గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2020, సోమవారం

దేవనింద,సింహరేఖ,రస,వీలవని,హరాయుధ,నేల నేలు,రసోపరి, రసమెయీ,జీవనాశృల్,గర్భ"-మేల్కోరు,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
దేవనింద,సింహరేఖ,రస,వీలవని,హరాయుధ,నేల నేలు,రసోపరి, రసమెయీ,జీవనాశృల్,గర్భ"-మేల్కోరు,వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                   
"-మేల్కోరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.ర.ర.త.మ.జ.జ.గగ.గణములు.,యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నేల నేల!జనం కావలెన్?నింగిజేర!జీవనాశృల్!నీ వదెవ్వరి?నేలెదెంచన్!
వీలు లేదు!పరార్థంబుకున్?బెంగనిండె!లోకమెల్లన్!వేవురున్బ్రతికున్న  చాలున్?          
చీలనీకు?సుహృద్భావనన్!శృంగ భంగమే!యదెంచన్?జీవ రక్షణ మోక్ష  దామమ్!
కూల జేయు కరోనా"-న్వడిన్!కొంగు బంగరం బదే నౌ?కోవ త్రెంచక మించి  మంచిన్!
                                                                             
1.గర్భగత"-దేవనింద"-వృత్తము.
బృహతీఛందము.ర.స.ర.గణములు.వృ.సం.155.
ప్రాసనియమము కలదు.
నేల నేల?జనం కావలెన్!
వీలులేదు? పరార్థంబుకున్!
చీలనీకు?సుహృద్భావమ్!
కూల జేయు!కరోనాన్? వడిన్!
2.గర్భగత"-సింహరేఖ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గగ.గణములు.వృ.సం.43.
ప్రాసనియమము కలదు.
నింగి జేర!జీవనాశృల్!
బెంగ నిండె!లోకమెల్లన్!
శృంగ భంగమే!యదెంచన్?
కొంగు బంగరం బదే!నౌ!
3.గర్భగత"-రస"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
నీవదెవ్వరి?నేలె దెంచన్!
వేవురున్!బ్రతికున్న చాలున్!
జీవ రక్షణ మోక్షదామమ్!
కోవ త్రెంచక !మించి మంచిన్!
4.గర్భగత"-వీలవని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.ర.ర.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నేల నేల?జనం కావలెన్!నింగి జేర జీవనాశృల్?
వీలు లేదు పరార్థంబుకున్?బెంగ నిండె!లోక మెల్లన్?
చీల నీకు సుహృద్భావమ్!శృంగభంగ మెంచ నౌనే?
కూలజేయు"-కరోనాన్!వడిన్!కొంగు బంగరం బదే!నౌ!
5.గర్భగత"-హరాయుథ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.మ.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర జీవనాశృల్!నీ వదెవ్వరి నేలె దెంచన్?
బెంగనిండె!లోక మెల్లన్?వేవురున్?బ్రతికున్న చాలున్!
శృంగభంగ మెంచ నౌనే?జీవ రక్షణ మోక్షదామమ్!
కొంగు బంగరం బదే?నౌ!కోవ త్రెంచకు మించి మంచిన్?
6.గర్భగత"-నేల నేలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.జ.మ.జ.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర!జీవనాశృల్!నీ వదెవ్వరి?నేలె దెంచన్!నేల నేల!జనం కావలెన్!
బెంగనిండె!లోక మెల్లన్?వేవురున్!బ్రతికున్న చాలున్?వీలు లేదు?పరా ర్థంబుకున్?            
శృంగ భంగ మెంచనౌనే?జీవ రక్షణ మోక్ష ధామమ్!చీల నీకు? సు హృ ద్భావమ్!    
కొంగు బంగరం బదే?నౌ! కోవ త్రెంచకు!మించి మంచిన్?కూలజేయు  కరోనాన్వడిన్!
                                                                       
7.గర్భగత"-రసోపరి"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీ వదెవ్వరి?నేలె దెంచన్!నేల నేల?జనం కావలెన్!
వేవురున్!బ్రతి కున్న చాలున్?వీలు లేదు!పరార్థంబుకున్?
జీవ రక్షణ మోక్ష దామమ్!చీలనీకు!సుహృద్భావమ్!
కోవ త్రెంచకు!మించి మంచిన్?కూల జేయు!కరోనాన్వడిన్!
8.గర్భగత"-రసమెయీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.ర.ర.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీ వదెవ్వరి?నేలె దెంచన్!నేల నేల!జనం కావలెన్!నింగి జేర!జీవనాశృల్!
వేవురు న్బ్రతి కున్న!చాలున్?వీలు లేదు?పరా ర్థంబుకున్!బెంగ నిండె లోక మెల్లన్?
జీవరక్షణ మోక్షదామమ్!చీలనీకు!సుహృద్భావమ్!శృంగ భంగ మెంచ   నౌనే?        
కోవ త్రెంచకు!మించి మంచిన్?కూల జేయు కరోనా న్వడిన్!కొంగు బంగరం బదే?నౌ!
                                                                   
9.గర్భగత"-కోవత్రెంచు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.మ.జ.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర జీవనాశృల్!నేల నేల!జనం కావలెన్!
బెంగ నిండె!లోక మెల్లన్?వీలు లేదు!పరార్థంబుకున్?
శృంగ భంగ మెంచ నౌనే?చీలనీకు!సుహృద్భావమ్!
కొంగు బంగరం బదే?నౌ!కూలజేయు కరోనా న్వడిన్!
10,గర్భగత"-జీవనాశృల్"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.య.య.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి జేర జీవనాశృల్!నేల నేల జనం కావలెన్?నీ వదెవ్వరి?నేలె దెంచన్!
బెంగ నిండె!లోక మెల్లన్?వీలు లేదు?పరార్థంబుకున్!వేవురున్?బ్రతి  కున్న చాలున్!    
శృంగ భంగ మెంచ నౌనే?చీల నీకు!సుహృద్భావమ్!జీవ రక్షణ మోక్ష   దామమ్!                
కొంగు బంగరం బదే?నౌ! కూల జేయు కరోనా"-న్వడిన్!కోవ త్రెంచకు?  మించి మంచిన్!
                                                               
 స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

30, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీవేంకటేశ్వర “గోపుర” బంధ శార్దూలము. రచన. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ

1 comments

జైశ్రీరామ్.
శ్రీవేంకటేశ్వర “గోపుర” బంధ శార్దూలము.  రచన. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ
శ్రీగోవింద పదాశ్రయాంకిత హృదశ్రీ  నర్పణన్ జేయగన్
శ్రీగోవింద పదాలఁ బల్కుచు నగశ్రీ నెక్కి సోపానముల్
శ్రీగోవింద సమాహ్వఘోషణములన్ శ్రీవేంకటేశా! మమున్
శ్రీగోవింద! మురారి! కావగ రమశ్రీతోడ రావే! హరీ!

ఇంత చక్కగా వ్రాసిన ప్రియ సహోదరులకు
అభినందనలతో పూర్వక ఆశీస్సులు.

అన్నను మించు తమ్ముఁడని హాయిగనందరు చెప్పునట్లుగా
మన్ననలందు తీరున సమంచితరీతిని బంధపద్యమున్
క్రన్నన వ్రాసినట్టి గుణగణ్య సహోదర సంతసంబయెన్.
పన్నుగ వేంకటేశ్వరుఁడు భాసిలఁజేయును మిమ్ము బ్రేమతోన్.

ప్రేమతో
చింతా రామకృష్ణారావు.

జైహింద్.

29, ఆగస్టు 2020, శనివారం

నేడు తెలుఁగు మాతృభాషా దినోత్సవము. ఈ సందర్భముగా తెలుఁగు ప్రాశస్త్యము.

0 comments

జైశ్రీరామ్.

నేడు తెలుఁగు మాతృభాషా దినోత్సవము. ఈ సందర్భముగా తెలుఁగు ప్రాశస్త్యము.

తెలుంగు భాషకన్నఁ జూడ తీయనైనదేదిరా?
వెలుంగు చిందు దివ్య భాష విశ్వమందు తెల్గురా.
కలంగనేల తెల్గు పల్క గౌరవంబు పోదురా.
చెలంగరా తెలుంగు పల్కి శ్రీధరున్ స్మరించుచున్.

తెలుఁగె లోకమునందున వెలుఁగు లొలుకు,
వెలుఁగు తిమిరంబునే బాపి నిలుపు మనను,
నిలుచు మనమంత జగతిని నిలుపనగును,
వెలుగు జగతికి మూలము తెలుఁగె యగును.

శ్రీకరమైన యక్షర ప్రసిద్ధిని గన్నది తెల్గుభాష, ర
త్నాకరమిద్ది సుద్దులకు, నవ్యమనోజ్ఞసుభాషణామృతం
బీకమనీయభాష తరమే యిల తెల్గును నిర్వచింప యా
శ్రీకర బ్రహ్మయున్ తెలుఁగు చిత్తమునిల్పి గ్రహించు నేర్పినన్.

మనమునఁ గల్గు భావన నమాంతము బల్కిన యంత దెల్పు నీ
ఘనమగు తెల్గు భాష. కొరగాని స్వరంబది లేదు తెల్గునన్,
క్షణములలోన నేఱ్వఁ దగు కమ్మని తెల్గు నెఱుంగనెంచినన్,
వినయ విధేయతల్ గొలిపి వేల్పులనే గనఁజేయు భాషయౌన్.

గిరిధరుండు తెలుఁగు కీర్తిని గనుచు నిం
డుగను మెచ్చి పోత నగ నిల వెలు
గునటు భాగవతము కూర్మితో వ్రాసెరా.
తెలుఁగుకన్న మిన్న తెలుప గలదె?
( ఈ పద్యమున నామగోపన చిత్రము కలదు. మొదటి మూడు పాదములలో మొదటి అక్షరములు గి.డు.గు.)

