గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఫిబ్రవరి 2024, శనివారం

యత్ర విద్వజ్జనో నాస్తి....... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్

శ్లో𝕝𝕝 యత్ర విద్వజ్జనో నాస్తి - శ్లాఘ్యస్తత్రాల్పధీరపిల్

నిరస్తపాదపే దేశే - ఏరణ్డోఽపి దృమాయతేల్

తే.గీ.  వృక్షములు లేని చోటులన్ పృథివిపైన

నాముదపు వృక్షమే ఘనంబరసి చూడ,

పండితులు లేని చోటులన్ వరలు ఘనత

నల్పమైనట్టు జ్ఞానియుననుపమముగ.

తా𝕝𝕝 వృక్షములు లేని ప్రదేశమునందు ఆముదవృక్షము మహావృక్షమెట్లు 

అగుచున్నదో అట్లే పండితులు లేని చోట అల్పజ్ఞానం కలవాడు కూడా 

పండితుడగుచున్నాడు.

జైహింద్.

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

గావః పశ్యంతి గంధేన ..... మేలిమిబంగారం మన సంస్కృతి.

2 comments

జైశ్రీరామ్. 

శ్లో.  గావః పశ్యంతి గంధేన  -  వేదైః పశ్యంతి పండితాః!

చారైః పశ్యంతి రాజానః  -  చక్షుభ్యాం ఇతరే జనాః!

తే.గీ.  గంధచక్షువులన్ బశుల్ కనుచునుండు,

వేదచక్షులన్ గాంతురు వేదవిదులు

చారు చక్షులన్ బాలకుల్ చక్క గాంత్రు,

చర్మ చక్షువులన్ గాంత్రు సకలజనులు.

భావము

గోవులు వాసనా నేత్రము చేతను, పండితులు వేదవిజ్ఞానమనే నేత్రము చేతను, 

రాజులు చారులనెడి (గూఢచారులు) నేత్రములతోడను, తమకు 

కావలసిన విషయములను చూచుచుండగా, సాధారణజనులు 

చర్మచక్షువులతోనే చూడగలుగుచున్నారు.

జైహింద్.

22, ఫిబ్రవరి 2024, గురువారం

సరస్వతి ఎవరు? ఆమె రూప రహస్యమేమిటి?

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

21, ఫిబ్రవరి 2024, బుధవారం

నెంచు,మది మెత్తన,కత్తి సాము,పత్తి వాస,సమస్త,కోరుమి,గర్భ"-ముక్తిదా"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.

 చీల నీకుమి సఖ్యతన్!చేర బోకుమి దుర్మదంబున్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!

మేలు గోరుమి సర్వమున్!మీర కేగుమి నీతి శాంతిన్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కాల దోషము నంట నీకన్!కారు కూతలు కూయ బోకుమ్!కత్తి సాముకి నిచ్ఛ మానుమ్!
బాల చైదము వీడుమా!పౌరహక్కుల గావు మెల్లన్!పత్తి వాసుని ముక్తి కోరుమ్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనుష్టుప్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-సఖ్యతా"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!
మేలు గోరుమి సర్వమున్!
కాల దోషము నంట నీకన్!
బాల చైదము వీడుమా!

అభిజ్ఞా ఛందము నందలి,అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-చీలనీకు"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!
మీర కేగుమి నీతి శాంతిన్!
కారు కూతలు కూయ బోకుమ్!
పౌర హక్కులు గావు మెల్లన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-మేలను"-వృత్తము.

చిత్త జాహితు గొల్వు భక్తిన్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!
పత్తి వవాసుని ముక్తి గొల్వుమ్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-దోషతా"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!చేర బోకుమి దుర్మదంబున్!
మేలు గోరుమి సర్వమున్!మీర కేగుమి నీతి శాంతిన్!
కాల దోషము నంటకన్!కారు కూతలు కూయ బోకుమ్!
బాల చైదము వీడుమా!పౌర హక్కుల గావు మెల్లన్!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును.
యతి.9,వ యక్షరము నకు చెల్లును.

5,గర్భగత"-చైదము"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చీల నీకుమి షఖ్యతన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మేలు గోరుమి సర్వమున్!
కారు కూతలు కూయ బోకుమ్!కాల దోషము నంటకన్!
పౌర హక్కుల గావు మెల్లన్!బా ల చైదము వీడుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-మీరకు"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!చిత్త జాహితు గొల్వు భక్తిన్!
మేలు గోరుమి సర్వమున్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కాల దోషము నంటకన్!కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!
బాల చైదము వీడుమా!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
పాదమునకు"17"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

7,,గర్భగత"-కారుకూతలు"-వృత్తము.

చిత్తజాహితు గొల్వు భక్తిన్!చీల నీకుమి సఖ్యతన్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మేలు గోరుమి సర్వమున్!
కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!కాల దోషము నంటకన్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!బాల చైదము వీడుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-దుర్మద'-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చిత్త జాహితు గొల్వు భక్తిన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కారు కూతలు కూయ బోకుమ్!కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!
పౌర హక్కులు గావు మెల్లన్!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-నీతి నెంచు"-వృత్తము.

చిత్త జాహితు గొల్వు భక్తిన్!చేర బోకుమి దుర్మదంబున్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మీర కేగుమి నీతి శాంతిన్!
కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!కారు కూతలు కూయ బోకుమ్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!పౌర హక్కులు గావు మెల్లన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదుపాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకుఉ చెల్లును.

