్థాలను ఈ పద్యంలో చూపించిన పద్దతి చూస్తుంటే, కవికి భాషమీద ఉన్న పట్టు తెలుస్తుంది.

ఇప్పుడు  ఇదే  కావ్యంలో ఇంకొక పద్యం చూద్దాం. ఈ పద్యం,  గత పద్యంలా కాకుండా అనులోమ విలోమ పద్యంగా గుర్తించవచ్చు. ఆంటే  పద్యాన్ని మొదటి నుంచి చదివితే ఒక అర్థం లోను చివరి నుంచి చదివితే మరొక ఆర్థంలోను ఉంటుందన్న మాట. ఈపద్యంలో మొదటి నుండి చదివితే తెలుగు పద్యంగా చివరినుంచి చదివితే సంస్కృత పద్యంగా ఆర్థం ఇస్తుంది.కం.   తా వినువారికి సరవిగ
        భావనతో నాను నతి విభావి సుతేజా
        దేవర గౌరవ మహిమన
       మా వలసిన కవిత మరిగి మాకు నధీశా

మొదట తెలుగు పద్యానికి అర్థం చూద్దాం.


అతి విభావి సుతేజా=మిక్కిలి ప్రకాశించు పరాక్రముగల, అదీశా=రాజా, దేవర గౌరవ మహిమన=ఏలినవారి మహిమాతిశయము చేతనే, మా వలసిన కవిత=మా ప్రియమైన కవిత్వము, తాన్=అది, వినువారికిన్=శ్రోతలకు, సరవిగన్=తగు రితి, భావనతొన్=తలచినంతనే, మాకున్, మరిగి= స్వాధీనమై, ఆనున్=భాసిల్లును.


భావము: రాజా! ఆశ్రమదాతలైన తమ మహిమాతిశయము చేతనే శ్రోతలకానందము గూర్చు ఈ కవిత మాకు వశవర్తినియై మెఱుగారుచున్నది.


ఇదే పద్యాన్ని తుదినుండి చదివితే, ఈ పద్యం క్రింది విధం గా ఉంటుంది.        శాధీన కు మాగిరి సుత
        వికనసి లవమాన మహిమ వర గౌరవదే
        జాతే సువిభా వితి నను
        నాతో నవ భాగ విరసకరి నా ను వితా!


పద భాగము: శాధి, ఇన కుం, ఆగిరి, మత వికనసి, లవ, మాన, మహిమ వర గౌరవదే, జాతే, సి విభౌ, ఇతి, నను, నా, అతః నవ భాః, గవి, రస, కిరి, అనువితా.


అర్థము: ఇన=రాజా!, ఆగిరి=పర్వతము లున్నంత కాలము, కుం=భూమిని, శాధి=పాలింపుము, మత=సర్వసమ్మతుడా, వికనసి=మిక్కిలి కీర్తిచే విరాజిల్లు చున్నాడవు, లవమాన=శ్రీరాముని కుమారుడగు లవునివలే మానవంతుడవగు, నను=ఓ రాజా! మహిమ వర గౌరవదే=గొప్పదనముచే మిక్కిలి గౌరవమునిచ్చు, సువిభౌ=నీ వంటి ప్రభువు, ఇతి=ఈరితి, జాతే=కలిగియుండగా, నా=మనుజుడు, (పండితుడు), అతః=ఇటువంటి గౌరవము వలన, నవ భాః=క్రొత్త వికాసము గలవాడై, రస కిరి=నవరసములు వెదజల్లు, గని=భాషయందు, అనువితా నా=స్తుతింపకుండునా?


భావము: ఓ రాజా! ధరలో గిరులున్నంతకాలమీ యిలనేలుము. శ్రీరామకుమారుడయిన లవునివంతి మనధనుడా! గౌరవాదరములు చూపు నీ వంటి మహాప్రభువును గాంచినంతనే సత్కవులు నూతనోత్తేజితులై పలుకుల రసము లుట్టిపడ వర్ణన సేయకుందురా?


ఈ పద్యాన్ని ఎలా చదవాలో కూడా సూరన్నగారు సూచించారు:


సీ:  ఏలు మో నాయక! యిల గిరు లెంత కా
          ల మ్మంత కాల మో సమ్మతుండ!
     మివుల శొభ్ల్లెదు, లవ కుమార సమాన
          మానుఁడ! మహిమ ననూనమైన
     గౌరవం బొసఁగు, చక్కని ప్రభు విట్లు గ
          ల్గఁగ నోయి! పురుషుఁ డీ గౌరవమున
     నభినవ తేజస్కుఁడై, వాణి రసములు
          గులికెడునట్టిది గలుగఁగాను
తే:  వినుతి సేయనివాఁడే యంచును, మహార్థ
     మున్నయది సంస్కృతంబునఁ జెన్నుమీఱ
     వరుసఁ దుదనుండి మొదలికిఁ దిరుగఁ జదువ
     నా తెనుఁగు పద్యమున బుధు లరసికొనుఁడు.ఇటువంటి అనేకమైన చిత్రకవిత్వ ప్రక్రియలు మనకు పింగళి సూరనామాత్యుని రచనలలో కనిపిస్తాయి.ఈయన రచించిన రాఘవపాండవీయం అనే కావ్యం ' ద్వార్థి ' కావ్యం. అంటె ఒకే పద్యానికి రామాయణ పరంగానూ భారతపరంగానూ అర్థం చెప్పుకోవచ్చును.
జైహింద్.

21, సెప్టెంబర్ 2019, శనివారం

రరో రరే రర... ఏకాక్షర శ్లోక వివరణ.

0 comments

జైశ్రీరామ్.
సంస్కృతంలో ఉన్న ఒక ఏకాక్షర శ్లోకము

రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!

ర = రామ శబ్దంలోని “ర” రేఫ వలన
రోః = భయం కల
అర = వేగంగా పరుగెత్తే
రురోః = జింకయైన మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని
రేరే = (ర+ఈరే) = కౌస్తుభమణి పొందియున్న
ఉరో రరే = వక్షము నందు
రీరారా = లీల నాపాదించునట్టి
ఊరూరూః = ఊరువులచే గొప్పనైన
ఉః = లక్ష్మి = సీత
అర రర = తన నివాసానికి తీసుకువెళ్ళిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూ శత్రువైన రావణునికి
రిః = నాశం కల్గించినదై
ఆరిరా = చెలికత్తెలను
రా = పొందిన దాయెను

శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థము.
జైహింద్.

20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

ఈశ్వరే నిశ్చలా బుద్ధిః , ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. ఈశ్వరే నిశ్చలా బుద్ధిః , దేశార్థం జీవనస్థితిః                                                                                              పృథివ్యాం బంధువద్వృద్ధిః ఇతి కర్తవ్యతా సతామ్.

తే.గీ. పుడమి పరమాత్మపై లసద్బుద్ధి నిలుపు.
దేశ సేవకై జీవించు ధీశుఁడవయి.
బంధు వృద్ధికి కృషి చేసి పరఁగుమిలను.
ఇదియె కర్తవ్యమని యెంచు మదిని నీవు.

భావము. 
భగవంతునిమీద నిశ్చల మైన బుద్ధి దేశ సేవ కొఱకు జీవంచటం పృధివి మీద బంధు వృద్ధి ఈ మూడూ మన అందరి కర్తవ్యం అని సనాతన ధర్మం చెపుతుంది

జైహింద్.

19, సెప్టెంబర్ 2019, గురువారం

పురాణ లక్షణాలు.

0 comments

 జైశ్రీరామ్
పురాణము లక్షణములు.
ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన దాని ప్రకారము
శ్లో. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్.
సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.
౧.సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
౨.ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
౩.వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
౪.మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
౫.వంశాలచరిత్ర. అనునవి.
భాగవతంలో
సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:.
అని పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.
జైహింద్.

18, సెప్టెంబర్ 2019, బుధవారం

చ మ త్కా ర శ్లో క ము. వి వ ర ణ ము.

1 comments

జైశ్రీరామ్.
చ మ త్కా ర శ్లో క ము.  వి వ ర ణ ము.

ఒక బ్రాహ్మణుడు ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు.
ఆ ధనికుడు సంపదనతో పాటు సంస్కారమున్నవాడు.
ఆ బ్రాహ్మడికి కడుపునిండా షడ్రసోపేతమైన భోజనం పెట్టి,  చక్కని పట్టు వస్త్రాలను యిచ్చి ఘనంగా సత్కరించాడు.
ఇంకేముంది కడుపునిండి,  సత్కారం జరిగే సరికి ఆశీర్వచన శ్లోకం తన్నుకుంటూ వచ్చింది ఆ బ్రాహ్మణుఁడికి.

శ్లో. విహంగో వాహనం యేషాం,
     త్రికంచధరపాణయః
     పాసాల సహితా దేవాః
     సదాతిష్ఠన్తు తే గృహే.

భావము.
పక్షులు వాహనాలుగా కలవారునూ, త్రికములను ధరించిన వారునూ, పాసాలతో నిండిన వారునూ, అగు దేవతలు మీ యింట ఎప్పుడూ ఉందురు గాక!
ఇదేమి ఆశీర్వచనమండీ అంటారేమో... ఒక్క క్షణం ఆలోచించండి మరి.
వి అంటే పక్షి,
హం అంటే హంస,
గో అంటే ఎద్దు,
పక్షి వాహనంగా కలవాడు విష్ణువు,
హంస వాహనుడు బ్రహ్మ,
ఎద్దు వాగాహనం గలవాడు శివుడు,
అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ త్రికంచ,

త్రికం ను ధరించినవారు.
త్రి అంటే త్రిశూలం,
కం అంటే శంఖము,
చ అంటే చక్రములను ధరించినవారు
త్రిమూర్తులు కదా!

త్రిశూల ధారి శివుడు,
శంఖ ధారి బ్రహ్మ,
సుదర్శన ధారి విష్ణువు

ఈ ముగ్గురూ పాసములతో కూడిన దేవతలు.
పా అంటే పార్వతి,
స అంటే సరస్వతి,
లఅంటే లక్ష్మీ దేవి .
పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి తో కూడిన దేవుళ్ళు
మీ యింట ఎల్లప్పుడూ వుందురుగాక! అని అర్థము.

సరస్వతి, లక్ష్మీ, పార్వతులనడంలో
విద్యలు, ఐశ్వర్యములు, సౌభాగ్యములు
మీ యింట వుండాలి అని అర్థం.

శంఖ, చక్ర, త్రిశూలములు ధరించిన వారు అనడం వలన శత్రు బాధలు, రాక్షస బాధలు, మీకు వుండవు అని భావము.

త్రిమూర్తులు వారి భార్యలతో మీ ఇంట వుందురు గాక!అనటం తో సర్వ సౌఖ్యములు, విద్యలతో పాటు , శాశ్వతమైన పరంధామము మీకు లభించుగాక!
అని చమత్కారమైన ఆశీర్వాదము.
జైహింద్.

