గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2018, శుక్రవారం

సమాశ్రీ,సాహస,శాసయ,స్వభావ,ఔరా,సజ్జసయా,సద్వియత,ముక్తిగా,దిగమ్రింగు,ఉత్తమా,గర్భ"-జవనాశ్వ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
సమాశ్రీ,సాహస,శాసయ,స్వభావ,ఔరా,సజ్జసయా,సద్వియత,ముక్తిగా,దిగమ్రింగు,ఉత్తమా,గర్భ"-జవనాశ్వ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                   
"-జవనాశ్వ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.జ.జ.భ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
భుక్తి ముక్తిగా దలంచి!భువనాలను మ్రింగ జూచు!పురుషోత్తము లుండి రౌరా!
రక్తి యుక్తి నెంచి భూమి!ప్రవరాఖ్యు లనంగ నొప్ప!పరమాత్ము డదేల నోయీ?
శక్తి దోష భావ మంట!జవనాశ్వము ధీటు కాగ!జర మెంచరు?పావనంబున్?
నక్త చర్య వీడరేల? నవనీత సమత్త్వ మెట్లు?నర వానరులో?యనంగన్?

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
భుక్తి ముక్తిగా దలంచి!
రక్తి యుక్తి నెంచి భూమి!
శక్తి దోష భావ మంట!
నక్త చర్య వీడ రేల?
నక్తచర్య=చీకటి వ్యాపారము.

2.గర్భగత"-సాహస"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.352.ప్రాసగలదు.
భువనాలను మ్రింగ జూచు!
ప్రవ రాఖ్యు లనంగ నొప్ప!
జవనాశ్వము ధీటు కాగ!
నవనీత సమత్వ మెట్లు?

3.గర్భగత"-శాసయ"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.92.ప్రాసగలదు.
పురుషోత్తము లుండి రౌరా?
పరమాత్ము  డదేల నోయీ?
జర మెంచరు పావనంబున్?
నర,వానరులో?యనంగన్?

4.గర్భగత"-స్వభావ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.జ.జ.గల.గణములు.యతి.9,.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భుక్తి!ముక్తిగా దలంచి!భువనాలను మ్రింగ జూచు!
రక్తి!యుక్తి నెంచి భూమి!ప్రవ రాఖ్యు లనంగ నొప్ప!
శక్తి! దోష భావ మంట! జవ నాశ్వము ధీటు కాగ!
నక్త చర్య వీడ రేల? నవనీత సమత్వ మెట్లు?

5.గర్భగత"-ఔరా!"వవృత్తము.
ధృతిఛందము.స.స.జ.స.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భువనాలను మ్రింగ జూచు!పురు షోత్తము లుండి రౌరా?
ప్రవరాఖ్యు లనంగ నొప్ప!పరమాత్ము డదేల నోయీ?
జవ నాశ్వము ధీటు కాగ!జర మెంచరు పావనంబున్?
నవ నీత సమత్వ మెట్లు? నర,వానరు లో?యనంగన్?

6.గర్భగత"-సజ్జసయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.స.స.య.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
భువనాలను మ్రింగజూచు!పురుషోత్తము లుండి రౌరా?భుక్తి ముక్తిగా దలంచి!
ప్రవరాఖ్యులనంగ నొప్ప!పరమాత్ము డదేలనోయీ?రక్తి,యుక్తి నెంచి భూమి!
జవనాశ్వము!ధీటుకాగ!జర మెంచరు పావనంబుం?శక్తి,దోషభావ మంట! నవనీత సమత్వ మెట్లు?నర,వానరులో?యనంగం!నక్త చర్య వీడరేల?

నవనీతసమము=మృదు స్వభావము.

7.గర్భగత"-సద్వియత"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.య.భ.య.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పురుషోత్తము లుండి రౌరా?భుక్తి,ముక్తిగా దలంచి!
పరమాత్ము డదేల నోయీ?రక్తి,యుక్తి నెంచి భూమి!
జర మెంచరు పావనంబుం?శక్తి దోషభావ మంట!
నర,వానరులో?యనంగం!నక్త చర్య వీడరేల?

8.గర్భగత"-ముక్తిగా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.య.భ.య.భ.జ.జ.గల.గణములు.యతులు.10,18.ప్రాసనీమముగలదు.
పురుషోత్తము లుండిరౌరా?భుక్తి,ముక్తిగా దలంచి!భువనాలను మ్రింగ జుచు!
పరమాత్ము డదేల నోయీ?రక్తి,యుక్తినెంచి భూమి!ప్రవరాఖ్యు లనంగ. నొప్ప!
జర,మెంచరు పావనంబుం?శక్తి,దోష భావముంట!జవనాశ్వము ధీటు కాగ!
నర,వానరులో? యనంగం! నక్త చర్య వీడ రేల?నవనీత సమత్వ మెట్లు?

9,గర్భగత"-దిగమ్రింగు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భువనాలను మ్రింగజూచు!భుక్తి,ముక్తిగా దలచి!
ప్రవరాఖ్యు లనంగ నొప్ప?రక్తి,యుక్తి నెంచి భూమి!
జవనాశ్వము ధీటుకాగ శక్తి,దోష భావ మంట!
నవనీత సమత్వ మెట్లు? నక్త,,చర్య వీడరేల?

10,గర్భగత"-ఉత్తమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.ర.జ.భ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
భువనాలనుమ్రింగ జూచు!భుక్తి,ముక్తిగా దలంచి?పురుషోత్తము లుండి రౌరా
ప్రవరాఖ్యు లనంగ నొప్ప?రక్తి,యుక్తి నెంచి భూమి!పరమాత్ము డదేలనోయీ?
జవనాశ్వము ధీటు కాగ!శక్తి దోష భావ మంట!జర మెంచరు పావనంబున్?
నవనీత సమత్వ మెట్లు?నక్త చర్య వీడరేల?నర,వానరు లో! యనంగన్?
స్వస్తి.
మూర్తి,జుత్తాడ.
జైహింద్.

29, నవంబర్ 2018, గురువారం

రక్షదా,ఉషశ్రీ,రామతారక,శార్దులభ్రమక,యద్విరమా,అహంబ్రహ్మ,సమద్విత,సమతాతమ,సమమతిజా,సమమతా,గర్భ"-వనమృగీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
రక్షదా,ఉషశ్రీ,రామతారక,శార్దులభ్రమక,యద్విరమా,అహంబ్రహ్మ,సమద్విత,సమతాతమ,సమమతిజా,సమమతా,గర్భ"-వనమృగీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.                      

"-వనమృగీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.జ.స.మ.త.త.మ.లగ.గణములు.యతులు.10,18
ప్రాసనీమముగలదు.
సర్వం బ్రహ్మ మయంబుగాదె?జగతిం ప్రాపేపీవేగా?జగన్నాయకా!భూత్త్మకా?
పర్వంబీవు!పరాత్పరుండ!ప్రగతింగూర్ప న్రావేగం!పగంనాగులం! పీడింపులన్!
చర్వంబౌ!బహు జన్మ కర్త!జగదా ధారా!సర్వేశా!స గర్వంబునం! జీవింపగాన్?
దుర్వారంబుల దూరమేర్చు?తొగరించం?సౌభాగ్యంబుం!తొగంవిందు చేకూర్చన్వలెన్?                                           తొగరించన్=అనురాగమొంద,తొగంన్విందు=(,పండువెన్నల),చంద్రుడు.

1.గర్భగత'-రక్షదా"-వృత్తము.
 బృహతీఛందము.మ.స.జ.గణములు.వృ.సం.345.ప్రాసగలదు.
సర్వం బ్రహ్మ మయంబు గాదె?
పర్వం బీవు! పరాత్ప రుండ!
చర్వంబౌ?బహు జన్మ కర్త!
దుర్వారంబుల దూర మేర్చు?

2.గర్భగత"-ఉషశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.మ.గగ.గణములు.వృ.సం.4,ప్రాసగలదు.
జగతిం!ప్రాపే పీ వేగా?
ప్రగతిం!గూర్పం రావేగన్?
జగదా  ధారా?సర్వేశా!
తొగరించం సౌభాగ్యంబున్?

3.గర్భగత"-రామతారక"-వృత్తము.
బృహతీఛందము.య.య.ర.గణములు.వృ.సం.138.ప్రాసగలదు.
జగన్నాయకా!భూతాత్మకా?
పగం నాగులం పీడింపులన్?
స గర్వంబునం జీవింపగాన్!
తొగం విందు ! జేకూర్చన్వలెన్!

4.గర్భగత"శార్దూల భ్రమక"-వృత్తము.
అత్యష్టీందము.మ.స.జ.స.మ.గగ.గణములు.యతి.10,వ యక్షరము.
ప్రాసనీమముగలదు.
సర్వం బ్రహ్మ మయంబు గాదె?జగతిం!ప్రా పేపీవే?గా?
పర్వంబీవు?పరాత్పరుండ! ప్రగతిం గూర్పం రా వేగన్?
చర్వంబౌ?బహు జన్మ కర్త!జగదా ధారా?  సర్వే శా
దు ర్వారంబుల దూర మేర్చు!తొగరించం సౌభాగ్యంబున్?

5.గర్భగత"-యద్విరమా"-వృత్తము.
ధృతిఛందము.య.య.ర.మ.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగన్నాయకా!భూతాత్మకా?సర్వం బ్రహ్మ మయంబు గాదె?
పగం నాగులం పీడింపం?పర్వంబీవు! పరాత్పరుండ?
స గర్వంబునం జీవింపగాం!చర్వంబౌ?బహు జన్మ కర్త!
తొగం విందు జేకూర్చన్వలెం?దుర్వారంబుల దూర మేర్చు?

6.గర్భగత"-అహం బ్రహ్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.య.ర.మ.స.జ.స.మ.గగ.గణములు.
యతులు.10,19.ప్రాసనీమముగలదు.
జగన్నాయకా!భూతాత్మకా?సర్వం;బ్రహ్మ మయంబుగాదె?జగతిం!ప్రాపేపీవేగా?                                                
పగం నాగులం పీడింపం?పర్వంబీవు?పరాత్పరుండ?ప్రగతిం గూర్పంరా వేగన్?                                                  
సగర్వంబునం జీవింపగాం!చర్వంబౌ?బహుజన్మ కర్త?జగదాధారా!సర్వేశా?                                                      
తొగంవిందు జేకూర్చం వలెం?దుర్వారంబుల దూర మేర్చు?తొగరించంసౌభాగ్యంబున్!                                                                        

7.గర్భగత"-సమద్విత"-వృత్తము.
అత్యష్టీఛందము.స.మ.త.త.మ.లగ.గణములు.యతి.9,.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతిం ప్రాపేపీవే గా?జగన్నాయకా!భూతాత్మకా!
ప్రగతింగూర్పం రా వేగం?పగంనాగులం పీడింపన్?
జగదాధారా!సర్వేశా?సగర్వంబునం జీవింపగాన్!
తొగరించం సౌభాగ్యంబుం!తొగం విందు జేకూర్చన్వలెన్!

8.గర్భగత"-సమతాతమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.మ.త.త.మ.య.త.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు
జగతిం ప్రాపేపీవే గా?జగన్నాయకా!భూతాత్మకా?సర్వం బ్రహ్మ మయంబుగాదె?                                                
ప్రగతింగూర్పం రావేగం?పగం నాగులం పీడింపం?పర్వంబీవు?పరాత్పరుండ?                                                    
జగదాధారా!సర్వేశా!సగర్వంబునం జీవింపగాం!చర్వంబౌ బహుజన్మ కర్త?
తొగరించం సౌభాగ్యంబుం తొగంవిందు జేకూర్చన్వలెం?దుర్వారంబుల దూరమేర్చు?                                          

9.గర్భగత"-సమమతిజా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.మ.మ.త.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతిం ప్రాపీవే గా!సర్వం బ్రహ్మ మయంబు గాదె?
ప్రగతింగూర్పం రా వేగం?పర్వంబీవు పరాత్పరుండ?
జగదాధారా!సర్వేశా!చర్వంబౌ!బహు జన్మ కర్త?
తొగరించం సౌభాగ్యంబుం!దుర్వారంబుల దూర మేర్చు!

10,గర్భగత"-సమమతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.మ.మ.త.జ.భ.త.మ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జగతిం ప్రాపీవేగా?సర్వం బ్రహ్మ మయంబుగాదె?జగన్నాయకా!భూత్త్మకా?
ప్రగతింగుర్చం రా వేగం?పర్వంబీవు పరాత్పరుండ?పగం నాగులం పీడింపన్?
జగదాధారా!సర్వేశా?చర్వంబౌ?బహు జన్మ కర్త?సగర్వంబునం జీవింపంగాన్!
తొగరించం సౌభాగ్యంబుం?దుర్వారంబుల దూరమేర్చు?తొగం విందు జేకూర్చంవలెన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

28, నవంబర్ 2018, బుధవారం

శ్లో. మౌనేన కలహో నాస్తి.... మేలిమిబంగారం మన సంస్కృతి.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. మౌనేన కలహో నాస్తి
న మౌనం కలహేనచ
ప్రథమే సుఖమాప్నోతి
అన్యత్తు క్లేశ సంకులమ్

తే.గీ. కలహమది మౌనముననెప్డు కలుగఁబోదు.
కలహమున మౌనమెప్పుడు కలుఁగబోదు.
మొదటి దానిచే సుఖముండు, పిదప దాని
చేత క్లేశముల్ కలుగును ఖ్యాతి పాయు.

భావము.
మౌనముగా ఉన్నచో కలహము కలుగదు. కలహము వలన మౌనము కలుగదు.
మొదటిదాని చేత సుఖము ప్రాప్తించును. రెండవదానిచేత క్లేశము సంభవించును.
జైహింద్.

27, నవంబర్ 2018, మంగళవారం

ఆహ్వానము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా. 
బ్రహ్మశ్రీ అష్టకాల నృసింహరామశర్మ గారు రవీంద్ర భారతిలో 27 . 11 . 2018 . , 5.30pm కు చేయుచున్న 
అష్టావధానమునకు స్వాగతము.
జైహింద్.

26, నవంబర్ 2018, సోమవారం

మత్తరజినీ ద్వయ,శోభకా,రజినీకర ప్రియద్వయ,ఛండశాసన,జంటనీ,నిల్చునాద్వయ,ఒంటరీద్వయ,గర్భ"-పండంటి"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
మత్తరజినీ ద్వయ,శోభకా,రజినీకర ప్రియద్వయ,ఛండశాసన,జంటనీ,నిల్చునాద్వయ,ఒంటరీద్వయ,గర్భ"-పండంటి"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
               

"-పండంటి"-వృత్తము.
ఉృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.త.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
దాస్యమే!ప్రభావిభావమై!ధర్మ గ్లాని సంక్ర మించెనే?తాదాప్య మేల?శంకరా!
వశ్యమాన స్వార్ధ భూమికం!పర్ము నైన నెంచలేకిలం?వాదాల శీల దూరులై!
నశ్యతీతి స్వేచ్ఛయో యనం?నర్మబద్ధ జీవ మేలికై!నాదాల నీతి గుప్పుచున్!
పశ్యమై !జరించి మాధవా!పర్మ భోగ భాగ్య మందెలే?పాదార్తి!బాప రావిటన్?

నశ్యతీతి స్వేచ్ఛ=స్వేచ్ఛనాశకమగునట్లు,నర్మబద్ధ=అబద్ధములచేకట్టబడి,
పశ్యమై=చూడబడుచు,పాదార్తి=నాలుగుపాదములలో మూడుభాగములు
నీరుకాగ,ఒకభాగము భూమి,ఆభూమియందలి కష్టములను.

1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.దాస్యమే!ప్రభా విభావమై!          2.ధర్మ గ్లాని సంక్రమించెనే?
  పశ్యమాన స్వార్ధ భూమికన్!           పర్మునైన నెంచలేకిలన్?
  నశ్యతీతి స్వేచ్ఛయో?యనన్?        నర్మబద్ధ జీవ మేలికై?
  పశ్యమై చరించి మాధవా!               పర్మ భోగ భాగ్య మందెలే?