10,గర్భగత"-మది మెత్తన"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చీల నీకుమి సఖ్యతన్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మేలు గోరుమి సర్వమున్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కారు కూతలు కూయ బోకుమ్!కాల దోషము నంటకన్!కత్తి సాముకి నిచ్ఛ మానుమ్!
పౌర హక్కులు గావు మెల్లన్!బాల చైదము వీడుమా!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-కీర్తి దామ"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!చేర బోకుమి దుర్మదంబున్!
మేలు గోరుమి సర్వమున్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మీర కేగుమి నీతి శాంతిన్!
కాల దోషము నంటకన్!కత్తి సామును నిచ్ఛ మానుమ్!కారు కూతలు కూయ బోకుమ్!
బాల చైదము వీడుమా!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!పౌర హక్కులు గావు మెల్లన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

12,గర్భగత"-పత్తి వాస"-వృత్తము.

చిత్తజాహితు గొల్వ భక్తిన్!చీల నీకుమి సఖ్యతన్!చేర బోకుమి దుర్మదంబున్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మేలు గోరుమి సర్వమున్!మీర కేగుమి నీతి శాంతిన్!
కత్తి సామును నిచ్ఛ మానుమ్!కాల దోషము నంటకన్!కారు కూతలు కూయ బోకుమ్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!బాల చైదము వీడుమా!పౌర హక్కులు గావు మెల్లన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాథమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-సమస్త"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!చీల నీకుమి సఖ్యతన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మెత్తనౌ మది నిల్పు సత్యమ్!మేలు గోరుమి సర్వమున్!
కారు కూతలు కూయ బోకుమ్!కత్తి సామును నిచ్ఛ మానుమ్!కాలదోషము నంటకన్!
పౌర హక్కులు గావు మెల్లన్!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!బాల చైదము వీడుమా!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-కోరుమి"-వృత్తము.

చిత్తజాహితు గొల్వు భక్తిన్!చేర బోకుమి దుర్మదంబున్!చీల నీకుమి సఖ్యతన్!
మెత్తనౌ మది నిల్పు సత్యమ్!మీర కేగుమి నీతి శాంతిన్!మేలు గోరుమి సర్వమున్!
కత్తి సామును నిచ్ఛ మానుమ్!కారు కూతలు కూయ బోకుమ్!కాలదోషము నంటకన్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!పౌర హక్కులు గావు మెల్లన్!బాల చైదము వీడుమా!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
జైహింద్.

చరిత నిల్చు,కరుణ గాచు,కరము మేలు,మేలొనరు,మరపు రాని,జరా సౌఖ్యం,గర్భ"- జరయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్. 

ధర్మ కర్ము లుదాసీనులు!ధరణి బ్రోచే సత్య సంధుల్!తరము నిల్పే ధీ నిధుల్!

మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరణ మైనా లెక్క సేయర్!మరువ నౌనే వారినిన్!
కర్మ జీవ సు కర్మంబులు!కరుణ గాచుం సర్వకాలమ్!కరము మేలౌ రక్షతన్!
చర్మ ధారులు దైవాంశులు!చరిత నిల్చే వారనంగన్!జరయు సౌఖ్యం బేర్పడున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-కర్మజీవ"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కర్మ జీవ సు కర్మంబులు!
చర్మ ధారులు దైవాంశులు!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాము నకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-మర్మ కర్మ"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!
మరణ మైనా లెక్క సేయర్!
కరుణ గాచుం సర్వ కాలమ్!
చరిత నిల్చే వారనంగన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును

3,గర్భగత"-ధర్మ కర్మ"-వృత్తము.

తరము నిల్చే ధీ నిధుల్!
మరువ నౌనే వారినిన్!
కరము మేలౌ రక్షతన్!
జరయు సౌఖ్యం బేర్పడున్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

4,గర్భగత"-సత్యసంధతా"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరణ మైనా లెక్క సేయర్!
కర్మ జీవ సుకర్మంబులు!కరుణ గాచున్ సర్వ కాలమ్!
చర్మ ధారులు దైవాంశులు!చరిత నిల్చే వారనంగన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-కరుణ"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!ధర్మ కర్ము లుదాసీనులు!
మరణ మైనా లెక్క సేయర్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరుణ గాచున్ సర్వ కాలమ్!కర్మ జీవ సు కర్మంబులు!
చరిత నిల్చే వారనంగన్!చర్మ ధారులు దైవాంశులు!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-తరము"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!తరము నిల్పే ధీ నిధుల్!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరువ నౌనే వారినిన్!
కర్మజీవ సు కర్మంబులు!కరము మేలౌ రక్షతన్!
చర్మ ధారులు దైవాంశులు!జరయు సౌఖ్యం బేర్పడున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

7,గర్భగత"-మరువరాని"-వృత్తము.

తరము నిల్పే ధీ నిధుల్!ధర్మకర్ము లుదాసీనులు!
మరువ నౌనే వారినిన్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరము మేలౌ రక్షతన్!కర్మ జీవ సు కర్మంబులు!
జరయు సొఖ్యం బేర్పడున్!చర్మ ధారులు దైవాంశులు!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-తెగించు"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!తరము నిల్పే ధీ నిధుల్!
మరణమైనా లెక్క సేయర్!మరువ నౌనే వారినిన్!
కరుణ గాచుం సర్వ కాలమ్!కరము మేలౌ రక్షతన్!
చరిత నిల్చే వారనంగన్!జరయు సౌఖ్యం బేర్పడున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-చరిత నిల్చు"-వృత్తము.