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

శ్రీషడానన శతకము. పూర్వ భాగము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, ఆగస్టు 2020, శుక్రవారం

రనరా,నీలికంఠ,మహత్వ,ఫలితవ్య,అదృశ,అమేయచైద,చిందించు,క్రతుఫల,ధింధిమ్మను,చిలిపితన,గర్భ"-తేజోమయీ"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
రనరా,నీలికంఠ,మహత్వ,ఫలితవ్య,అదృశ,అమేయచైద,చిందించు,క్రతుఫల,ధింధిమ్మను,చిలిపితన,గర్భ"-తేజోమయీ"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

   "- తేజోమయీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.న.ర.స.భ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
స్త్రీ జనో ద్ధరణ మందునన్!చిలిపి కృష్ణు డీవేగా?చిందించి తమేయ
                                                                             చైదముల్!
తేజ మీవె?వ్రజ శక్తికిన్!తెలియ రారు దివ్యులే?ధింధిమ్మను ఘోష
                                                                         నాధముల్!
వాజపేయ క్రతు వీవనన్?పలు ఫలాల భవ్యుడా!బంధింపగ శక్యమే?
                                                                               నినున్!
భోజు డీవె?పరమాత్ముడా!బలిదు డీవె?శ్రీహరీ!బంధాలకు మూల
                                                                              కారకా!
అర్ధములు:-వ్రజ శక్తి=గోపాలుర సత్తువ,

1.గర్భగత"-రనరా"-వృత్తము.
బృహతీఛందము.ర.న.ర.గణములు.వృ.సం.187.
ప్రాసనియమము కలదు.
స్త్రీ జనోద్ధరణ మందునన్!
తేజ మీవె?వ్రజ శక్తికిన్?
వాజపేయ క్రతు వీవనన్?
భోజు డీవె?పరమాత్ముడా!
2.గర్భగత"-నీలికంఠ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.గగ.గణములు.వృ.సం.24.
ప్రాసనియమము కలదు.
చిలిపి కృష్ణు డీవేగా?
తెలియ రారు దివ్యులే?
పలు ఫలాల భవ్యుడా!
బలిదు డీవె?శ్రీహరీ!
3.గర్భగత"-మహత్వ"-వృత్తము.
బృహతీఛందము.త.జ.ర.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
చిందించి తమేయ చైదముల్!
ధింధిమ్మను ఘోష నాథముల్?
బంధింపగ శక్యమే?నినున్?
బంధాలకు మూల కారకా?
4.గర్భగత"-ఫలితవ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
స్త్రీ జనోద్ధరణ మందునన్?చిలిపి కృష్ణు డీవేగా?
తేజ మీవె?వ్రజ శక్తికిన్!తెలియ రారు?దివ్యులే!
వాజ పేయ క్రతు వీవనన్?పలు ఫలాల భవ్యుడా!
భోజు డీవె?పరమాత్ముడా!బలిదు డీవె?శ్రీహరీ!
5.గర్భగత"-అదృశ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.మ.భ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిలిపి కృష్ణు డీవెగా?చిందించి తమేయ చైదముల్!
తెలియ రారు!దివ్యులే?ధింధిమ్మను ఘోష నాథముల్?
పలు ఫలాల భవ్యుడా!బంధింపగ శక్యమే?నినున్!
బలిదు డీవె?శ్రీహరీ!బంధాలకు మూల కారకా?
6.గర్భగత"-అమేయ చైద"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.మ.భ.ర.య.జ.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిలిపి కృష్ణు డీవెగా?చిందించి తమేయ చైదముల్!స్త్రీ జనోద్ధరణ
                                                                         మందునన్?
తెలియ రారు!దివ్యులే?ధింధిమ్మను ఘోష నాథముల్?తేజ మీవె!
                                                                         వ్రజ శక్తికిన్!
పలు ఫలాల భవ్యుడా!బంధింపగ!శక్యమే?నినున్!వాజ పేయ క్రతు
                                                                        వీ వనన్?
బలిదుడీవె?శ్రీ హరీ!బంధాలకు మూల కారకా?భోజు డీవె?పర
                                                                         మాత్ముడా!
7.గర్భగత"-చిందించు"-వృత్తము.
ధృతిఛందము.త.జ.ర.ర.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిందించి తమేయ చైదముల్!స్త్రీ జనోద్ధరణ మందునన్?
ధింధిమ్మను ఘోష నాధముల్?తేజ మీవె!వ్రజ శక్తికిన్!
బంధింపగ!శక్యమే?నినున్!వాజ పేయ క్రతు వీవనన్?
బంధాలకు మూల కారకా?భోజు డీవె?పరమాత్ముడా!
8.గర్భగత"-క్రతుఫల"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.ర.న.ర.న.ర.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిందించి తమేయ చైదముల్!స్త్రీ జనోద్ధరణ మందునన్?చిలిపి కృష్ణు
                                                                                     డీవెగా?
ధింధిమ్మను ఘోష నాథముల్?తేజ మీవె?వ్రజ శక్తికిన్!తెలియ రారు
                                                                                దివ్యులే?
బంధింపగ శక్యమే?నినున్!వాజ పేయ క్రతు వీవనన్?పలు ఫలాల
                                                                                భవ్యుడా!
బంధాలకు మూల కారకా?భోజు డీవె?పరమాత్ముడా!బలిదు డీవె?
                                                                        శ్రీహరీ!
9.గర్భగత"-ధింధిమ్మను"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.మ.జ.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిలిపి కృష్ణు డీవెగా?స్త్రీ జనోద్ధరణ మందునన్?
తెలియ రారు దివ్యులే?తేజ మీవె?వ్రజ శక్తికిన్!
పలు ఫలాల భవ్యుడా!వాజ పేయ క్రతు వీవనన్?
బలిదు డీవె?శ్రీహరీ!భోజు డీవె?పరమాత్ముడా!
10,గర్భగత"-చిలిపితన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.మ.జ.స.య.భ.ర.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిలిపి కృష్ణు డీవెగా?స్త్రీ జనోద్ధరణ మందునన్?చిందించి తమేయ
                                                                             చైదముల్!
తెలియ రారు దివ్యులే?తేజ మీవె?వ్రజ శక్తికిన్!ధింధిమ్మను ఘోష
                                                                         నాథముల్?
పలు ఫలాల భవ్యుడా!వాజ పేయ క్రతు వీవనన్?బంధింపగ శక్యమే         నినున్!
బలిదు డీవె?శ్రీహరీ!భోజు డీవె?పరమాత్ముడా!బంధాలకు మూల కారకా?

జైహింద్.

27, ఆగస్టు 2020, గురువారం

ఉత్సుకద్వయ,మునివర,ధీమహి,తావులద్వయ,కలి వికార ద్వయ,కామనా,ఢఢంభరగర్భ"-మహిబ్రోవు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
ఉత్సుకద్వయ,మునివర,ధీమహి,తావులద్వయ,కలి వికార ద్వయ,కామనా,ఢఢంభరగర్భ"-మహిబ్రోవు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                            జుత్తాడ.

"-మహిబ్రోవు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.న.భ.మ.స.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కామిత కామన కామతన్!కలి వికారము పెచ్చెన్!కాటుక కన్నులు రోధిలెన్!
సామత లేదయె?స్వార్ధతన్!సలిల మింకెను చూడన్?చాటిరి గొప్పలు
                                                                                   పెక్కులున్!
తామస ధృష్టికి తావయెన్?తలపరైరిల దైవమున్!దాటిరి సర్వము
                                                                                    దర్పులై!
ధీ మహి బ్రోవు సదా శివా!తెలియ జేయుమి నీతినిన్!ధీటుగ నిల్పుమి!
                                                                           సత్యమున్!
1.గర్భగత"-ఉత్సుక ద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
1.కామిత కామన కామతన్.           2.కాటుక కన్నులు రోధిలెన్!
   సామత లేదయె?స్వార్ధతన్!          చాటిరి గొప్పలు పెక్కులున్!
  తామస ధృష్టికి తావయెన్!            దాటిరి సర్వము దర్పులై!
ధీమహి బ్రోవు సదాశివా!                ధీటుగ నిల్పుమి సత్యమున్!
2.గర్భగత"-మునివర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.భ.గగ.గణములు.వృ.సం.56.
ప్రాసనియమము కలదు.
కలి వికారము పెచ్చెన్!
సలిల మింకెను చూడన్!
తలప రైరిల దైవమున్!
తెలియ జేయుమి నీతినిన్!
3.గర్భగత"-ధీమహి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.న.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కామిత కామన కామతన్!కాటుక కన్నులు రోధిలెన్?
సామత లేదయె?స్వార్ధతన్!చాటిరి గొప్పలు పెక్కులున్!
తామస ధృష్టికి తావయెన్!దాటిరి సర్వము దర్పులై!
ధీ మహి బ్రోవు సదా శివా!ధీటుగ నిల్పుమి సత్యమున్!
4.గర్భగత"-తావుల ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.న.భ.మ.స.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కలి వికారము పెచ్చయెన్!కాటుక కన్నులు రోధిలెన్?
సలిల మింకెను చూడన్!చాటిరి గొప్పలు పెక్కులున్!
తలప రైరిల?దైవమున్!దాటిరి సర్వము దర్పులై!
తెలియ జేయుమి నీతినిన్!ధీటుగ నిల్పుమి సత్యమున్?
2.
కలి వికారము పెచ్చెన్!కామిత కామన కామతన్?
సలిల మింకెను చూడన్!సామత లేదయె!స్వార్ధతన్!
తలప రైరిల దైవమున్!తామస దృష్టికి తావయెన్?
తెలియ జేయుమి నీతినిన్!ధీ మహి బ్రోవు సదా శివా!
5.గర్భగత"-కలివికార"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.న.భ.మ.స.స.య.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కలి వికారము పెచ్చెన్!కాటుక కన్నులు రోధిలెన్!కామిత కామన కామతన్!
సలిల మింకెను చూడన్!చాటిరి గొప్పలు పెక్కులున్!సామత లేదయె?
                                                                                      స్వార్ధతన్!
తలప రైరిల దైవమున్!దాటిరిసర్వము దర్పులై!తామస ధృష్టికి తావయెన్!
తెలియ జేయుమి నీతినిన్!ధీటుగ నిల్పుమి సత్యమున్!ధీ మహి బ్రోవు
                                                                                    సదా శివా!
2.
కలి వికారము పెచ్చెన్!కామిత కామన కామతన్!కాటుక కన్నులు రోధిలెన్?
సలిల మింకెను చూడన్!సామత లేదయె?స్వార్ధతన్!చాటిరి గొప్పలు
                                                                                       పెక్కులున్!
తలప రైరిల దైవమున్!తామస ధృష్టికి తావయెన్!దాటిరి సర్వులు
                                                                                  దర్పమున్!
తెలియ జేయుమి నీతినిన్!ధీ మహి బ్రోవు సదా శివా!ధీటుగ నిల్పుమి
                                                                              సత్యమున్!
6.గర్భగత"-కామనా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటుక కన్నులు రోధిలెన్?కామిత కామన కామతన్?
చాటిరి గొప్పలు పెక్కులున్!సామత లేదయె?స్వార్ధతన్!
దాటిరి సర్వులు దర్పమున్!తామస ధృష్టికి తావయెన్!
ధీటుగ నిల్పుమి సత్యమున్!ధీ మహి బ్రోవు సదా శివా!
7.గర్భగత"-ఢంభర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.భ.ర.న.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటుక కన్నులు రోధిలెన్?కామిత కామన కామతన్!కలి వికారము
                                                                                 పెచ్చెన్!
చాటిరి గొప్పలు పెక్కులున్!సామత లేదయె?స్వార్ధతన్!సలిల మింకెను
                                                                                  చూడన్?
దాటిరి సర్వులు దర్పమున్!తామస ధృష్టికి తావయెన్!తలపరైరిల
                                                                              దైవమున్!
ధీటుగ నిల్పుమి సత్యమున్!ధీ మహి బ్రోవు సదాశివా!తెలియ జేయుమి!
                                                                               నీతినిన్!
జైహింద్.

