గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 31వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

31. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః.

కలిత వృత్త గర్భ సీసము

సమవర్తివి. జయ పథము నీవు. వర కవిన్ - నడిపెడి నరహరీ! నన్నుఁ గనుమ.

గణనీయ! ప్రజల సుఖము నీవయ. ఘన - క్షణఁ గొలుపు గతివే! కమలనయన!

మదినుండు సుజన వరదుఁడా! శుభకర! శో -  భఁ గొలుప వలదొకో? పాపహారి!

సుగుణుఁడ! నిజముఁ గనఁగ నీవె యనుచు నే - ర్ప వలదొ? తెలియఁగన్ ప్రవిమల గతి.

గీ. కలిత గర్భసు సీసస్థ! కామితదుఁడ! - ధరణి వర *మహాదంష్ట్రాయుధా*! జయో೭స్తు.    

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

31 సీస గర్భస్థ కలిత. ( .. యతి 12) 

విజయ పథము నీవు. వర కవిన్ నడిపెడి నరహరీ!

ప్రజల సుఖము నీవయ ఘన రక్షణఁ గొలుపు గతివే

సుజన వరదుఁడా! శుభకర! శోభఁ గొలుప వలదొకో?

నిజముఁ గనఁగ నీవె యనుచు నేర్ప వలదొ? తెలియఁగన్.

 భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నీవు సమవర్తివిజయ మార్గముకూడా నీవే.శ్రేష్ఠకవిని

నడిపించువాడవు. నన్నును చూడుము. గణింపబడువాడా! ప్రజల సుఖమునీవే.   కమల నయనా! గొప్ప రక్షణ

గొలుపు వాడవే సుమా. శుభకరుడా! మదిలో వసించు సుజన వరదుఁడా! నీవు మాకు శోభను గొలుప వలదా?

సుగుణాఢ్యుడా! నిర్మలచిత్తముతో తెలుసుకొనుటకు చూడగా నిజమనిన నీవేయని నేర్పవలదా నీవు. కలిత వృత్తగర్భ

సీసరూపుఁడా! కోరిక లీడేర్చువాడా! భువిని గొప్ప కోరలు ఆయుధముగా కలవాడా! నీకు జయము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.