2.గర్భగత"-శోభకా"-వృత్తము.
అనుష్టప్ఛందము.త.ర.లగ.గణములు.వృ.సం.85.ప్రాసగలదు.
తాదాప్యమేల? శంకరా!
వాదాల శీల దూరులై?
నాదాల నీతి గుప్పుచున్?
పాదార్తి బాప రావిటన్?

3.గర్భగత"-రజినీకర ప్రియ ద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.
దాస్యమే!ప్రభా విభావమై!ధర్మ గ్లాని సంక్ర మించెనే?
పశ్యమాన స్వార్ధ భూమికం!పర్ము నైన నెంచ లేకిలన్?
నశ్యతీతి స్వేచ్ఛయో?యనం!నర్మ బద్ధ జీవ మేలికై!
పశ్యమై!చరించి మాధవా!పర్మ భోగ భాగ్య మందెలే?
2.
ధర్మ గ్లాని సంక్రమించెనే?దాస్యమే!ప్రభావిభావమై!
పర్మునైన నెంచ లేకిలం?పశ్యమాన స్వార్ధ భూమికన్!
నర్మ బద్ధ జీవ మేలికై?నశ్యతీతి స్వేచ్ఛయో!యనన్?
పర్మ భోగ భాగ్య మందెలే?పశ్యమై చరించి మాధవా!

4.గర్భగత"-ఛంశాసనా"-వృత్తము.
ఉత్కృతిఛందము,ర.జ.ర.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
.ధర్మ గ్లాని సంక్రమించెనే?తాదాప్య మేల?శంకరా!దాస్యమే?ప్రభావిభావమై!
పర్మునైన నెంచ లేకిలం?వాదాల శీల దూరులై!పశ్యమాన స్వార్ధ భూమికన్?
నర్మ బద్ధ జీవ మేలికై!నాదాల నీతి గుప్పుచుం!నశ్యతీతిస్స్వేచ్ఛ యోయనన్?
పర్మ భోగ భాగ్య మందెలే?పాదార్తి బాప రావిటం? పశ్యమై చరించి మాధవా!

5.గర్భగత"-జంటనీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.త.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధర్మ గ్లాని సంక్రమించెనే?తాదాప్య మేల?శంకరా!
పర్ము నైన నెంచ లేకిలం?వాదాల శీల దూరులై!
నర్మబద్ధ జీవ మేలికై! నాదాల నీతి గుప్పుచున్?
పర్మ భోగ భాగ్య మందెలే?పాదార్తి బాప రావిటన్?

6.గర్భగత"-నిల్చునా"-ద్వయవృత్తములు.
అత్యష్టీఛందము.త.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.
తాదాప్యమేల?శంకరా!దాస్యమే!ప్రభా విభావమై!
వాదాల శీల దూరులై!పశ్యమాన స్వార్ధ భూమికన్?
నాదాల నీతి గుప్పుచుం?నశ్యతీతి స్వేచ్ఛ యోయనన్?
పాదార్తి బాప రావిటం? పశ్యమై చరించి మాధవా!
2.
తాదాప్యమేల?శంకరా!ధర్మ గ్లాని సంక్ర మించెనే?
వాదాల శీల దూరులై!పర్ము నైన నెంచ లేకిలన్?
నాదాల నీతి గుప్పుచుం?నర్మ బద్ధ జీవ మేలికై!
పాదార్తి బాపరా విటం?పర్మ భోగ భాగ్య మందెలే?

7.గర్భగత"-ఒంటరి"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.త.ర.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
1.
తాదాప్య మేల?శంకరా!దాస్యమే!ప్రభా విభావమై!ధర్మ గ్లాని సంక్ర మించేనే?
వాదాల శీల దూరులై!పశ్యమాన స్వార్ధ భూమికం?పర్మునైన నెంచ లేకిలన్?
నాదాల నీతి గుప్పుచుం?నశ్యతీతి స్వేచ్ఛయోయనం?నర్మబద్ధ జీవమేలికై?
పాదార్తి బాప రావిటం? పశ్యమై చరించి మాధవా?పర్మభోగ భాగ్య మందెలే?
2.
తాదాప్య మేల?శంకరా!ధర్మ గ్లాని సంక్ర మించెనే?దాస్యమే!ప్రభావిభావమై!
వాదాల శీల దూరులై!పర్మునైన నెంచ లేకిలం?పశ్యమాన స్వార్ధ భూమికన్?
నాదాల నీతి గుప్పుచుం?నర్మబద్ధ జీవ మేలికై?నశ్యతీతిస్వేచ్ఛయోయనన్?
పాదార్తి బాప రావిటం!పర్మ భోగ భాగ్య మందెలే?పశ్యమై చరించి మాధవా?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

25, నవంబర్ 2018, ఆదివారం

జగతీ,సమ్మద,జీవనా,ప్రముఖాశ్రి,తూజప,వాజిన,రసవత్కళా,రాజితమాంధ్ర,రమణీయ,మనోజ్ఞమయి,గర్భ"-ప్రాజిత"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ

0 comments

జైశ్రీరామ్.
జగతీ,సమ్మద,జీవనా,ప్రముఖాశ్రి,తూజప,వాజిన,రసవత్కళా,రాజితమాంధ్ర,రమణీయ,మనోజ్ఞమయి,గర్భ"-ప్రాజిత"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ                   

"-ప్రాజిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.భ.జ.జ.స.స.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
రసవత్కళా ప్రపూర్ణ!రమణీయ మనోజ్ఞ మయి!రాజిత మాంధ్ర మెంచరేలన్?
పస విద్వదౌష ధామ!ప్రముఖాశ్రి వినోది రమ!ప్రాజిత సా రసో త్సుధా శ్రీ!
వసి తావధాన ధీమ!భమిడింనరి చిత్రకృతి!వాజినమం దసాధ్యగాదే?
దొసగా?పఠింప తెన్గు!దుముకంగను జేయకుమి!తూ జప మేర్చ న్యాయమా?

అర్ధములు:-
పస విద్వదౌషధామ=పట్టనందు విద్యావంతులనే నూహింపజేయగల నిలయము,ప్రాజిత సా రసోత్సుధాశ్రీ=సారధియైన రసభరమైన మథువను
సంపద,వసితావధాన ధీమ=అవధానములందు నిల్చు ధీరవనిత,
భమిడింసరి చిత్ర కృతి=చిత్రకావ్యములందుబంగారము వంటిది,
వాజినమందసాధ్య=బలమునందసాధ్యురాలు,దుముకంగన=పతనము
గనునట్లు చూచిన,దొసగా=దోషమా?,తూజపము=తూమంత్రముగా!,

భావము:విద్యావంతులనే యూహింప జేసే పట్టుగల తెన్గుభాష!రసవత్కళా
ప్రపూర్ణ.రమణీయమై!మనస్సున కింపైనది.ప్రకాశవంతమైన తెలుగును
తలపరెందులకు?ప్రముఖుల నాశ్రయించి వినోదించు నందకత్తె!రసభరమైన తీయటిపలుకుల సంపదకు సారధి యీమె!అవధానములందు వశించు
నవధాన శారదా! చిత్రకాయములందు, బంగరుతల్లి!అసదృశ బలసంపన్ను
రాలు!అట్టి తెలుగును నేర్చుట తప్పా? తప్పెన్నటికీ కాాదు!, ఒప్పే సుమా!
అట్టి మహత్తరమైన తెలుగును కూలనీకుమి.తూ జపముగా తెలుగు
చేయుట న్యాయమా! న్యాయ మెన్నటికి కాదు.అన్యాయమే!

1,గర్భగత"-జగతీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.జ.గల.గణములు.వృ.సం.172.ప్రాసగలదు.
రసవత్కళా ప్రపూర్ణ!
పటు విద్వదౌష ధామ!
వసి తావధాన!ధీమ!
దొసగా?పఠింప తెన్గు!

2.గర్భగత"-సమ్మద"-వృత్తము.
బృహతీఛందము.స.స.న.గణములు.వృ.సం.476.ప్రాసగలదు.
రమణీయ మనోజ్ఞ మయి!
ప్రముఖాశ్రి! వినోది రమ!
భమిడిం సరి చిత్ర కృతి!
దుముకంగను జేయకుమి?

3.గర్భగత"-జీవవృత్మత్తము.
బృహతీఛందము.భ.ర.య.గణములు.వృ.సం.87.ప్రాసగలదు.
రాజిత మాంధ్ర మెంచ రేలన్?
ప్రాజిత సా రసోత్సు ధా! శ్రీ!
వాజిన మందసాధ్యగాదే?
తూ జపమేర్చ న్యాయమే?

4.గర్భగత"-ప్రముఖాశ్రి"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.భ.జ.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రసవత్కళా ప్రపూర్ణ!రమణీయ మనోజ్ఞ మయి!
పస విద్వదౌష ధామ!ప్రముఖాశ్రి వినోది రమ!
వసి తావధాన ధీమ!భమిడిం సరి చిత్ర కృతి!
దొసగా?పఠింప తెన్గు!దుముకంగను జేయకుమి?

5.గర్భగత"-తూజప"-వృత్తము.
ధృతిఛందము.స.స.న.భ.ర.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రమణీయ మనోజ్ఞ మయి!రాజిత మాంధ్ర మెంచ రేలన్?
ప్రముఖాశ్రి వినోది రమ!ప్రాజిత సా రసోత్సుధా!శ్రీ!
భమిడిం సరి చిత్ర కృతి!వాజినమందసాధ్య గాదే?
దుముకంగను జేయకుమి!తూ జప మేర్చ న్యాయమే?

6.గర్భగత లఘ్వంత"-వాజిన"-.
ఉత్కృతిఛందము.స.స.న.భ.ర.య.స.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
రమణీయ మనోజ్ఞ మయి!రాజిత మాంధ్ర మెంచ రేలం?రసవత్కళా ప్రపూర్ణ!
ప్రముఖాశ్రి వినోది రమ! ప్రాజిత సా రసోత్సుధా శ్రీ!  పస విద్వ దౌష ధామ!
భమిడిం సరి చిత్ర కృతి! వాజిన మందసాధ్య గాదే?  వసి తావధాన ధీమ!
దుముకంగను జేయకుమి! తూ జప మేర్చ న్యాయమే?దొసగా?పఠింప తెన్గు!

7.గర్భగత"-రసవత్కళా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.య.స.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రాజిత మాంధ్ర మెంచరేలం?రసవత్కళా ప్రపూర్ణ!
ప్రాజిత సా రసోత్సుధా శ్రీ! పస విద్వ దౌష ధామ!
వాజిన మందసాధ్య గాదే?వసి తావధాన ధీమ!
తూ జప మేర్చ న్యాయమే?దొసగా?పఠింప తెన్గు!

8.గర్భగత"-రాజితమాంధ్ర"-లఘ్వంతము,
ఉత్కృతిఛందము.భ.ర.య.స.జ.భ.జ.జ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
రాజిత మాంధ్ర మెంచ రేలం?రసవత్కళా ప్రపూర్ణ!రమణీయ మనోజ్ఞ మయి!
ప్రాజిత సా రసోత్సుధా శ్రీ! పస విద్వదౌష ధామ! ప్రముఖాశ్రి వినోది రమ!
వాజిన మం దసాధ్య గాదే?వసి తావధాన ధీమ!భమిడిం సరి చిత్ర కృతి!
తూ జపమేర్చ న్యాయమే?దొసగా?పఠింప తెన్గు!దుముకంగను జేయకుమి!

9.గర్భగత"-రమణీయ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.న.స.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రమణీయ మనోజ్ఞ మయి!రసవత్కళా ప్రపూర్ణ!
ప్రముఖాశ్రి వినోది రమ!పస విద్వదౌష ధామ!
భమిడిం సరి చిత్ర కృతి!వసి తావధాన ధీమ!
దుముకంగను జేయకుమి!దొసగా?పఠింప తెన్గు!

10,గర్భగత"-మనోజ్ఞమయి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.న.స.జ.ర.స.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
రమణీయ మనోజ్ఞ మయి!రసవత్కళా ప్రపూర్ణ!రాజిత మాంధ్ర మెంచ రేలన్?
ప్రముఖాశ్రి వినోది రమ!పస విద్వదౌష ధామ!ప్రాజిత సా రసోత్సుధా శ్రీ!
భమిడిం సరి చిత్ర కృతి!వసి తావధాన ధీమ!వాజిన మందసాధ్య గాదే?
దుముకంగను జేయకుమి!దొసగా?పఠింప తెన్గు!తూ జప మేర్చ న్యాయమే?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

24, నవంబర్ 2018, శనివారం

ఆధునిక"-భువనవిజయము"-నాటిక"-చిన్నపిల్లలకు. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

3 comments

జైశ్రీరామ్.
ఆధునిక"-భువనవిజయము"-నాటిక"-చిన్నపిల్లలకు.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                 
వందిమాగదులు"-సాహితీ సమరాంగణ సార్వభౌమా!విజయనగర సామ్రాజ్య
తేజోవిభావ!శ్రీ.శ్రీ.శ్రీ.కృష్ణదేవరాయ సార్వభౌమా!బహు పరాక్!బహు పరాక్!

తెరవెనుక"-స్వాగతం_సుస్వాగతం!
 నేటి భువన విజయమునకు అష్షదిగ్గజ కవులు విచ్చేసిరి.
శ్రీకృష్ణదేవరాయలు:-
అష్టదిగ్గజ కవులకు పేరుపేరు వరుసన శుభాభివందనములు.
మంత్రి,సామంత,పురోహిత,దండనాయకులకు సాదరాభివందనములు.
"-దేశభాషలందు తెలుగు లెస్స!
"-ఇంపు సొంపులు గుబాళించు తెనుగు నుడికారములు శ్రవణానంద కరములు.
కాయకష్టములకోర్చి,రేయనక పగలనక శ్రమించు కష్టజీవులు,లోకమునకు
తిండిని చేకూర్చు రైతన్నలు దేశమునకు వెన్నెముక వంటివారు.అట్టివారు
మథు పాన మత్తులై,తృటిలో!ప్రాణాలు గోల్పోవుచున్నారు.హృదయ విదారక
మైన ,ఈవిషయమునకు స్పందించి!నేడే శాసించుచున్నాను.
కం:-కాటుక కన్నులు పాడరి
    కూటికి!లోటేర్పడంగ!కుంకుమ తుడిచే!
    చేటగు సారా మానుడి!
    సూటిగ జీవింప వలెను!శుభములు గల్గున్!
అనుచు,
"  పెద్దనార్యా! "-మథువును గొనువారె!జగతి మంగళ కారుల్!"-
         ఈసమస్యను తమయల్లిక జిగిబిగితో!పూరింపుడు!

కం:-మృదు వచనామృత జలధి!
     మథువన"నమృత మది!సురలు మరి మరిగొని!, యా
    పదలందక యుండిరి!యా
    మథువును గొను వారె!జగతి మంగళ కారుల్!

అమృతమును దేవతలుత్రాగెదరు.మానవుల కది లభ్యము కాదు.వీరుత్రాగే
మథువు(సారా),ప్రాణములు తీయును.అందుకే మానాలి.
కృష్ణదేవరాయలు"-పెద్దనార్యా!మథువనబడు నమృతమునుత్రాగుటకు
దేవతలేయోగ్యులని,ఆ!యమృతము వారికి మరణములేకుండ చేయునని,
వారే!లోకములకు మేలుజేయు దేవతలని చక్కగ వివరించిరి.
నిగూఢార్ధముగా!దేవతలుకాని,వారగు మానవులు మధువనునామాంతరము
గల సారాను త్రాగిన చని పోవుదు రని చెప్పక చెప్పిరి, బహు  పసందుగా నున్నది.

కృష్ణరాయలు"-తిమ్మనార్యు వైపు తిరిగి!"ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు
లంటారు కదా!"
 ఇదే సమస్యను ముద్దు లొలికే పలుకులతో పూరింపుడు.