26, ఆగస్టు 2020, బుధవారం

ఆద్భిర్గాత్రాణి శుధ్యన్తి ......మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో|| ఆద్భిర్గాత్రాణి శుధ్యన్తి మనస్సత్యేన శుధ్యతిl
విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిః జ్ఞానేన శుధ్యతిll

తే.గీ. శుద్ధి చేయును దేహమున్ శుద్ధ జలము.
సత్యమది శుద్ధి మనమును సరిగ చేయు,
జ్ఞాన మది బుద్ధికిన్ శుచిఁ గలుగఁ జేయు,
ఆత్మశుద్ధిని తపమదే యమరఁ జేయు.

భావము. "జలములచేత శరీరము శుద్ధియగును. సత్యముచేత మనస్సు శుద్ధియగును. జ్ఞానముచే బుద్ధి శుచియగును. తపస్సుచే ఆత్మ పరిశుద్ధమగును". 

జైహింద్.

25, ఆగస్టు 2020, మంగళవారం

రక్షక,మత్తరజినీ,జ్ఞానినా,దుష్కర,నీచసంస్కృతి,సుష్టభూతి,భూమికా,అశృధారా,సుజీవనా,ప్రాణహాని,గర్భ"-కలినైజ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
రక్షక,మత్తరజినీ,జ్ఞానినా,దుష్కర,నీచసంస్కృతి,సుష్టభూతి,భూమికా,అశృధారా,సుజీవనా,ప్రాణహాని,గర్భ"-కలినైజ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-కలినైజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.య.జ.ర.య.న.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్కరులున్!దుర్మార్గులున్!ముష్టిఘాత,ప్రాణ.హానులై?మోము నశృధార ముంచిరే?
దుష్కరత న్మర్ధింపగాన్?దుష్ట చర్య నీచ సంస్కృతిన్?ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?
పుష్కరమా?భీతావహమ్!పుష్టికాదు?కీచ కృత్యమే!భూమినిక!శాంతి లేదయెన్?
సుష్కమయెన్?స్వాతంత్రమున్!సుష్టభూతి!కష్ట మేర్చెలే?సోమ మిదె? కల్యు గంబునన్!
                                                                 
అర్ధములు:-
సోమ మిదె=పరాక్రమ మిదియే?ధూమ భ్రమకాగ్నిజ్వాల=కారుచిచ్చు,

1.గర్భగత"-రక్షక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.మ.లగ.గణములు.వృ.సం.71.
ప్రాసనియమము కలదు.
ముష్కరులున్?దుర్మార్గులున్?
దుష్కరతన్?మర్ధింపగాన్?
పుష్కరమా?భీతావహమ్?
సుష్కమయెన్!స్వాతంత్రమున్?
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
ముష్టిఘాత!ప్రాణ హానులై!
దుష్ట చర్య నీచ సంస్కృతిన్?
పుష్టికాదు! కీచకత్వమే?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?
3.గర్భగత"-జ్ఞానినా"-వృత్తము.
బృహతీఛందము.భ.జ.ర.గణములు.వృ.సం.175.
ప్రాసనియమము కలదు.
మోము నశృధార!ముంచిరే?
ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?
భూమి నిక!శాంతి లేదయెన్?
సోమ మిదె?కల్యుగంబునన్!
4.గర్భగత"-దుష్కర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.మ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్కరులున్?దుర్మార్గులున్?ముష్టిఘాత,ప్రాణ హానులై?
దుష్కరత న్మర్ధింపగాన్? దుష్ట చర్య!నీచ సంస్కృతిన్?
పుష్కరమా?భీతావహమ్!పుష్టి కాదు!నీచ కృత్యమే?
సుష్క మయెన్?స్వా తంత్రమున్!సుష్ట భూతి!కష్ట మేర్చెలే?
5.గర్భగత"-నీచ సంస్కృతి"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.జ.ర.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణ హానులై?మోము నశృధార!ముంచిరే?
దుష్ట చర్య నీచ సంస్కృతిన్?ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?
పుష్టికాదు!నీచ కృత్యమే?భూమి నిక!శాంతి లేదయెన్?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?సోమ మిదె?కల్యుగంబునన్!
6.గర్భగత"-సుష్ట భూతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.జ.ర.భ.మ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణహానులై!మోము నశృధార ముంచిరే?ముష్కరులున్?దుర్మార్గులున్?
దుష్టచర్య!నీచ సంస్కృతిన్?ధూమ భ్రమకాగ్ని జ్వాలయై?దుష్కరతన్?మర్ధింపగాన్?
పుష్టికాదు!నీచకృత్యమే?భూమి నిక శాంతి లేదయెన్?పుష్కరమా?భీతావహమ్?
సుష్ట భూతి కష్ట మేర్చెలే?సోమ మిదె?కల్యుగంబునన్!సుష్క మయెన్?స్వాతంత్రమున్!
7.గర్భగత"-భూమికా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.జ.ర.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మోము నశృధార ముంచిరే?ముష్కరులున్,దుర్మార్గులున్?
ధూమ భ్రమకాగ్ని!జ్వాలయై?దుష్కరతన్?మర్ధింపగాన్?
భూమినిక!శాంతి లేదయెన్?పుష్కరమా?భీతావహమ్!
సోమ మిదె?కల్యుగంబునన్!సుష్క మయెన్?స్వాతంత్రమున్?
8.గర్భగత"-అశృధారా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.జ.ర.భ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మోము నశృధార ముంచిరే?ముష్కరులున్,దుర్మార్గులున్?ముష్టి ఘాతప్రాణ హానులై?
ధూమ భ్రమకాగ్ని జ్వాలయై!దుష్కరతన్?మర్ధింపగాన్?దుష్ట చర్యసంస్కృతిన్?
భూమి నిక శాంతి లేదయెన్?పుష్కరమా?భీతాహవమ్?పుష్టి కాదు!నీచ కృత్యమే?
సోమ మిదె?కల్యుగంబునన్!సుష్క మయెన్!స్వాతంత్రమున్?సుష్ట భూతి కష్ట మేర్చెలే?
9.గర్భగత"-సుజీవనా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.భ.మ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణ హానులై?ముష్కరులున్?దుర్మార్గులున్?
దుష్ట చర్య సంస్కృతిన్?దుష్కరతన్?మర్ధింపగాన్?
పుష్టికాదు!నీచ కృత్యమే?పుష్కరమా?భీతాహవమ్?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?సుష్కమయెన్!స్వాతంత్రమున్?
10,గర్భగత"-ప్రాణహాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.మ.య.న.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ముష్టిఘాత!ప్రాణహానులై?ముష్కరులున్!దుర్మార్గులున్?మోము నశృధార ముంచిరే?
దుష్ట చర్య సంస్కృతిన్?దుష్కరతన్!మర్ధింపగాన్?ధూమ భ్రమకాగ్నిజ్వాలయై?
పుష్టికాదు!నీచ కృత్యమే?పుష్కరమా?భీతాహవమ్?భూమి నిక శాంతి లేదయెన్?
సుష్ట భూతి!కష్ట మేర్చెలే?సుష్కమయెన్!స్వాతంత్రమున్?సోమ మిదె! కల్యుగంబునన్?
జైహింద్.

24, ఆగస్టు 2020, సోమవారం

మానస,కాలాశ్రీ,మదినిండు,తద్వయమా,మసిమా,దుష్ప్రభా,అబ్బుర,భాముల,అసంభవ,ఘాతుకా,గర్భ"-శ్రీజప"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్
మానస,కాలాశ్రీ,మదినిండు,తద్వయమా,మసిమా,దుష్ప్రభా,అబ్బుర,భాముల,అసంభవ,ఘాతుకా,గర్భ"-శ్రీజప"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.     
                       
"-శ్రీపద"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.య.మ.స.మస.స.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
రాబంధుల కేదీ?కరోనా!రామా!ఘాతుక చర్యేగా?రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
శ్రీబంధపు తీరే!యదేమో?క్షేమం లేదిల!సర్వేశా?శ్రీ జిగె!దోష మన న్వలెన్?
సేబాసన!జీవింప రేలన్?శ్రీమంతంబవ!రా వేగన్!శ్రీజప ధన్యత శోభిలన్?
బాబా విక!నీవే?మహేశా!భాముల్బాపుమి!శ్రీకంఠా!భాజన నీదే!నుమాధవా!
అర్ధములు:-
భాజన=రక్షించే బాధ్యత,నుమాధవ=పార్వతీశ్వరా,శ్రీజప=లక్ష్మీదేవియొక్క జపము,బాబా=తండ్రి,సేబాసన=వల్లెయనగ,శ్రీజిగె=లక్ష్మీ సంపన్నతే,
రాబంధులు=చనిపోయిన శునకములను పీకి తిను,(దుర్మార్గపు జీవులు),
భాజన నీదే!నుమాధవా=రక్షించు బాధ్యత నీదే పార్వతీశ్వరా,
భాజన నీదేను మాధవా=రక్చే బాధ్యత నీదే సుమా!లక్ష్మీపతీ,