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

డా. గండ్లూరి దత్తాత్రేయశర్మ మిత్రబృందముతో ప్రదర్శించిన భువనవిజయము.

0 comments

జైశ్రీరామ్.
డా. గండ్లూరి దత్తాత్రేయశర్మ మిత్రబృందముతో ప్రదర్శించిన భువనవిజయము. 
జైహింద్.

16, సెప్టెంబర్ 2019, సోమవారం

డా. గండ్లూరి దత్తాత్రేయశర్మ మిత్రబృందముతో ప్రదర్శించిన భువనవిజయము. 2వ భాగము.

0 comments

జైశ్రీరామ్.
డా. గండ్లూరి దత్తాత్రేయశర్మ మిత్రబృందముతో ప్రదర్శించిన భువనవిజయము. 2వ భాగము.
జైహింద్.

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

బహుముఖ ప్రజ్ఞాపూర్ణ నాయకుఁడు ఆంజనేయుఁడుఅనే గ్రంథావిష్కరణ...శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారి సమీక్ష.

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులాఎఆ! శ్రీ పాలకుర్తి రామమూర్తిగారు రచించిన 
బహుముఖ ప్రజ్ఞాపూర్ణ నాయకుఁడు ఆంజనేయుఁడు అనే గ్రంథావిష్కరణను శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ సహోదరులు చేయుచు ఆ గ్రంథమును చక్కగా సమీక్షించినారు. అది వెనఁగలరు.
గ్రంథ రచయితకు, సమీక్షకులకు అభినందనలు.
జైహింద్.

14, సెప్టెంబర్ 2019, శనివారం

తృప్తిదా,మృదుమానస,మత్తరజినీ,కీలెనరు,అసహన,చక్రిత,చరమనరా,నిదన సదన,సంతాపక,ధ్యాసినీ,గర్భ"-లయంకర"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
తృప్తిదా,మృదుమానస,మత్తరజినీ,కీలెనరు,అసహన,చక్రిత,చరమనరా,నిదన సదన,సంతాపక,ధ్యాసినీ,గర్భ"-లయంకర"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-లయంకర"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.న.ర.ర.స.య.జ.భ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిన్నే! నే దలతు నెన్నడున్?నీలికంఠ!సదా శివా!నిర్మలాంగ!భక్త రక్షకా!
మున్నే! నీ ఘనత వింటినే!మూలమీవు జగాలకున్?మూర్ముహుర్లతాంగ భంగిమన్?
కన్నారం!కలను గంటినే!కాలచక్ర భ్రమంబునన్?కర్మ మోహబంధ!మోచనా!
జన్నాలం!వెలుగు నీశ్వరా!జాలమేలు విభూతిదా!చర్మ మేర్చుముహుర్లతాంగ
చర్మమేర్చు=లయమునుకూర్చు,జన్నాలం=యజ్ఞములందు.
1.గర్భగత"-తృప్తిదా"-వృత్తము.
బృహతీఛందము.మ.న.ర.గణములు.వృ.సం.185.
ప్రాసనియమము కలదు.
నిన్నే!నే దలతు నెన్నడున్?
మున్నే!నీ ఘనత వింటినే!
కన్నారం కలను గంటినే!
జన్నాలం వెలుగు నీశ్వరా!
2.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృసం.91.
ప్రాసనియమము కలదు.
నీలికంఠ!సదా శివా!
మూలమీవు!జగాలకున్?
కాల చక్ర భ్రమంబునన్!
జాలమేలు!విభూతిదా!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
నిర్మలాంగ!భక్త రక్షకా!
మూర్ముహుర్లతాంగ!భంగిమన్?
కర్మ మోహబంధ మోచనా!
చర్మ మేర్చు నీలి కంధరా!
4.గర్భగత"-కీలెనరు"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.న.ర.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిన్నే!నే దలతు నెన్నడున్?నీలికంఠ!సదా శివా!
మున్నే!నీ ఘనత వింటినే?మూలమీవు!జగాలకున్!
కన్నారం!కలను గంటినే!కాలచక్ర భ్రమంబునన్?
జన్నాలం!వెలుగు నీశ్వరా!జాలమేలు!విభూతిదా!
5.గర్భగత"-అసహన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.త.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీలికంఠ!సదా శివా!నిర్మలాంగ!భక్త రక్షకా!
మూలమీవు!జగాలకున్?మూర్ముహుర్లతాంగ భంగిమన్?
కాలచక్ర భ్రమంబునన్?కర్మ మోహబంధ మోచనా!
జాలమేలు విభూతిదా!చర్మ మేర్చు నీలి కంధరా!
6.గర్భగత"-చక్రిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.త.ర.య.త.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీలికంఠ!సదాశివా!నిర్మలాంగ భక్త రక్షకా!నిన్నే!నే దలతు నెన్నడున్?
మూలమీవు!జగాలకున్?మూర్ముహుర్లతాంగ భంగిమన్?మున్నే!నీ ఘనత వింటినే?
కాలచక్ర భ్రమంబునన్?కర్మ మోహ బంధ మోచనా!కన్నారం కలను గంటినే?
జాలమేలు విభూతిదా!చర్మ మేర్చు నీలికంధరా!జన్నాలం వెలుగు నీశ్వరా!
7.గర్భగత"-చరమనరా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.మ.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిర్మలాంగ!భక్త రక్షకా!నిన్నే నే దలతు నెన్నడున్?
మూర్ముహుర్లతాంగ భంగిమన్?మున్నే!నీ ఘనత వింటినే?
కర్మ మోహబంధ మోచనా!కన్నారం కలను గంటినే?
చర్మ మేర్చు నీలికంధరా?జన్నాలం వెలుగు నీశ్వరా!
8.గర్భగత"-నిదనసదన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.మ.న.ర.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిర్మలాంగ!భక్త రక్షకా!నీన్నే నే దలతు నెన్నడున్?నీలికంఠ!సదాశివా!
మూర్ముహుర్లతాంగ భంగిమన్?మున్నే నీ ఘనత వింటినే?మూలమీవు జగాలకున్?
కర్మ మోహబంధ మోచనా!కన్నారం కలను గంటినే?కాలచక్ర భ్రమంబునన్?
చర్మ మేర్చు నీలి కంధరా?జన్నాలం వెలుగు నీశ్వరా!జాలమేలు విభూతిదా!
9.గర్భగత"-సంతాపక"-వృత్తము.
అత్రయష్టీఛందము.ర.స.య.త.స.లగ.గణములురయతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీలికంఠ!సదాశివా!నిన్ను నే దలతు నెన్నడున్?
మూలమీవు జగాలకున్?మున్నే!నీ ఘనత వింటినే?
కాలచక్ర భ్రమంబునన్?కన్నారం కలను గంటినే?
జాలమేలు విభూతిదా!జన్నాలం వెలుగు నీశ్వరా!
10,గర్భగత"-ధ్యాసినీ"-వృత్తము .
ఉఉ్కృతిఛందము.ర.స.య.త.స.య.జ.భ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీలికంఠ!సదాశివ!నిన్ను నే దలతు నెన్నడున్?నిర్మలాంగ!భక్త రక్షకా!
మూలమీవు!జగాలకున్?మున్నే!నీ ఘనత వింటినే?మూర్ముహుర్లతాంగభంగిమన్?
కాలచక్ర భ్రమంబునన్?కన్నారం కలను గంటినే?కర్మ మోహ బంధమోచనా!
జాలమేలు విభూతిదా!జన్నాలం వెలుగు నీశ్వరా!చర్మ మేర్చు నీలికంధరా?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

రసభాతి,సమీపక,రసయా,ముప్పిడి,కుద్దుగ,నమాంజలి,మూతముప్పిడి,రసభా,మోసక,నమామీతి,గర్భ"-స్నేహబాలా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
రసభాతి,సమీపక,రసయా,ముప్పిడి,కుద్దుగ,నమాంజలి,మూతముప్పిడి,రసభా,మోసక,నమామీతి,గర్భ"-స్నేహబాలా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