తరము నిల్చే ధీనిధుల్!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మరువ నౌనే వారినిన్!మరణ మైనా లెక్క సేయర్!
కరము మేలౌ రక్షతన్!కరుణ గాచున్ సర్వకాలమ్!
జరయు సౌఖ్యం బేర్పడున్!చరిత నిల్చే వారనంగన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

10,గర్భగత"-కరుణగాచు"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!ధర్మ  కర్ము లుదాసీనులు!తరము నిల్పే ధీ నిధుల్!
మరణ మైనా లెక్క సేయర్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరువ నౌనే వారినిన్!
కరుణ గాచుం సర్వ కాలమ్!కర్మ జీవ సుకర్మంబులు!కరము మేలౌ రక్షతన్!
చరిత నిల్చే వారనంగన్!చర్మ ధారులు దైవాంశులు!జరయు సౌఖ్యం బేర్పడున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-కరము మేలు"-వృత్తము.

ధర్మ కర్ము లుదాసీనులు!తరము నిల్పే ధీ నిధుల్!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరువ నౌనే వారినిన్!మరణమైనా లెక్క సేయర్!
కర్మ జీవ సు కర్మంబులు!కరము మేలౌ రక్షతన్!కరుణ గాచుం సర్వ కాలమ్!
చర్మ ధారులు దైవాంశులు!జరయు సౌఖ్యం బేర్పడున్!చరిత నిల్చే వారనంగన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-మేలొనరు"-వృత్తము.

తరము నిల్చే ధీనిధుల్!ధర్మ కర్ము లుదా సీనులు!ధరణి బ్రోచే సత్య సంధుల్!
మరువ నౌనే వారినిన్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!మరణమైనా లెక్క సేయర్!
కరము మేలౌ రక్షతన్!కర్మ జీవ సు కర్మంబులు!కరుణ గాచుం సర్వ కాలమ్!
జరయు సౌఖ్యం బేర్పడున్!చర్మ ధారులు దైవాంశులు!చరిత నిల్చే వారనంగన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-మరపు రాని"-వృత్తము.

ధరణి బ్రోచే సత్య సంధుల్!తరము నిల్పే ధీ నిధుల్!ధర్మ కర్ము లుదాసీనులు!
మరణమైనా లెక్క సేయర్!మరువ నౌనే వారినిన్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరుణ గాచుం సర్వ కాలమ్!కరము మేలౌ రక్షతన్!కర్మ జీవ సుకర్మంబులు!
చరిత నిల్చే వారనంగన్!జరయు సౌఖ్యం బేర్పడున్!చర్మ ధారులు దైవాంశులు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-జరాసౌఖ్యం"-వృత్తము.

తరము నిల్పే ధీ నిధుల్!ధరణి బ్రోచే సత్య సంధుల్!ధర్మ కర్ము లుదాసీనులు!
మరువ నౌనే వారినిన్!మరణ మైనా లెక్క సేయర్!మర్మ కర్ములు ద్వేషాత్ములు!
కరము మేలౌ రక్షతన్!కరుణ గాచుం సర్వకాలమ్!కర్మ జీవ సుకర్మంబులు!
జరయు సౌఖ్యం బేర్పడున్!చరిత నిల్చే వారనంగన్!చర్మ ధారులు దైవాంశులు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
జైహింద్.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము సందర్భముగా మన సంస్కృతాంధ్రముపద్యరచనను ఆంధ్రకవితాపితామహుఁడు అల్లసానిపెద్దన చెప్పిన ఆశు ఉత్పలమాలికలో చెప్పిన నిర్వచనమును శ్రీ గుమ్మడి గోపాలకృష్ణగారి మధురమైన కంఠములో వినండి.

0 comments

 జైశ్రీరామ్.

అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవము సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు. మన మాతృ భాషను ప్రేమిద్దాం మనం మాతృభాషలోనైమాటాడే నైపుణ్యాన్ని పెంపొందించుకుందాం.

జై ఆంధ్రమాతా!

వందే సంస్కృతమాతరమ్.

జైహింద్


మహా శివ గద్యం Maha Shiva Gadyam with Telugu Lyrics - మహా శివ గద్యం | G...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పుష్పవిలాపము ... రచన : ACPSastry ... 4 ఆగ, 2016, గురు 2:19 AM

0 comments

జైశ్రీరామ్.

 పుష్పవిలాపము తే .. బుద్ధదేవుని పూజింప బోవుచున్న 
       నాదు  వెనుకను పిలుచుచు నన్నుతాకి 
       గాలి పిలిచినటులసడి గాగ తిరిగి 
       జూడ కానబడియె నొక్క సుమము కన్నె 

తే ..  వట్టి చేతుల తోడ దైవతమునుగన
         బోవ నొప్పునటయ్య నీ బుద్ధి యిట్లు 
         వికట గతి బొంద నగునయ్య విమలమయిన 
         భారతమునందు నీపూజ గోర రెవరు 

తే ..   రిక్త హస్తము తోడను నృపుల గురువు 
          దైవ తంబుల  జూచుట తగదు తప్ప 
          టంచు శాస్త్రముల్ పలుకగా నార్య సమితి 
          చెప్పగా విని నీవిట్లు చేయనగునొ  

తే ..   తల్లి వృక్షము వయసుతో నుల్ల మలర 
         సూర్య కిరణాల సంగతి సుఖము గదుర 
          పుటుకనో చితిమయ్య నీ పుడమి బలము 
          తోడ సర్వ ఋతువులందు తోరముగను


తే ...   మాకు మాత్రము దేవుని మహిమలన్ని 
           కన్నులారంగ జూడంగ కాంక్ష లేదొ 
          చంద్రవదనల శిరసున సార రుచుల 
          పీఠ మెక్కగ మాయెద పేర్మిలేదొ 

తే ..   ఎవరు కనకుండ వినకుండ నేటి దారి 
         పుట్టిపెరిగి కడకుమేము  గిట్టుటేన 
          బ్రహ్మ మా నొసటను బట్టి వ్రాసినట్టి 
          వ్రాత మీరు చదువగల్గు వారొ ! ఔనొ ! 
               