1.గర్భగత"-మానస"-వృత్తము.
బృహతీఛందము.త.య.య.గణములు.వృ.సం.77.
ప్రాసనియమము కలదు.
రాబంధుల కేదీ?కరోనా!
శ్రీబంధపు తీరే!యదేమో?
సేబాసన!జీవింప రేలన్?
బాబా విక నీవే!మహేశా?
2.గర్భగత"-కాలాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.స.గగ.గణములు.వృ.సం.25.
ప్రాసనియమము కలదు.
రామా!ఘాతుక చర్యేగా?
క్షేమం!లే దిల!సర్వేశా?
శ్రీమంతంబవ!రా వేగన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!
3.గర్భగత"-మదినిండు"-వృత్తము.
బృహతీఛందము.మ.భ.ర.గణములు.వృ.సం.177.
ప్రాసనియమము కలదు.
రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
శ్రీ జిగె!దోష మన న్వలెన్?
శ్రీజప ధన్యత శోభిలన్?
భాజన నీదే?నుమాధవా!
4.గర్భగత"-తద్వయమా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.య.మ.స.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాబంధుల కేదీ?కరోనా!రామా!ఘాతుక చర్యేగా?
శ్రీబంధపు తీరే!యదేమో?క్షేమం లేదిల?సర్వేశా!
సేబాసన!జీవింప రేలన్?శ్రీమంతంబవ!రా వేగన్?
బాబా!విక నీవే?మహేశా!భాముల్బాపుమి!శ్రీకంఠా!
5.గర్భగత"-మసద్వయా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.మ.స.స.లగ.గణములు.యతి,9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
క్షేమం లేదిల!సర్వేశా?శ్రీ జిగె!దోష మన న్వలెన్?
శ్రీమంతంబవ!రా వేగన్?శ్రీజప ధన్యత శోభిలన్?
బాముల్బాపుమి!శ్రీకంఠా!భాజన నీదే?నుమాధవా!
6.గర్భగత"-దుష్ప్రభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.మ.స.స.య.భ.త.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?రా బంధుల కేదీ?
                                                                                     కరోనా!
క్షేమం!లేదిల!సర్వేశా?శ్రీజిగె!దోష మన న్వలెన్?శ్రీబంధపు తీరే!యదేమో?
శ్రీమంతంబవ!రా వేగన్?శ్రీజప ధన్యత శోభిలన్?సేబాసన!జీవింప రేలన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!భాజన నీదే?నుమాధవా!బాబా విక నీవే!మహేశా!
7.గర్భగత"-అబ్బుర"-వృత్తము.
ధృతిఛందము.మ.భ.ర.త.య.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?రాబంధుల కేదీ?కరోనా!
శ్రీజిగె!దోష మన న్వలెన్?శ్రీబంధపు తీరే!యదేమో?
శ్రీ జప ధన్యత శోభిలన్?సేబాసన!జీవింప రేలన్?
భాజన నీదే?నుమాధవా!బాబా విక నీవె?మహేశా!
8.గర్భగత"-భాముల"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.భ.ర.త.య.య.మ.స.లగ.గణములు.యతులు.10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?రా బంధుల కేదీ?కరోనా!రామా!ఘాతుక చర్యేగా?
శ్రీ జిగె!దోష మన న్వలెన్?శ్రీబంధపు తీరే!యదేమో?క్షేమం!లేదిల?సర్వేశా!
శ్రీ జప ధన్యత!శోభిలన్?సేబాసన!జీవింప రేలన్?శ్రీమంతంబవ!రా వేగన్?
భాజన నీదే?నుమాధవా!బాబా విక నీవే?మహేశాెభాముల్బాపుమి!శ్రీకంఠా!
9.గర్భగత"-అసంభవ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.మ.భ.త.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాబంధుల కేదీ?కరోనా!
క్షేమం!లేదిల?సర్వేశా!శ్రీబంధపు తీరే!యదేమో?
శ్రీమంతంబవ!రా వేగన్?సేబాసన!జీవింప రేలన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!బాబా విక నీవే?మహేశా!
10,గర్భగత"-ఘాతుక"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.మ.భ.త.మ.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!ఘాతుక చర్యేగా?రాబంధుల కేదీ?కరోనా!రాజిలె!దుష్ప్రభ లిక్కలిన్?
క్షేమం లేదిల?సర్వేశా!శ్రీబంధపు తీరే!యదేమో?శ్రీ జిగె!దోష మన న్వలెన్?
శ్రీమంతంబవ!రా వేగన్?సేబాసన!జీవింప రేలన్?శ్రీజప ధన్యత శోభిలన్?
భాముల్బాపుమి!శ్రీకంఠా!బాబా విక నీవే?మహేశా!భాజన నీదే నుమాధవా!
 జైహింద్.

23, ఆగస్టు 2020, ఆదివారం

భారతం అశ్వమేధ పర్వము

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

22, ఆగస్టు 2020, శనివారం

శ్రీమద్వినాయక చతుర్థి సందర్భంగా దండక గర్భ సీస మాలిక.

0 comments

జైశ్రీమన్నారాయణ.
ఆర్యులారా!
ఈ రోజు శ్రీమద్వినాయక చతుర్థి. మన బుజ్జి గణపయ్య మనిళ్ళకు వచ్చి మనకు నచ్చిన పదార్ధాలను నైవేద్యంగా పెట్టితే సంతోషంగా ఆరగిస్తాడు. మన పనుల కెక్కడా ఆటంకం రాకుండా ఉండేలా అనుగ్రహిస్తాడు. అట్టి పవిత్రమైన ఈ పండుగ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఆ గణపతిని మనం మనసారా ప్రార్థిద్దాం.

దండక గర్భ సీస మాలిక.
శ్రీమన్మహాదేవ! శ్రీవిఘ్ననాథుండ మాయింటికిన్ వచ్చి మహిత నీవు
మమ్మున్ గృపం జూచి, మా పూజలన్ గొంచు, మాశ్రద్ధనే మెచ్చి మన్ననమున
మేమిచ్చు పండ్లన్ సమస్తంబు సంతృప్తి గానారగించంగ కరుణతోడ
మాకోర్కెలన్ దీర్చ మాపజ్జనుండంగ ప్రార్థింతుమోదేవ భక్తితోడ
సిద్ధిన్ సుబుద్ధిన్ ప్రసిద్ధంబుగా నీవు నీవెంట రప్పించి నిత్య శుభద!
కొల్వుండు మాయింట కూర్మిన్ మమున్ గాంచు, క్షుత్తాపమున్ దీర్చు శుభ్రతేజ!
మాయింట పిన్నల్ నమస్కారముల్ జేసి మాతోడు నీవుండి మంచిగాను
యాటాడమంచున్ ప్రయత్నంబునేచేయు నీతోడ నాడంగ, నిష్కళంక
బాలుండవీవున్ గృపాయత్త చిత్తంబుతోనాడరావయ్య, మాననీయ!
శ్రీ పార్వతీ పుత్ర మా పాపలన్ గాంచి మా పాపముల్ బాపి మహిమఁ గనుమ,
యేబాధలున్ లేని యే దుస్థితుల్ రాని మాభావి కల్పించ శోభగూర్చ
నీవే సమర్ధుండ వీవేమముం గాచుమేవేళలోనైన నీప్సితదుఁడ!
నీ పాదముల్ తప్ప, నేనెంచగా నేర్వ నన్యంబు లేదింక ననవరతము
నీపై మనంబుంచి నే పద్యముల్ వ్రాసి నీకే సమర్పింతు నేర్చినంత
జ్ఞానప్రదాతా! గణాధీశ!రమ్మింక నీదివ్య భక్తాళి నిత్య శుభద
గాంచంగ వేగమ్మె. కన్పించగా రమ్ము కారుణ్యమొప్పార ఘన సుచరిత!
నే వేచితిన్ స్వామి నిన్నున్ గనన్ దేవ! వేగంబుగా రమ్ము ప్రీతితోడ
జ్ఞానప్రపూర్ణా నమస్తే నమస్తే!న - మస్తే నమః కాంచుమా మనోజ్ఞ!
తే.గీ. ప్రార్థనన్ మది వినుమయ్య భక్త సులభ!
వందనమ్ములు కొనుమయ్య సుందరాంగ!
చవితి పూజను చేసినన్ సదయఁ గనుచు
మమ్ముగాంచెడి గణపతీ! మంగళములు.

సీసమాలిక గర్భస్థ దండకము
శ్రీమన్మహాదేవ! శ్రీవిఘ్ననాథుండ మాయింటికిన్ వచ్చి
మమ్మున్ గృపం జూచి, మా పూజలన్ గొంచు, మాశ్రద్ధనే మెచ్చి
మేమిచ్చు పండ్లన్ సమస్తంబు సంతృప్తి గానారగించంగ
మాకోర్కెలన్ దీర్చ మాపజ్జనుండంగ ప్రార్థింతుమోదేవ
సిద్ధిన్ సుబుద్ధిన్ ప్రసిద్ధంబుగా నీవు నీవెంట రప్పించి
కొల్వుండు మాయింట కూర్మిన్ మమున్ గాంచు, క్షుత్తాపమున్ దీర్చు
మాయింట పిన్నల్ నమస్కారముల్ జేసి మాతోడు నీవుండి,
యాటాడమంచున్ ప్రయత్నంబునేచేయు నీతోడ నాడంగ,
బాలుండవీవున్ గృపాయత్త చిత్తంబుతోనాడరావయ్య,
శ్రీ పార్వతీ పుత్ర మా పాపలన్ గాంచి మా పాపముల్ బాపి
యేబాధలున్ లేని యే దుస్థితుల్ రాని మాభావి కల్పించ
నీవే సమర్ధుండ వీవేమముం గాచుమేవేళలోనైన
నీ పాదముల్ తప్ప, నేనెంచగా నేర్వ నన్యంబు లేదింక
నీపై మనంబుంచి నే పద్యముల్ వ్రాసి నీకే సమర్పింతు,
జ్ఞానప్రదాతా! గణాధీశ!రమ్మింక నీదివ్య భక్తాళి
గాంచంగ వేగమ్మె. కన్పించగా రమ్ము కారుణ్యమొప్పార
నే వేచితిన్ స్వామి నిన్నున్ గనన్ దేవ! వేగంబుగా రమ్ము
జ్ఞానప్రపూర్ణా నమస్తే నమస్తే!న - మస్తే నమః.

 జైహింద్.

వినాయక చతుర్థి సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ..
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః.
ఆర్యులారా! వినాయక చతుర్థి సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.
ఆ జణేశుని మహదాశీర్వాదం మీకు పూర్తిగా లభించాలని కోరుకొంటున్నాను.
ఆ పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను.
ఈ వినాయక చతుర్థి సందర్భముగా ఆస్వామికి భక్తితో నేను సమర్పించుచున్న పద్యపుష్పపంచకము.
అవధరింప మనవి.

శ్రీమన్మంగళ భావనాంచిత ఘనా! శ్రీ పార్వతీ నందనా !
క్షేమంబున్ శుభ సంహతిన్, సుగుణ సచ్ఛీలంబులున్ గొల్పు నీ
వేమా దిక్కని నమ్ము మమ్ము సతమున్ బ్రీతిన్ ప్రవర్ధింపఁగా
శ్రీమంతంబుగఁ జేయ రమ్ము భువికిన్ చిద్రూప విఘ్నేశ్వరా!

గణాధిపా నమోస్తుతే ప్రకాశమీయ రమ్మికన్,
ప్రణామముల్ గ్రహింపుమా, వరంబులిమ్ము నీవు, సద్
గుణాలమింక మాకిలన్  సుగోచరంబుగాన్ గృపన్
క్షణంబు నీవు నిల్చి కూర్చి కావుమా వినాయకా!

జయంబు నిశ్చయంబు నిన్ను చక్కగా భజించినన్
ప్రియం బెలర్ప నీదు పూజఁ దృప్తిఁ జేయువారికిన్
క్షయంబగున్ దురంత దుష్ట కార్యదుష్ఫలంబులే.
భయంబు బాప రమ్ము నీవు భవ్యుఁడా! వినాయకా!