 కం:-మదిరాక్షి!వలపు చిలుకగ!
       మృదు శయ్యను జేరి వరుని మథురాధర',శో
      భ!దురీను లగుచు!మత్తిలి!
     మథువును గొనువారె?జగతి మంగళ కారుల్!

కృష్ణదేవరాయలు"భేషు!భేషు! తిమ్మనార్యా! మథువును మథురాధర
మథువుగా మార్చి చక్కగా!పూరించిన మీపూరణము బహుపసందు.
కృష్ణదేవరాయలు"-జనాభా!విపరీతముగా!పెరిగి పోవుచున్నది.వారికి
తిండిగింజలు దొరుకుట కష్టముగా నున్నది.అందుకని కోటాబియ్యం
ప్రజలకిచ్చే పధకాన్ని ప్రవేశ పెట్టాం!ఎలా!ఉంటుంది!మల్లనార్యా!
వివరింపుడు.

 కం:-నోటులు లోటైనా సరె!
       ఓటుల కిక లోటు రాదు!ఓటమి దవ్వౌ!
       నీటుగ మనదే!రాజ్యము!
      పాటు పడంగవలె?దేశ ప్రగతికి మీరే!

కృష్ణదేవరాయలు:-ధూర్జటి పల్కుల కేల?గల్గు!నీయతులిత మాథురీ మహిమ"యంటారు.ధూర్జటి కవివరేణ్యా!దానిని మీరెట్లా పూరిస్తారు,

 కం:-కోటా తూటాలను గొని
       పోటీపడి రాజ్యమేలు పూజ్యుల కిలలో?
      కోటలు బీటులు వారిన
     కోటుల కిక లోటురాదు!కువలయ నాధా!

శ్రీకృష్ణదేవరాయలు:"

 కం:-భద్రం బెయ్యదొ?జెప్పుమ!
      నిద్రాళురు కన్ను తెరచి!నేరిమి మీరన్!
     సద్రాజ్య!సుఖములందగ!
    భద్రకవీ!పలుక వయ్య! భవితవ్యంబున్!

రామభద్రకవి.

 కం:-సమ సామ్రాజ్యమునెలకొన
       సమతను పాటించి దేశ సంస్కృతి పెంపున్?
      తమకపు సిరి పెంపు మరచి!
      గమియించిన భద్రరాజ్య !గరిమము పెరుగున్?
భద్ర రాజ్యము గురించి రామభద్రకవీ!భద్రంగా నుపదేశించిరి?బాగు బాగు!

కృష్ణరాయలు"-రామకృష్ణకవీ!వికట కవితా దురీణా!జనాభా నియంత్రణ
మమలు చేయించినా!జనాభా తగ్గుట లేదు.దీనికి మీసందేశ మేమిటి?


కం:-శయ్యాటము పెను పెచ్చగ!
     కుయ్యో!మొర్రో!యనియెడు కూనల కనగా!
     నుయ్యో!గొయ్యో గాకను!
    అయ్యో! జన మెట్లు?తగ్గు!నవనీ నాధా!
శ్రీకృష్ణదేవరాయలు"-భట్టుమూర్తి కవీ!దేశ ప్రగతికి మీ సందేశ మేమిటి?

తే.గీ:-శాస్త్ర విజ్ఞాన సంపత్తి!చక్కబరచి!
        జీవయాత్రను సరిజేసి !జీవితముల!
        శాంతి సౌభాగ్య శోభిత!జగము వెలుగ!
        తీర్చ గావలె!  శ్రీకృష్ణ దేవ రాయ!

:శ్రీకృష్ష్ణరాయలు":'అక్షరాస్యత '-విషయంలోచాల ధనము వెచ్చించి
ప్రయత్ని స్తున్నాము.దానివలన ప్రయోజనము చేకూరు తుందని,
మా ప్రగాఢ విశ్వాసము.దీని విషయములో మీసందేశ మేమిటి.!

కం:-చదువను దీపము!జనులకు!
      సదమలమగు భవితకెంతొ?సాయము కాగన్!
     చదువులు నేర్చిన వారలు!
     పదిలపు సుఖ జీవితాన వర లెద  రిలలోన్!

రాయలు"జ్ఞాన జ్యోతి భావి గమనమునకు దారి చూపు ననియు,సుఖ
జీవన మందించుననియు,బాగుగా వచించిరి.సంతోషము.

శ్రీకృష్ణదేవ రాయలు:-"స్త్రీ విద్యను మేము ప్రోత్సహించున్నన్నాము.
మంచి దంటారా!

  కం:-వనితలు చదివిన చాలును!
        ఘనతను సాధింప గలరు!కలియుగ మందున్!
         ఘన భవితకు సారధులై
        మనుజుల సరి!పాటు పడుచు!మనెదరు భువినిన్!

***ఆధునిక భువనవిజయమును బహు పసందుగా నడిపిన
అష్ట దిగ్గజ కవివరేణ్యులకు! వారి సాహితీ దురీణతకు సర్వదా!
కృతజ్ఞుడను.
        "నేటి భువనవిజయమునకు ముగింపుగా________

     కం:'రవి  గన నేరని తావులు!
          కవులే!!యెరుగం గలారు!కాదన వశమే?
          కవితా సుమ సోయగ సతి
          భవితకు తగు నీతి నొసగి!వరలగ వలెగా?
                  *************

స్వస్తి
మూర్తి. జుత్తాడ.
జైహింద్.

23, నవంబర్ 2018, శుక్రవారం

నిదర్శనా,సమాశ్రీ,భద్రకా,హాసినీ,కేళినీ,విషమయ,బాధిత,విఱ్ఱవీగు,లాంఛిత,లాలిపాడు,గర్భ "-దోషాపహాస్య"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
నిదర్శనా,సమాశ్రీ,భద్రకా,హాసినీ,కేళినీ,విషమయ,బాధిత,విఱ్ఱవీగు,లాంఛిత,లాలిపాడు,గర్భ
"-దోషాపహాస్య"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-దోషాపహాస్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.భ.ర.జ.ర.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
లంచమనే విషకన్యట?లాలిపాడ నీతికన్య!లాంఛనమై విఱ్ఱ వీగెనే?
వంచనమే సబబంచును?బాలక్రీడ సంతసాన!వాంఛిత దోషాప హాస్యమై!
కాంచనమే పరమంబని?కాలతీరు చైదమంటె?కాంచగ దుర్భూతి భోగతన్?
దంచెను భూ వర సాధ్విని!తాళజాలలేని తీరు!తాం చరితార్ధంబు నౌగతిన్?

1.గర్భగత"-నిదర్శనా"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.భ.గణములు.వృ.సం.439.ప్రాసగలదు.
లంచమనే!విషకన్యట?
వంచనమే!సబబంచును?
కాంచనమే!పరమంబని?
దంచెను భూ వర సాధ్విని!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు. వృ.సం.171.ప్రాసగలదు.
లాలిపాడ నీతికన్య!.
బాలక్రీడ సంతసాన!
కాలతీరు చైదమంటె?
తాళజాలలేని తీరు!

3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.ప్రాసగలదు.
లాంఛనమై విఱ్ఱ వీగెనే?
వాంఛిత దోషాప హాస్యమై!
కాంచగ దుర్భూతి భోగతన్?
తాం చరితార్ధంబు నౌగతిన్?

4.గర్భగత"-హాసినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.భ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లంచమనే!విష కన్యట!లాలిపాడ నీతికన్య!
వంచనమే!సబబంచును!బాలక్రీడ సంతసాన!
కాంచనమే!పరమంబని!కాలతీరు చైదమంటె!
దంచెను భూ వర సాధ్విని!తాళజాల లేనితీరు!

5.గర్భగత"-కేళినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.స.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లాలిపాడ నీతికన్య!లాంఛనమై విఱ్ఱవీగెనే?
బాలక్రీడ సంతసాన!వాంఛిత దోషాపహాస్యమై!
కాలతీరు చైదమంటె! కాంచగ దుర్భూతి భోగతన్?
తాళజాల లేని తీరు!తాం చరితార్ధంబు నౌగతిన్?

6.గర్భగత"-లఘ్వంత విషమయ"-.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.ర.య.స.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
లాలిపాడ నీతికన్య!లాంఛనమై విఱ్ఱవీగెనే?లంచమనే విషకన్యట?
బాలక్రీడ సంతసాన!వాంఛిత దోషాప హాస్యమై!వంచనమే!సబబంచును?
కాలతీరు చైదమంటె!కాంచగ దుర్భూతి భోగతం?కాంచనమే!పరమంబని!
తాళజాలలేనితీరు!తాం చరితార్ధంబు నౌగతిం?దంచెను భూ వర సాధ్విని!

7.గర్భగత"-బాధిత"-వృత్తము.
ధృతిఛందము.భ.త.ర.భ.భ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లాంఛనమై!విఱ్ఱవీగెనే?లంచమనే?విషకన్యట?
వాంఛిత దోషాపహాస్యమై!వంచనమే!సబబంచును?
కాంచగ దుర్భూతి భోగతం?కాంచనమే!పరమంబని?
తాం చరితార్ధంబు నౌగతిం?దంచెను భూవర సాధ్విని!

8.గర్భగత"-లఘ్వంత-విఱ్ఱవీగు"-.
ఉత్కృతిఛందము.భ.త.ర.భ.భ.భ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
లాంచనమై!విఱ్ఱవీగెనే?లంచమనే!విషకన్యట?లాలిపాడ నీతికన్య!
వాంఛిత దోషాప హాస్యమై!వంచనమే!సబబంచును?బాలక్రీడ సంతసాన!
కాంచగ దుర్భూతి భోగతం?కాంచనమే!పరమంబని!కాలతీరు చైదమంటె?
తాం చరితార్ధంబు నౌగతిం?దంచెను భూ వరసాధ్విని!తాళజాలలేనితీరు?

9.గర్భగత"-లాంఛిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.స.స.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లాలిపాడ నీతికన్య!లంచమనే!విషకన్యట?
బాలక్రీడ సంతసాన!వంచనమే?సబబంచును!
కాలతీరు చైదమంటె?కాంచనమే!పరమంబని!
తాళజాలలేని తీరు!దంచెను భూ వర సాధ్విని!

10,గర్భగత"-లాలిపాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.స.స.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
లాలిపాడ నీతికన్య!లంచమనే!విషకన్యట?లాంఛనమై విఱ్ఱవీగెనే?
బాలక్రీడ సంతసాన!వంచనమే?సబబంచును!వాంఛిత దోషాప హాస్యమై?
కాలతీరు చైదమంటె?కాంచనమే!పరమంబని!కాంచగ దుర్భూతి భోగతన్?
తాళజాలలేని తీరు!దంచెను!భూవర సాధ్విని!తాం చరితార్ధంబు నౌగతిన్?
స్వస్తి.
మూర్తి,జుత్తాడ.
జైహింద్.

22, నవంబర్ 2018, గురువారం

వరీయ,సుఖజీవనా,సూక్తి,హుళక్కి,ఆగతమే,నైచ్యతా,నీతులాడు,నజ్జరభా,మెక్కుడు,సచ్ఛర,గర్భ"-ప్రళయంకర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
వరీయ,సుఖజీవనా,సూక్తి,హుళక్కి,ఆగతమే,నైచ్యతా,నీతులాడు,నజ్జరభా,మెక్కుడు,సచ్ఛర,గర్భ"-ప్రళయంకర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-ప్రళయంకర"-వృత్తము"
ఉకృతిఛందము.భ.భ.భ.జ.ర.జ.న.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
స్వచ్ఛత జూడ హుళక్కి?పదిమంది సొమ్ము మెక్కుచుం!పలుకుదు రెన్నొ?నీతులన్!.                                           తుచ్చులె? మాన్యు లనంగ! తుది కైన దైవ మెంచకం?తులువత  భావినెంతురే?
పచ్చటి కొంపల నార్పి!పదిలంపు స్వార్ధ తేజతం?వలదనరెట్టి?నైచ్యమున్!
స చ్ఛ రితార్ధు లటంచు? చదిరంపు తీరు తీరొకో?జల ప్రళయాల త్రాతలై?

చదిరంపు తీరు=పాము నైజము.

1,గర్భగత"-వరీయ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.ప్రాసగలదు.
స్వచ్ఛత జూడ హుళక్కి?
తుచ్ఛులె?మాన్యు లనంగ!
పచ్చటి కొంపల   నార్పి!
సచ్ఛరి తార్ధు లటంచు?

2.గర్భగత"-సుఖజీవన"-వృత్తము.
బృహతీఛందము.స.జ.ర.గణములు.వృ.సం.172.ప్రాసగలదు.
పదిమంది సొమ్ము మెక్కుచున్!
తుది కైన దైవ  మెంచకన్?
పదిలంపు స్వార్ధ తేజతన్!
చదిరంపు తీరు తీరొకో?

3.గర్భగత"-సూక్తి"-వృత్తము.
బృహతీఛందము.న.జ.ర.గణములు.వృ.సం.178.ప్రాసగలదు.
పలుకుదు రెన్నొ?నీతులం!
తులువత భావి నెంతురే?
వలదన  రెట్టి నైచ్యమున్?
జల ప్రళయాల త్రాతలై?

4.గర్భగత"-హుళక్కి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.జ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
స్వచ్ఛత జూడ హుళక్కి? పదిమంది సొమ్ము మెక్కుచున్?
తుచ్ఛులె?మాన్యు లనంగ!  తుదికైన దైవ మెంచకన్?
పచ్చటి కొంపల నార్పి! పదిలంపు స్వార్ధ తేజతన్?
సచ్ఛరి తార్ధు లటంచు?చదిరంపు తీరు తీరొకో?

5.గర్భగత"ఆగతమే?"-వృత్తము.
ధృతిఛందము.స.జ.ర.న.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పదిమంది సొమ్ము మెక్కుచుం?పలుకుదు రెన్నొ?నీతులన్!
తుదికైన దైవ మెంచకం? తులువత భావి నెంతురే?
పదిలంపు స్వార్ధ తేజతం! వలదన రెట్టి నైచ్యమున్?
చదిరంపు తీరు  తీరొకో? జల ప్రళయాల త్రాతలై?

6.గర్భగత"-లఘ్వంత నైచ్యతా"-.
ఉత్కృతిఛందము.స.జ.ర.న.జహర.భ.భ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పదిమంది సొమ్ము మేక్కుచుం?పలుకుదు రెన్నొ?నీతులం!స్వచ్ఛత జూడ! హుళక్కి!
తుదికైన దైవ మెంచకం?తులువత భావి నెంతురే?తుచ్ఛులె?మాన్యు లనంగ?
పదిలంపు స్వార్ధ తేజతం?వలదన రెట్టి?నైచ్యముం!పచ్చటి కొంపల నార్పి!
చదిరంపు తీరు తీరొకో? జల ప్రళయాల త్రాతలై! సచ్చరి తార్ధు లటంచు?

7.గర్భగత"-నీతులాడు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.ర.భ.భ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పలుకుదు రెన్నొ?నీతులం!స్వచ్ఛత జూడ హుళక్కి!
తులువత భావి నెంతురే??తుచ్ఛులె మాన్యు లనంగ?
వలదన రెట్టి నైచ్యముం?పచ్చటి కొంపల నార్పి!
జల ప్రళయాల త్రాతలై! సచ్చరి తార్ధు లటంచు?

8.గర్భగత"-నజ్జరభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.ర.భ.భ.భ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పలుకుదు రెన్నొ నీతులం?స్వచ్ఛత జూడ హుళక్కి!పదిమంది సొమ్ము మెక్కుచున్?
తులువత భావి నెంతురే??తుచ్ఛులె?మాన్యులనంగ! తుదికైన దైవమెంచకన్?
వలదనరెట్టి?నైచ్యముం!పచ్చటి కొంపల నార్పి!పదిలంపు స్వార్ధ తేజతన్?
జల ప్రళయాల త్రాతలై!సచ్చరి తార్ధు లటంచు?చదిరంపు చరితార్ధు లనంగ?