స్నేహబాలా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.భ.న.మ.మ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మూత ముప్పిడి వ్యాపారము!మొదటికే!మోసంబౌరా!మొద్దుబారక! మేలుకొమ్మా?
చేత శూన్యము గానీకుమ!చిదుము నెయ్యంబెంచగాన్?సిద్ధహస్తతసాకు మేలున్!
కోతి చైదపు లోకంబిది!కుదురు లేదెంచం మదిన్కుద్దునింపుము తెల్వి స్నేహమ్!
నీతి పట్టదు!భ్రాంతే సుమ!నిధను డెవ్వండెంచగన్?నిద్దురించకు! స్నేహ బాలా!
1.గర్భగత"-రసభాతి"-వృత్తము.
బృహతీఛందము.ర.స.భ.గణములు.వృ.సం.411.
ప్రాసనియమము కలదు.
మూత ముప్పిడి వ్యాపారము!
చేత శూన్యము గానీకుమ!
కోతి చైదపు లోకంబిది!
నీతి పట్టదు భ్రాంతే సుమ!
2.గర్భగత"-సమీపక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.మ.గగ.గణములు.వృ.సం.8,
ప్రాసనియమము కలదు.
మొదటికే!మోసంబౌరా!
చిదుము నెయ్యంబెంచగన్?
కుదురు లేదెంచన్!మదిన్?
నిధను డెవ్వం డెంచగన్?
3.గర్భగత"-రసయా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
మొద్దుబారక!మేలుకొమ్మా!
సిద్ధహస్తత సాకు మేలున్?
కుద్దు నింపుము తెల్వి స్నేహమ్?
నిద్దురించకు స్నేహ బాలా?
4.గర్భగత"-ముప్పిడి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.భ.న.మ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మూతముప్పిడి వ్యాపారము!మొదటికే!మోసంబౌరా!
చేతశూన్యము గానీకుమ!చిదుము నెయ్యంబెంచగన్?
కోతి చైదపు లోకంబిది! కుదురు లేదెంచ న్మదిన్?
నీతి పట్టదు!భ్రాంతే!సుమ!నిధను డెవ్వం డెంచగన్?
5.గర్భగత"-కుద్దుగ"-వృత్తము.
అత్య ష్టీఛందము.న.మ.మ.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మొదటికే!మోసంబౌరా?మొద్దు బారక మేలుకొమ్మా!
చిదుము నెయ్యం బెంచగన్?సిద్ధ హస్తత సాకు మేలున్?
కుదురు లేదెంచ న్మదిన్?కుద్దు నింపుమి!తెల్వి స్నేహమ్?
నిధను డెవ్వం డెంచగన్?నిద్దురించకు స్నేహ బాలా!
6.గర్భగత"-నమాంజలీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.మ.జ.జ.మ.జ.య.లల.గణములు.యతులు.9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
మొదటికే!మోసంబౌరా?మొద్దుబారక మేలుకొమ్మా!మూతముప్పిడి వ్యాపారము!
చిదుము నెయ్యంబెంచగన్?సిద్ధ హస్తత సాకు మేలున్?చేతశూన్య గానీకుమ?
కుదురు లేదెంచం మదిన్?కుద్దు నిల్పుమి తెల్వి స్నేహమ్?కోతి చైదపు లోకంబిది?
నిధను డెవ్వం డెంచగన్?నిద్దురించకు స్నేహ బాలా!నీతి పట్టదు భ్రాంతే సుమ!
7.గర్భగత"-మూతముప్పిడి"-వృత్తము.
ధృతిఛందము.ర.స.మ.ర.స.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మొద్దుబారక మేలుకొమ్మా!మూతముప్పిడి వ్యాపారము!
సిద్ధ హస్తత సాకు మేలున్?చేత శూన్యము గానీకుమ!
కుద్దు నిల్పుమి తెల్వి స్నేహమ్?కోతి చైదపు లోకంబిది?
నిద్దురించకు స్నేహ బాలా! నీతి పట్టదు భ్రాంతే సుమ!
8.గర్భగత"-రసభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.మ.ర.స.భ.న.మ.గగ.గణములు.యతులు.
10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
మొద్దుబారక!మేలుకొమ్మా!మూత ముప్పిడి వ్యాపారము!మొదటికే! మోసంబౌరా?
సిద్ధ హస్తత!సాకు మేలున్?చేత శూన్యము గానీకుమ!చిదుము నెయ్యంబెంచగన్?
కుద్దు నిల్పుమి తెల్వి స్నేహమ్?కోతి చైదపు లోకంబిది?కుదురు లేదెంచన్మదిన్?
నిద్దురించకు స్నేహ బాలా!నీతి పట్టదు భ్రాంతే సుమ!నిధను డెవ్వండెంచగన్?
9.గర్భగత"-మోసక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.మ.జ.య.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మొదటికే!మోసంబౌరా?మూతముప్పిడి వ్యాపారము!
చిదుము!నెయ్యం బెంచగన్?చేతశూన్యము గానీకుమ!
కుదురు!లేదెంచ న్మదిన్? కోతి చైదపు లోకంబిది?
నిధను డెవ్వం డెంచగన్?నీతి పట్టదు!భ్రాంతే సుమ!
10,గర్భగత"-నమామీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.మ.జ.య.స.జ.జ.గగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
మొదటికే!మోసంబౌరా?మూతముప్పిడి వ్యాపారము.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మొదటికే!మోసంబౌరా?మూత ముప్పిడి వ్యాపారము!మొద్దు బారక మేలుకొమ్మా?
చిదుము నెయ్యంబెంచగన్?చేత శూన్యము గానీకుమ!సిద్ధ హస్తత సాకు మేలున్?
కుదురు లేదెంచన్మదిన్? కోతి చైదపు లోకంబిది?కుద్దు నిల్పుమి తెల్వి                                   స్నేహమ్?
నిధను డెవ్వం డెంచగన్?నీతి పట్టదు భ్రాంతే సుమ!నిద్దురించకు స్నేహ                                        బాలా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

12, సెప్టెంబర్ 2019, గురువారం

త్రినేత్ర,శ్రీకర,మదినిండునతిక్రమ,నిరుక్త,విధ్వంసక,నిమర్జన,నీరంటు,బీరువొందు,ఱుత్విఘ్ఘోషణా,గర్భ"-దోషహరణ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
త్రినేత్ర,శ్రీకర,మదినిండునతిక్రమ,నిరుక్త,విధ్వంసక,నిమర్జన,నీరంటు,బీరువొందు,ఱుత్విఘ్ఘోషణా,గర్భ"-దోషహరణ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                           

    సత్యం వద!ధర్మం చర!పితృదేవోభవ!మాతృ దేవో భవ!
    ఆచార్య దేవో భవ!అతిధి దేవో భవ!అభ్యాగత దేవో భవ!
అను వాక్యములు,నేటి కాలానికి పొందు నందుట లేదు.
శ్రీ వల్లభేశ "గణపతి"-చతుర్ధీ దినముల,సర్వ జనానీకము,ఊహించి నిజానిజములు
తెలిసికొన గోరుచూ,వినయ పూర్వకముగా-విన్నవించు కొనుచున్న
విషయములు.  
పురుషసూక్తము"ప్రకారము.
        శ్రీమన్మహావిష్ణువు,విరాట్స్వరూపుడై,తొలిదొల్త,దేవతలను ఱుత్విక్కు
లను,సృజించెను.అప్పటికి సృష్టి లేని కారణమున,మానవకాహవము,సం
కల్పించి,యజ్ఞ ద్రవ్యార్ధమై,భౌతిక సృష్టి గావించెను.ఱుతువులు కూర్చెను.
వసంతము నేయి,శరత్తు హవిస్సును జేసి,సప్త మాతృకలు 7.సమిధ లీయగా
వాటిని 21.చేసి,యా విరాట్స్వరూపుడే యజ్ఞమున యాహుతియై,వృషత్తనే
నేయిని,గుఱ్ఱములు,మిగిలిన చరాచర జంతుజాలమును సృజించెను.
    విరాట్పురుషుని-- ముఖమునుండి,బ్రాహ్మణులు,భుజములనుండి,క్షత్రియులు,ఊరువులనుండి
వైశ్యులు,పాదముల నుండి శూద్రులు సృజించెను.వారు వారు చేయు పనుల
బట్టి కులములు భగవంతు డేర్పరచెను.నేడు కాలమూ మారినది.పద్ధతి
మారినది.మార్పు సహజము.ఇందొక విషయము నిక్షిప్తమై యున్నది.
నీరు3.పాదములు,భూమి1.పాదము కాగా!4.వదియగు ఆపాదమునందు
మహావిష్ణువు 10,"-లపరిమాణముతో,శ్రమిక జీవులగు,శూద్రుల హృదయ
కుహరములందు నిలిచి యున్నాడు.దేశమునకు భుక్తి నొసగే అన్నదాతలో
దైవమున్నాడనుట నగ్న సత్యము.దానికి విపరీత ధోరణి యాపాదించి,
కలికి"-బూదిని పులిమి,స్వార్ధ సంకుచిత స్వభావముతో,పాదాలే శూద్రుల
కిచ్చారని,దిగువ పరచేరని,ఇచ్ఛాను సారము మాట్లాడుట ముమ్మాటికి
వేద ధూషణమే!అదినరక హేతువు.దాని నాధారముగా కులవివక్షత
చూపుట,దేశ సౌష్ఠవానికి,సౌభ్రాతృత్వ,భిన్నత్వంలో యేకత్వమునకు
గొడ్డలి పెట్టు.సమ సమాజ స్థాపనానికి పెట్టని గోడ.జాతి,కుల,మత వైషమ్యములు,దేశ భవితకు తిలోదకము లిచ్చుననుటకు,సందేహము
లేదు.జ్ఞానులు విదేశములు పట్టే దుస్థితి ప్రాప్తించును.
     విష్ణ్వంశ లేనివాడు,యేలిక కానేరడు.స్వార్ధ, సంకుచిత,స్వభావమున
కెడమైన,ధర్మార్థ కామ మోక్షములు(పురుషార్థములు) యేలిక నెడ
నుండగా,భగవంతుడు,వేరే థర్మ సంస్థాపనార్ధమై యవతారమెత్తు
నావశ్యకత యుండదు.రాజు యెంత సుగుణ సంపన్ను డైనను,వేగులచే
తన పరిపాలన యెలా ఉన్నదో తెలిసి కొని,తదను గుణ్యముగా,ప్రజల మేలుకు పాటుపడవలెను.అప్పుడే సుసంపన్నమైన,రామ రాజ్యము కాగరాజ్యమువిపరీత ధోరణి వలన ప్రకృతి వికటించును.
       గిరులు,వనములు,ప్రకృతి సంపదలను,భుజించుటయే!కర్తవ్యము
నాయకులకున్నచో,ప్రకృతి సమతుల్యత చెడిపోవుననే విషయాన్ని గుర్తు
నందిడుకొనిన దేశమునకు మేలు,సశ్య శ్యామలతకు లోటుండదనే,విషయం
గ్రహించి,స్వార్ధపరులు కాకుండ,షట్చక్ర వర్తుల చరిత్రలు,భారత,భాగవత,
రామాయణములందలి నీతిని భావితరములు తెలిసికొనునట్టు పాఠ్య
పుస్తకముల నేర్పాటు చేసిన బాగుండును.అల్లా,యేసు,రహీములు,
తెల్పిన నీతిని గ్రహింప జేయవలెను.వినాశ కారక చర్యలకు స్వస్తి
పల్కవలెను.గణపతి నవరాత్రుల పర్వదినములందు, శ్రీవల్లభ గణపతి
లోకమును మంచిమార్గమున నడిపించాలని,నైతిక విలువలు పెంచాలని
మన మందరము ఆశిద్దామా!మరి.*****
                         లోకాసమస్తాః సుఖినో భవంతు.
                           ఓం శాంతిః శాంతిఃశాంతిః.
దోషహరణ వృత్తమును తిలకింప ప్రార్ధన,
                     ===================
      "-దోషహరణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.జ.భ.మ.స.త.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రకృతి విధ్వంసాహవాన!పాలక ఱుత్విఘ్ఘోషణ!వారింనెట్టు భూతలిన్!వెసన్?
వికృత చేతోన్మాదమందె!పేలవ వాగ్దోషంబును!బీరుంబొందు లోక శోకతన్?
సుకృత!నిర్విఘ్నం కరోమి!జోలికి రానీకం గను!జోరున్మాన్పు రక్షితుండవై!
ప్రకృతి!లక్ష్మీ వల్లభేశ!పాలిత చైదం మార్చుమ!పారంబౌ!సుఖంబు వర్ధిలన్?