కరావలంబమిచ్చి మమ్ము కావగావలెన్ గృపన్,
నరాంతకుల్ దురాత్ములున్ ధనాశతో మహాత్ములన్
నిరంతరంబు వ్రేచుచుంట నీవుచూడలేదొకో
నిరీక్షణేలఁ గావగా గణేశ! శ్రీ వినాయకా!

సుమంగళాత్ములై రహింపఁ జూడవేమి భక్తులన్?
సమంచి తార్ద్ర చిత్తులన్ ప్రశస్త పుణ్య మూర్తులన్,
దమ క్షమాదిసద్గుణాఢ్య దక్షులన్ గ్రహింపుమా
సుమంగళంబులిమ్ము సత్య శోభితా వినాయకా.!

స్వస్తి.                    
జైహింద్.

21, ఆగస్టు 2020, శుక్రవారం

అవధానచతుష్టయం చేసిన అష్టావధానం. భక్తిసాధనమ్ నిర్వహణలో

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

మత్తరజినీ,శ్రీవర్ధన,నిందాశ్రి,దుర్విధి,తారయా,శోభల్పండు,నీతివినా,ధర్మగ్లాని,తాయజ,దండిత"-గర్భ"-దుశ్ఛేదనా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
మత్తరజినీ,శ్రీవర్ధన,నిందాశ్రి,దుర్విధి,తారయా,శోభల్పండు,నీతివినా,ధర్మగ్లాని,తాయజ,దండిత"-గర్భ"-దుశ్ఛేదనా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"- దుశ్ఛేదనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.త.య.య.య.ర.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ గ్లాని గూర్చు చర్యలే!దండించును ముమ్మాటికిన్!దక్కు నొకో?మోక్ష
                                                                                 ధామమున్!
మర్మ మార్గ మెంచ రాదిలన్?మండించును!జీవంబులన్?మక్కువతో
                                                                           కోరు ధర్మమున్!
కర్మ మోక్ష మార్గ మెంచుమా!ఖండించుమి!దుర్మార్గముల్!గ్రక్కున నీ
                                                                            తోడవ న్సురల్?
వర్మణీయ ధర్మ తేజమౌ!పండుం భువి శోభాయమై!ప్రక్కన నిల్చుండ
                                                                                 దైవమున్?
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
ధర్మ గ్లాని గూర్చు చర్యలే?
మర్మ మార్గ మెంచరాదిలన్?
కర్మ మోక్ష మార్గ మెంచుమా!
వర్మణీయ ధర్మ తేజమౌ!
2.గర్భగత"-శ్రీవర్ధన"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.య.లగ.గణములు.వృ.సం.77.
ప్రాసనియమము కలదు.
దండించును!ముమ్మాటికిన్?
మండించును!జీవంబులన్!
ఖండించుమి!దుర్మార్గముల్!
పండుం భువి శోభాయమై!
3.గర్భగత"-నిందాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.ర.త.ర.గణములు.వృ.సం.163.
ప్రాసనియమము కలదు.
దక్కు నొకో?మోక్ష ధామమున్!
మక్కువతో!కోరు ధర్మమున్?
గ్రక్కున నీతోడవం!సురల్!
ప్రక్కన నిల్చుండ!దైవమున్!
4.గర్భగత"-దుర్విథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.త.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ గ్లాని గూర్చు చర్యలే?దండించును ముమ్మాటికిన్?
మర్మ మార్గ మెంచరా దిలన్?మండించును జీవంబులన్?
కర్మ మోక్ష మార్గ మెంచుమా?ఖండించుమి!దుర్మార్గముల్?
వర్మణీయ ధర్మ తేజమౌ?పండుం భువి శోభాయమై!
5.గర్భగత"-తారయా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.య.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దండించును!ముమ్మాటికిన్?దక్కు నొకో?మోక్ష ధామమున్?
మండించును!జీవంబులన్?మక్కువతో!కోరు ధర్మమున్?
ఖండించుమి!దుర్మార్గముల్!గ్రక్కున నీతోడవం?సురల్!
పండుం భువి !శోభాయమై!ప్రక్కన నిల్చుండ దైవమున్?
6.గర్భగత"-శోభల్పండు"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.య.య.ర.య.త.ర.లగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
దండించును!ముమ్మాటికిన్?దక్కు నొకో?మోక్షధామమున్!ధర్మ గ్లాని
                                                                         గూర్చు చర్యలే?
మండించును!జీవంబులన్?మక్కువతో!కోరు ధర్మమున్?మర్మ మార్గ
                                                                     మెంచ రాదిలన్?
ఖండించుమి!దుర్మార్గముల్!గ్రక్కున నీ తోడవం?సురల్!కర్మ మోక్ష
                                                                 మార్గ మెంచుమా?
పండుం భువి!శోభాయమై!ప్రక్కన నిల్చుండ!దైవమున్?వర్మణీయ
                                                                     ధర్మ తేజమౌ?
7.గర్భగత"-నీతివినా"-వృత్తము.
ధృతిఛందము.ర.త.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దక్కు నొకో?మోక్ష ధామమున్!ధర్మ గ్లాని గూర్చు!చర్యలే?
మక్కువతో?కోరు ధర్మమున్!మర్మ మార్గ మెంచ రాదిలన్?
గ్రక్కున నీతోడవం?సురల్! కర్మ మోక్ష మార్గ మెంచుమా?
ప్రక్కన నిల్చుండ!దైవమున్?వర్మణీయ!ధర్మ తేజమౌ?
8.గర్భగత"-ధర్మ గ్లాని"-వృత్తము
ఉత్కృతిఛందము.ర.త.ర.ర.జ.ర.త.య.లగ.గణములు.యతులు.
10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
దక్కు నొకో?మోక్ష ధామమున్!ధర్మ గ్లాని గూర్చు చర్యలే?దండించును!
                                                                           ముమ్మాటికిన్?
మక్కువతో!కోరు ధర్మమున్?మర్మ మార్గ మెంచ రాదిలన్?మండించును!
                                                                            జీవంబులన్?
గ్రక్కున నీ తోడవం!సురల్?కర్మ మోక్ష మార్గ మెంచుమా?ఖండించుమి!
                                                                          దుర్మార్గముల్?
ప్రక్కన నిల్చుండ!దైవమున్?వర్మణీయ ధర్మ తేజమౌ?పండుం భువి!
                                                                             శోభాయమై!
9,గర్భగత"-తాయజ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దండించును!ముమ్మాటికిన్?ధర్మ గ్లాని గూర్చు చర్యలే?
మండించును!జీవంబులన్?మర్మ మార్గ మెంచ రాదిలన్?
ఖండించుమి!దుర్మార్గముల్?కర్మ మోక్ష మార్గ మెంచుమా?
పండుం భువి!శోభాయమై!వర్మణీయ!ధర్మ తేజమౌ?
10,గర్భగత"-దండిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
దండించును!ముమ్మాటికిన్?ధర్మ గ్లాని గూర్చు చర్యలే?దక్కు నొకో?  
                                                                   మోక్ష ధామమున్!
మండించును!జీవంబులన్?మర్మ మార్గ మెంచరాదిలన్?మక్కువతో?
                                                                      కోరు ధర్మమున్?
ఖండించుమి!దుర్మార్గముల్?కర్మ భోక్ష మార్గ మెంచుమా?గ్రక్కున నీ
                                                                     తోడవం సురల్?
పండుం భువి!శోభాయమై?వర్మ ణీయ ధర్మ తేజమౌ?ప్రక్కన నిల్చుండ!
                                                                         దైవమున్?
 జైహింద్.

20, ఆగస్టు 2020, గురువారం

అష్టావధానము....ఇప్పుడే భక్తి సాధనమ్ వాట్సప్ సమూహములో శ్రీ బండికాడ అంజయ్యావధాని, శ్రీ ముద్దు రాజయ్య అవధాని, శ్రీ, మైలవరపు మురళీకృష్ణ అవధాని చేయుచుండగా నేనును చేసిన పూరణలు

0 comments

జైశ్రీరామ్.
ఇప్పుడే భక్తి సాధనమ్ వాట్సప్ సమూహములో శ్రీ బండికాడ అంజయ్యావధాని, శ్రీ ముద్దు రాజయ్య అవధాని, 
శ్రీ, మైలవరపు మురళీకృష్ణ అవధాని చేయుచుండగా 
నేనును చేసిన పూరణలు..
౧. సమస్యాపూరణము.
అష్టకాలవిద్యాచరణ్....శునకము సింహాసనమ్ము శోభను పెంచెన్

వినువారలుండిరనుచును
కన సాధ్యము కానిదానిఁ గనచేయుదురా?
ఘనముగనెపుడెచ్చటనే
శునకము సింహాసనమున శోభను గూర్చెన్?

నిషిద్ధాక్షరి
న ల ర
అక్షరాలను నిషేధిస్తూ రాబోయే వినాయక చవితి యొక్కగొప్పదనాన్ని స్వేచ్ఛా ఛందంలో వివరించండి
చుక్కాయపల్లి శ్రీదేవి౨. 

గణపతి పండుగ శోభయె
గణుతించుగ బోము సుకవి గాయకతతియీ
గణపతి జృంభిత జీవము
గణుతిగ క్షీణింపజేయకాంక్షయె భువిపై.

౩. దత్తపదిఞానప్రసూనాశర్మ.
.జీలకర్ర, మెంతులు, ఆవాలు,ధనియాలు

ఈ వంటింటి దినుసులు ఉపాయోగించి
షోడశగౌరీపూజ విశిష్టతను తెలుపండి
షోడశ గౌరీ పూజకు
స్త్రీలిలజీరకము మెంతి చిటికెడు ధనియాల్
మేలగునావాల్ రసమును
చాలగ నర్పించుటయెప్రశస్తము కనగన్.
జీలకఱ్ఱ మెంతులు ఆవాలు ధనియాలు.

౪వర్ణన..సంగీతంనరసింహారావు.వర్ణన
పార్వతి తను తపస్సుచేసుకోవడానికి వీలుగా కాపలాగా ఉంచడానికి నలుగుపిండితో బాలుని సృష్టించినసందర్భమును వర్ణిస్తూ ఉత్పలమాల వృత్తంలో పద్యం చెప్పగలరు. 

స్నానము చేయఁబోవుచును చక్కగపిండిని బొమ్మ చేసి తా
ప్రాణము పోసి ద్వారమున పాలకవృత్తిని నిల్పె శూలమున్
ధీనిధి పార్వతిచ్చె తనదీవన లిచ్చుచు పుత్రునట్లుగా
తాను ముదంబునొందుచు., విధాతమరేగతి చేయనుండెనో?

౫. అంత్యాక్షరి...డా.మలుగాంజయ్యావధాని.
అంత్యాక్షరం....మా
మానుట ధర్మము మహితులు
ధీనిధులగు వారిచెంత తెలియని పనులన్
జ్ఞానము సంప్రాప్తించును
మానితముగ గౌరవంబు మహిని లభించున్.