9,గర్భగత"-మెక్కుడు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.ర.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరమ.
ప్రాసనీమముగలదు.
పదిమంది సొమ్ము మెక్కుచుం!స్వచ్ఛత జూడ హుళక్కి!
తుదికైన దైవ మెంచకం?తుచ్ఛులె!మాన్యు లనంగ?
పదిలంపు స్వార్ధ తేజతం? పచ్చటి కొంపల నార్పి!
చదిరంపు చరితార్ధు లనంగ?సచ్చరి తార్ధు లటంచు?

10,గర్భగత"-సచ్ఛర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.ర.భ.భ.భ.న.ర.లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
పదిమంది సొమ్ము మెక్కుచుం!స్వచ్ఛత జూడ హుళక్కి!పలుకుదు రెన్నొ!నీతులన్?
తుది కైన దైవ మెంచకం?తుచ్ఛులె మాన్యు లనంగ! తులువత భావినెన్నడున్?
పదిలంపు స్వార్ధ తేజతం?పచ్చటి కొంపల నార్పి!వలదనరెట్టి నైచ్యమున్?
చదిరంపు చరితార్ధులనంగ?సచ్చరితార్ధు లటంచు?జలప్రళయాల త్రాతలై!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ..
జైహింద్

21, నవంబర్ 2018, బుధవారం

శ్రీ మునగపాటి శివరామకృష్ణగారు విరచించిన మాలికా బంధచంపక మాలిక

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! సుప్రసిద్ధ వ్యంగ్యచిత్రలేఖకులు శ్రీ మునగపాటి శివరామకృష్ణగారు విరచించిన మాలికా బంధచంపక మాలిక పఠించి మనమూ ఇట్టి రచనకు ఉపక్రమించవచ్చును. చూడండి.
ఇంత చక్కగా భక్తి పూర్ణ హృదయులై చంపకమాలికతో ఆ స్మామిని సేవించి అనుగ్రహపాత్రులయారు. వారికి నా నమస్కృతులు.
జైహింద్.

20, నవంబర్ 2018, మంగళవారం

మననా,మాణవక,విభూతి,మననీని,కేకిలు,తృష్ణావర్త,కీర్తిచెడు,కీలెడమ,మేటగు,తుదిమొదలు,గర్భ"-కీకరు"- వృత్తము "-కికరు"-వృత్తము.మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
మననా,మాణవక,విభూతి,మననీని,కేకిలు,తృష్ణావర్త,కీర్తిచెడు,కీలెడమ,మేటగు,తుదిమొదలు,గర్భ"-కీకరు"-
వృత్తము "-కికరు"-వృత్తము.మూర్తి.జుత్తాడ.
"-కికరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.న.న.భ.త.య.స.య.లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
కేశాద్యంతము,తెలియక!కీకురులే?మేటులవం!కీలెడమై తెగుం భారతీ!
కీశాధీశులు ఘనమవ!కేకిలు లోకంబు నగున్?కీలకముల్పరాధీనమౌ!
ఆశాపాశము నిడుపగు!యాకలి మంటల్బొడముం!యాలన పాలన దూరమౌ.                                                     నాశంబౌ?భవిత ప్రగతి!నాకము నవ్వుం!నరుడా!నాలుక చేదునౌ!నెంచుమా!                                                  
అర్ధములు:-కేశాద్యంతము=తలవెండ్రుక మొదలు,చివరలు,కీకురులు=
మోసగాండ్రు,కీశాధీశులు=శ్రేష్టతగలకోతులు,కేకిలు లోకంబు=ప్రపంచము
గగ్గోలు పెట్టును,కీలెడమై తెగున్=కీళ్ళు దూరమై రాలిపోవును,కీలకముల్పరా
ధీనము=ప్రాముఖ్యమువహించు విషయములుపరులకు చేరును,
నిడుపగ=పొడవు పెరుగును,ఆకలిమంటల్బొడమున్=ఆకలిమంటలు,
పుట్టును,నాకము నవ్వున్=దేవతలు నవ్వెదరు,నాలుక చేదౌ?=నాలుక
రుచితప్పును,

1.గర్భగత"-మననా"-వృత్తము.
బృహతీఛందము.మ.న.న.గణములు.వృ.సం.505.ప్రాసగలదు.
కేశాద్యంతము తెలియక?
 కీశాధీశులు ఘనమవ?
ఆశాపాశము నిడుపగు!
నాశంబౌ?భవిత ప్రగతి!
కీశాధీశులు=మితిమీరిన కోతిచేష్టలుగల ప్రభులు.

2.గర్భగత"-మాణవక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.త.గల.గణములు.వృ.సం.103.ప్రాసగలదు.
కీకురులే?మేటులవన్?
కేకిలు!లోకంబు నగున్!
ఆకలి మంటల్బొడమున్?
నాకము నవ్వుం!నరుడా!
నాకము నవ్వున్=దేవతలు పరిహసింతురు.

3.గర్భగత"-విభూతి"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.భ.గణములు.వృ.సం.407.ప్రాసగలదు.
కీ లెడమై!తెగుంభారరతీ?
కీలకముల్?పరాధీనమౌ!
ఆలన పాలనల్? దూరమౌ!
నాలుక చేదునౌ?నెంచుమా?

కీలెడమై తెగుం? భారతీ=ప్రాముఖ్యమైన(అతినిగుఢమైన)విషయములు
విద్యావ్యాసంగమున పూర్తిగా!తెగిపోవును,భారతదేశ రహస్యములు
పైదేశీయులకు చేరును.నాలుక చేదునౌ=రసాస్వాదన వికటించును,

4.గర్భగత"-మననీని"-వృత్తము.
అయ్యష్టీఛందము.మ.న.న.భ.త.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముదు.
కేశాద్యంతము తెలియక? కీకురులేమేటులవన్?
కీశాధీశులు ఘనమవ?కేకిలు లోకంబు నగున్!
ఆశాపాశము నిడువగు!యాకలి మంటల్బొడమున్?
నాశంబౌ?భవిత ప్రగతి! నాకము నవ్వుం నరుడా!

5.గర్భగత"-కేకిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.య.స.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కీకురులే?మేటులవం!కీలెడమై!తెగుం భారతీ!
కేకిలు లోకంబునగుం?కీలకముల్పరాధీనమౌ?
ఆకలి మంటల్బొడముం!ఆలన పాలనల్దూరమౌ?
నాకము నవ్వుం!నరుడా!నాలుక చేదునౌ?నేంచుమా!

6.గర్భగత"-లఘ్వంతతృష్ణావర్త"-
ఉత్కృతిఛందము.భ.త.య.స.య.య.త.న.లల.గణములు.
యతులు.9,18.ప్రాసనీమముగలదు.
కీకురులే?మేటులవం!కీలెడమై తెగుం భారతీ!కేశాద్యంతము తెలియక?
కేకిలు లోకంబు నగుం?కీలకముల్పరాధీనమౌ?కీశాధీశులు ఘనమవ?
ఆకలి మంటల్బొడముం?యాలన పాలనల్దూరమౌ?ఆశాపాశము నిడువగు!
నాకము నవ్వున్నరుడా!నాలుక చేదునౌ?నెంచుమా!నాశంబౌ!భవిత ప్రగతి!

7.గర్భగత"-కీర్తిచెడు"-వృత్తము.
ధృతి ఛందము.భ.ర.భ.మ.న.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కీలెడమై తెగుం?భారతీ!కేశాద్యంతము తెలియక?
కీలకముల్పరాధీనమౌ!కీశాధీశులు ఘనమవ?
యాలన పాలనల్దూరమౌ?ఆశాపాశము నిడువగు?
నాలుక చేదునౌ?నెంచుమా!నాశంబౌ!భవిత ప్రగతి!

8.గర్భగత"-కీలెడమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.భ.మ.న.న.భ.త.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కీలెడమై తెగుం?భారతీ!కేశాద్యంతము తెలియక?కీకురులే!మేటులవన్?
కీలకముల్పరాధీనమౌ!కీశాధీశులు ఘనమవ?కేకిలు లోకంబు నగున్?
ఆలన పాలనల్దూరమమౌ?ఆశాపాశము నిడువగు!ఆకలి మంటల్బొడమున్?
నాలుక చేదునౌ?నెంచుమా!నాశంబౌ!భవిత ప్రగతి!నాకము నవ్వుం నరుడా!

9.గర్భగత"-మేటగు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.య.త.న.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కీకురులే!మేటులవం? కేశాద్యంతము తెలియక?
కేకిలు లోకంబు నగుం?కీశాధీశులు ఘనమవ?
ఆకలిమంటల్బొడముం?ఆశాపాశము నిడువగు?
నాకము నవ్వుం నరుడా!నాశంబౌ!భవిత ప్రగతి!

10,గర్భగత"-తుదిమొదలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.య.త.న.స.స.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కీకురులే!మేటులవం?కేశాద్యంతము తెలియక?కీలెడమైతెగుం?భారతీ!
కేకిలు లోకంబు నగుం?కీశాదులు ఘనమవ?కీలకముల్పరాధీనమౌ?
ఆకలి మంటల్బొడముం?ఆశాపాశము నిడువగు!యాలనపాలనల్దూరమౌ?
నాకము నవ్వుం నరుడా!నాశంబౌ!భవిత ప్రగతి!నాలుక చేదునౌ? నెంచంగన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

19, నవంబర్ 2018, సోమవారం

రేపు క్షీరాబ్ధి ద్వాదశి. - వివరణ. బ్రహ్మశ్రీ నారాయణ భట్ల చైతన్య.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
పరమపవిత్రమైన క్షీరాబ్ధిద్వాదశి రేపే. దీనిని గూర్చి బ్రహ్మశ్రె నారాయణభట్ల చైతన్య ఎలా వివరించారో చూడండి..
క్షీరాబ్ధిద్వాదశి
శ్లో.ఉపరాగ సహస్రాణి!
వ్యతీపాతాయుతానిచ!
అమాలక్షంతు ద్వాదశ్యాః!
కలాంనార్హంతిషోడశీమ్!!
తా.వేయి గ్రహణములును, పదివేల వ్యతీపాతయొగములును,లక్షఅమావాస్యలును కలిపిన క్షీరాబ్ధిద్వాదశి వ్రతఫలానికి పదహారో వంతుకు కూడా సరిసమానము గాజాలదు.
పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి. ఇలా అనేక నామాలతో అనంత కోటి పుణ్యఫల ప్రదాయినిగ ప్రసిద్ధిగాంచిన ఈ క్షీరాబ్దిద్వాదశి మహాపర్వదినమున విద్యుక్తముగ చేయవలసిన స్నానము,దానము,అర్చన.
శ్రీతులసి,ధాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామిని, శ్రీకార్తీకదామోదరుని, శ్రీభవానీశంకరులను పూజించుట.తదనంతరం..దానము
వాటిలో ముఖ్యమైనవి.
1.సాలగ్రామ,2వస్త్ర,3యజ్ఞోపవీత,4.ఛత్ర,5.వ్యజన,6పాదుక,7.ఉదకుంభ,8.రజితప్రతిమ,9.నవరత్న,10.సుగంధద్రవ్య,11.చందన,12.ఆమలక,13.పూర్ణఫల,14.దధ్యోదన 15.దీపదానములను 16.రజితదీప దానములను
యథాశక్తిమేరకు నిర్వహించవలెను
-:ఈ క్షీరాబ్ధి ద్వాదశినాడు ఆచరించవలసిన దానములు ఆచరించిన వచ్చే అపూర్వపుణ్యఫలా లనుగూర్చి స్కాందపురాణంలో ఉన్న విశేషాంశాలు:-
శ్లో.సాలగ్రామం సమభ్యర్చ్య శ్రోత్రియాయకుటింబినే!
దానంయఃకురుతేభక్త్యా!తస్యపుణ్యఫలంశ్రుణు.
శ్లో.చతుస్సాగరపర్యంతం!
భూదానాద్యత్ఫలంవిదుః!
తత్ఫలంసమవాప్నోతి!
ద్వాదశ్యాంకార్తికస్యచ!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు సాలగ్రామాన్ని చక్కగపూజించి అద్దానిని శ్రోత్రియుడైన బ్రాహ్మణగృహస్థుకి దానం చేసినట్లైతే నాలుగు సముద్రముల మధ్యనున్న యావత్తు ఈ భూమండలాన్ని మొత్తాన్ని దానం ఇచ్చినంత పుణ్యఫలం వొస్తుంది.
శ్లో.ద్వాదశ్యాంకార్తికేమాసి!
వస్త్రదానంకరోతియః!భక్త్యాప్రయత్నతోరాజన్!
పాపైఃపూర్వార్జితైరపి!
విముచ్యవిష్ణుభవనం!
యాతినాస్త్యత్రసంశయః!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు భక్తితో శ్రోత్రియుడైన బ్రాహ్మణగృహస్థుకి వస్త్రదానం ఆచరించువాని పూర్వజన్మార్జిత పాపములు నశించి. తుదకు వైకుంఠం జేరును. ఇందు సందేహము లేదు.
శ్లో.ఫలం, యజ్ఞోపవీతంచ!
సతాంబూలం సురక్షితం!
ద్వాదశ్యాంయే ప్రకుర్వంతి!తత్ఫలం శృణుభూమిప!!
శ్లో.భుంక్తే స విపులాన్ భోగాన్!
స్వర్గేప్యంతేతుదుర్లభాన్!
పశ్చాద్విష్ణుపురం ప్రాప్య!
మోదతే విష్ణువచ్చిరమ్!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు భక్తితో శ్రోత్రియుడైన బ్రాహ్మణగృహస్థుకి ఫలమును,-యజ్ఞోపవీతమును,-తాంబూలమును, ఇచ్చువాడు. యీలోకమందు ఆనేకభోగములను పొంది. అంతమందు విష్ణులోకమున చిరకాలము సుఖించును.
శ్లో.కార్తికేమాసిద్వాదశ్యాం!
దధ్యన్నందానముత్తమం!
యఃకుర్యాత్సోపి ధర్మేభ్యో!
అధికంఫలముచ్యతే!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు భక్తితో శ్రోత్రియుడైన బ్రాహ్మణ గృహస్థుకి పెరుగు అన్నమును దానము చేసిన యెడల సమస్తధర్మములకంటే అధికఫలమును పొందును.
*"*ముఖ్యగమనిక*"*
*"ప్రదానం ప్రఛ్ఛన్నం*" అంటే?
తాను ఇతరులకి ఇచ్చినదేదీ చెప్పరాదంటున్నది శాస్త్రం. అలా కాదని దానంగ, కాని ధర్మముగ, గాని తాను ఇతురులకి ఇచ్చినవి. ఎంతమందికి చెబితాడో ఎంతమంది విని సంతోషించారో? అంతమందికి తాను చేసిన దానమో ధర్మమమో ద్వారా వొచ్చిన పుణ్యఫలంలో నాల్గోవొంతు వారంతా పొందినవారవుతరని శాస్త్రనిర్దేశం. అయినప్పటికి. ఆ జగదంబ కృపతో నేనిచ్చిన కొద్దిపాటి దానవిశేషాలన్నిటిని మీ అందరికి తెల్పటంలోని ఆంతర్యం. నాకు ఏ విషయం గూర్చైన సరే సవివరణగ సోదాహరణలతో చెప్పడం అలవాటు. మరి అత్యంత పవిత్రతరమైన క్షీరాబ్ధిద్వాదశినాడు ఆచరించవలసిన దాన ధర్మాలగూర్చి సోదాహరణగ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎవరు యథోక్తముగ కాకపోయిన కనీసం యథాశక్తిమేరకైన దాన,ధర్మాలు విధిని అనుసరించి ఆయా పర్వదినాలలో ఏమేమి చేయాలో తెల్సుకొని ఆచరించేవారు తారసిల్లకపోవటంతో. నాకొచ్చే పుణ్యఫలం తగ్గుతందని తెలిసి ఉండికూడా కేవలం మన మహర్షులచే ఆర్షగ్రంధాలలో నిర్దేశింపబడిన పర్వములను పండగల పేరుతో విందు,వినోదాలకో విలాసాలకో మాత్రమేకాదు. ముక్తికొరకై ఇలా స్నాన,దాన,పూజా కార్యక్రమాలని ఆచరిస్తున్నవారు ఇంకా ఉన్నారని. (ఏనుగులు నడిచిన దోవలో ఎర్రచీమలైన నడుస్తున్నాయనే) భావన ప్రఢవిల్లాలనే సదుద్దేశ్యంతో మాత్రమే పై విషయాలన్నిటిని ప్రస్తావించానే కాని నా స్వోత్కర్షకు మాత్రంకాదని సహృదయులైన మీ అందరికీ సవినయముగ మనవి చేయుచున్నాను.
స్వస్తి.
నారాయణభట్ల చైతన్య.
చైతన్యగారికి ధన్యవాదములు.
జైహింద్.