తే ...... కదల లేని వారము మేము కనికరమున 
           నెవరు చేగొని నను కాదనియన బోము 
           మీరు దేవుని పూజల సౌరు మీర
           మమ్ముబోOట్లను దరిజేర్చు మనుజులెవరు 

తే ...   ఇప్పటి కినైన మించిన దేమిలేదు 
          మమ్ము గోయుచు మీ సజ్జ సొమ్ముగాగ
         బోల్చి గొనిపొండు బుద్ధుని పూజ కొరకు 
         పరుల పూజకు గాదెమా విరులు ధరణి 

తే..  ఋతువు నందున పూవులు  జతను గోరు 
        ధరణి యందు పరులకైన విరులు తాము 
        అర్ప ణముజేసి కొనునట్టి యర్హజాతి 
        అట్టి భాగ్యము పోగొట్ట నర్హులెవరు 


రచన : ACPSastry 
జైహింద్.

20, ఫిబ్రవరి 2024, మంగళవారం

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి పురాణపఠనము అద్భుతము.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

19, ఫిబ్రవరి 2024, సోమవారం

కృత్రిమ మహిళ

0 comments

 

జైశ్రీరామ్.
చైనాలో తయారైన కృత్రిమ మహిళ చైనా మార్కెట్‌లోకి విడుదలైంది. శరీర మాంసం 100% ఫాంటా ఫ్లెష్ మెటీరియల్ సిలికాన్ భాగాలతో తయారు చేయబడింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 72 గంటలపాటు అంతరాయం లేకుండా పనిచేస్తుంది. ఆత్మ లేదు. ఆహారం అవసరం లేదు.  దీనికి "HOORI" అని పేరు పెట్టారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేస్తుంది కాబట్టి ఇది 99% ఖచ్చితత్వంతో ఏ భాషనైనా మాట్లాడగలదు. భారతదేశంలోని యువతను లక్ష్యంగా చేసుకోవడానికి కంపెనీ ఈ "HOORI"ని త్వరలో భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. కట్నం లేదు. జాతకాలు లేవు. వంట చేస్తుంది, ఇంటి పనంతా చేస్తుంది, వాదనలు లేవు, డిమాండ్లు లేదా ఆదేశాలు లేవు.
జైహింద్

కావరె,పోరాడు,జవహీన,గర్భ"-వెతలు మాపు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.

 తీరు లేదు తెన్ను లేదు!తీరు తెన్ను లసలె లేవు!తీరు గూర్చి గావుమా హరీ!

నేర మేమి చేయలేదు!నేర గాడి నసలె కాను!నీర జాక్ష దక్షు డీవె గా!
భూరి సత్వ దైవ మీవు!పోర నాకు జవము లేదు!భూరి దక్షిణంబు లేదయా!
ఘోర కాటకాలు బాపుక్రూర జీవ వెతలు మాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-తీరు"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!
నేరమేమి చేయ లేదు!
భూరి సత్వ దైవమీవు!
ఘోర కాటకాలు బాపు!

అభిజ్ఞాఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-తెన్ను లేని"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!
నేరగాడి నసలె కాను!
పోర నాకు జవము లేదు!
క్రూర జీవ వెతలు మాపు!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-నేరుగా"-వృత్తము.

తీరు గూర్చి కావుమా హరీ!
నీరజాక్ష దక్షు డీవె గా!
భూరి దక్షిణంబు లేదయా!
కోరె దేను ముక్తి మార్గమున్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతీ"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-జవము"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!తీరు తెన్ను లసలె లేవు!
నేరమేమి చేయ లేదు!నేరగాడి నసలె కాను!
భూరి సత్వ దైవ మీవు!పోర నాకు జవము లేదు!
ఘోర కాటకాలు బాపు!క్రూర జీవ వెతలు మాపు!

అణిమా"-ఛందమునందలి "అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరము నకు చెల్లును.

5,గర్భగత"-తెరగు"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు లేదు తెన్ను లేదు!
నేరగాడి నసలె కాను!నేరమేమి చేయ లేదు!
పోర నాకు జవము లేదు!భూరి సత్వ దైవ మీవు!
క్రూర జీవ వెతలు మాపు!ఘోర కాటకాలు బాపు!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-భూరిదా"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!తీరు గూర్చి కావుమా హరీ!
నేర మేమి చేయ లేదు!నీర జాక్ష దక్షు డీవె గా!
భూరి సత్వ దైవ మీవు!భూరి దక్షిణంబు లేదయా!
ఘోర కాటకాలు బాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
పాదమునకు"17"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-దక్షిణా"-వృత్తము..