౬. న్యస్తాక్షరి.  శ్రీమతి సరస్వతీ రామశర్మ..      
అం భా సు త 
అనే ఆక్షరాలను..పాదాద్యక్షరాలుగా ఉంయోగిస్తూ..స్వేచ్చాఛందంలో..

వినాయకచవితి రోజు ..పెట్టే నైవేద్యం విశిష్టత నుశతెలుపగలరని కోరుతున్నాను..
అంబ సుతుని గొలిచి యనుపమ రీతిలో
భాసురపరమాన్న పాత్రనుంచి
సుచిగ రుచిగ చేసి సూపంబు నటనుంచి,
తనియఁ బెట్ట వలయు ధర్మమదియె.

౭. అశువు.
గత కొద్దికాలంగా కురుస్తున్న వర్షాన్ని,నిండిన చెరువులని,పొంగుతున్న వాగులను చూసి హాలికుడి హర్షాన్ని  మీ ఇష్టమైన వృత్తంలో చెప్పవలసినదిగా ప్రార్థన
వర్షము హాలికుని ఆనందము.
సమయమునకు తగిన చక్కని వానలు
కురుయుచుండ మనసు మురియుచుండె.
పంటలెల్ల పండు ప్రఖ్యాతిగానింక
వరుణ దేవ! నీకు వందనములు.

౮. చిత్రము నకు పద్యము. పండరి రాధాకృష్ణ. 
అన్నపూర్ణ శివునకు భిక్ష వేయుట. చిత్రం.
పాత్ర పట్ట శివుడు పార్వతీదేవి తా
భిక్షవేయుచుండె వింత యిదియె.
కారణంబు కలుగ కర్తవ్యమును వీడి

మెలగబోరు మహితులలఘులిలను..

పూరణలకు పట్టిన సమయము నలభై ఐదు నిమిషములు.
జైహింద్. 

భక్తిసాధనమ్ వాట్సప్ సమూహము నిర్వాహకులచే సాహితీ పురస్కారాలు, ప్రశందలు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

19, ఆగస్టు 2020, బుధవారం

అనఘా,మత్తరజినీద్వయ,బ్రహ్మసూక్త,జ్ఞాన కీర్తనా,సదావంద,రజరోన్నయ, యోగ సాధనా,కీర్తనీయ,బుద్ధిచైద,గర్భ"-చతుర్మతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల సరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
అనఘా,మత్తరజినీద్వయ,బ్రహ్మసూక్త,జ్ఞాన కీర్తనా,సదావంద,రజరోన్నయ, యోగ సాధనా,కీర్తనీయ,బుద్ధిచైద,గర్భ"-చతుర్మతీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల సరసింహ మూర్తి. జుత్తాడ.
                         

"-చతుర్మతీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.షం.
చతుర బుద్ధి చైదముల్!సదానంద జ్ఞాన కీర్తనల్!సత్య ధర్మ యోగ  సాధ్యముల్?
స్మృతి విరాట్సమంబులౌ!చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్థిత్యమౌచు! మోక్షమీయుగా!
ప్రతిన నిల్పు ధీ దితుల్!ప్రదోషంబు లంట వెన్నడున్?రత్యధీన దైవ   చింతనన్!
బ్రతుకు ధర్మ మార్గ మౌ!వదాన్యుండ వౌదు!మానవా!ప్రత్యనీక మంట దెత్తరిన్?
                                                             
ప్రత్యనీకము=రిపు సైన్యము,విఘ్నము.

1.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.
ప్రాసనియమము కలదు.
చతుర బుద్ధి చైదముల్!
స్మృతి విరాట్సమంబులౌ!
ప్రతిన నిల్పు ధీ దితుల్!
బ్రతుకు ధర్మ మార్గమౌ!
2.గర్భగత"-మత్త రజినీద్వయ"-వృత్తములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.సదానంద జ్ఞాన కీర్తనల్.!              2.సత్య ధర్మ యోగ సాథ్యముల్?
   చిదానంద బ్రహ్మ సూక్తముల్!           స్థిత్య మౌచు!మోక్షమీయగా!
   ప్రదోషంబు లంట వెన్నడున్?            రత్యధీన దైవ చింతనన్?
   వదాన్యుండ వౌదు!మానవా!             ప్రత్యనీక మంట దెత్తరిన్?
3.గర్భగత"-బ్రహ్మ సూక్త"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.త.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతుర బుద్ధి చైదముల్!సదానంద జ్ఞాన కీర్తనల్!
స్మృతి విరాట్సమంబులౌ!చిదానంద బ్రహ్మ సూక్తముల్!
ప్రతిన నిల్పు ధీ దితుల్!ప్రదోషంబు లంట వెన్నడున్?
బ్రతుకు ధర్మ మార్గమౌ!వదాన్యుండ వౌదు!మానవా!
4.గర్భగత"-జ్ఞాన కీర్తనా"-వృత్తము.
ధృతిఛందము.య.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద జ్ఞాన కీర్తనల్!సత్య ధర్మ యోగ సాధ్యముల్?
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్థిత్యమౌచు!మోక్ష మీయగా!
ప్రదోషంబు లంట వెన్నడున్?రత్యధీన దైవ చింతనన్?
వదాన్యుండ వౌదు!మానవా!ప్రత్యనీక మంట దెత్తరిన్?
5.గర్భగత"-సదానంద"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద జ్ఞాన కీర్తనల్!సత్య ధర్మ యోగ సాధ్యముల్?చతుర బుద్ధి చైదముల్!
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్థిత్య మౌచు!మోక్ష మీయగా!స్మృతి విరాట్స మంబులౌ!
ప్రదోషంబు లంట వెన్నడున్?రత్యధీన దైవ చింతనన్?ప్రతిన నిల్పు ధీదితుల్!
వదాన్యుండ వౌదు!మానవా!ప్రత్యనీక మంట దెత్తరిన్?బ్రతుకు ధర్మ మార్గమౌ!
                                                                           
6.గర్భగత"-రజరోన్నర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్య ధర్మ  యోగ సాధ్యముల్?చతుర బుద్ధి చైదముల్!
స్థిత్య మౌచు!మోక్ష మీయగా!స్మృతి విరాట్సమంబులౌ!
రత్యధీన దైవ చింతనన్?ప్రతిన నిల్పు ధీ దితుల్!
ప్రత్యనీక మంట దెత్తరిన్?బ్రతుకు ధర్మ మార్గమౌ!
7.గర్భగత"-యోగ సాధనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్య ధర్మ యోగ సాధ్యముల్?చతుర బుద్ధి చైదముల్!సదానంద జ్ఞాన కీర్తనల్!
స్థిత్య మౌచు!మోక్ష మీయగా!స్మృతి విరాట్సమంబులౌ!చిదానంద బ్రహ్మసూక్తముల్!
రత్యధీన దైవ చింతనన్?ప్రతిన నిల్పు ధీ దితుల్!ప్రదోషంబు లంట వెన్నడున్?
ప్రత్య నీక మంట దెత్తరిన్?బ్రతుకు ధర్మ మార్గమౌ!వదాన్యుండ వౌదు!మానవా!
                                                                           
8.గర్భగత"-కీర్తనీయ"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద జ్ఞాన కీర్తనల్!చతుర బుద్ధి చైదముల్!
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్మృతి విరాట్సమంబులౌ!
ప్రదోషంబు లంట వెన్నడున్?ప్రతిన నిల్పు ధీ దితుల్!
వదాన్యుండ వౌదు!మానవా!బ్రతుకు ధర్మ మార్గమౌ!
9.గర్భగత"-బుద్ధిచైద"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.న.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.షం.
సదానంద జ్ఞాన కీర్తనల్!చతుర బుద్ధి చైదముల్!సత్య ధర్మ యోగ  సాధ్యముల్?
చిదానంద బ్రహ్మ సూక్తముల్!స్మృతి విరాట్సమంబులౌ!స్థిత్య మౌచు! మోక్షమీయగా!
ప్రదోషంబు లంట వెన్నడున్?ప్రతిన నిల్పు ధీ దితుల్!రత్యధీన దైవ చింతనన్?
వదాన్యుండ వౌదు!మానవా! బ్రతుకు ధర్మ మార్గమౌ!ప్రత్యనీక మంట  దెత్తరిన్?
                                                                       
జైహింద్.

18, ఆగస్టు 2020, మంగళవారం

వాచాలతా,పూర్ణా,శ్రీపాల,తత్శోభా,భుక్తంబు,నీత్యుక్త,తంతరమంతర,భుక్తిదామతయా,నీతినిల్పు,గర్భ"-ధర్శ శోభా"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్
వాచాలతా,పూర్ణా,శ్రీపాల,తత్శోభా,భుక్తంబు,నీత్యుక్త,తంతరమంతర,భుక్తిదామతయా,నీతినిల్పు,గర్భ"-ధర్శ శోభా"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         