18, నవంబర్ 2018, ఆదివారం

అనంతకృష్ణుల వాక్ గంగా ప్రవాహము.

1 comments

జైశ్రీరామ్.

ఆర్యులకు శుభోదయమ్.
 బ్రహ్మశ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు.(నారద పురాణాంతర్గత గంగా మాహాత్మ్యం పై నాలుగు మాటలు అమ్మదయతో) 
అమ్మల గన్నయమ్మయె యనంతునిలోఁ గనిపించుచుండె నా
యమ్మయె మిమ్ము మమ్ము జగమంతనుఁ బ్రోచు శుభాళిఁ గొల్పుచున్.
నెమ్మనమందు మాతను పునీతులనంతులు నిల్పినట్లుగా
సమ్మతితోడ నిల్పిన ప్రశాంతతనొప్పగవచ్చు సజ్జనుల్.
ఆ అమ్మదయ మన అనంతకృష్ణులకనవరతము లభించుఁ గాక.
శుభమస్తు.
జైహింద్.

17, నవంబర్ 2018, శనివారం

శ్రీయాజ్ఞవల్క్య శతకము. రచన. చింతా రామకృష్ణారావు.

1 comments

             
జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
మహితులమధ్య మెల్గుటను మాన్యతకేనును నోచుకొంటి. నా
కహరహమున్ శుభావళులనంతము కల్గుట మీ కటాక్షమే.
మహితులు నాగురూత్తములు మాన్యులు రాఘవు దీవనల్ ననున్
మహితుల చేత సత్కృతులమందముదంబున పొందఁజేసెనే.
మీ అందరి ప్రేమకు పాత్రుఁడనగునట్లు చేసిన ఆ పరమాత్మ వేదాంతవేద్యుల మధ్య సత్కృతుని చేయుచున్నాడు.
నాపై అవ్యాజానురాగమును చూపు మీ అందరికీ నా కైమోడ్పులు.
జైశ్రీమన్నారాయణ.
శ్రీ యాజ్ఞవల్క్యపరిషత్ భీమవరంలో ౧౮ - ౧౧ - ౨౦౧౮ ని సత్కరించుచున్న సందర్భముగా నేను వ్రాసిన శతకము.  
జైశ్రీమన్నారాయణ.
శ్రీయాజ్ఞవల్క్య శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.

  1.ఉ. శ్రీ వనజాప్త లబ్ధ వర చిన్మయ వేద నిధాన! నిత్యమున్
దేవ సుపూజితాద్యుఁడగు దివ్య వినాయకునాత్మనెంచి, నిన్
భావన చేసి యీ శతక భర్తగ, నే విరచింతు నీపయిన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  2.  ఉ. భూవలయంబులో సుజన పూజిత దివ్య పదారవిందయౌ,
భావనలోన మెల్గు వరవాణికి, పుస్తక రమ్యపాణికిన్,
శ్రీవనజాత సంభవుని చిన్ముఖ వాసినికంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  3. ఉ. జీవనమిచ్చినట్టి రఘు చిన్మయ వేంకట వీర సద్గురున్,
భావన చేసి నా మదిని, భక్తిసమన్వితునై భజించుచున్
దీవనలీయఁ గోరుదును దివ్యముగా విరచింపదీనినో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  4. ఉ. దేవులకెల్ల దేవుఁడును, దీనజనావన దీక్షితుండు, స
జ్జీవన మార్గదర్శకుఁడు, శ్రీకర కృష్ణుఁడు, వానినెన్నుచున్
బ్రోవఁగ గోరుచున్ మదిని పూజ్య పదంబుల కంజలింతు నో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  5. ఉ. జీవన భాగ్య హేతువయి, సృష్టికి మూలమునై యహర్నిశల్
భావనకైన చిక్కని ప్రభా నిలయుండగు భాస్కరుండు సం
భావితమూర్తియై పగలు వర్ధిలు. వానికినంజలింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  6. చ. అవనిని కాణ్వ శాఖను మహాత్ములనేకులు జ్ఞాన తేజులై
ప్రవిమలకీర్తిఁ గొల్పిరి. పరాత్పర సన్నిభులెల్లరున్ గనన్.
భువిననురాగయుక్తులగు పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  7. చ. శ్రవణ కుతూహలమ్ముగ, ప్రశంసలనందెడు రీతి వేదమున్
సువిదిత రీతి చెప్పఁగల శోభనమూర్తులు వేద పండితుల్
భువిని వశించు భాస్కరులు. పూజ్యులు. వారలకంజలింతునో
ధృవసమ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  8. ఉ. భావన చేత , మాటలను, పట్టుగ చేసెడి చేతలన్ సదా
ధీవరులెన్న నొక్కటిగ తీరుగ చేసెడి దివ్యమూర్తులన్
సేవలు నీకు చేయు శుభ చిత్తులకేను నమస్కరింతునో
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  9. ఉ. భావిని చూచి చెప్పెడి ప్రభావము కల్గిన కాణ్వశాఖ రా
జీవ మహాత్ములన్ దలచి చేసెద వారికి వందనంబులన్.
శ్రీవరణీయులై చెలఁగు చిన్మయమూర్తులకీవె తోడుగా.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

10. చ. శ్రవణ కుతూహలమ్మయిన చక్కని కావ్యములల్లు సత్కవుల్
భువిని వసింతురందుఁ గల పూజ్యులలోపల కాణ్వ శాఖజుల్
ప్రవరులుగా గణింపఁబడు వారిని కల్గెడి దివ్యమైన భా
తివి కన యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

11. చ. కలియుగమందు పుట్టుటను కానిపనుల్ పచరించుచుంటిమే,
తెలియకపోవుటన్. కృపను తీరుగ మా మదులందు జ్ఞానమున్
బలముగ పొందఁగా వలయు. భవ్యుడ! సన్నుత దివ్యమార్గమున్
దెలుపుము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

12. చ. పరిపరి వేడెదన్. సుగుణ వర్ధన చేసెడి సత్కవిత్వమున్
నిరుపమ మార్గమందు వరణీయముగా నెలకొల్పుమయ్య. నన్
గరుణను చూడుమయ్య. గురుగౌరవ తేజములిమ్ము నాకు సు
స్థిరముగ, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

13. చ. అతులిత తేజసంబు పరమాద్భుత రీతిని నిన్ను చేర, సం
స్తుతులను ముంచెనీజగతి శోభిలుచుండెడి నిన్నుఁగాంచి, యే
గతిని వహించె నిన్ ప్రభలు? కాంచఁగ మాకును చూపుమయ్య. వం
దిత పద! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

14. చ. క్షితిని మహాత్ములెల్లరును శిక్షణనిచ్చెడి సద్గురూత్తముల్.
సతతము వారి వర్తనము చక్కఁగనెంచి గ్రహించువారు స
న్నుతమతులై రహించెదరనూనగతిన్. మరి నాకు కూడ యా
ధృతినిడు, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

15. చ. సుజనులె నీదు మార్గమున శోభిల వర్తిలనేర్తురయ్య స
ద్విజయము కాంచగా వలచి. విజ్ఞులు వారలు. నన్ను నీవు నీ
విజయ పథమ్మునన్ నడిపి విజ్ఞతతోడ వశింపఁ జేయుమా.
ద్విజవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

16. చ. వెతలు భరించ లేక ప్రభవించెడు దుర్గతులాప నేరమిన్
క్షితిని కృశించుచుండిరి విశిష్టమహాత్ములె. శక్తి హీనులై.
బ్రతుకఁగ దివ్య మార్గమును, బాధలఁ గెల్చెడి
శక్తినిమ్ము బా
ధితులకు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

17. చ. క్షణమున భంగురంబటుల కాలము గర్భము జొచ్చు పృథ్విపై
గుణగణులాదిశాఖజులు కూర్ముని తప్ప యిహంబు కోరరీ
ధనములు రత్నహారములు ధర్మపరిగ్రహులైన వీరికిన్
తృణమయ! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

18. ఉ. శ్రీవర తేజులౌ ప్రథమచిద్వర శాఖజులైనవారికిన్
దీవన లీయ వేడెదను. దీనులనెల్లెడ కావ వేడెదన్.
భావజ న్యూనతన్ దుడిచి భాస్కర తేజము గొల్పఁ గోరెదన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

19. ఉ. భావి తరంబులన్ సుగతి వర్ధిలఁ జేయు మహాత్ములెందరో
మీ వరణీయ తేజమును మీ మహనీయతలన్ స్మరించు. సం
సేవలఁ దేల్చు మిమ్ములను . చిత్తమునన్ స్మరియింతు వారలన్.
ధీవర! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

20. చ. వలయునదేది దుర్గతిని బాయఁగ నెంచిన మానవాళికిన్?
ఫలములనెట్లు వీడనగు పాపము పుణ్యము చేయువారికిన్?
మెలకువ కొల్పు మాకు, గుణమేదుర. సత్పరివర్ధకంబు కాన్
దెలుపుము! యాజ్ఞవల్క్యగురుదేవర!
శ్రీకర! జ్ఞాన భాస్కరా!

21. చ. ద్విజులను పేరుఁగన్న యిలవేల్పులు కాణ్వ మహత్వ శాఖజుల్.
ప్రజలకు మేలు చేయుచు, వరంబువనిచ్చెడి భవ్యమూర్తులున్.
నిజమగు నీదు శక్తిని గణించుటచేతనె గణ్యులైరయా.
ద్విజ నుత! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

22. చ. శరణుగురూత్తమా! మనసు చంచలమౌచు జగత్ప్రకాశకున్
హరిని కనంగనీదు. దురహంకృతి చీకటి క్రమ్మఁ జేయు. భా
సురమగు సత్యమున్ గనఁగ చూపుమయా మహనీయమైనదౌ
తెరవును, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

23. చ. పగలును రాత్రియున్ విడని పాపము గొల్పెడి దుష్ప్రవృత్తులే
జగతిని కన్నులం బడు. నిజంబిది దుర్మతిఁ పెంచు మాకు నే
ప్రగతియులేక చింతిలెడివారము. నీవిక
పాపుమయ్య మా
దిగులును. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

24. చ. దినపతి ధర్మ బద్ధుఁడయి తీరుగనాకసవీధిలోననే
యనిశము సంచరించు. మనయందు తదద్భుత శక్తిఁ గొల్పడే.
జనులును ధర్మబద్ధులయి చక్కఁగనుండఁగ చేయఁగల్గఁడే
దినమణి?  యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

25. ఉ. భూజనులందు సద్గుణ సుపూజ్యులు కణ్వ ప్రశంస శాఖజుల్.
రాజిలు శక్తి కోల్పడి పరాజయ మార్గము పట్టనీకుమా.
నీ జయ శీలమెన్ని పరిణీతులవన్ తగ నీవు కొల్పుము
త్తేజము. యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

26. చ. సుమధుర భాషణంబున వసుంధర నుండిన పండితావళిన్
సములను గెల్చి శాస్త్ర విలసన్నుత పాండితి చూపితీవు. నీ
మమునను మమ్ము నిల్పుమిక మాకనుమానములెంచి పాపుమీ
తిమిరము  యాజ్ఞవల్క్య.గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

27. చ. కలతలు కల్మషంబులును గాఢతరాంధము నన్ను క్రమ్ముటన్
తెలియుట నేర్వనైతిని మదిన్ గల నీశ్వరు సత్ప్రకాశునిన్.
కలుషము బాపి ప్రోవుమయ. కాంచఁగనొప్పెడి ముక్త మార్గమున్
దెలుపుము. యాజ్ఞవల్క్య.గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

28. ఉ. లోక వినాశ కారకులు, లుబ్ధులు, దుర్నయపాలకుల్ భువిన్
మాకహితుల్. దురాత్ములను మట్టును బెట్టఁగ శక్తి చాలదే.
భీకరులైన వారలను పీచమడంచఁగ మాకు  కొల్పుమా
తేకువ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

29. ఉ. సంపదలెన్ని కల్గినను సంతసమన్నది కల్గకుంట, ఘో
రంపు దురాగతంబులు నిరంతరమున్ పచరించు కోర్కె, మా
కింపుగనెంచలేము. మదులెట్టులమార్చుకొనంగనౌను? బో
ధింపుమ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

30. ఉ. విద్యలనేకముల్ కలుఁగు విశ్వమునందున, వేదవిద్యలే
వేద్యము కాకపోవుటను వేల్పుల మార్గము వీడి నేడు పల్
విద్యలు నేర్వ, జీవనము భీతిగ సాగుచునుండె. నేర్పు స
ద్విద్యను.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

31. ఉ. ధీరత, సత్య సంధత, విధేయత, సౌమ్యత, వాఙ్మనోజ్ఞతన్,
భారత జాతిలో ప్రబలి భవ్యముగా వెలుగొంద కోరుదున్.
మీరలె తీర్చగావలయు. మీరలె తీర్చకయున్న కోరికల్
తీరునె? యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

32. ఉ. దానగుణాభిరాములగు ధార్మికులొప్పగనుండుటన్ భువిన్
దీనజనాళి జీవనము తీయగ సాగగ మార్గమేర్పడెన్.
జ్ఞానులనుద్దరించు నిను గాంచుట భాగ్యము. దేవదేవ!  వం
దే నుత యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

33. ఉ. శ్రేయము సర్వజీవులకు చిత్తము పొంగ రచింపఁ గోరుదున్.
న్యాయమునెల్లవారును సమాదరణంబునఁ జూడఁగోరుదున్.
నీ యనురాగమెన్న, మహనీయ! కనుంగొని
తీర్చుమయ్య మా
ధ్యేయము. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

34. ఉ. కష్ట సముద్రమున్ గడప, కల్పిత దుర్గతిఁ బాపఁ జేయ, మా
యిష్టములెల్ల తీర్చగ, మహేశుననుగ్రహమందఁజేయ, సం
తుష్టిని గొల్పి మాకు సుగతుల్ రచియింపగ నీవు పెట్టుమా
దృష్టిని, యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

35. ఉ. విప్రవరేణ్యులన్ గనిన విశ్వమనోజ్ఞ వివేకమబ్బు నా
విప్రుల తోడ భాషణము విజ్ఞతఁ గొల్పును శక్తిఁగొల్పుచున్.
సుప్రతిభాస్పదంబగును. శోభిలఁ గొల్పును సత్యపూర్ణమౌ
ధీప్రభ. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

36. ఉ. లెక్కకు మించి ముష్కరులు లీలగ దుష్కృతముల్ ఘటింతు రే
ప్రక్కను గన్న వారలె. ప్రపన్నులఁ గావగలారు లేరు. నీ
వొక్కడవే దురాత్మకులనుక్కడగించి జనాళీఁ బ్రోచు మా
దిక్కువు యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

37. ఉ. సంతసమెల్ల వేళలను చక్కగ నుండఁగ మాకు చేయు మీ
వింత యొనర్చినన్ నిరతమేము శుభాస్పద కార్యదీక్షతో
శాంతిని నింపనేర్తుమిల. చక్కఁగ సంతస మీయ నిన్నుఁ బ్రా
ర్థింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