తీరు గూర్చి కావుమా హరీ!తీరు లేదు తెన్ను లేదు!
నీర జాక్ష దక్షు డీవె గా!నేర మేమి చేయ లేదు!
భూరి దక్షిణంబు లేదయా!భూరి సత్వ దైవ మీవు!
కోరె దేను ముక్తి మార్గమున్!ఘోర కాటకాలు బాపు!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

8,గర్భగత"-నీరజాక్ష"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు గూర్చి  గావుమా హరీ!
నేర గాడి నసలె కాను!నీర జాక్ష దక్షు డీవెగా!
పోర నాకు జవము లేదు!భూరి దక్షిణంబు లేదయా!
క్రూర జీవ వెతలు మాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
పాదమునకు"18"అక్షరము లుండును..ప్రాసనియమము కలదు.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-జీవన"-వృత్తము.

తీరు గూర్చి కావుమా హరీ!తీరు తెన్ను లసలె లేవు!
నీరజాక్ష దక్షు డీవె గా!నేరగాడి నసలె కాను!
భూరి దక్షిణంబు లేదయా!పోర నాకు జవము లేదు!
కోరె దేను ముక్తి మార్గమున్!క్రూర జీవ వెతలు మాపు!

అణిమా ఛందము నందలి"-ధృతి "ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి 10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-సత్వము"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు లేదు తెన్ను లేదు!తీరు గూర్చి కావుమా హరీ!
నేరగాడి నసలె కాను!నేర మేమి చేయ లేదు!నీరజాక్ష దక్షు డీవె గా!
పోర నాకు జవము లేదు!భూరి సత్వ దైవ మీవు!భూరి దక్షిణంబు లేదయా!
క్రూర జీవ వెతలు మాపు!ఘోర కాటకాలు బాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

11,గర్భగత"-తత్వము"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!తీరు గూర్చి కావుమా హరీ!తీరు తెన్ను లసలె లేవు!
నేరమేమి చేయ లేదు!నీర జాక్ష దక్షు డీవెగా!నేరగాడి నసలె కాను!
భూరి సత్వ దైవ మీవు!భూరి దక్షిణంబు లేదయా!పోర నాకు జవము లేదు!
ఘోర కాటకాలు బాపు!కోరె దేను ముక్తి మార్గమున్!క్రూర జీవ వెతలు మాపు!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.

12,గర్భగత"-కావవె"-వృత్తము.

తీరు గూర్చి కావుమా హరీ!తీరు లేదు తెన్ను లేదు!తీరు తెన్ను లసలె లేవు!
నీరజాక్ష దక్షు డీవె గా!నేర మేమి చేయ లేదు!నేర గాడి నసలె కాను!
భూరి దక్షిణంబు లేదయా!భూరి సత్వ దైవ మీవు!పోర నాకు జవము లేదు!
కోరె దేను ముక్తి మార్గమున్!ఘోర కాటకాలు బాపు!క్రూర జీవ వెతలు మాపు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-పోరాడ"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు గూర్చి కావుమా హరీ!తీరు  లేదు తెన్ను లేదు!
నేరగాడి నసలె కాను!నీర జాక్ష దక్షు డీవె గా!నేర మేమి చేయ లేదు!
పోర నాకు జవము లేదు!భూరి దక్షిణంబు లేదయా!భూరి సత్వ దైవ మీవు!
క్రూర జీవ వెతలు మాపు!కోరె దేను ముక్తి మార్గమున్!ఘోర కాటకాలు బాపు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-జవహీన"-వృత్తము.

తీరు గూర్చి గావుమా హరీ!తీరు తెన్ను లసలె లేవు!తీరు లేదు తెన్ను లేదు!
నీరజాక్ష దక్షు డీవెగా!నేరగాడి నసలె కాను!నేర మేమి చేయ లేదు!
భూరి దక్షిణంబు లేదయా!పోర నాకు జవము లేదు!భూరి సత్వ దైవ మీవు!
కోరె దేను ముక్తి మార్గమున్!క్రూర జీవ వెతతలు మాపు!ఘోల కాటకాలు బాపు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
జైహింద్.

తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ ... తే తం భుక్త్వా స్వర్గలోకం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే|

క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చాలితః|| (భాగవతం)

తే.గీ.  ఎంత వరకు పుణ్యంబుండు నంత వరకె

స్వర్గసుఖములు జీవాళి చక్కగఁ గను, 

క్షీణపుణ్యులు భువిపైకి చేరుచుందు

రందుకే ముక్తి మార్గంబు నందవలయు.                        

భావము.  స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము 

అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. 

ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా 

క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు.

శ్లో.  “ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీ‌ణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే || ” 

భగవద్గీత 9-21

తే.గీ. స్వర్గ భోగులు తమపుణ్య చయము తరుగ 

మనుజ లోకంబునే చేరు మరల, పార్థ! 

కర్మబద్ధులకీగతి కలుగుచుండు 

నన్నె నమ్మిన ముక్తి సంపన్నులయెడు. 

భావము.

“ చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం 

క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు ; 

మూడు ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు 

అనే రాకడపోకడలను పొందుతున్నారు.”

జైహింద్.

నా సహోదరుఁడు డా.యల్.ఎస్.వై.వీ.శర్మ ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రంలో నిర్వహించిన చింతన కార్యక్రమం ప్రబోధాత్మకంగా ఉండి ఎంతో సంతోషం కలిగించింది. మీరూ వినండి.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

శ్రీ శ్యామలా దండకం .

0 comments

     జైశ్రీరామ్.         

శ్రీ శ్యామలా దండకం . 