"-ధర్మ శోభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.త.ర.మ.త.య.ర.ర.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మమ్!తత్శోభాకరంబగున్?ధాత్రిం నిల్పు నీత్యుక్తతన్!తానిచ్చు భుక్తంబు
                                                                                   శోభిలన్!
కర్మం!సద్బుద్ధిం జరింపగన్!గాత్రంబుల్సు శ్లోకంబులౌ?గానామృతంబే!
                                                                              విభూతియౌ!
మర్మంబు ల్ద్రోల న్వడిన్!మాత్రపూర్ణ బీజాశ్రియై!మానాభిమానంబులం
                                                                                      సదా!
నిర్మోహంబే?ముక్తి మార్గమౌ!నేత్రాలుండి వీక్షింపుమా!నా,నీ యనం
                                                                  పాపమే!యగున్?
1.గర్భగత"-వాచాలతా"-వృత్తము.
బృహతీఛందము.మ,త.ర.గణములు.వృ.సం.161.
ప్రాసనియమము కలదు.
ధర్మం!తత్శోభా కరంబగున్?
కర్మం!సద్బుద్ధిం జరింపగన్!
మర్మంబు ల్ద్రోల న్వడిన్!
నిర్మోహంబే?ముక్తి మార్గమౌ!
2.గర్భగత"-పూర్ణా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.త.లగ.గణములు.వృ.సం.92.
ప్రాసనియమము కలదు.
ధాత్రిం!నిల్పు నీత్యుక్తతన్!
గాత్రంబుల్సు శ్లోకంబులౌ?
మాత్ర పూర్ణ బీజాశ్రియై!
నేత్రాలుండి వీక్షింపుమా!
3.గర్భగత"-శ్రీపాల"-వృత్తము.
బృహతీఛందము.త.త.ర.గణములు.వృ.సం.165.
ప్రాసనియమము కలదు.
తా నిచ్చు!భుక్తంబు శోభిలన్!
గానామృతంబే?విభూతియౌ!
మానాభి మానంబులం!సదా!
నీ,నా యనం!పాపమే?యగున్!
4.గర్భగత"-తత్శోభా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.త.ర.మ.త.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మం!తత్శోభా!కరంబగున్?ధాత్రిం నిల్పు!నీత్యుక్తతన్!
కర్మం!సద్బుద్ధిం!జరింపగన్?గాత్రంబు ల్సుశ్లోకంబులౌ?
మర్మంబు ల్ద్రోలం వడిన్!మాత్రా పూర్ణ బీజాశ్రియై!
నిర్మోహంబే!ముక్తి మార్గమౌ?నేత్రా లుండి వీక్షింపుమా!
5.గర్భగత"-భుక్తంబు"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.త.య.ర.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధాత్రిం!నిల్పు నీత్యు క్తతన్?తా నిచ్చు భుక్తంబు!శోభిలన్!
గాత్రంబు ల్సుశ్లోకంబులౌ?గానామృతంబే!విభూతియౌ?
మాత్రా పూర్ణ బీజాశ్రియై!మానాభి మానంబుల న్సదా!
నేత్రా లుండి వీక్షింపుమా!నీ,నా యనం పాపమే యగున్!
6.గర్భగత"-నీత్యుక్త"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.త.య.ర.ర.య.మ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధాత్రిం!నిల్పు నీత్యుక్తతన్?తా నిచ్చు భుక్తంబు శోభిలన్!ధర్మంబు తత్శోభా
                                                                       కరం బగున్?
గాత్రంబు ల్సుశ్లోకంబులౌ?గానామృతంబే?విభూతియౌ!కర్మం!సద్బుద్ధిం
                                                                        జరింపగన్?
మాత్రా పూర్ణ బీజాశ్రియై!మానాభి మానంబుల న్సదా!మర్మంబులం
                                                                       ద్రోలం!వడిన్?
నేత్రాలుండి వీక్షింపుమా!నీ,నా యనం!పాపమే యగున్?నిర్మోహంబే!
                                                               ముక్తి మార్గమౌ?
7.గర్భగత"-తంతర మంతర"-వృత్తము.
ధృతిఛందము.త.త.ర.మ.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తా నిచ్చు!భుక్తంబు!శోభిలన్!ధర్మంబు తత్శోభా!కరంబగున్?
గానామృతంబే?విభుతియౌ!కకర్మం!ద్బుద్ధిం జరింపగన్?
మానాభి మానంబులం సదా!మర్మంబులం ద్రోలం వడిన్?
నీ,నా యనం?పాపమే  యగున్?నిర్మోహంబే!ముక్తి మార్గమౌ?!
8.గర్భగత"-భుక్తిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.ర.మ.త.ర.మ.త.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తానిచ్చు భుక్తంబు!శోభిలన్ధర్మంబు తత్శోభా కరంబగున్?ధాత్రిం నిల్చు
                                                                               నీత్యు.క్తతన్?
గానా మృతంబే!విభూతి యౌ?కర్మం!సద్బుద్ధి న్జరింపగన్?గాత్రంబు ల్సు
                                                                               శ్లోకంబులౌ?
మానాభి మానంబులం!సదా!మర్మంబులం ద్రోలన్వడిన్?మాతా పూర్ణ
                                                                               బీజాశ్రియై!
నీ,నా యనం?పాపమే యగున్!నిర్మోహంబే?ముక్తి మార్గమ్!నేత్రాలండి
                                                                            వీక్షంపుమా?
9,గర్భగత"-మతయా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.త.య.య.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధాత్రిం!నిల్పు నీత్యుక్తతన్? ధర్మంబు!తత్శోభాకరంబగున్?
గాత్రంబు ల్సుశ్లోకంబు లౌ?కర్మం!ద్బుద్ధి న్జరింప గన్?
మాతాపూర్ణ బీజాశ్రియై?మర్మంబులం!ద్రోలన్వడిన్?
నేత్రాలుండి వీక్షింపుమా?నిర్మోహంబే!ముక్తిమార్గమౌ?
10,గర్భగత"-నీతినిల్పు"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.త.య.మ.ర.య.ర.ర.లగ.గణములు.యతులు.
9,18,ప్రాసనియమము కలదు.వృ.సం.
ధాత్రిం!నిల్పు నీత్యుక్తతన్?ధర్మంబు తత్శోభా కరంబగున్?తా నిచ్చు
                                                                   భుక్తంబు శోభిలన్?
గాత్రంబుల్సు శ్లోకంబులౌ?కర్మం!సద్బుద్ధిం జరింప గన్?గానామృతంబే?
                                                                         విభూతియౌ!
మాతా పూర్ణ బీజాశ్రియై?మర్మంబులం ద్రోలన్వడిన్?మానాభి మానం
                                                                         బుల న్సదా!
నేత్రాలుండి వీక్షింపుమా?నిర్మోహంబే?ముక్తి మార్గమా!నీ, నా!
                                                    యనం?పాపమే యగున్?
జైహింద్.

16, ఆగస్టు 2020, ఆదివారం

కాలగతి చెందిన డా. రాపాక ఏకాంబరాచార్యులు వారికి నా శ్రద్ధాంజలి.

0 comments

ఓం శాంతిః
డా. రాపాక ఏకాంబరాచార్యులు వారికి నా శ్రద్ధాంజలి.
సహృదయులు, శాంతస్వభావులు, అయిన పూజ్య ఏకాంబరాచార్యులు గారు కాలగతి చెందారన్నవార్త దిగ్భ్రాంతి కలిగించింది.వీరి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటూ వీరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియఁ జేయుచున్నాను.
నారాయణ.నారాయణ నారాయణ.

15, ఆగస్టు 2020, శనివారం

వందే భారతమాతరమ్.

0 comments

వందే భారతమాతరమ్.


శ్రీమద్భారత మాత సంతతిగ భాసింపంగ యోగంబు నా
శ్రీమన్మంగళ శ్రీనృసింహవిభు నాశీర్వాద సద్భాగ్యమే
బ్రేమన్ గొల్పును, స్వార్థహీనమతులే విశ్వేశ్వరాధీనులే
శ్రీమన్మంగళ భారతాంబకు శుభశ్రీసంపదల్ నిత్యమున్.
బలిదానంబులనేకులిద్ధరణికై ప్రఖ్యాతిగా చేయగా
తొలగెన్ భారత మాత సంకెలలు. మాధుర్యంపు సత్ స్వేచ్ఛయే
కలిగెన్. భారత జాతి సంతతి మహత్కార్యంబు సాధించె, నీ
స్థలియే విశ్వమునందు పూజ్య గుణ సంస్థానంబు, భాస్వంతమున్.
గీతామాత జనించె నీ ధరణినే, గీర్వాణు లిద్ధాత్రిపై
ఖ్యాతిన్ మెల్గగ నిచ్చగింత్రు సతము, కాంక్షింతు రీ నేలపై
ప్రీతిన్ బారెడి సన్నదీనదములన్ బ్రీతాత్ములై మున్గగా.
మాతా! భారత సత్సుధాకలిత! ప్రేమన్ బ్రోవుమా భక్తులన్.

జైహింద్.
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.

సోదరభారతీయులారా! అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

ఓం నమో నారసింహాయ
సోదరభారతీయులారా! అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
శ్రీమద్భారతమాత పుత్రునిగ భాసించన్ మహద్యోగమున్
బ్రేమన్ శ్రీహరి కొల్పి యుండవలయున్, విశ్వంబులోనన్ కవుల్
ధీమంతుల్ మన భారతాంబ సుతులే దీపింతు రిద్ధాత్రిపై.
శ్రీమన్మంగళ భారతాంబ! ప్రణతుల్, చిన్మూర్తివై వెల్గుమా.
ఎందరో మహనీయులయిన త్యాగధనుల కృషి ఫలితమే మనకు లభించిన స్వాతంత్ర్యము. 
వారి త్యాగఫలమయిన ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న మనం క్రమశిక్షణతో మెలుగుతూ, మన ప్రజ్ఞాపాటవాలతో మన దేశ కీర్తి దేశాంతరాల్లో మారుమ్రోగేలా చేస్తూ భారతమాతకు  గర్వకారణంగా నిలుద్దాం. ఆ శ్రీహరి చరణాలను ఆశ్రయించి పరస్పర సహకారంతో ఆనందమయ జీవితం గడుపుదాం.  జైహింద్ అని నినదిద్దాం.
వందే మాతరమ్.
జైహింద్.

13, ఆగస్టు 2020, గురువారం

భారతము... స్వర్గారోహణ పర్వము.ాంభట్ల పార్వతీశ్వర శర్మ ప్రవచనము. నిర్వహణ...భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

12, ఆగస్టు 2020, బుధవారం

డాాంభట్ల పార్వతీశ్వర శర్మ. అయోధ్యకాండ ప్రవచనము. నిర్వహణ..భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
డాాంభట్ల పార్వతీశ్వర శర్మ. అయోధ్యకాండ ప్రవచనము.
 జైహింద్.

11, ఆగస్టు 2020, మంగళవారం

ఆర్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. బ్రహ్మశ్రీ లోకా జగన్నాథశాస్త్రిగారి ప్రవచనమ్ శ్రీకృష్ణ లీలలు భక్తిసాధనం ఆధ్వర్యవములో.. వినదలరు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
బ్రహ్మశ్రీ లోకా జగన్నాథశాస్త్రిగారి ప్రవచనమ్ శ్రీకృష్ణ లీలలు భక్తిసాధనం ఆధ్వర్యవములో..
వినదలరు.
జైహింద్.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు...... .శతపద్య పూరణము ౨వ భాగము. భక్తిసాధనమ్ నిర్వహణలో.

0 comments

జైశ్రీరామ్.
మజనీయులకు వందనములు
ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భముగా భక్తులందరిపైనా ఆ పరమాముని దయ ఉండాలని కోరుకొంటూ అభినందనలు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.


జైహింద్.

10, ఆగస్టు 2020, సోమవారం

శతపద్య పూరణము ౨వ భాగము. భక్తిసాధనమ్ నిర్వహణలో

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

9, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారి ప్రవచనము...నిర్వహణ...భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

8, ఆగస్టు 2020, శనివారం

అవధానత్రయ కృత సంస్కృతావధానము.... నిర్వహణ,,భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

7, ఆగస్టు 2020, శుక్రవారం

ధీనుతా,సంబర,మోహనా,ద్విజతగా,సుందర,మోహాంబుధీ,పావక,సుమనా,సంభరిత,జంత్రీ,జతాభయా,జగవాసా,జామినీ,చామినీ,జగన్మోహ,గర్భ"-సదానంద"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
ధీనుతా,సంబర,మోహనా,ద్విజతగా,సుందర,మోహాంబుధీ,పావక,సుమనా,సంభరిత,జంత్రీ,జతాభయా,జగవాసా,జామినీ,చామినీ,జగన్మోహ,గర్భ"-సదానంద"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         

సదానంద సందోహ సంభరిత చిత్తా!జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!
నిదానంబు జేకూర్చు!నీప్రభ లనంతమ్!నిగూఢ మెంచన్?నిగమాంత
                                                                              వేద్యా!శుభా!
చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!జిగీష దక్షా!జిగిదేఱు భద్రాత్మకా!
వదాన్యుండ వీవోయి!పావకుడ వీవే!ప్రగాఢ విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!