38. చ. స్మృతిని వచించితీవు పరిసేవ్య శుభావహ ధర్మ వర్తనల్.
బ్రతుకుటె భారమౌటను సభక్తిగ నీకు నమస్కరించి యా
స్మృతులు పఠించలేము. పరీశీలన చేయుము. మార్చుమయ్య మా
స్థితినిక. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

39. ఉ. గుప్తములయ్య వేదములు. కోవిదపాళి గ్రహింపనౌను. సం
క్షిప్త పదార్థ భావములు చెప్పిన మేము గ్రహింతుమయ్య. మా
ప్రాప్తమదేమొ చెప్పరయ. భాగ్యవిధాతవు నీవె చెప్పుసం
తృప్తిగ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

40.  ఉ. పంతము మాని, నీ స్మృతిని బాగుగనందరెఱుంగునట్లు, ర
వ్వంత కృపావహుండవయి ప్రస్ఫుటరీతి గ్రహింప చెప్పుమా.
సాంతము నీవు నేర్పిన. ప్రశాంతము లోకమునెల్ల చోట్ల సా
ధింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

41. ఉ. భీమవరంబునందునిల పేరును గాంచిన కాణ్వ శాఖజుల్
నీ మహనీయ జన్మదిన నిస్తుల భవ్యమహోత్సవంబు ని
ష్కామముతోడచేయు. శుభకర్ముల బాధ్యత భక్త బంధు నీ
దే మరి యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

42. ఉ. అప్రతిమాన పండిత మహాత్ములు కల్గిరి కాణ్వ శాఖలో.
నీ ప్రతిభా విశేషము, మనీషయునెల్లెడ చాటువారలే.
విప్రకులోత్తముల్ ప్రబల వెల్గఁగజేయుమ వారిలోపలన్
ధీప్రభ యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

43. చ. వ్రతములు, యజ్ఞముల్, సతము రమ్యముగా పచరించు దీక్షితుల్
వెతలను తాళఁ జాలరయ. వేగమె నీవు గ్రహించి వారికిన్
సతతము సంఘమందు ఘన సత్కృకతులొప్పగ కొల్పుమా సమా
దృతినిల యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

44. ఉ. కష్టములన్ భరించుచు ప్రకాశ మనంబున మెల్గు నైపుణిన్,
దృష్టి మరల్చకుండ వినుతించుచు నిన్ గను శక్తియుక్తులన్,
శ్రేష్టుల సంగతిన్ గొలుపు శ్రేష్టతనొప్ప మనోజ్ఞమౌ మహ
ధ్దృష్టిని, యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

45. ఉ. వేగిరపాటు చేత ప్రభవించునయాచిత దుర్నిమిత్తముల్.
సాగెడి జీవితంబున ప్రశాంతి రయంబగు దానిచేతనే.
నా గతి మార్చుమయ్య కరుణన్ ననుఁగాంచుమ. నీవు పాపుము
ద్వేగము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

46. ఉ. ఇద్ధర దుర్జనార్ణవమయెన్ దురపిల్లఁగ సజ్జనాళి. సం
బద్ధము లేని చట్టములు. పాపపు చింతన మృగ్యమాయె. నీ
విద్ధరనుద్ధరింప గుణవృద్ధిని చేయుము. పెంచుమింక స
ద్వృద్ధిని  యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

47. ఉ. మూలము నీవు పూజ్యగుణముల్ మము చేరుట కెల్ల వేళలన్.
మేలును గొల్పు సద్గుణము మేము గ్రహింపఁగ శక్తినీమ్ము. నీ
మ్రోల నమస్కరించు గుణమున్ దయచేయుము.  కొల్పుమయ్య  స
చ్చీలము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

48. ఉ. సంతసమున్ సతంబు మనసారగ మాకు ననుగ్రహించుమా
శాంతిగ నుండ సజ్జనుల సంగతినొప్పి, శుభప్రదంబుగా
చింతలఁ బారఁద్రోలుచు ప్రసిద్ధిగ మంచిగ దేనినైన  సా
ధింతుము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

49. ఉ. నవ్యత పేరునన్ యువత నాగరికంబను హీన సంస్కృతిన్.
సవ్యమునేవగించుకొను. సద్గుణమన్న గ్రహింపనోపరే.
నవ్య సమాజమెన్నఁగననంతుని సేవలు తెల్పుమయ్య. ఓ
దివ్యుఁడ! యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

50. ఉ. సంపదలెల్ల మాయు. విలసన్నుత దైవమె నిల్చు నిత్యమున్
సొంపులశాశ్వతంబు.  గుణశుద్ధియె శాశ్వత కీర్తి మూలమౌన్.
భ్రాంతిని వీడ సత్ ప్రభలు భక్తిగ కాంచఁగ మార్గమీవు బో
ధింపుము. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

51. ఉ. జ్ఞానవిదూర మానసము కాల్చుచునుండు హృదంతరాళమున్.
హీన దురంత దుస్థితి యహీనగతిన్ మము చుట్టిముట్టు. స
మ్మానముతోడ మమ్ముగనుమా. మదినుండియె పాపుమా మహ
ద్దీనత.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

52. ఉ. నీతిని నమ్మి లోకముననేక పరాభవ కీలలందు వి
ఖ్యాతియె భస్మమై, తుదకు కాలిన కట్టె తెరంగునుండు వి
ఖ్యాతులకాత్మధైర్యమిడు. కాంచుము. మాపుము వారిలో మహ
ద్భీతిని.యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

53. ఉ. ఆశలకంతులేదు. కలహాల భయంబు కనంగ లేదు. పే
రాశలఁ జిక్కుచుండి అడియాసలెదుర్కొను మానవాళికిన్
శ్రీశునిపై మనంబునిడ చిత్తము పొంగగ నీయుమయ్య సం
దేశము. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

54. ఉ. జ్ఞప్తికి రాడు మాధవుఁడు కామితముల్ నెరవేరుచున్నచో.
గుప్తముగా హృదబ్జమను కోవెలనుండెడి వానిఁ గాంచరే!
సుప్త మనస్థితిన్ దరిమి. చూపుము దేవుని. కొల్పుమయ్య సం
తృప్తిని యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

55. ఉ. అప్పుల బాధలన్ బడుట నాత్మకు శాంతి సుదూరమౌటచే
నిప్పులపై చరించినటు నిత్యము చింతిలు దీన మానవుల్
ముప్పునెదుర్కొనున్. కనుక పూజ్యుఁడ ప్రోవఁగ నెంచి, చూడు మా
తిప్పలు యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

56. ఉ. ప్రాణమదెట్టులుండు? కనరాని మహాద్భుత శక్తియా? లస
న్మౌనము దాల్చి తాపసులు మంచిగ కాంచఁగఁ గల్గుదేని? నే
దీనుఁడనెట్టులిద్ది కనితీరుదు? తృప్తిగనిమ్మి నాకు నీ
ధీనిధి. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

57. ఉ. శ్రేయము గొల్పు సద్గుణము, క్షేమము గొల్పెడి మంచి బుద్ధియున్,
న్యాయమనోజ్ఞ వర్తనము, నైతిక వాగ్ఝరి మాకుఁ గొల్పుమా.
సాయము చేయుబూనితివొ చక్కగ నీవికఁ గొల్పు నాకున
స్తేయము.  యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

58. ఉ. చాలము మాటపైనిలువఁ జాలము నమ్మగ దైవమొక్కనిన్.
జాలము పాపముల్ విడువ, చాలము నిన్గన జ్ఞాన నేత్రమున్.
చాలుదుమేము బోధనలు చాలఁగ చేయఁగ. కాంచఁ జెప్పుటే
తేలిక. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

59. ఉ. కోరికలన్ త్యజించుటయు, కుత్సితభావవివర్జితంబు, సం
సారమహాంబుధిన్ చెలఁగి సత్యవిదూరము కాకయుంట, ని
స్సారము వీడి సారమును చక్కఁగ పట్టిన ముక్తి ప్రాప్తమై
తీరును యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

60. ఉ. మోహమదేలఁ గొల్పె విధి? మోహమె ముక్తికి మార్గమైన స
మ్మోహమదేల కల్గునిల? మోహము క్రోధము కామమున్ వినా
యైహికముండదే. పరమునందుటదెట్టలు? దేహమెన్న సం
దేహము యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

61. ఉ. అక్షయ వేదమెన్ని పరమాద్భుతరీతిని భాస్కరుండు సత్
శిక్షణనీయ నీకు వికశించితివందున సాటి లేనటుల్.
మోక్ష ఫల ప్రదుండ! కయిమోడ్పులు చేసెద  దివ్యమైన నీ
దీక్షకు. యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

  62. ఉ. జ్ఞానమనంతమంచు నినుఁ గన్న మహాత్ములకర్థమౌనటుల్
మానిత పండితాళికడ మాటలచే విజయంబు పొందితే.
మౌనము వీడి నీ జనుల మంచిని చూడుము ముక్తి చూపుచున్
ధీనుత! యాజ్ఞవల్క్య. గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

63. ఉ. ముక్తికి జీవితాన ననుభూతినినొసంగెడి దివ్య కల్పనా
శక్తికి, మంచి మార్గమును చాలఁగ చూపిన దివ్యమైన నీ
యుక్తికి, సన్నుతుల్. సుగుణ యుక్తుఁడ! నీప్రభ చేరెనయ్య యా
దిక్తటి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

64. ఉ. ఒప్పరికించినన్ సకలమోడుదుమయ్య, శుభాళి దూరమౌ
నెప్పటికప్పుడే జరుగు నేదిశుభంబసుభంబొతెల్పుచున్
ముప్పుఘటిల్లకుండ మము బ్రోవుము. బ్రోవకయున్నచో నినున్
దెప్పరె? యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

65. ఉ. అధ్యయనంబు చేయుతరినంతము లేని సుఖోపభోగులై
విద్యలు నేర్వఁజాలక, నివృత్తిఁ గనుంగొనలేనివారలన్
విద్యల తల్లి మెచ్చునెటు? వేల్పువు నీవయి కొల్పుమయ్య  స
ద్విద్యలు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

66. ఉ. చింతయె లేని జీవనము సిద్ధిని పొందఁగ మార్గమౌను. ని
శ్చింతగ శ్రీహరిన్ మదిని చేర్చి నిరంతర సేవలన్ సదా
భ్రాంతిని చేయగానగును. పాపఁగ చింతలనెల్ల నిన్ను ప్రా
ర్థించెద యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

67. ఉ. సంచిత పాప కర్మ చెరసాలగ చేయును జీవితమ్మునే.
కుంచిత చిత్తమున్ నడువకూడని దుర్గతినాశ్రయింతుమే.
కాంచవొ నీవు. మమ్ములను కావక చూచుచు మమ్ము పట్టి వే
ధించకు యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

68. ఉ. భారము నీది. నీ సుగుణ భారము మాకును పంచి కావఁగా.
కారణమీవెఱుంగుదువు. కాణ్వ జనావళి గౌరవార్థమై
తీరును వీడనీక కడతేర్చగ మమ్ములఁ, గోరుచుంటి మీ
ధీరహి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

69. ఉ. కష్టము మాకు సద్గుణ వికాసముతో చరియింప నిచ్చలున్.
నష్టము గొల్పు నైహికమె నచ్చుచునుండు జగంబునందు. నీ
దృష్టిని మాపయిన్ నిలిపి తీరుగనుండ మరల్చుమయ్య మా
దృష్టిని. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

70. ఉ. భావితరాలలో ప్రతిభ వర్ధిలఁ జేసెడి శక్తినిమ్ము. సం
భావిత మూర్తులై చెలఁగు భాతిని గొల్పెడి యుక్తినిమ్ము. నీ
దీవనలాత్మశక్తినిడు. దీవనలిచ్చుచు మాకు కొల్పుమో
ధీవర యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

71. చ. ఘనమగు సంహితన్ రవి సుఖంబుగ నీకు ననుగ్రహించెనా.
క్షణమును నిల్వజాలకయు చక్కఁగ చేసెన పాఠనంబు. నీ
వనుపమరీతి నేర్చుటను భవ్య ఫలప్రదుడయ్యె నీకు నా
దినపతి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

72. ఉ. జ్ఞాన నిధానమీవు. వరగణ్యుల లోపల గణ్యుఁడీవు. వా
దైన యనంత వేదముల తత్వమెఱింగితివీవు. నీవికన్
మౌనము వీడి, నీజనుల మాన్యతనిల్పఁగ హెచ్చరింపుమో
ధీనిధి యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

73. ఉ. అప్పులు చేయనొప్పని మహాత్ములు నీ వర శాఖ భూసురుల్
తప్పులు చేయనొప్పరు. యదార్థమునందు చరించు ధీనిధుల్.
తప్పఁగఁ జేయు వారి పరితాపము, దుర్విధిఁ  గల్గుచున్న యా
తిప్పలు, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

74. ఉ. న్యాయము తప్పనేరరు. సనాథులనాథులు కాణ్వ శాఖజుల్.
ధ్యేయముతోడ వర్తిలెడి ధీవరులెల్లరు. చూడు వీరికిన్
న్యాయము చేయుమెల్లెడల, నార్తిని చేయుము జీవితాలనే
దీయగ. యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

75. ఉ. చక్కఁగ నీదెయౌ ప్రథమశాఖను పుట్టినవారలందరున్
నిక్కము నిన్నె నమ్మిరయ. నేరరు దుర్వ్యవహారముల్
ధరన్.
మక్కవతోడ నిన్గొలుచు మాన్యులుపల్కుదురయ్య నీవె మా
దిక్కని. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

76. ఉ. మురియుచు నీదు జన్మదినమున్ పరమాద్భుత భావనన్ దగన్
నిరుపమ రీతిలో జరుపు నీ ప్రియ భక్తులు నేర్పుమీరఁగా.
ధరణిని నీవె మాకనెడి ధార్మికవర్యుల మానసంబికన్
దిరుగదు. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

77. ఉ. మాకు శుభాస్పదంబయిన మంచిని గొల్పి చరింపజేయుచున్,
శ్రీకరమైన జీవనము,  చిన్మయతేజసమొప్పఁగూర్చుచున్,
లోకహితంబు చేయగ విలోకన చేయుము. భారమెల్ల నీ
దేకద. యాజ్ఞవల్క్యగురుదేవర! శ్రీకర! జ్ఞాన భాస్కరా!

78. ఉ. సుతులని, పత్నియంచు, ధనశోభయటంచు మనంబునెంచి, సం
స్తుతమగు పారలౌకికము త్రోసి యిహంబునె చిక్కియుండు మా
కతులిత జ్ఞానమున్ గొలిపి యాదరమొప్పఁగ పాపు మీషణ
త్రితయము. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర భాస్కరా!

79. ఉ. దీనదయాపరుండవు. మదిన్ నిను దల్చిన మాత్రమే కృపన్
ప్రాణసమాన దైవమయి రక్షణఁ గొల్పఁగనెంతువీవు. మా
దీనతఁ బాపి యోగ్యత మదిన్ కలిగింపఁగ భారమింక నీ
దేనయ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర భాస్కరా!

80. చ. పరులకు హానిలేని నిరపాయ మహోన్నత భావపూర్ణమై
పరఁగునుపాయమున్ గొలిపి పాపపు కూపము బాపి రక్షణన్
నిరుపమ! కొల్పుమా సతము నిర్మల జీవన మార్గమింక సు
స్థిరముగ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర భాస్కరా!

81. ఉ. విస్మయమిద్ది. లోక హిత విస్తృత ధర్మ పథంబు చూపు రో
చిష్మతి, జ్ఞాన భాసురము. చిన్మయ తేజవివర్ధనాక్షయం
బై, స్మృతులందు గొప్పదయి వర్ధిలు నేటికి కూడ నీదు భా
తి స్మృతి యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర భాస్కరా!