ధ్యానమ్ |

మాణిక్యవీణాముపలాలయంతీం

మదాలసాం మంజులవాగ్విలాసామ్ |

మాహేంద్రనీలద్యుతికోమలాంగీం

మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||

చతుర్భుజే చంద్రకళావతంసే

కుచోన్నతే కుంకుమరాగ శోణే |

పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ-

-హస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |

కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |

జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||


దండకమ్ |

జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే |

సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలీ సనాథత్రికే సానుమత్పుత్రికే | 

శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావలీ బద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే | 

కామలీలా ధనుఃసన్నిభ భ్రూలతాపుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే | 

చారు గోరోచనా పంక కేలీ లలామాభిరామే సురామే రమే | 

ప్రోల్లసద్వాలికా మౌక్తికశ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్యగండస్థల న్యస్తకస్తూరికాపత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీతసాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే | 

వల్లకీ వాదన ప్రక్రియా లోల తాలీదలాబద్ధతాటంక భూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే | 

దివ్య హాలామదోద్వేల హేలాలసచ్చక్షురాందోలన శ్రీసమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛా ఫలే శ్రీఫలే | 

స్వేద బిందూల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహకృన్నాసికా మౌక్తికే సర్వవిశ్వాత్మికే కాలికే | 

ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూలకర్పూర ఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే | 

కుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావలీ నిర్మలాలోల కల్లోల సమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే |

సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబుబిబ్బోక భృత్కంధరే సత్కలామందిరే మంథరే | 

దివ్యరత్నప్రభా బంధురచ్ఛన్న హారాదిభూషా సముద్యోతమానానవద్యాంశు శోభే శుభే | 

రత్నకేయూర రశ్మిచ్ఛటా పల్లవప్రోల్లసద్దోర్లతా రాజితే యోగిభిః పూజితే | 

విశ్వదిఙ్మండలవ్యాపి మాణిక్యతేజః స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకైః సత్కృతే | 

వాసరారంభ వేలా సముజ్జృంభమాణారవింద ప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే | 

దివ్య రత్నోర్మికాదీధితి స్తోమసంధ్యాయమానాంగులీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే | 

తారకారాజినీకాశ హారావలిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీభృత్కరే కింకర శ్రీకరే | 

హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే | 

లసద్వృత్త గంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావలీభూషణే మంజు సంభాషణే | 

చారు శింజత్కటీ సూత్ర నిర్భర్త్సితానంగ లీలా ధనుః శింజినీడంబరే దివ్యరత్నాంబరే | 

పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభా జిత స్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే |

వికసిత నవ కింశుకాతామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభా పరాభూతసిందూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే | 

కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగ తూణీర శంకాకరోదార జంఘాలతే చారులీలాగతే | 

నమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభా పుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే | 

ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీగృహీతాంఘ్రి పద్మే సుపద్మే ఉమే |

సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే | 

రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే | 

తత్ర విఘ్నేశ దుర్గా వటు క్షేత్రపాలైర్యుతే | 

మత్తమాతంగ కన్యాసమూహాన్వితే మంజులా మేనకాద్యంగనా మానితే భైరవైరష్టభిర్వేష్టితే | 

దేవి వామాదిభిః శక్తిభిః సేవితే | 

ధాత్రిలక్ష్మ్యాది శక్త్యష్టకైః సంయుతే | 

మాతృకామండలైర్మండితే | 

యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే | 

పంచబాణాత్మికే | 

పంచబాణేన రత్యా చ సంభావితే | 

ప్రీతిభాజా వసంతేన చానందితే |

 భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే | 

యోగినాం మానసే ద్యోతసే | 

ఛందసామోజసా భ్రాజసే | 

గీతవిద్యా వినోదాతితృష్ణేన కృష్ణేన సంపూజ్యసే | 

భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే | 

విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే |

శ్రవణహరణ దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే | 

యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చ్యసే | 

సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిః సురాణాం సమారాధ్యసే | 

సర్వవిద్యావిశేషాత్మకం చాటుగాథాసముచ్చారణం కంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే | 

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాబిభ్రతీ యేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ | 

యేన వా యావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః | 

యేన వా శాతకుంభద్యుతిర్భావ్యసే సోఽపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే | 

కిం న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః | 

తస్య లీలాసరో వారిధిః, తస్య కేలీవనం నందనం, తస్య భద్రాసనం భూతలం, తస్య గీర్దేవతా కింకరీ, తస్య చాజ్ఞాకరీ శ్రీః స్వయమ్ | 

సర్వతీర్థాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వపీఠాత్మికే, సర్వతత్త్వాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవిద్యాత్మికే, సర్వయోగాత్మికే, సర్వనాదాత్మికే, సర్వశబ్దాత్మికే, సర్వవిశ్వాత్మికే, సర్వదీక్షాత్మికే, సర్వసర్వాత్మికే, సర్వగే, పాహి మాం పాహి మాం పాహి మాం, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమః ||


ఇతి శ్రీకాళిదాస కృత శ్రీ శ్యామలా దండకమ్ |

జైహింద్.

16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

వేదగణితం - ఒక కథ ... ఇది చదివిన తరువాతయినా కళ్ళుతెరవాలి మనం.

0 comments

జై శ్రీరామ్.


చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా *నేర్చుకుని చదవ వచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను.*అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోష పరచడానికి ఆడతాను అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు రాజా! ఆట ను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలి గాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! అంటూ సున్నితంగాతిరస్కరించాడు.

సరే! పండితా! నీ తెలివి ని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! అన్నాడు రాజుగారు.

మహారాజా! చదరంగం లో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు - నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం. అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే! అని ఆ పని మంత్రికిపురమాయించాడు.