అర్ధములు:-
జిగీష=పట్టుదల,జిగిదేఱు=కాంతివంతమగు,ప్రగాఢ=ధృడమైన,
ప్రగడ=ప్రధానుడు,

1.గర్భగత"-ధీనుతా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.య.య.ల.గణములు.వృ.సం.74.
ప్రాసనియమము కలదు.
సదానంద సందోహ!
నిదానంబు జేకూర్చు!
చిదానంద శ్రీకాంత!
వదాన్యుండ వీవోయి!
2.గర్భగత"-సంబర"-వృత్తము.
అతిజగతీఛందము.య.య.జ.స.గ.గణములు.యతి.8,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిదానంబు జేకూర్చు నీప్రభ లనంతమ్!
చిదానంద శ్రీకాంత జీవ పరిపోషా!
వదాన్యుండ వీవోయి!పావకుడ వీవే?
3.గర్భగత"-మోహనా"-వృత్తము.
ధృతిఛందము.య.య.జ.స.ర.య.గణములు.యతి12,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సదానంద సందోహ సంభరిత చిత్తా!జగన్నివాసా!
నిదానంబు జేకూర్చు నీ ప్రభ లనంతమ్!నిగూఢ మెంచన్?
చిదానంద శ్రీకాంత!జీవ పరి పోషా!జిగీష దక్షా!
వదాన్యుండ వీవోయి!పావకుడ వీవే?ప్రగాఢ విశ్వా!
4.గర్భగత"-ద్విజతగా"-వృత్తము.
అతిజగతీఛందము.జ.త.జ.త.గ.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!
నిగూఢ మెంచన్?నిగమాంత వేద్యా!శుభా!
జిగీష దక్షా!జిగి దేఱు!భద్రాత్మకా!
ప్రగాఢ విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!
5.గర్భగత"-సుందర"-వృత్తము.
కృతిఛందము.జ.త.జ.త.ర.ర.గల.గణములు.యతులు.6,14.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!సదానంద సందోహ!
నిగూఢ మెంచన్?నిగమాంత వేద్యా!శుభా!నిదానంబు జేకూర్చు!
జిగీష దక్షా!జిగి దేఱు భద్రాత్మకా!చిదానంద!శ్రీకాంత!
ప్రగాఢ!విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీ వోయి?
6.గర్భగత"-మోహాంబుధీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.జ.త.ర.ర.ర.న.గగ.గణములు.యతులు.6,14,21.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!జగదైక మోహాంబుధీ!సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిగూఢ మెంచన్?నిగమాంత వేద్యా!శుభా!నిదానంబు జేకూర్చు!నీ ప్రభ
                                                                                 లనంతమ్!
జిగీష దక్షా!జిగి దేఱు భద్రాత్మకా!చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!
ప్రగాఢ విశ్వా!ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?
7.గర్భగత"-పావక"-వృత్తము.
అతిశక్వరీ"-వృత్తము.స.య.జ.త.త.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగదైక మోహాంబుధీ?సదానంద సందోహ!
నిగమాంత వేద్యా?నిదానంబు జేకూర్చు!
జిగిదేఱు భద్రాత్మకా?చిదానంద శ్రీకాంత!
ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?
8.గర్భగత"-సుమనా"-వృత్తము.
ప్రకృతిఛందము.స.య.జ.త.త.త.య.గణములు.యతులు.9,16,
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగదైక మోహాంబుధీ?సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిగమాంత వేద్యా?నిదానంబు జేకూర్చు!నీ ప్రభ లనంతమ్?
జిగిదేఱు భద్రాత్మకా?చిదానంద!శ్రీకాంత!జీవ పరిపోషా!
ప్రగడీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?
9.గర్భగత"-సంభరిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.జ.త.త.త.య.జ.గగ.గణములు.యతులు.
9,16,22,ప్రాసనియమము కలదు.వృ.సం.
జగదైక మోహాంబుధీ?సదానంద సందోహ సంభరిత చిత్తా!జగన్నివాసా!
నిగమాంత వేద్యా!నిదానంబు జేకూర్చు!నీ ప్రభలనంతమ్?నిగూఢ
                                                                                  మెంచన్?
జిగి దేఱు భద్రాత్మకా?చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!జిగీష దక్షా!
ప్రగ డీవె?సర్వేశ్వరా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?ప్రగాఢ!విశ్వా!
10,గర్భగత"-జంత్రీ"-వృత్తము.
జగతీఛందము.జ.త.త.త.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సదానంద సందోహ!
నిగూఢ మెంచన్?నిదానంబు జేకూర్చు!
జిగీష!దక్షా!చిదానంద శ్రీ కాంత!
ప్రగాఢ!విశ్వా!వదాన్యుండ వీవోయి?
11.గర్భగత"-జతాభయా"-వృత్తము.
ధృతిఛందమయాజ.త.త.త.భ.య.గణములు.యతులు.6,13.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సదానంద సందోహ సంభరిత చిత్తా!
నిగూడ మెంచన్?నిదానంబు జేకూర్చు!నీ ప్రభలనంతమ్?
జిగీష దక్షా!చిదానంద శ్రీకాంత!జీవ పరిపోషా!
ప్రగాఢ విశ్వా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?
12.గర్భగత"-జగవాసా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.త.త.భ.య.స.య.లగ,గణములు.యతులు
6,13,19,ప్రాసనియమము కలదు.వృ.సం.                                                     జగన్నివాసా!సదానంద సందోహ సంభరిత చిత్తా!జగదైక  మోహాంబుధీ?
నిగూఢ మెంచన్?నిదానంబు జేకూర్చు!నీప్రభ లనంతమ్?నిగమాంత
                                                                                        వేద్యా?
జిగీష దక్షా!చిదానంద శ్రీకాంత!జీవపరి పోషా!జిగి దేఱు భద్రాత్మకా?
ప్రగాఢ విశ్వా!వదాన్యుండ వీవోయి?పావకుడ వీవే?ప్రగడీవె?సర్వేశ్వరా!
13.గర్భగత"-జామినీ"-వృత్తము.
త్రిష్టుప్ఛందము.జ.మ.న.గగ.గణములు.యతి.6,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సంభరిత చిత్తా!
నిగుఢ మెంచన్?నీ ప్రభ లనంతమ్?
జిగీష దక్షా!జీవ పరిపోషా!
ప్రగాఢ విశ్వా!పావకుడ వీవే?
14.గర్భగత"-చామినీ"-వృత్తము.
ధృతిఛందము.జ.మ.న.త.త.త.గణములు.యతి.12,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.షం.
జగన్నివాసా!సంభరిత చిత్తా?సదానంద సందోహ!
నిగూఢ మెంచన్?నీప్రభ లనంతమ్?నిదానంబు జేకూర్చు!
జిగీష దక్షా!జీవ పరి పోషా!చిదా నంద శ్రీకాంత!
ప్రగాఢ విశ్వా!పావకుడ వీవే?వదాన్యుండ వీవోయి?
15.గర్భగత"-జగన్మోహా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.మ.న.త.త.త.స.య.లగ.గణములు.యతులు
6,12,19,ప్రాసనియమము కలదు.వృ.సం.
జగన్నివాసా!సంభరిత చిత్తా!సదానంద సందోహ!జగదైక మోహాంబుధీ?
నిగూఢ మెంచన్?నీప్రభ లనంతమ్?నిదానంబు జేకూర్చు!నిగమాంత
                                                                                      వేద్యా?
జిగీష దక్షా!జీవ పరిపోషా!చిదానంద శ్రీకాంత!జిగి దేఱు భద్రాత్మకా?
ప్రగాఢ విశ్వా!పావకుడ వీవే?వదాన్యుండ వీవోయి?ప్రగడీవె?సర్వేశ్వరా!
జైహింద్.

6, ఆగస్టు 2020, గురువారం

అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్భముగా పద్య గేయ సంకీర్తనలు...నిర్వహణ భక్తిసాధనమ్.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

5, ఆగస్టు 2020, బుధవారం

రామజన్మభూమి అయోధ్యలో రామాలయ శంకుస్థాపన సందర్భముగా..శ్రీరామజయమ్.

0 comments

జైశ్రీరామ్.
శ్రీరామజన్మభూమి అయోధ్యలో రామాలయ శంకుస్థాపన సందర్భముగా..శ్రీరామజయమ్.

శ్రీరామా! రఘువంశజా! భవహరా! సీతామనో నాయకా!
నీ రమ్యాక్షరనామమే వర శుభానీకంబు కల్గించునే,
శ్రీరామా యనిపల్కినన్ వినిన మా చింతల్ విడన్ జేయునే
మారామింతయు లేనివాడవగుచున్ మారామ! మమ్మేలుమా.

కూర్మినయోధ్యలోన వెలుఁగుల్విరజిమ్మఁగ  రమ్ము సీతతో
ధర్మము నాల్గుపాదముల ధక్షుఁడవై నడువంగ చేయుమా.
మర్మవిదూరులన్ సుగుణమాన్యులఁ గావుమ నిత్యమిద్ధరన్,
ధార్మికులందునుండి వరధర్మమునే పరిరక్ష సేయుమా.

జైశ్రీరామ! జయంబు ధర్మవశమై సత్యంబునే నిల్పెనే,
సుశ్రేయంబులె మమ్ము నీదు కృపచే శోభించగా చేరునే
విశ్రాంతిని విడి నిన్ను కొల్చునటులన్ బ్రీతిన్ మమున్ జేయుమా,
యశ్రద్ధన్ విడఁ జేసి చేతనమునే యాత్మన్ సదా నిల్పుమా.

జైశ్రీరామ్,
జైహింద్.

లోకా సమస్తాః సుఖినో భవంతు.అయోధ్యరామునికి జయము జయము. జైశ్రీరామ్ ... జైశ్రీరామ్ ... జైశ్రీరామ్ ... జైశ్రీరామ్ ... జైశ్రీరామ్.

0 comments

జైశ్రీరామ్ 
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ... జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ... 
జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ... జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...   జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ... జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...   జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ... జైశ్రీరామ్  ...   జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ... జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ... 
 జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...   జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ... జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ... 
 జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  
జైశ్రీరామ్  ... జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్.  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  జైశ్రీరామ్  ...  
జైహింద్