వారిం నెట్టు=నీట పడవేయుము,బీరుంబొందు=భయమందును.
జోరున్మాన్పు=దుశ్చర్యల వేగత నాపుము.
1,గర్భగత"-త్రినేత్ర"-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం.384.
ప్రాసనియమము కలదు.
ప్రకృతి విధ్వంసాహవాన!
వికృత చేతోన్మాద మందె!
సుకృత నిర్విఘ్నం కరోమి!
ప్రకృతి లక్ష్మీ వల్లభేశ!
2.గర్భగత"-శ్రీకర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.మ.లల.గణములు.వృ.సం.199.
ప్రాసనియమము కలదు.
పాలక ఱుత్విఘ్ఘోషణ!
పేలవ వాగ్దోషంబును!
జోలికి రానీకం గను!
పాలిత చైదం మార్పుమ!
3.గర్భగత"-మదినిండు"-వృత్తము.
బృహతమదినిండుమ.భ.ర.గణములు.వృ.సం.177.
ప్రాసనియమము కలదు.
వారిం!నెట్టు!భూతలిన్!వెసన్?
బీరుం బొందు లోక శోకతన్!
జోరున్మాన్పు రక్షితుండవై!
పారంబౌ!సుఖంబు వర్ధిలన్!
4.గర్భగత"-నతిక్రమ"-వృత్తము.
అత్యష్టీఛందము.
న.మ.జ.భ.మ.లల.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనియమము కలదు.
ప్రకృతి విధ్వంసాహవాన!పాలక ఱుత్విఘ్ఘోషణ!
వికృత చేతోన్మాద మందె!పేలవ వాగ్దోషంబున!
సుకృత!నిర్విఘ్నం కరోమి!జోలికి రానీకంగను!
ప్రకృతి లక్ష్మీ వల్లభేశ!పాలిత చైదం మార్చుమ!
5.గర్భగత"-నిరుక్త"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.మ.న.మ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాలక ఱుత్విఘ్ఘోషణ!వారిం!నెట్టు భూతలిన్వెసన్?
పేలవ వాగ్దోషంబున!బీరుం బొందు లోక శోకతన్?
జోలికి రానీకం గను!జోరున్మాన్పు రక్షితుండవై!
పాలిత చైదం మార్చుమ!పారంబౌ సుఖంబు వర్ధిలన్?
6.గర్భగత"-విధ్వంసక"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.న.మ.త.ర.జ.స.త.లగ.గణములు.యతులు.9,18.ప్రాసనియమము కలదు.వృ.సం
పాలక ఱుత్విఘ్ఘోషణ! నెట్టు!భూతలిన్వెసన్?ప్రకృతి విధ్వంసాహవాన!
పేలవ వాగ్దోషంబున!బీరుంబొందు లోక శోకతన్?వికృత చేతోన్మాద మందె!
జోలికి రానీకంగను!జోరున్మాన్పు రక్షితుండవై!సుకృత!నిర్విఘ్నం కరోమి!
పాలిత చైదం మూర్చుమ!పారంబౌ సుఖంబు వర్ధిలన్?ప్రకృతి లక్ష్మీవల్లభేశ!
7.గర్భగత"-నిమర్జన"-వృత్తము.
ధృతిఛందము.మ.జ.ర.న.మ.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వారిం నెట్టు భూతలిన్వెసన్?ప్రకృతి విధ్వంసాహవాన!
బీరుంబొందు లోకశోకతన్?వికృత చేతేతోన్మాదమందె!
జోరుంమాన్పు రక్షితుండవై!సుకృత నిర్విఘ్నం కరోమి?
పారంబౌ!సుఖంబు వర్ధిలన్?ప్రకృతి లక్ష్మీ వల్లభేశ!
8.గర్భగత"-నీరంటు"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.ర.న.మ.జ.భ.మ.లల.గణములు.యతులు.10,19.ప్రాసనియమభు కలదు.వృ.సం.
వారింనెట్టు భూతలిన్వెసన్?ప్రకృతి విధ్వంసాహవాన!పాలక ఱుత్విఘ్ఘోషణ!
బీరుంబొందు లోక శోకతన్?వికృత చేతోన్మాదమందె!పేలవ వాగ్దోషంబున!
జోరున్మాన్పు రక్షితుండవై!సుకృత నిర్విఘ్నం కరోమి!జోలికి రానీకంగను!
పారంబౌ!సుఖంబు వర్ధిలన్?ప్రకృతి లక్ష్మీ వల్లభేశ!పాలిత చైదం మార్చుమ!
9.గర్భగత"-బీరువొందు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.మ.న.స.త.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాలక ఱుత్విఘ్ఘోషణ!ప్రకృతి విధ్వంసాహవాన!
పేలవ వాగ్దోషంబున!వికృత చేతోన్మాదమందె!
జోలికి రానీకంగను!సుకృత!నిర్విఘ్నంకరోమి!
పాలిత చైదం మార్చుమ!ప్రకృతి లక్ష్మీవల్లభేశ!
10,గర్భగత"-ఱుత్విఘ్ఘోషణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.న.స.త.ర.త.ర.లగ.గణములు.యతులు9,18..
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాలక ఱుత్విఘ్ఘోషణ!ప్రకృతి విధ్వంసాహవాన!వారిం నెట్టు భూతలిన్వెసన్?
పేలవ వాగ్దోషంబున!వికృత చేతోన్మాదమందె?బీరుం బొందు లోక శోకతన్?
జోలికి రానీకంగను!సుకృత!నిర్విఘ్నం కరోమి!జోరున్మాన్పు రక్షితుండవై!
పాలిత చైదం మార్చుమ!ప్రకృతి లక్ష్మీ వల్లభేశ!పారంబౌ సుఖంబు వర్ధిలన్?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

11, సెప్టెంబర్ 2019, బుధవారం

మృదుమానస,ఉపమా,న్యూనభావ,జనసామ్య,సుజ్యోతి,ఆశామయ,మితనత,మగతమి,నరాశ్రిత,మిన్నగు,గర్భ"-గణితకీర్తి"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
మృదుమానస,ఉపమా,న్యూనభావ,జనసామ్య,సుజ్యోతి,ఆశామయ,మితనత,మగతమి,నరాశ్రిత,మిన్నగు,గర్భ"-గణితకీర్తి"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-గణితకీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.న.స.జ.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమణు కలదు.వృ.సం.
సానపట్టిన ముత్యమై!జగతివెలుగు బాలుడా!జయమునీవెంట నంటగాన్!
దాన ధర్మ ప్రబోధివై!తగను సుగతి జ్యోతివై!దయకు తావై!శుభాశ్రితా!
మానితంబగు విద్యలన్!మగతమి గన వెల్గుమా!మయముగాక!దురాశకున్!
జ్ఞానివై!శుభధామమున్!నగప్రగణిత కీర్తులన్?నయ గమంబును కోరుమా!
1.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91,
ప్రాసనియమము కలదు.
సాన పట్టిన ముత్యమై!
దాన ధర్మ ప్ర బోధివై!
మానితంబగు విద్యలన్?
జ్ఞానివై!శుభధామమున్!
2.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.292.
ప్రాసనియమము కలదు.
జగతి వెలుగు బాలుడా!
తగను సుగతి జ్యోతివై!
మగతమిగన వెల్గుమా!
నగ ప్రగణిత కీర్తులన్!
3.గర్భగత"-న్యూనభావ"-వృత్తము.
బృహతీఛందము.న.త.ర.గణములు.వృ.సం.168.
ప్రాసనియమము కలదు.
జయము నీవెంట నంటగాన్!
దయకు తావై శుభాశ్రితా!
మయము గాక!దురాశకున్?
నయ గమంబును కోరుమా!
4.గర్భగత"-జనసామ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.జ.న.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాన పట్టిన ముత్యమై!జగతి వెలుగు బాలుడా!
దాన ధర్మ ప్రబోధివై! తగను సుగతి జ్యోతివై!
మానితంబగు విద్యలన్?మగతమి గన వెల్గుమా!
జ్ఞానివై శుభ ధామమున్!నగ ప్రగణిత కీర్తులన్!
5.గర్భగత"-సుజ్యోతి"-వృత్తము.
ధృతిఛందము.న.న.ర.న.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు. వృ.సం.
జగతి వెలుగు బాలుడా!జయము నీవెంట నంటగాన్!
తగను సుగతి జ్యోతివై!దయకు తావై!శుభాశ్రితా!
మగతమిగన వెల్గుమా!మయముగాక!దురాశకున్!
నగ ప్రగణిత కీర్తులన్! నయ గమంబును కోరుమా!
6.గర్భగత"-ఆశామయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.న.త.ర.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగతి వెలుగు బాలుడా!జయమునీవెంట నంటగాన్!సానపట్టిన ముత్యమై!
తగను సుగతి జ్యోతివై!దయకు తావై!శుభాశ్రితా!దాన ధర్మ ప్రబోధివై!
మగతమిగన వెల్గుమా!మయముగాక!దురాశకున్!మానితంబగు విద్యలన్!
నగ ప్రగణిత కీర్తులన్!నయ గమంబును కోరుమా!జ్ఞానివై శుభ ధామమున్!
7.గర్భగత"-మితనత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.త.ర.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జయము నీవెంట నంటగాన్!సాన పట్టిన ముత్యమై!
దయకు తావై!శుభాశ్రితా!దాన ధర్మ ప్రబోధివై!
మయముగాక!దురాశకున్!మానితంబగు విద్యలన్!
నయ గమంబును కోరుమా!జ్ఞానివై!శుభ ధామమున్!
8.గర్భగత"-మగతమి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.ర.ర.స.జ.న.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జయము నీవెంటనంటగాన్!సాన పట్టిన ముత్యమై!జగతి వెలుగు బాలుడా!
దయకు తావై!శుభాశ్రితా!దాన ధర్మ ప్రబోధివై! తగను సుగతి జ్యోతివై!
మయముగాక!దురాశకున్!మానితంబగు విద్యలన్!మగతమిగన వెల్గుమా!
నయ గమంబును!కోరుమా!జ్ఞానివై!శుభ ధామమున్!నగ ప్రగణిత కీర్తులన్!
9.గర్భగత"-నరాశ్రిత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.ర.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగతి వెలుగు బాలకా!సాన పట్టిన ముత్యమై!
తగను సుగతి జ్యోతివై!దాన ధర్మ ప్రబోధివై!
మగతమిగన వెల్గుమా!మానితంబగు విద్యలన్!
నగ ప్రగణిత కీర్తులన్!జ్ఞానివై!శుభధామమున్!
10,గర్భగత"-మిన్నగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.ర.స.జ.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగతి వెలుగు బాలకా!సానపట్టిన ముత్యమై!జయము నీవెంట నంటగాన్?
తగను సుగతి జ్యోతివై!దాన ధర్మ ప్రబోధివై!దయకు తావై!శుభాశ్రితా!
మగతమిగన వెల్గుమా!మానితంబగు విద్యలన్!మయముగాక!దురాశకున్!
నగ ప్రగణిత కీర్తులన్!జ్ఞానివై!శుభధామమున్!నయ గమంబున!కోరుమా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