ఆ పండితుని వెంటమంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు పండితుడడి గాడు కదా.. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు, తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు.. అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజ లకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..

అలా తీసెయ్యకండి మహారాజా!.. ఆ పండితు డేమీ వెర్రిబాగులవాడు కాదు..

ఎందుచేత..? అన్నాడు రాజుగారు.

లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!!!

ఎందుకు..? ఆశ్చర్య పోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటల కొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణం లో చెప్పేసాడు మహారాజా! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపక మాల పద్యం కూడా చెప్పాడు.

అలాగా.. ఏమిటా పద్యం..?

ఇదుగో.. వినండి మహారాజా !

చం.  శరశశి షట్కచంద్ర శరసాయక రంధ్ర వియన్నగాగ్ని భూ

ధర గగనాబ్ధి వేదగిరి తర్కపయోనిధి పద్మజాస్య కుం

జరతుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి

స్తరనగు రెట్టి రెట్టి తగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్ 

(పావులూరి మల్లన గణితంలో పద్యం.)

పద్యం విన్న మహారాజు దీన్లో తేలిన లెక్కెక్క డుంది..?అంతా బాణా లూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలుతప్ప..

అదే మహారాజా! మన దేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరము లతో అనల్పార్థ సాధకం గా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

*ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతా లుగా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ పద్యంలో

శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని.( మన్మథుని పంచ సాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.

గగన, వియత్ - 0

(ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1(చంద్రుడొకడే భూమి కి )

షట్కము - 6

రంధ్ర - 9

(నవరంధ్రాలు)

నగ, గిరి, భూధర - 7

అగ్ని - 3

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని,దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి - 4

వేద -4

(చతుర్వేదములు)

తర్క - 6

(షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)

పద్మజాస్య - 4

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)

కుంజర - 8

(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెల సంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’

శర శశి షట్క చంద్ర శర

5     1     6         1    5

సాయక రంధ్ర వియత్

5            9       0

నగాగ్ని భూ

    7       3

ధర గగనాబ్ధి వేద గిరి

  7     0    4      4    7

తర్క పయోనిధి

6         4

పద్మజాస్య కుం

    4    

జర తుహినాంశు

8         1

సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

అంకెలులెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. "అంకానాం వామతో గతిః" - కుడి నుంచి ఎడమకు చేర్చి చదువు కోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.

1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46 వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,

ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజ లు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,

4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే

సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సం.।।లు...

అదీ సంగతి…

వేదపండితులతో వేళా కోళం తగదు మహారాజా!… నిజానికి అతడు చదివిన ఘనపనస కూడా లెక్కలకు,ధారణ శక్తికి సంబంధించినదే! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచారు. ఇప్పుడు ఏం చేయడం? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది.

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు.

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నేఅడుగుదాము.అని ఆ పండితున్ని పిలిపించిక్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పుమన్నాడు.

ఆ పండితుడు రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము.ధాన్యంబదులు గా అవును ఇవ్వండి చాలు! అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

చూచారా? వేదగణితానికి సాటి అయినది ఏమతగ్రంథం లోనయినా ఏ అన్యశాస్త్రణ్లోనయినా ఉందంటారా? చెప్పండి. అందుకే సనాతన ధర్మం ప్రతిపాదించే గ్రంథరాజాల్ని వదిలేసి పొట్టనింపుకోడానికి తాత్కాలికమైన కాలక్షేపం చదువులు మనపిల్లలికి అందజేయడం మనకు ఎంతవరకు సబవో ఆలోచించి కళ్ళుతెరవాలి మనం.

జైహింద్.

సంప్రదాయంగా జరుపుకొనే పుట్టినరోజునాడు మనము శుభప్రదమయిన మన సంస్కృతభాషలో అభ్గినందించు విధానము మీరూ వినండి. నచ్చితే పాటించండి. పాటింపజేయండి.

0 comments

 

జైశ్రీరామ్.
శుభ జన్మదినం తుభ్యం
శుభ జన్మదినం తుభ్యం
శుభ జన్మదినే తవ హే
సకలం మధురం భూయాత్ 
శుభ జన్మదినం తుభ్యం
శుభ జన్మదినం తుభ్యం
శుభ జన్మదినే తవ హే
సకలం మధురం భూయాత్ 
సకలం చ శుభం భూయాత్
జైహింద్

ఆత్మాత్వం గిరిజామతి స్సహచరా: .... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  ఆత్మాత్వం గిరిజామతి స్సహచరా: ప్రాణాశ్శరీరం గృహం

పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితి:

సంచార: పదయో: ప్రదక్షణవిధి: స్తోత్రాణి సర్వాన్గిరో

యద్య త్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం ||

శా.  నీవే యాత్మవు, బుద్ధి దుర్గ, స్వజనుల్ నీవైన నా ప్రాణముల్,

భావింపన్ గుడి నాశరీరమయ, సేవల్ నీకు నా కార్యముల్,

దేవా నిద్ర సమాధి, నా నడకయే దీపించు నిన్ చుట్టుటల్,

నావాక్కుల్ గన స్తోత్రముల్, గొనుమయా! నావర్తనల్ సేవగా.