82. ఉ. శాంతము, సౌఖ్యమున్, సుజన సన్నుత సద్గుణమున్, మహత్వమున్,
దాంతియు, సత్య సంధతయు, తత్వవివేకము, ధైర్య సంపదన్
సాంతము మాకుఁ గొల్పి మము చక్కఁగ చూడమటంచు నిన్ను  ప్రా
ర్థింతును యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

83. ఉ. నిక్కము, సద్గురుల్ కనుచు నిన్ను కనంగను చేయనెంతురే.
అక్కజమిద్ది. నీ ప్రతిభ నందరు సద్గురులందుకొంట. మా
మక్కువ తీర నిన్గన, సమస్త వివేకము గొల్పుదీవె మా
దిక్కయి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

84. చ. అతులిత దుఃఖ హేతువులనంతముగా మము క్రమ్ముచుండుటన్
క్షితి ధృతి హీనతన్ బ్రతుకుకే తుది కోరక తప్పదయ్య. సం
స్తుత సుఖమీయుమయ్య. కృపతోడను మాకిల  కొల్పుమా మహ
ద్ధృతినిక, యాజ్ఞవల్క్య
గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

85. ఉ. పాపపుకూపమీజగతి. పాపులకాకరువౌట కాంచవో?
శాపమిటన్ జనించుటని సాత్వికులెల్లడ బాధ చెందుటన్
నీ పని కాదొ కాంచుట? మనీషులనెల్లెడ కావరామ్మయా.
దీపిత యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

86. చ. వ్రతముల, నోములన్ గనఁగ వశ్యముకాదయ సత్య తేజమున్.
స్తుతమతివైన నీ స్మృతులె చూపఁగ నేర్చును సత్య రూపమున్.
క్షితిని వసించువారలకు క్షేమము గూర్చఁగ నీవిటన్మహ
త్కృతివయ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

87. ఉ. పూజలతోన సద్గురుని ముందుగ తృప్తులఁ జేసి, విద్య వి
భ్రాజులు నేర్వ నేర్చెదరు. భాస్కర తేజము వారికబ్బెడున్.
భూజనులందు బ్రాహ్మణులు పుణ్యవిదూరులకబ్బునయ్య ని
స్తేజము. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

88. ఉ. రాజిలు కాణ్వశాఖజుల రమ్య మనోజ్ఞ విధానమెన్నునీ
భూజనులెల్ల. వింతయిది పూజ్యులు వేదవిదాంవరాళియున్
రాజిల శాఖనొప్పిరి. వరంబుగ నిల్చెను వీరిలోన నీ
తేజమె యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

89. ఉ. దేశ విదేశ వాసులగు దివ్యులలో భవదీయ శాఖ వా
రాశగ నీ మహత్వము సమాదరలీల ప్రసిద్ధి గొల్పువా
రీశుఁడు కూడ మెచ్చునటులెల్లెడనుందురిదెల్ల  నీదు సం
దేశమొ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

90. ఉ. వేదము శుక్ల భాసితము. వేదవిదుల్ వర కాణ్వశాఖలో
సాదర చిత్త భాసితులు. సంస్తవనీయులు పండితాళి. స
ద్బోధను గొల్ప నీ స్మృతి, ప్రపూజితులైరిలవీరు. వీరు  నీ
దీధితి, యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

91. ఉ. అల్పులమయ్య. నీ ప్రతిభనర్థముచేసుకొనంగలేము. నిన్
నిల్పగలేము మా మదుల నిత్యము నిర్మల భావముంచి. సం
కల్పబలంబు లేదు. గతి గానగ లేమయ. సత్య మార్గమున్
దెల్పుము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

92. ఉ. ఉల్లమునందు శాంతము, సమున్నత సద్గుణ సద్విభాసమున్,
చల్లని మానసంబును, ప్రశస్త మనోజ్ఞ కవిత్వ ధారలన్.
కాళ్ళకు శక్తినీయుమయ కాదనకుండగ
గౌరవంబు సం
ధిల్లగ యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

93. ఉ. సూక్తి సుధాస్మృతి వసుంధర నందరు నేర్చి సర్వదా
భక్తి ప్రపత్తులం గలిగి భావన చేసి పఠించుచుండినన్
సూక్తుల సంతచే మిగుల శోభిలుటన్ గని  మారు మ్రోగు నా
దిక్తటి యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

94. ఉ. అర్చన చేయఁ జేయుము మహాత్మ త్వదీయపదాంబుజంబులన్.
కూర్చుము భక్తి తత్పరత కూరిమితోడ మదాత్మలో. కృపం
జేర్చుము మమ్మునీకడకు. శ్రీకర! బంధుర సందియంబులన్
తీర్చుమ. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

95. ఉ. యోగముచేతనైహికము, యోగము చేత పరంబు ప్రాప్తమౌ
నీగతి కొల్పు యోగముననేక ఫలంబుల మంచి చెడ్డలన్
సాగఁగ చేయుచుండు మము. సద్గురువర్యుఁడ!
కొల్పుమయ్య స
ద్యోగము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

96. ఉ. కష్టములెల్లనొక్కటయి కాల్చుచునుండె మనంబు నక్కటా
దృష్టిని నీపయిన్నిలుప తేలిక కాదు. మహాత్మ నీవికన్
కష్టములెల్లఁ బాపి, మము కావఁగ భావనఁ జేసి పెట్టుమా
దృష్టిని. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

97. చ. సతతము నిన్స్మరించు, గుణసాంద్రులు సద్వర కాణ్వశాఖజుల్,
క్షితి నను గౌరవించుతరి చిన్మయమూర్తులకంజలించి నే
నతులితభక్తి నీశతక మంచితరీతి రచించినాడ స
త్కృతిగను యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

98. సరసుఁడు, వేదశాస్త్ర పరిషత్ ఘనపాఠియు నప్పనాఖ్యులా
పరమ పవిత్రమూర్తి నను వర్ధిలఁజేయఁగ సత్కరించుటన్
గరువము పెంచినారు.  శుభకామితముల్ నెరవేర్చు వారికా
తిరుపతి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

99.  ఉ. కనుము దయానిథీ. సుకవి కల్పకముల్ ధర మెచ్చునట్లుగా
ఘనముగ నీ జయంతిని ప్రగాఢమనమ్మున వ్రాసినాడ నీ
మనమునకెక్కనీ కృతిని. దీనిని చేఁ గొనుమయ్య. నీవె యం            .  
దిన, తగు. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

100. ఉ. శ్రావ్యముగా పఠించినను, శ్రద్ధగ దీనిని భోధ చేసినన్,
దివ్యత కొల్పి, దీప్తమగు ధీప్రభ పెంచుము వారికిద్ధరన్.
భావ్యము నీకు పాఠకుల వర్థిలఁ జేయుట. భక్తబాంధవా!
దివ్యుఁడ! యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

101. ఉ. కాణ్వ ప్రశస్త శాఖజుఁడ. కౌశిక గోత్రుఁడ. సుప్రసిద్ధ చిం
తాన్వయ రామకృష్ణుఁడ. ముదంబున నీ శతకంబు వ్రాసి, భా
తిన్వివరించి నీ మహిత తెల్పితినిందు. మహత్వ పూర్ణ! ఖ్యా
తిన్విను యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

102. ఉ. పావన యజ్ఞకర్మలనపారముగా నొనరించు యాజులీ
పావన శాఖలోఁ గలరు. వర్ధిలఁజేయుము వారినందరిన్.
జీవన భాగ్యమిమ్ము. విరచింపుము మంచిని. వారికిమ్ము నీ
దీవన. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

103. ఉ. నీదు జయంతి వేడుక మనీషులనన్య మనోజ్ఞకంబుగా
సాధు జనాళితో కలిసి చక్కఁగఁ జేయుచునుండిరేండ్లుగా
మోదముతోడ వారిఁగని పుణ్యఫలంబుగ వారికిమ్ము నీ
దీధితి. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

104. ఉ. కోరరు కాణ్వశాఖజులు కోరగరానివిహంబునందునన్.
కోరరు స్వార్థమున్ కలిగి. కోరరనన్య ధనాదికంబులన్.
చేరుచు నిన్ను కోరుదురు శక్తినొసంగుచునుండు నీదు స
త్స్మేరము. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

105. ఉ. భావమనోజ్ఞసంహితను పాఠులు సద్ఘనమందు శుక్లమం
దీవర ధాత్రిపై ప్రబలుదెవ్వరు వారలు నీదు భక్తులే.
కావుము వారినెల్లరను గౌరవమొందఁగ చేయుచుండి యో
ధీవర. యాజ్ఞవల్క్య గురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

106. ఉ. ఈ శతకంబునందుఁగల హృద్యమహూజ్వల పద్య పాళి పే
రాశగ నీవొసంగినవి. అచ్చటనచ్చట కల్గు దోషముల్
ధీశుఁడ నావి. నీ కృపను తీరుగ దోషమె భూషణంబగున్
దేశిక. యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

107. చ. మహితులకంజలుల్ రవికుమారులు, వేంకటశాస్త్రి, శ్రీ రమేష్.
మహిమను కొల్ప నాకు గుణ మాన్యుల మధ్యను సత్కరించి, నన్
విహిత స్వధర్మ బద్ధునిగ విశ్వమునన్ నిలబెట్టినారు స
ద్విహితము యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

108. ఉ. ప్రాణ సమాన! మంగళము. భక్త శుభంకర! మంగళంబయా.
జ్ఞాన నిధాన మంగళము. కల్మష దూరుఁడ! మంగళంబయా.
మానిత సద్గురూత్తముఁడ! మంగళముల్ గను మో సుధా పయో
ధీ! నుత యాజ్ఞవల్క్యగురుదేవర!  శ్రీకర! జ్ఞాన భాస్కరా!

స్వస్తి.
బుధజన విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
విళంబి. కార్తీక శుద్ధ పాడ్యమి.
08 . 11 . 2018.
జైహింద్.

16, నవంబర్ 2018, శుక్రవారం

47వ వార్షికోత్సవ ఆహ్వానము... శ్రీ శుక్లయజుర్వేద విద్యా ప్రవర్థక సమితి. భీమవరమ్.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

15, నవంబర్ 2018, గురువారం

ఆంధ్రనామశేషము - 4

1 comments

జైశ్రీరామ్.
ఆంధ్రనామశేషము - 4 - అడిదము సూరకవి (చివరిభాగం)
సీ. బిట్టు గ ట్టనఁ బెల్లు పెద్దయుఁ దద్దయు, నురవడి పరువడి యుద్దవిడియుఁ
బనివడి పదపడి బలివిడి తలకొని, నెట్టన యెంతేని నెఱి గరంబు
లలి వార కేడ్తెఱ పెలుచ వావిరి యన, నఱిముఱి యనఁ బొరిఁ బొరి యనంగ
గడుఁజాల మిగిలంగ గాటం బనంగ న, త్యంతముగ ననుట కాఖ్య లయ్యె

తే. నుడుకు సెక వెట్ట వేఁడిమి యుబ్బ యావి
యుక్క యన నొప్పు నామంబు లుష్ణమునకుఁ
దాల్మి యోరిమి సైరణ తాళుకొంట
సైఁచు టోర్చుట యనఁగను క్షాంతి పేళ్లు                (57)

టీ. బిట్టు, గట్టి, పెల్లు, పెద్దయు, తద్దయు, ఉరవడి, పరువడి, ఉద్దవిడి పా. ఉద్దపడి, పనివడి పదపడి బలివిడి, తలకొని, నెట్టన, ఎంతేని, నెఱి, కరము, లలి వారక, ఏడ్తెఱ, పెలుచ, వావిరి, అఱిముఱి, పొరిపొరి, కడు, చాల, మిగుల, గాటము - ఈ పదిహేడును అత్యంతమనుటకు పేర్లు. ఉడుకు, సెక, వెట్ట, వేడిమి, ఉబ్బ, అవి, ఉక్క - ఈఏడును ఉష్ణమునకు నామములు. తాల్మి 9రూ. తాలిమి), ఓరిమి, సైరణ, తాళుకొంట, సైచుట, ఓర్చుట - ఈ ఆరును క్షాంతికి పేర్లు.

తే. పెద్దనిద్దురఁ జెండించెఁ బిలుకుమార్చె
గీటణంచెను గుదెతాల్పు వీటి కనిచెఁ
గూలిచెను రూపుమాపెను నేలఁగలిపె
ననఁగ హతిచేసె ననుట కాఖ్యలు దనర్చు               (58)

టీ. పెద్దనిద్దుర చెందించె, పిలుకుమార్చె, గీటణంచె, గుదెతాల్పు వీటికనిచె = యమపురికి పంపెను, కూలిచె, రూపుమాపె, నేలగలిపె - ఈ ఏడును చంపె ననుటకు పేర్లు.

క. పరిచేర్ణ మయ్యె ననుటకు
వరుసన్ నామంబు లగుచు వర్తిలుచుండున్
దుఱుమయ్యెన్ బరుమయ్యెన్
నుఱుమయ్యెన్ బిండియయ్యె నుగ్గయ్యె ననన్                  (59)

టీ. తుఱుమయ్యె, పరుమయ్యె, నుఱుమయ్యె, పిండియయ్యె, నుగ్గయ్యె - ఈ అయిదును చూర్ణమయ్యె ననుటకు పేర్లు.

క. కునుకె నిదురించెఁ గూర్కెను
గనుమోడ్చె ననంగ నిద్రగనుటకు బేళ్ళౌ
గనువిచ్చె ననఁగ మేల్కొనె
ననఁగఁ బ్రభోధంబు నొందె ననుటకుఁ బేళ్ళౌ         (60)

టీ. కునికె, నిదురించె, కూర్కెను, కనుమోడ్చెను - ఈ నాల్గును నిద్రపోయెను అనుటకు పేర్లు. కనివిచ్చె, మేల్కొనె - ఈ రెండును నిద్రలేచె ననుటకు పేర్లు.

క. డులిచె వదలించె నూడ్చెను
దొలగించెన్ బాపె ననఁగ ద్రోచె ననంగ
వెలికొత్తె ననఁగ బేళ్లై
యలరున్ విఘటన మొనర్చె ననుటకు (శర్వా)              (61)

టీ. డులిచె, వదలించె, ఊడ్చె, తొలగించె, పాపె, త్రోచె, వెలికొత్తె _ ఈ ఏడును విఘటన మొనర్చె ననుటకు పేర్లు.

క. పొలయలుక యనఁగ నెయ్యపు
టలుక యనం బ్రణయకలహ మలరారుఁ గుచం
బుల కొప్పు నామములు గు
బ్బలనంగాఁ జన్ను లనఁగఁ బాలిండ్లనఁగన్            (62)

టీ. పొలయలుక, నెయ్యపుటలుక (నెయ్యము+అలుక- నెయ్యపు + అలుక-నెయ్యపుటలుక) - ఈ రెండును ప్రణయకలహమునకు నామములు. గుబ్బలు, చన్నులు పాలిండ్లు (పాలు+ఇండ్లు = పాలుండుచోట్లు) - ఈ మూడును కుచములకు నామములు.

తే. చౌటిమున్నీ రనఁగ నుప్పు సంద్రమనఁగ
రాజిలుచు నుండు లవణవారాశి పేళ్లు
కాలు వన బట్టె యనఁగను జా లనంగఁ
గుల్య కభిధాన మై పొల్చుఁ (గుధరనిలయ)          (63)

టీ. చౌటిమున్నీరు, ఉప్పుసముద్రము - ఈ రెండును లవణ సముద్రము పేర్లు. కాలువ, (రూ.కాల్వ) బట్టె, జాలు - ఈ మూడును కుల్యకు నామములు.

తే. పెల్లగించెను బెకలించెఁ బెఱికె ననఁగ
నాఖ్య లుత్పాటన మొనర్చె ననుట కలరు
నాహ్వయంబులు చేదించె ననుట కయ్యెఁ
జించె నన వ్రచ్చె నన వ్రక్కలించె ననఁగ           (64)

టీ. పెల్లగించె, పెకలించె, పెఱికి - ఈ మూడును ఉత్పాటన మొనర్చె ననుటకు పేర్లు. చించె, వ్రచ్చె, వ్రక్కలించె - ఈ మూడును చేదించె ననుటకు నామములు.