సిరినిలయ,మత్తరజినీద్వయ,మితిమీరు,రజినీకరప్రియ,నీతికొదువ,పూర్ణేందు ద్వయ,అంతులేనిద్వయ,గర్భ"-మంతనాల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
సిరినిలయ,మత్తరజినీద్వయ,మితిమీరు,రజినీకరప్రియ,నీతికొదువ,పూర్ణేందు ద్వయ,అంతులేనిద్వయ,గర్భ"-మంతనాల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-మంతనాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అదునూ పదునూ లేదు?అంతుపంతు లేని లోకమున్!హద్దుమీరె!మాయ దేమొకో?                                            
కుదురేమియు లేదాయె!గొంతు బంటి నీర్ష్య ద్వేషతన్!కొద్దిపాటి!నీతిగానకన్?
పదిలం బెడమాయెన్లె?పంతమంది వర్తిలం గడున్?పద్ధతేది!లేదు చూడగన్?
మది మార్చుమి!దేవేశ!మంతనాల గూర్చు మంచినిన్?మద్దతీయ మాను దైవమా!                                        
1.గర్భగత"-సిరినిలయ"-వృత్తము.
అనుష్టప్ఛందము.స.స.లగ.గణములు.వృ.సం.92.
ప్రాసనియమము కలదు.
అదునూ పదునూ లేదు?
కుదురేమియు లేదాయె?
పదిలం బెడమాయెన్లె?
మది మార్చుమి!దేవేశ!
2.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.అంతు పంతు లేని లోకమున్!        2.హద్దు మీరె!మాయదేమొకో?
   గొంతు బంటి నీర్ష్య ద్వేషతన్!            కొద్ది పాటి!నీతి గానకన్?
  పంతమంది వర్తిలం గడున్?              పద్ధతేది! లేదు చూడగన్?
  మంతనాల గూర్చు మంచినిన్?         మద్దతీయ మాను దైవమా!
3.గర్భగత"-మితిమీరు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.ర.జ.ర.లగ.గణముల.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు. వృ.సం.
అదునూ!పదునూ లేదు?అంతుపంతు లేని లోకమున్?
కుదురేమియు!లేదాయె?గొంతుబంటి నీర్ష్య ద్వేషతన్?
పదిలం బెడ మాయెన్లె?పంతమంది వర్తిలం గడున్?
మది మార్చుమి!దేవేశ!మంతనాల గూర్చు మంచినిన్?
4.గర్భగతసిరజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అంతు పంతు లేని లోకమున్?హద్దు మీరె!మాయదేమొకో?
గొంతు బంటి నీర్ష్య ద్వేషతన్? కొద్దిపాటి నీతి గానకన్?
పంతమంది వర్తిలం గడున్?పద్ధతేది?లేదు చూడగన్!
మంతనాల గూర్చు మంచినిన్?మద్దతీయ మాను దైవమా!
5.గర్భగత"-నీతికొదువ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.స.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు. వృ.సం.
అంతుపంతు లేని లోకమున్?హద్దు మీరె!మాయదేమొకో?అదునూ పదునూ లేదు?                                          
గొంతుబంటి నీర్ష్య ద్వేషతన్?కొద్దిపాటి నీతిగానకన్?కుదురేమియు!లేదాయె!
పంతమంది వర్తిలం!గడున్?పద్ధతేది!లేదుచూడగన్?పదిలంబెడమాయెన్లె?
మంతనాల గూర్చుమంచినిన్?మద్దతీయ మాను దైవమా!మది మార్చుమి దేవేశ!
                                                                                         
6.గర్భగత"-పూర్ణేందు ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.స.స.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1. హద్దుమీరె!మాయదేమొకో?అదునూ!పదునూ లేదు?
    కొద్దిపాటి!నీతి గానకన్?కుదు రేమియు లేదాయె!
    పద్ధతేది లేదు?చూడగన్?పదిలం బెడ మాయెన్లె?
    మద్దతీయ మాను దైవమా!మది మార్చుమి!దేవేశ?
2.  అంతు పంతు లేని లోకమున్?అదునూ పదునూ లేదు?
     గొంతు బంటి నీర్ష్య ద్వేషతన్?కుదురేమియు!లేదాయె?
     పంతమంది వర్తిలంగడున్?పదిలం బెడ మాయెన్లె?
     మంతనాల గూర్చు మంచినిన్?మది మార్చుమి!దేవేశ!
7.గర్భగత"-అంతులేని"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.స.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1. హద్దు మీరె!మాయదేమొకో?అదునూపదునూ!లేదు?అంతుపంతులేని! లోకమున్?                                    
కొద్దిపాటి నీతిగానకన్?కుదురేమియు!లేదాయె?గొంతుబంటి నీర్ష్యద్వేషతన్!
పద్ధతేది?లేదు!చూడగన్?పదిలంబెడమాయెన్లె?పంతమంగడున్్తిలంగడున్
మద్దతీయ మాను దైవమా?మది మార్చుమి!దేవేశ!మంతనాలు గూర్చు మంచినిన్?                                                                            
2. అంతుపంతు లేని లోకమున్?అదునూ!పదునూ!లేదు!హద్దు మీరె!మాయ దేమొకో?
గొంతుబంటి నీర్ష్య ద్వేషతన్?కుదురేమియు!లేదాయె!కొద్దిపాటినీతి గానకన్?
పంతమంది వర్ధిలంగడున్?పదిలంబెడమాయెన్లె?పద్ధతేది?లేదు చూడగన్?
మంతనాల గూర్చు మంచినిన్?మదిమార్చుమి!దేవేశ!మద్దతీయ మాను! దైవమా!
                                                                                 
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.    

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

ముకుంద,మత్తరజినీ,వారుణ,ఉల్లాసినీ,వారితమా,చోరిత,చతుర్నరా,జూబరా,మరకతా,వారితమా,గర్భ"-చూరగొను"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
ముకుంద,మత్తరజినీ,వారుణ,ఉల్లాసినీ,వారితమా,చోరిత,చతుర్నరా,జూబరా,మరకతా,వారితమా,గర్భ"-చూరగొను"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-చూరగొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.య.జ.ర.జ.స.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జూబరాఖర్చుమానుమా!చోరబుద్ధి నంటనీకుమా!సురలుమెచ్చ!జీవించుమా!
శోభకాలుండునా?తుదిన్!చూరగొమ్ము!శాంతి ధాంతులన్?చురుకు గల్గి వర్తించుమా!
ప్రాభవంబెంచు!థాత్రినిన్?వారితాల జోలి కేగకన్?పరులచూడు!దైవంబునున్
నీబలంబెంత?చూడగన్!నీరజాక్షు గొల్వు ముక్తికై!నిరుపమంపు!జీవంబనన్?
1.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.వృ.సం.83.
ప్రాసనియమము కలదు.
జూబరా!ఖర్చు మానుమా!
శోభకాలుండునా!తుదిన్?
ప్రాభవాలెంచు!థాత్రినిన్?
నీబలంబెంత?చూడగన్?
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
చోర బుద్ధి నంటనీకుమా!
చూర గొమ్ము!శాంతి ధాంతులన్!
వారితాల జోలి కేగకన్?
నీరజాక్షు గొల్వు ముక్తికై!
3.గర్భగత"-వారుణ"-వృత్తము.
బృహతీఛందము.న.ర.ర.గణములు.వృ.సం.152.
ప్రాసనియమము కలదు.
సురలు మెచ్చ జీవించుమా!
చురుకు గల్గి వర్తించుమా!
పరుల చూడు దైవంబునున్?
నిరుపమంపు జీవంబనన్?
4.గర్భగత"-ఉల్లాసినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జూబరా ఖర్చు మానుమా!చోర బుద్ధి నంట నీకుమా!
శోభకాలుండునా!తుదిన్?చూరగొమ్ము శాంతి ధాంతులన్?
ప్రాభవా లెంచు!థాత్రినిన్?వారితాల జోలి కేగకన్?
నీ బలంబెంత?చూడగన్!నీర జాక్షు గొల్వు ముక్తికై ?
5.గర్భగత"-వారితమా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చోర బుద్ధి నంట నీకుమా!సురలు మెచ్చ జీవించుమా!
చూర గొమ్ము శాంతి ధాంతులన్?చురుకు గల్గి వర్తించుమా!
వారితాల జోలి కేగకన్?పరుల చూడు!దైవంబునున్?
నీర జాక్షు గొల్వు ముక్తికై!నిరుపమంపు జీవంబనన్?
6.గర్భగత"-చోరిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.ర.ర.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చోరబుద్ధి నంట నీకుమా!సురలు మెచ్చ జీవించుమా!జూబరా!ఖర్చు మానుమా!
చూరగొమ్ము!శాంతి ధాంతులన్?చురుకు గల్గి వర్తించుమా!శోభకాలుండునా? తుదిన్!     
వారితాల జోలి కేగకన్?పరుల చూడు దైవంబునున్?ప్రాభవాలెంచు!  థాత్రినిన్!
నీరజాక్షు గొల్వు ముక్తికై!నిరుపమంపు జీవంబనన్?నీబలంబెంత? చూడగన్?
7.గర్భగత"-చతుర్నరా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.ర.ర.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సురలు మెచ్చ జీవించుమా!జూబరా ఖర్చు మానుమా!
చురుకు గల్గి వర్తించుమా!శోభకాలుండునా?తుదిన్!
పరుల చూడు దైవంబునున్?ప్రాభవాలెంచు!థాత్రినిన్?
నిరుపమంపు జీవంబనన్?నీ బలంబెంత?చూడగన్!
8.గర్భగత"-జూబరా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.ర.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సురలు మెచ్చ జీవించుమా!జూబరా ఖర్చు మానుమా!చోర బుద్ధి నం   నీకుమా!
చురుకు గల్గి వర్తించుమా!శోభకాలుండునా?తుదిన్!చూర గొమ్ము!శాంతి ధాంతులన్?
పరుల చూడు దైవంబునున్?ప్రాభవాలెంచు థాత్రినిన్?వారితాల జోల కేగకన్?
నిరుపమంపు జీవంబనన్?నీ బలంబెంత?చూడగన్!నీరజాక్షు గొల్వు ముక్తికై!
9.గర్భగత"-మారకతా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతి.10వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చోరబుద్ధి నంట నీకుమా!జూబరా ఖర్చు మానుమా!
చూరగొమ్ము శాంతి ధాంతులన్?శోభకాలుండునా?తుదిన్!
వారితాల జోలి కేగకన్?ప్రాభవాలెంచు థాత్రినిన్?
నీరజాక్షు గొల్వు ముక్తికై!నీ బలం బెంత?చూడగన్?
10,గర్భగత"-వారితమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.ర.జ.స.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చోర బుద్ధి నంట నీకుమా!జూబరా ఖర్చు మానుమా!సురలు మెచ్చ జీవించుమా!
చూరగొమ్ము!శాంతి ధాంతులన్?శోభకా లుండునా?తుదిన్!చురుకు.గల్గి వర్తించుమా!
వారితాల జోలి కేగకన్?ప్రాభవా లెంచు థాత్రినిన్?పరుల చూడు దైవంబునున్?
నీరజాక్షు గొల్వు ముక్తి కై!నీ బలంబెంత?చూడగన్!నిరుపమంపు జీవంబనన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

9, సెప్టెంబర్ 2019, సోమవారం

అహమస్మి,అనఘా,మత్తరజినీ,ప్రగతిపద్మ,బిగువ,సుస్వార్ధి,చిరుమేలు,భవబంధ,నారాశ్రి,కుతంత్ర,గర్భ"-మేల్గాంచు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి, జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
అహమస్మి,అనఘా,మత్తరజినీ,ప్రగతిపద్మ,బిగువ,సుస్వార్ధి,చిరుమేలు,భవబంధ,నారాశ్రి,కుతంత్ర,గర్భ"-మేల్గాంచు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి, జుత్తాడ.                          