భావము.  
ఓ పరమేశ్వరా! నా ఆత్మవు నీవే .  నా బుద్ధిగిరిజయే. నా పంచప్రాణములు సహచరులే.   
నా శరీరమే యిల్లు. నా విషయోపభోగరచననలే నీకు నేను చేయు పూజ. నా నిద్రయే సమాధి. నా పాదములు ఇటునటుతిరుగుటయే నీకు నేను చేయు ప్రదక్షిణలు. నేను నిత్యమూ పలికెడి నా మాటలే నీకు నేను చేయు స్తోత్రములు. నేను యేయే కర్మలనొనరించుచుంటినో అదంతయూ నీ ఆరాధనయే. నీవు నన్ను అనుగ్రహించుము.
🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

చాటుమాటు,చేరు,దెబ్బతీయు,వాట మేర్చు,చీటి చింపు,వాట మేర్చు,వెక్కి రించు,మారని తీరు,గర్భ"-అగమ్య"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.

దారి గోతుల నాతి చూపుల్!తాట దీసెను జీవ ధాత్రిన్!తారు గమ్య మగమ్యమై!
సారి సారికి వెక్కి రింపన్!చాటు మాటున దెబ్బ తీసెన్!చారు శీల వికారతన్!
పారె లోకము చిక్కి భీతిన్!వాట మేర్చిన దోష కన్యై!వారు వీరని యెంచకన్!
చేరె నక్రమ విక్ర మార్కమ్!చీటి చింపును నిక్కు వంబై!చేర జేయును కాలునిన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత ఉత్కృతి
ఛందము లోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-తారు గమ్య "-వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!
సారి సారికి వెక్కి రింపన్!
పారె లోకము చిక్కి భీతిన్!
చేరె నక్రమ విక్ర మార్కమ్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-చారు శీల"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!
చాటు మాటున దెబ్బ తీసెన్!
వాట మేర్చిన దోష కన్యై!
చీటి చింపును నిక్కువంబై!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-తారతమ్య"-వృత్తము.

తారు గమ్య మగమ్యమై!
చారు శీల వికారతన్!
వారు వీరని యెంచకన్!
చేర జేయును కాలునిన్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

4,గర్భగత"-మార్గము"-వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!తాట దీసెను జీవ ధాత్రిన్!
సారి సారికి వెక్కి రింపన్!చాటు మాటున దెబ్బ తీసెన్!
పారె లోకము చిక్కి భీతిన్!వాట మేర్చిన దోష కన్యై!
తీరు మారునె?భ్రాంతి గాకన్!చీటి చింపును నిక్కు వంబై!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును .
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-సారి సారికి"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!దారి గోతుల నాతి చూపుల్!
చాటు మాటున దెబ్బ తీసెన్!సారి సారికి వెక్కిరింపన్!
వాట మేర్చిన దోష క న్యై!పారె లోకము చిక్కి భీతిన్!
చీటి చింపును నిక్కు వంబై!తీరు మారునె?భ్రాంతి గాకన్!

అణిమా ఛందము నందలి ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-18,అక్షరము లుండును.
యతి,10"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-భీతి చిక్కు"వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!తారు గమ్య మగమ్యమై!
సారి సారికి వెక్కి రింపన్!చారు శీల వికారతన్!
పారె లోకము చిక్కి భీతిన్!వారు వీరని యెంచకన్!
చేరె నక్రమ విక్రమార్కమ్!చేర జేయును కాలునిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-భ్రాంతి గను"-వృత్తము.

తారు గమ్య మగమ్యమై!దారి గోతుల నాతి చూపుల్!
చారు శీల వికారతన్!సారి సారికి వెక్కిరింపన్!
వారు వీరని యెంచకన్!పారె లోకము చిక్కి భీతిన్!
చేర జేయును కాలునిన్!చేరె నక్రమ విక్ర మార్కమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-చాటు మాటు"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!తారు గమ్య మగమ్యమై!
చాటు మాటున దెబ్బ దీసెన్!చారు శీల వికారతన్!
వాట మేర్చిన దోష కన్యై!వారు వీరని యెంచకన్!
చీటి చింపును నిక్కు వంబై!చేర జేయును కాలునిన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-చేరు"-వృత్తము.

తారు గమ్య మగమ్యమై!తాట దీసెను జీవ ధాత్రిన్!
చారు శీల వికారతన్!చాటు మాటున దెబ్బ తీసెన్!
వారు వీరని యెంచకన్!వాట మేర్చిన దోష కన్యై!
చేర జేయును కాలునిన్!చీటి చింపును నిక్కు వంబై!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-దెబ్బతీయు"-వృత్తము.

తాట దీసెను జీవ ధాత్రిన్!దారి గోతుల నాతి చూపుల్!తారు గమ్య మగమ్యమై!
చాటు మాటున దెబ్బ దీసెన్!సారి సారికి వెక్కి రింపన్!చారు శీల వికారతన్!
వాట మేర్చిన దోష కన్యై!పారె లోకము చిక్కి భీతిన్!వారు వీరని యెంచకన్!
చీటి చింపును నిక్కు వంబై!చేరె నక్రమ విక్ర మార్కమ్!చేరజేయును కాలునిన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-వాట మేర్చు"-వృత్తము.

దారి గోతుల నాతి చూపుల్!తారు గమ్య మగమ్యమై!తాట దీసెను జీవధాత్రిన్!
సారి సారికి వెక్కిరింపన్!చారు శీల వికారతన్!చాటు మాటున దెబ్బ దీసెన్!
పారె లోకము చిక్కి భీతిన్!వారు వీరని యెంచకన్!వాటమేర్చిన దోషకన్యై!
చేరె నక్రమ విక్రమార్కమ్!చేర జేయును కాలునిన్!చీటి నింపును విక్ర మార్కమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.

జైహింద్.