"-మేల్గాంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.న.ర.య.జ.ర.లగ.గణములుయతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుతంత్రాల కర్మచేష్టతన్!కువలయంబు నేలినన్?కొద్ది మేలు గాంచ శక్యమే?
ప్రతాపాల మర్మ ప్రోక్తులై!భవము జిక్కి లెక్కలన్?వద్దనేటి వార లేరిలన్?
చితాభస్మ మేర్ప స్వార్ధతన్?శివతమంబు గానకన్?సిద్ద దక్కజేయ లోకులన్!
నితంత్రించు సత్య మేదికన్?నివురుగప్పు నర్మతన్?నిద్దురించె!ఖ్యాతియో యనన్?                                                                                        
1.గర్భగత"-అహమస్మి"-వృత్తము.
బృహతీఛందము.య.జ.ర.గణములు.వృ.సం.170.
ప్రాసనియమము కలదు.
కుతంత్రాల కర్మ చేష్టతన్?
ప్రతాపాల మర్మ ప్రోక్తులై!
చితాభస్మ మేర్ప స్వార్ధతన్?
నితంత్రించు సత్య మేదికన్?
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.
ప్రాసనియమము కలదు.
కువలయంబు నేలినన్?
భవము జిక్కి లెక్కలన్?
శివతమంబు గానకన్?
నివురు గప్పు నర్మతన్?
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కొద్దిమేలు !గాంచ శక్యమే?
వద్ద నేటి వార లే రిలన్?
సిద్ద దక్క జేయ లోకులన్?
నిద్దురించె!ఖ్యాతియో?యనన్!
4.గర్భగత"-ప్రగతి పద్మ"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుతంత్రాల కర్మ చేష్టతన్?కువలయంబు నేలినన్?
ప్రతాపాల మర్మ ప్రోక్తులై!భవము జిక్కి లెక్కలన్?
చితాభస్మ మేర్ప స్వార్ధతన్?శివతమంబు గానకన్?
నితంత్రించు సత్య మేదికన్?నివురు గప్పు నర్మతన్?
5.గర్భగత"-బిగువ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కువలయంబు నేలినన్?కొద్ది మేలు గాంచ శక్యమే?
భవము జిక్కి లెక్కలన్?వద్దనేటి వారలేరిలన్?
శివతమంబు గానకన్?సిద్ద దక్క జేయ లోకులన్?
నివురు గప్పు నర్మతన్?నిద్దురించె!ఖ్యాతియో యనన్?
6.గర్భగత"-సుస్వార్థి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కువలయంబు నేలినన్?కొద్ది మేలుగాంచ శక్యమే?కుతంత్రాల కర్మచేష్టతన్?
భవము జిక్కి లెక్కలన్?వద్దనేటి వార లేరిలన్?ప్రతాపాల మర్మ ప్రోక్తులై!
శివతమంబు గానకన్?సిద్ద దక్క జేయలోకులన్?చితాభస్మమేర్ప!స్వార్ధతన్?
నివురుగప్పు నర్మతన్!నిద్దురించె!ఖ్యాతియో యనన్?నితంత్రించు!సత్యమేదికన్?                                                
7.గర్భగత"-చిరుమేలు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.య.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొద్దిమేలు గాంచశక్యమే?కుతంత్రాల కర్మచేష్టతన్?
వద్ద నేటి!వార లేరిలన్?ప్రతాపాల మర్మ ప్రొక్తులై!
సిద్ద దక్క జేయ లోకులన్?చితాభస్మ మేర్ప స్వార్ధతన్?
నిద్దు రించె!ఖ్యాతియోయనన్?నితంత్రించు!సత్యమేదికన్?
8.గర్భగత"-భవబంధ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.య.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొద్దిమేలు!గాంచ శక్యమే?కుతంత్రాల కర్మ చేష్టతన్?కువలయంబు నేలినన్?
వద్దనేటి!వార లేరిలన్?ప్రతాపాల మర్మ ప్రోక్తులై!భవము జిక్కి లెక్కలన్?
సిద్ద దక్క జేయ లోకులన్?చితాభస్మమేర్ప స్వార్ధతన్?శివతమంబు!గానకన్!
నిద్దురించె!ఖ్యాతియోయనన్?నితంత్రించు సత్య మేదికన్?నివురు గప్పునర్మతన్?                                              
9.గర్భగత"-నారాశ్రి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.త.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కువలయంబు నేలినన్?కుతంత్రాల కర్మ చేష్టతన్?
భవము జిక్కి లెక్కలన్?ప్రతాపాల మర్మ ప్రోక్తులై!
శివతమంబు గానకన్?చితాభస్మ మేర్ప స్వార్ధతన్?
నివురు గప్పు నర్మతన్?నితంత్రించు సత్య మేదికన్?
10,గర్భగత"-కుతంత్ర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
కువలయంబు నేలినన్?కుతంత్రాల కర్మచేష్టతన్?కొద్ది మేలుగాంచ శక్యమే?
భవము జిక్కి లెక్కలన్?ప్రతా పాల మర్మ ప్రోక్తులై!వద్ద నేటి వార లేరిలన్?
శివతమంబు గానకన్?చితాభస్మమేర్ప స్వార్ధతన్?సిద్ద దక్కజేయ లోకులన్!
నివురుగప్పు నర్మతన్?నితంత్రించు సత్య మేదికన్?నిద్దురించె!ఖ్యాతియో యనన్?
                                                                                       
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

08 - 9 - 2019 ఆదివరము మాతామహుల, పితామహుల శోభా దివసము.

0 comments

జైశ్రీరామ్.
08 - 9 - 2019 ఆదివరము మాతామహుల, పితామహుల  శోభా దివసము.
మనుమలు మనుమరాండ్రు మామ్మ, అమ్మమ్మ, తాత, తాతయ్యలతో ఆనందం పంచుకొనే రోజు.
ఈ సందర్భముగా నేను వ్రాసినదో లేక మరెవరు వ్రాసినదో గుర్తు లేదు ఐనా ఒక ప్రత్యేకతను సంతరించుకొనిన ఆంగ్లమాధ్యమంలో చక్కని తేటగీతి
మీ ముందుంచుచున్నాను.
తిలకింపుడు.
గ్రేండు పేరెంట్సు డే టుడే. గ్రేటు గ్రేటు (డేటు).
గ్రేండు సన్సెండు డాటర్సు గ్రీటు దెమ్ము.
ఎక్సులెంట్ దిస్సు సీక్వెన్సు. యెవ్విర్వేరు.  
గ్రేండు పేరెంట్సు విష్షెస్సు గిఫ్టు గాట్టు.
జైహింద్.
                                                                                                                                          .

7, సెప్టెంబర్ 2019, శనివారం

జలవర,రక్షదా,సుశ్లోకినీ,హత్తుకొను,ప్రమాణ,నీలిమా,పగవిడని,నయమారయ,మస్తక,మృగిణీ,గర్భ"-స్వార్థరాహిత్య"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి, జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
జలవర,రక్షదా,సుశ్లోకినీ,హత్తుకొను,ప్రమాణ,నీలిమా,పగవిడని,నయమారయ,మస్తక,మృగిణీ,గర్భ"-స్వార్థరాహిత్య"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి, జుత్తాడ.                          
"-స్వార్ధరాహిత్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.స.త.జ.భ.భ.న.మ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
స్వార్థరాహిత్య చింతన!సత్తత్వంబుల దారి జూపు!జగతికి మేలౌ!నెంచంగన్?
అర్ధ వంతంపు యోచన!హత్తు న్మొత్తము!లోక మందు!నగజకు నౌ! సంతోషంబున్?                                            
వ్యర్ధమౌ నూహ మానుచొ?చిత్తంబున్!శుచినొందు నీతి!పగనెడ మేర్చన్! సౌఖ్యంబౌ?                                          
నిర్థనుండుండ డిద్ధర?నెత్తావిన్!పులకించు నెంతొ?నెగడున్?సౌభ్రాతృత్వం బిద్ధరన్?                      
1.గర్భగత"-జలవర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లల.గణములు.వృ.సం.211.
ప్రాసనియమము కలదు.
స్వార్థ రాహిత్య చింతన!
అర్థ వంతంపు యోచన!
వ్యర్థమౌ!నూహ మానుచొ?
నిర్ధనుండుండ డిద్ధర?
2.గర్భగత"-రక్షదా"-వృత్తము.
బృహతీఛందము.మ.స.జ.గణములు.వృ.సం.345.
ప్రాసనియమము కలదు.
సత్తత్వంబుల దారి జూపు!
హత్తున్మొత్తము!లోకమందు!
బత్తెంబున్!శుచి నొందు నీతి!
నెత్తావిం బులకించు నెంతొ?
3.గర్భగత"-సుశ్లోకినీ"-వృత్తము.
బృహతీఛందము.న.య.మ.గణములు.వృ.సం.17.
ప్రాసనియమము కలదు.
జగతికి!మేలౌ!నెంచంగన్?
నగజకు నౌ!సంతోషంబున్?
పగ నెడ మేర్చం!సౌఖ్యంబౌ?
నెగడును సౌభ్రాతృత్వంబున్?
4.గర్భగత"-హత్తుకొను"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.ర.స.త.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
స్వార్థ రాహిత్య చింతన!సత్తత్వంబుల దారి జూపు!
అర్థవంతంపు యోచన!హత్తున్మొత్తము! లోక మందు!
వ్యర్థమౌ!నూహ మానుచొ? బత్తెంబున్శుచి నొందు నీతి!
నిర్ధనుం డుండ డిద్ధర? నెత్తావిం!పులకించు నెంతొ?
5.గర్భగత"-ప్రమాణ"-వృత్తము.
ధృతిఛందము.మ.స.జ.న.య.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్తత్వంబుల దారిజూపు!జగతికి !మేలౌ?నెంచంగన్?
హత్తున్మొత్తము!లోకమందు!నగజకునౌ!సంతోషంబున్?
బత్తెంబున్శుచి నొందు నీతి!పగ నెడమేర్పన్?సౌఖ్యంబౌ?
నెత్తావిం!పులకించు నెంతొ?నెగడును!సౌభ్రాతృత్వంబున్?
6.గర్భగత"-నీలిమా"-వృత్తము.
ఉత్కృతిఛందము,మ.స.జ.న.య.మ.ర.ర.లల,గణములు.యతులు.10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్తత్వంబుల దారి జూపు!జగతికి మేలౌ!నెంచంగన్శ్వార్ధ రాహిత్య!చింతన!
హత్తున్మొత్తము!లోకమందు!నగజకునౌ!సంతోషంబున్?అర్ధవంతంపు! యోచన!                                                
బత్తెంబున్శుచి నొందు నీతి!పగ నెడ మేర్చన్?సౌఖ్యంబౌ!వ్యర్ధమౌ!నూహ! మానుచొ?                                          
నెత్తావిం!పులకించు నెంతొ?నెగడును!సౌభ్రాతృత్వంబున్?నిర్ధనుండుండడిద్ధర?
7.గర్భగత"-పగవిడని"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.మ.ర.ర.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగతికి మేలౌ!నెంచంగన్?స్వార్ధ రాహిత్య చింతన!
నగజకు నౌ!సంతోషంబున్?అర్ధవంతంపు యోచన!
పగ నెడ మేర్చన్!సౌఖ్యంబౌ!వ్యర్ధమౌ!నూహ మానుచొ?
నెగడును సౌభ్రాతృత్వంబున్?నిర్ధనుండుండ డిద్ధర?
8.గర్భగత"-నయమారయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.మ.ర.ర.స.త.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగతికి మేలౌ!నెంచంగన్?స్వార్ధ రాహిత్య చింతన!సత్తత్వంబులదారిజూపు!
నగజకు నౌ!సంతోషంబున్?అర్థవంతంపు యోచన!హత్తున్మొత్తము! లోకమందు!                                              
వగ నెడమేర్చన్!సౌఖ్యంబౌ!వ్యర్థమౌ!నూహ మానుచొ?బత్తెంబున్!శుచినొందు!నీతి?                                          
నెగడును!సౌభ్రాతృత్వంబున్?నిర్ధనుండుండ డిద్ధర?నెత్తావిం!పులకించునెంతొ?
9.గర్భగత"-మస్తక"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.జ.ర.ర.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్తత్వంబుల దారి జూపు!స్వార్ధ రాహిత్య చింతన!
హత్తున్మొత్తము లోకమందు!అర్ధవంతంపు యోచన!
బత్తెంబున్!శుచి నొందు!నీతి!వ్యర్ధమౌ!నూహ మానుచొ?
నెత్తావిం!పులకించు నెంతొ?నిర్ధనుండుండ డిద్ధర?
10,గర్భగత"-మృగిణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.జ.ర.ర.న.న.మ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్తత్వంబుల!దారిజూపు!స్వార్ధ రాహిత్య చింతన!జగతికి మేలౌ!నెంచంగన్?
హత్తున్మొత్తము!లోకమందు!అర్ధ వంతంపు యోచన!నగజకు నౌ!సంతో షంబున్?                                              
బత్తెంబున్?శుచినొందు!నీతి!వ్యర్ధమౌ నూహ మానుచొ?వగ నెడమేర్చున్? సౌఖ్యంబునౌ?                                    
నెత్తావిం!పులకించు నెంతొ?నిర్ధనుం డుండ డిద్ధర?నెగడును సౌభ్రాతృ  త్వంబున్?                                            
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

గతికా,సమాశ్రీ,మత్తరజినీ,సుమాశ్రీ,యతిర్నవసుగంథి,నియమ,చరణాగత,సద్విశాల,సాధక,కీర్తిగామినీగర్భ"-శోధకా"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
గతికా,సమాశ్రీ,మత్తరజినీ,సుమాశ్రీ,యతిర్నవసుగంథి,నియమ,చరణాగత,సద్విశాల,సాధక,కీర్తిగామినీగర్భ"-శోధకా"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-శోధకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీతి నీమ నిష్టమైన!నిజ మనేది?నిల్చు ధాత్రి!నీకు రాదు!యాప దెన్నడున్!
పాతకాలు!పారిపోవు!?భజన సేయ!ముక్తి గల్గు!ప్రాకుమోయి!కీర్తిధామమున్!
చూతువేమి?పొందు నొంద!సుజన తత్వ మందు మోయి?శోక జీవనంబు! వీడుమా?
చేతనంబు!మంచి నొప్ప!సృజన శీల మందు!కొమ్ము?చీకుచింత!లెల్ల బాయలే!
1.గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
నిజమనేది?నిల్చు ధాత్రి!
భజన సేయ ముక్తిగల్గు?
సుజన తత్వ మందుమోయి?
సృజన శీల మందు కొమ్ము!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
నీతి నీమ నిష్ట మైన!
పాత కాలు పారిపోవు!
చూతువేమి?పొందు నొంద!
చేతనంబు మంచి నొప్ప!
3.గర్భగత"-మత్త రజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
నీకు రాదు!యాప దెన్నడున్?
ప్రాకు మోయి!కీర్తి ధామమున్?
శోక జీవనంబు!వీడుమా!
చీకు చింత లెల్ల బాయులే?
4.గర్భగత"-సుమాశ్రీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిజమనేది?నిల్చు థాత్రి!నీతి నీమ నిష్ట మైన!
భజన సేయ ముక్తి గల్గు!పాత కాలు!పారిపోవు!
సుజన తత్వ మందుమోయి?చూతువేమి?పొందు నొంద?
సృజన శీల మందు కొమ్ము!చేతనంబు మంచి నొప్ప!
5.గర్భగత"-యతిర్నవ సుగంథి"-వృత్తము
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీతి నీమ నిష్ట మైన!నీకు రాదు!యాపదెన్నడున్?
పాతకాలు పారి పోవు!ప్రాకు మోయి!కీర్తి ధామమున్?
చూతు వేమి?పొందు నొంద!శోక జీవనంబు వీడుమా!
చేతనంబు!మంచి నొప్ప!చీకు చింత లెల్ల బాయులే?
6.గర్భగత"-నియమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
నీతి నీమ నిష్ట మైన!నీకు రాదు!యాపదెన్నడున్?నిజ మనేది!నిల్చు థాత్రి?
పాతకాలు పారిపోవు!ప్రాకుమోయి!కీర్తిధామమున్?భజనసేయ!ముక్తిగల్గు!
చూతువేమి?పొందునొంద!శోక జీవనంబు!వీడుమా!సుజన తత్వ మందు మోయి?
చేతనంబు మంచినొప్ప!చీకుచింతలెల్ల బాయులే?సృజన!శీలమందుకొమ్ము!
7.గర్భగత"-శరణాగత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీకు రాదు!యాప దెన్నడున్?నిజమనేది!నిల్చు థాత్రి?
ప్రాకు మోయి!కీర్తిధామమున్?భజన సేయ!ముక్తిగల్గు!
శోక జీవనంబు!వీడుమా!సుజన తత్వ మందుమోయి?
చీకుచింత లెల్ల బాయులే?సృజన శీల మందుకొమ్ము?
8.గర్భగత"-సద్విశాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీకురాదు!యాపదెన్నడున్?నిజమనేది!నిల్చు ధాత్రి?నీతి నీమనిష్టమైన!
ప్రాకుమోయి!కీర్తిధామమున్?భజన సేయ ముక్తిగల్గు!పాతకాలు పారిపోవు?
శోక జీవనంబు!వీడుమా!సుజనతత్వ మందుమోయి?చూతువేమి?పొందు నొంద!
చీకుచింతలెల్ల బాయులే?సృజన శీల మందుకొమ్ము?చేతనంబు!మంచినొప్ప
9.గర్భగత"-సాధక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీతి నీమ నిష్టమైన!నిజమనేది!నిల్చు థాత్రి!
పాతకాలు పారిపోవు!భజన సేయ ముక్తి గల్గు!
చూతువేమి?పొందు నొంద!సుజన తత్వమందుమోయి?
చేతనంబు మంచి నొప్ప!సృజనశీల మందుకొమ్ము?
10.గర్భగత"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిజమనేది?నిల్చు ధాత్రి!నీతి నీమ నిష్టమైన!నీకురాదు!యాపదెన్నడున్?
భజనసేయ ముక్తిగల్గు!పాతకాలు పారిపోవు!ప్రాకుమోయి!కీర్తిధామమున్?
సుజనతత్వమందుమోయి!చూతువేమి?పొందునొంద?శోక జీవనంబు వీడుమా?
సృజనశీల మందుకొమ్ము!చేతనంబు మంచి నొప్ప!చీకుచింతలెల్ల!బాయులే!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

5, సెప్టెంబర్ 2019, గురువారం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా!. నేడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు. ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవముగా ప్రకటించి ఉపాధ్యాయులకు ఒక గుర్తింపునిచ్చిన ఆనాటి మేధావులను ప్రశంసింపక తప్పదు.
ఉపాధ్యాయులు తమ ఔన్నత్యమును వృత్తి నిర్వహణద్వారా నిరూపింఉకొంటూ విద్యార్థులకు సమాజమునకు తలలో నాలుకగా ఉంటూ అన్ని వేళలా సమాజంలో గౌరవింపఁబడవలసి ఉందని భావిస్తున్నాను.
ఇట్టి మహోత్తమమైన ఉపాధ్యాయ దినోత్సము సందర్భముగా ఉపాధ్యాయులు యావన్మందికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియఁ జేసుకొంటున్నాను.
పూజ్యులయిన మాగురుదేవులకు గురుతుల్యులయిన పెద్దలకు శిరసువంచి పాదాభివందనము చేయుచున్నాను.
జైహింద్.

4, సెప్టెంబర్ 2019, బుధవారం

నయ,మృదుపద,ఉపమా,మృదుపాలక,సుస్వన,ప్రమాణిక,నానినా,దిగులొనరు,సుస్వర,వరూథినీ,గర్భ"-తొగలుసెగలు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
నయ,మృదుపద,ఉపమా,మృదుపాలక,సుస్వన,ప్రమాణిక,నానినా,దిగులొనరు,సుస్వర,వరూథినీ,గర్భ"-తొగలుసెగలు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                           
"-తొగలు సెగలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.భ.న.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తెలుగు వెలుగు చెలగు!దిగులు తొలగు నెంతొ?దినము సుగమ చర్యలన్?
బలము మెలగు నెలమి!వగపు గనని తీరు!ప్రణుతి గనుత!శ్రీలతోన్?
జలము లలము నిలను!జగతి కుపక రించు!జనము దనరు పంటలన్?
తొలగు కులపు నులుకు!తొగల సెగలు నంటు!తొణుకు బెణుకు లోపకన్?
1గర్భగత"-నయ"-వృత్తము.
బృహతీఛందము.న.న.న.గణములు.వృ.సం.512.
ప్రాసనియమము కలదు.
తెలుగు వెలుగు చెలగు!
బలము మెలగు నెలమి!
జలము.లలము నిలను!
తొలగు కులపు నులుకు!
2.గర్భగత"-మృదుపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గలగణములు.వృ.సం.192.
ప్రాసనియమము కలదు.
దిగులు తొలగు నెంతొ?
వగపు గనని తీరు!
జగతి కుపక రించు!
తొగల సెగలు నంటు!
3.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.192.
ప్రాసనియమము కలదు.
దినము సుగమ చర్యలన్?
ప్రణుతి గనుత శ్రీలతోన్?
జనము దనరు పంటలన్?
తొణుకు బెణుకు లోపకన్?
4.గర్భగత"-మృదుపాలక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.న.న.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.98304.
తెలుగు వెలుగు చెలగు!దిగులు తొలగు నెంతొ?
బలము మెలగు నెలమి!వగపు గనని తీరు?
జలము లలము నిలను!జగతి కుపకరించు!
తొలగు కులపు నులుకు!తొగల సెగలు నంటు!
5.గర్భగత"-సుస్వన"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.న.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దిగులు తొలగు నెంతొ?దినము సుగమ చర్యలన్?
వగపు గనని తీరు!ప్రణుతి గనుత!  శ్రీల తోన్?
జగతి కుపక రించు!జనము దనరు పంట లన్?
తొగల సెగలు నంటు!తొణుకు బెణుకు లోపకన్?
6.గర్భగత"-ప్రమాణిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.భ.న.స.జ.న.న.లల.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దిగులు తొలగు నెంతొ?దినము సుగమ చర్యలన్?తెలుగు వెలుగు చెలగు!
వగపు గనని తీరు!ప్రణుతి గనుత!శ్రీలతోన్?బలము మెలగు నెలమి!
జగతి కుపకరించు!జనము దనరు పంటలన్?జలము లలము నిలను!
తొగల సెగలు నంటు!తొణుకు బెణుకు లోపకన్?తొలగు కులపు నులుకు!
7.గర్భగత"-నినినా"-వృత్తము
ధృతిఛందము.న.న.ర.న.న.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దినము సుగమ చర్యలన్?తెలుగు వెలుగు చెలగు!
ప్రణుతి గనుత శ్రీలతోన్?బలము మెలగు నెలమి!
జనము దనరు పంటలన్?జలము లలము నిలను!
తొణుకు బెణుకు లోపకన్?తొలగు కులపు నులుకు!
8.గర్భగత"-దిగులొనరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.న.న.న.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దినము సుగమ చర్యలన్?తెలుగు వెలుగు చెలగు!దిగులు తొలగు నెంతొ?
ప్రణుతి గనుత!శ్రీలతోన్?బలము మెలగు నెలమి!వగపు గనని తీరు?
జనము దనరు పంటలన్?జలము లలము నిలను!జగతి కుపకరించు!
తొణుకు బెణుకు లోపకన్?తొలగు కులపు నులుకు!తొగల సెగలు నంటు!
9.గర్భగత"-సుస్వర"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.న.న.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దిగులు తొలగు నెంతొ?తెలుగు వెలుగు చెలగు!
వగపు గనని తీరు?బలము మెలగు నెలమి!
జగతి కుపకరించు!జలము లలము నిలను!
తొగల సెగలు నంటు!తొలగు కులపు నులుకు!
10,గర్భగత"-వరూథినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.భ.న.న.న.న.స.లగ.గణములు.యతులు09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దిగులు తొలగు నెంతొ?తెలుగు వెలుగు చెలగు!దినము సుగమ చర్యలన్?
వగపు గనని తీరు?బలము మెలగు నెలమి?ప్రణుతి గనుత శ్రీలతోన్?
జగతి కుపకరించు!జలము లలము నిలను!జనము దనరు పంటలన్?
తొగల సెగలు నంటు!తొలగు కులపు నులుకు!తొణుకు బెణుకు లోపకన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

3, సెప్టెంబర్ 2019, మంగళవారం

గతికా,అంథక,రనరా,శోచయా,సమానోక్తి,గాయసీ,ప్రాణినా,వాస్తవా,గతజనీ,నాస్తీతి,గర్భ"-ఛాయాభ్రమక"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
గతికా,అంథక,రనరా,శోచయా,సమానోక్తి,గాయసీ,ప్రాణినా,వాస్తవా,గతజనీ,నాస్తీతి,గర్భ"-ఛాయాభ్రమక"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-ఛాయా భ్రమక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.య.య.జ.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిలువ నీడ లేని?నీతి!నేడ కేగెనో?బాలకా!నీవె!తేవలెను!థాత్రికిన్?
పులకరింపు!జాతి భాతి!పోడిమిన్?చెడెన్!భూతలిన్?భూ వరామ!శుభమారయన్?
అలసి!చూడ నోప కేగె?యాడు నాట!పెంపేర్పుకన్?యావదాస్తి!నిలుపే గతిన్?
తలప రాని!కోర్కెలీనె?తాడి నీడ!తీరాయెనే?తావకంపు!భవితెంచగన్?
1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
నిలువ నీడ లేని?నీతి!
పులకరింపు జాతి భాతి!
అలసి చూడనోప కేగె?
తలపరాని కోర్కె లీనె!
2.గర్భగత"-అంధక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75.
ప్రాసనియమము కలదు.
నేడ కేగెనో?బాలకా?
పోడిమిన్చెడెన్?భూతలిన్!
ఆడు నాట!పెంపేర్పు కన్??
తాడి నీడ!తీరాయెనే?
3.గర్భగత"-రనరా"-వృత్తము.
బృహతీఛందము.ర.న.ర.గణములు.వృ.సం.187.
ప్రాసనియమము కలదు.
నీవె!తేవలెను!థాత్రికిన్?
భూ వరామ!శుభ మారయన్?
యావదాస్తి!నిలుపే!గతిన్?
తావకంపు!భవితెంచగన్?
4.గర్భగత"-శోచయా"-వృత్తము.
అత్య ష్టీఛందము.న.ర.జ.ర.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిలువ నీడ లేని!నీతి!నేడ కేగెనో?బాలకా!
పులకరింపు!జాతి భాతి!పోడిమిం!జెడెన్భూతలిన్?
అలసి చూడనోప కేగె?యాడు నాట!పెంపేర్పకన్?
తలపరాని కోర్కె లీనె?తాడి నీడ తీరాయెనే?
5.గర్భగత"-సమానోక్తి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.జ.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నేడ కేగెనో?బాలకా!నీవె!తేవలెను!ధాత్రికిన్?
పోడిమిన్జెడెన్?భూతలిన్!భూవరామ!శుభ మారయన్?
ఆడు ఆట పెంపేర్పకన్యావదాస్తి!నిలు పేగతిన్?
తాడి నీడ తీరాయెనే?తావకంపు!భవి తెంచగన్?
6.గర్భగత"-గాయసీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.జ.స.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నేడ కేగెనో?బాలకా?నీవె తేవలెను!ధాత్రికిన్!నిలువ నీడ లేని?నీతి!
పోడిమిన్జెడెన్?భూతలిన్!భూవరామ!శుభ మారయన్?పులకరింపు!జాతి భాతి!
ఆడు ఆట పెంపేర్పకన్?యావదాస్తి!నిలు పేగతిన్?అలసి!చూడ నోప కేగె?
తాడి నీడ తీరాయెనే?తావకంపు!భవి తెంచగన్?తలప రాని!కోర్కె లీనె?
7.గర్భగత"-ప్రాణినా"-వృత్తము.
ధృతిఛందము.ర.న.ర.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీవు తేవలెను!ధాత్రికిన్?నిలువ నీడ లేని?నీతి?
భూ వరామ!శుభమారయన్?పులకరింపు!జాతి భాతి?
యావదాస్తి!నిలు పే?గతిన్?అలసి చూడ నోప కేగె?
తావకంపు !భవి తెంచగన్?తలపరాని!కోర్కె లీనె?
8.గర్భగత"-వాస్తవా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.న.ర.జ.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీవు తేవలెను!ధాత్రికిన్?నిలువ నీడ లేని నీతి!నేడ కేగెనో?బాలకా!
భూవరామ!శుభ మారయన్?పులకరింపు జాతి భాతి?పోడిమిన్జెడెన్? భూతలిన్?
యావదాస్తి!నిలుపే గతిన్?అలసి చూడ నోప కేగె?ఆడు ఆట పెంపేర్పకన్?
తావకంపు!భవితెంచగన్?తలపరాని!కోర్కె లీనె?తాడి నీడ తీరాయెనే?
9.గర్భగత"-గతజని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.జ.స.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసననియమము కలదు.వృ.సం.
ఏడ కేగెనో?బాలకా!నిలువ నీడ లేని?నీతి?
పోడిమిన్?చెడెన్!భూతలిన్?పులకరింపు!జాతి భాతి?
ఆడు ఆట!పెంపేర్పకన్?అలసి చూడనోపకేగె?
తాడి నీడ!తీరాయెనే?తలప రాని!కోర్కెవలీన!
10,గర్భగత"-నాస్తీతి"-వృత్తము.
ఏడ కేగెనో? బాలకా!నిలువ నీడ లేని నీతి!నీవు తేవలెను!ధాత్రికిన్?
పోడిమిన్!చెడెన్భూతలిన్?పులకరింపు జాతి భాతిిభూవరామ! శుభ మాయనే?
ఆడు ఆట పెంపేర్పకన్?అలసి!చూడనోప కేగె?యావదాస్తి నిలుపేగతిన్?
తాడి నీడ తీరాయెనే!తలప రాని కోర్కె లీనె?తావకంపు భవితెంచగన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

2, సెప్టెంబర్ 2019, సోమవారం

ఓం గం గణేశాయ నమః.

0 comments

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
ఆర్యులకు శుభోదయమ్.
నేడు వినాయక చతుర్థి. ఈ సందర్భముగా మీకు మీ కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియఁజేయుచున్నాను.

కంద గీత గర్భ ఉత్పలమాల.
ఓ గణనాథుఁడా! శుభములొప్పునటుల్ మము చూడు నిత్యమున్.
యోగదుఁడా! శుభా! కరమహో! ఘనదేహుఁడ! కాపు మాకు. రా
వే గణియించి యీ ప్రజకు ప్రేరణఁ గొల్పుమ వచ్చి నేడు. రా
వేగముగా.  సదా శుభము ప్రీతినొసంగుచు చూడుమమ్ము లన్.

ఉత్పలగర్భస్థ కందము.

గణనాథుఁడా! శుభములొ
ప్పునటుల్ మము చూడు నిత్యమున్ యోగదుఁడా! 
గణియించి యీ ప్రజకు ప్రే
రణఁ గొల్పుమ వచ్చి నేడు. రా వేగముగా.🙏🏼

ఉత్పలమాల గర్భస్థ తేటగీతి.
శుభములొప్పునటుల్ మము చూడు నిత్య!
కరమహో! ఘనదేహుఁడ! కాపు మాకు. 
ప్రజకు ప్రేరణఁ గొల్పుమ వచ్చి నేడు. 
శుభము ప్రీతినొసంగుచు చూడు మమ్ము.🙏🏼

శ్రీగణేశాయ మంగళమ్.🙏🏼
సద్విధేయుఁడు
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.

వినాయక చతుర్థి సందర్భముగా మీకందరికీ నా శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు పరమ పవిత్రమయిన, శుభప్రదమయిన, సమస్త విఘ్నవినాశకరమయిన వినాయక చతుర్థి.
ఆంధ్రామృత పాఠకమహోదయులకు భక్తులకు, సజ్జనులకు ఆ విఘ్నేశ్వరుఁడు శుభప్రదుడై కృపఁ జూచి కంటికి రెప్పవలె కాపాడును గాక.మీ అందరికీ నా శుభాకాంక్షలు.
జైహింద్.