తే. కనుమొఱఁగె నేమఱించె నాఁగను నిగూఢ
వర్తన మొనర్చె ననుట కాహ్వయము లడరు
మొయి లన మొగు ళ్లనంగను మొనయు మబ్బు
లన ఘనంబుల కాఖ్యలై (యభ్రకేశ)                 (65)

టీ. కనుమొఱగె, ఏమరించె - ఈ రెండును నిగూఢవర్తనము చేసె ననుటకు పేర్లు. మొయిలు, మొగళ్లు, మబ్బులు - ఈ మూడును మేఘములకు నామములు.

క. పగ ఱనఁగ మార్తు రనఁగను
పగవాం డ్రనఁ బగతు రనఁగఁ బరిపంథికిఁ బే
ళ్లగు మెగ మనంగ మెక మన
మృగమునకు నభిక్య లయ్యె (మేరుశరాసా)                 (66)

టీ. పగఱు, మార్తురు, పగవాండ్రు, పగతురు - ఈ నాలుగును విరోధికి నామములు. మెగము, మెకము - ఈ రెండును మృగమునకు పేర్లు.

తే. ఇంకె నడుగంటె వట్టె నానివిరె ననఁగ
నిర్జలం బయ్యె ననుటకునెగడుఁ బేళ్లు
నిండెఁ గ్రిక్కిఱిస్వ్ ననఁ బూర్ణించె ననుట
కాఖ్యలై తనరారు (సుధాంశుమకుట)                  (67)

టీ. ఇంకె, అడుగంటె, వట్టె, ఇవిరె - ఈ నాలుగును నిర్జలమయ్యె ననుటకు నామములు. నిండె, క్రిక్కిఱిసె - ఈ రెండును పూర్ణించె ననుటకు పేర్లు.

తే. పెచ్చు పెరిగె ననం బురివిచ్చె మోఱె
నన విజృంభించె ననుటకు నాఖ్యలయ్యెఁ
దిండికాఁ డనఁ దిండీఁడు తిండిపోత
నంగ భక్షకునకు దనర్చుఁ బేళ్లు                  (68)

టీ. పెచ్చుపెరిగె, పురివిచ్చె, మీఱె - ఈ మూడును విజృంభించెననుటకు పేర్లు. తిండికాడు, తిండీడు, తిండిపోతు - ఈ మూడును భక్షకునకు పేర్లు.

క. పెనఁగొనె గిఱికొనియెను వల
గొనియెన్ మెలికొనియెఁ జుట్టుకొనె సుడిగొనె నాఁ
గను నులిగొనె నన నాఖ్య ల
గును వలయిత మయ్యె ననుటకును (శితికంఠ)             (69)

టీ. పెనగొనె, గిఱికొనె, వలగొనె, మెలికొనె, చుట్టుకొనె, చుట్టుకొనె, సుడికొనె, నులిగొనె - ఈ ఏడును వలయిత మయ్యె ననుటకు పేర్లు.

సీ. మొగరా లన స్తంభములు చిట్టకము దంభ, మెరగలి వనవహ్ని యొడ్డె మూర్ఖుఁ
డుడుగర యుపహార మూఱట విశ్రాంతి, మొద లని యనఁగను మూల మనుట
తఱు లన తళులు చిందమనంగ శంఖంబు, తఱ టనాంగఁ గశాభుధాన మయ్యె
దమ టనఁ గీల పదం బగు మెట్టన, గాయకులకుఁ బేరు గాణ లనఁగ

తే. మృత్యువునకును బే రయ్యె మిత్తి యనఁగ
మకుటమున కాఖ్య లగు బొమిడిక మనంగ
నోముట యనఁగఁ బోషించు టూడిగంబు
సేవ కభిధానమై యొప్పు (శేషభూష)                  (70)

టీ. మొగరాలు = స్థంభము, చిట్టకము = దంభము, మిష, ఎరవలి -పా.ఎరగలి=కాఱుచిచ్చు, ఎడ్డె = మూర్ఖుడు, ఉడుగర = కానుక, ఊఱట, విడుమర, మొదలు = మూలము, తఱులు = మడతలి, చిందము = శంఖము, తఱటు = జూటి, చబుకు, తమట = నిప్పుమంట, మెట్ట = పాదము, గాణ = గాయకుడు, మిత్తి (ప్ర. మృత్యువు) = చావు, బొమిడికము =  కిరీటము, ఓముట = పోషించుట, ఊడిగము = సేవ.

సీ. ఎట్టకేల కనంగ నెనయును సకృదర్థ, మఖిలం బటంటకు నంతపట్టు
ఏకాకి యొక్కటనేకులు పలువురు, వేనవేల్ పెక్కండ్రు వేరు రనఁగ
నలరు నో చేదర్థ మై9 కానినాఁ డన, నేతాదృశులె యంట కిట్టివారె
మిన్నక యూరకయున్నఁ దూష్టీమర్థ, మనుసరించి యుటంట కగును దొట్టి

తే. యొండొకఁ డనంగ మఱియు వేఱొకఁడు లాఁతి
వాఁడు పెఱవాఁడు దక్కినవాఁడనంగ
నన్యునకు నాఖ్య లగుచుఁ బెంపారుచుండు
(శతఘటితశూల వైయాఘ్రచర్మచేల)                 (71)

టీ. ఎట్టకేలకు = ఒకానొకప్పుడు, అంతపట్టు = అఖిలమును, ఎక్కటి = ఏకాకి, పలువురు, వేనవేలు, పెక్కండ్రు, వేవురు - ఈ నాలుగును అనేకులు. కానినాడు = అటుకాకపోయిన, ఇట్టివారె = ఈలాటివారే యనుట, మిన్నక, ఊరక - ఈ రెండును తూష్ణీమర్థకములు. తొట్టి = అనురించి. ఒండికడు, వేఱొకడు, లాటివాడు, వెఱవాడు, తక్కునవాడు - ఈ అయిదును అన్యునకు పేర్లు.

నానార్థములు

క. వడి యనఁగాఁ గాలం బగు
వడి యన వేగంబునకు వర్తిలు బేరై
మడి యనఁ గేదారం బగు
మాడి యనఁగా శుద్ధికిని సమాహ్వాయ మయ్యెన్            (72)

టీ. 1. వడి = కాలము, వేగము. 2. మడి = వరిచేను, శుద్ధి

క. ఈ డనఁగ వయసుపే రగు
నీ డన సామ్యంబునకును వెసఁగును బేరై
నా డన రాజ్యము పేరగు
నాఁ డనఁ దత్కాలమం దనఁగఁ బెంపారున్            (73)

టీ. 1. ఈడు = వయస్సు, సాటి. 2. నాడు = దేశము, అప్పుడు (రెండవ అర్థమున "నాఁడు" అని యరసున్న గలదు)

క. మొన యన సైన్యముపే రగు
మొన యనఁగా నగ్రభాగమునకును బే రౌ
దొన యనఁ దూణీరం బగు
దొన యన నవసానమునకుఁ దొడరును బేరై             (74)

1. మొన = సైన్యము, ముందుభాగము. 2. దొన = అమ్ములపొది, కొన.

క. వె న్ననఁగ బీజమంజరి
వె న్ననఁ జరమాంగమునకు వెలయును బేరై
కన్ను లనం బర్వంబులు
కన్ను లనన్ లోచనములు (కంఠేకాలా)                  (75)

టీ. 1. వెన్ను = కంకి, వీపు. 2. కన్ను = గణుపు, నేత్రము.

క. తమ్మి యనఁ దరువిశేషము
తమ్మి యనం బంకజాభిధానం బయ్యెన్
నెమ్మి యనఁ బ్రియముపేరగు
నెమ్మి యన మయూరమునకు నెగడుం బేరై              (76)

టీ. 1. తమ్మి = వృషవిశేషము, తామర. 2. నెమ్మి = సుఖము, నెమలి.

క. దండ యనన్ సాన్నిధ్యము
దం డన సుమమాలికాభిధానం బయ్యెన్
మం దనఁ బ్రకోష్ఠ మయ్యెన్
మం డన మృత్పాత్రకును సమాహ్వయ మయ్యెన్             (77)

టీ. దండ = చేరువ, పూలదండ. 2. మండ = ప్రకోష్ఠము, మంటికుండ.

క. తెలుఁగుం గబ్బపుమర్మము
తెలుఁగుకవీంద్రులకుఁ దేటతెల్లము గాఁగన్
దెలియఁగ నడిదము సూరయ
చెలువారఁగ నాంధ్రనామశేషముఁ జెప్పెన్            (78)

సటీకాంధ్రనామశేషము
సంపూర్ణము
జైహింద్.

14, నవంబర్ 2018, బుధవారం

ఆంధ్రనామశేషము - 3

1 comments

జైశ్రీరామ్.
ఆంధ్రనామశేషము - 3 - అడిదము సూరకవి
క. తడవు వడి కా రనంగా
నడరుం గాలంబు శిథిలమయ్యె ననుట యౌ
విడె వీడె నూడె విచ్చెను
సడలె నురలె వదలె బ్రిదిలె జాఱె ననంగన్           (36)

టీ. తడవు, వడి, కారు - ఈ మూడును కాలమునకు పేర్లు. విడె, వీడె, ఊడె,  విచ్చె, సడలె, ఉరలె, ఉరలె, వదలె, ప్రిదిలె, జాఱె - ఈ తొమ్మిదియు శిథిలమయ్యె ననుటకు పేర్లు.

క. మది డెంద ముల్ల మొద యన
హృదయంబున కాఖ్యలయ్యె నీఱం బనఁగాఁ
బొదరి ల్లనఁగ నికుంజము
(సదయాంతఃకరణ తరుణ చంద్రాభరణా)             (37)

టీ. మది (ప్ర. మతి) డెందము, ఉల్లము, ఎద - ఈ నాలుగును హృదయమునకు పేర్లు. ఈఱము, పొదరిల్లు (పొద+ఇల్లు) - ఈ రెండును నికుంజమునకు పేర్లు.

క. తెగ దినుసు తోయ మనఁగను
నెగడుఁ బ్రాకారంబునకును నెఱి నామములై
మెగ మనఁగ మెక మనంగను
మృగమునకు నభిఖ్యలయ్యె (మేరుశరాసా)             (38)

టీ. తెగ, దినుసు, తోయము - ఈ మూడును ప్రకారమునకు నామములు. మెగము, మెకము (ఈ రెండును మృగ శబ్ధభవములు) - ఈ రెండును మృగమునకు పేర్లు.

క. ఎడ దవ్వు కేళ వనంగా
నడరున్ దూరంబునకు సమాఖ్యలు నలి నాఁ
బొడి నుగ్గు తురుము నూరు మన
బెడఁగడరుం జూర్ణమునకుఁ బేళ్ళై (శర్వా)         (39)

టీ. ఎడ, దవ్వు, కెఖవు - ఈ మూడును దూరమునకు పేర్లు. నలి, పొడి, నుగ్గు, తురుము, నుఱుము - ఈ అయిదును చూర్ణమునకు పేర్లు.

క. ప్రేరేచెను బురికొలిపెను
దారిచె ననఁ జోదనకును దగు నాఖ్యలు పెం
పారును జంబుద్వీపము
నేరెడుదీవి తొలుదీవనెడు నామములన్                  (40)

టీ. ప్రేరేచెను, పురికొలిపెను, తారిచెను - ఈ మూడును ప్రేరణ చేసెననుటకు పేర్లు. నేరెడుదీవి = నేరేడుచెట్టుగల ద్వీపము, తొలుదీవి = మొదటి ద్వీపము - ఈ రెండును జంబూద్వీపమునకు పేర్లు.

క. తొలఁగెం బాసె ననంగా
నలరున్ విముఖతకుఁ బ్రాప్తమయ్యె ననుటపే
ళ్ళలమె నొదవె దక్కొనియెను
నెలకొనియెన్ జెందె ననఁగ నెక్కొనియె ననన్             (41)

టీ. తొలగెను, పాసెను - ఈ రెండును దూరముగా పోవుటకు పేర్లు. అలమె, ఒదవె, దక్కుకొనియె, నెలకొనియె చెందె నెక్కొనియె -  ఈ ఆరును లభించె ననుటకు పేర్లు.

క. వెనుకఁ దరువాతఁ బిమ్మట
ననఁగా నంతట ననంగ నంత ననంగాఁ
దనరుం బశ్చాదర్థము
(కనకాచలచాప చంద్రఖండకలాపా)                    (42)

టీ. వెనుకన్, తరువాతన్, పిమ్మటన్, అంతటన్, అంతన్ - ఈ అయిదును అనంతర మనుటకు పేర్లు.

క. పల్లఱపులు రజ్జు లనం
బ్రల్లదము లనంగ వ్యర్థభాషణములకున్
బేళ్లై వర్తిల్లు నోలిగ
(నుల్లోకజయాభిసరణ యురగాభరణా)                      (43)

టీ. పల్లఱపులు, రజ్జులు, ప్రల్లదములు - ఈ మూడును పనికిమాలిన మాటలకు పేర్లు.

క. కైసేఁ తలంకరించుట
బేసి యనన్ విషమమునకుఁ బేరై వెలయున్
సేసలు దీవనఁబ్రా లన
భాసిలు మంత్రాక్షతలకుఁ బర్యాయములై                (44)

టీ. కైసేత (కై+చేత) అనగా అలంకరించుట, బేసి = సరికాని సంఖ్య. సేసలు, దీవనబ్రాలు - ఈ రెండును మంత్రాక్షత లకు నామములు.

క. కో రనఁ బా లన సంశం
బేఱన వాఁక యన నదికి నెసఁగును బేళ్లై
నీరాజనంబు పేళ్ళగు
నారతి నివ్వాళి యనఁగ (నంగజదమన)                (45)

టీ. కోరు, పాలు - ఈ రెండును భాగమునకు నామములు. ఏఱు, వాక - ఈ రెండును నదికి నామములు. ఆరతి (ప్ర. హారతి), నివ్వాళి - ఈ రెండును నీరాజనమునకు నామములు.

ఆ. మొఱబవోయె ననఁగ మొద్దువోయె ననంగఁ
గుంఠమయ్యె ననుటకుం ఫనర్చు
శాతమునకు నాఖ్యలై తనరారును
జుఱుకు వాఁడి తెగువ కఱ కనంగ                   (46)

టీ. మొఱవవోయె (మొఱవ+పోయె) మొద్దువోయె (మొద్దు+పోయె) - ఈ రెండును పదును లేనివయ్యె ననుటకు పేర్లు. చుఱుకు, వాడి, తెగువ, కఱకు - ఈ నాలుగును పదునుకు పేర్లు.

సీ. యామికులకు నాఖ్యలై ప్రవర్తిలుచుండు, నారెకు లనఁగఁ దలారు లనఁగఁ
గళ్లెంబు  వాగె నాఁగను ఖలీనంబు పే, ళ్ళలరు దంతంబుపేరౌ డనంగఁ
దఱపి నా ముదురు నాఁ దరుణేతరం బంట, యిం చనఁ జెఱ కన నిక్షు వలరు
నష్టం బొనర్చె నంటకు నాహ్వయము లయ్యె, బోకార్చె ననఁగ గోల్పుచ్చె ననఁగఁ

తే. గుదె యనఁగ దు డ్డనంగను గదకుఁ బేళ్లు
ఇవ మనఁగ మం చనంగను హిమముపేళ్లు
కాన యన నడవి యనంగఁ గాననంబు
షడ్ఢకుఁడు తోడియల్లుఁడు జగిలెఁ డనఁగ           (47)

టీ. ఆరెకులు, తలారులు - ఈ రెండును తలవర్లకు పేర్లు. కళ్లెము వాగె - ఈ రెండును ఖలీనమునకు పేర్లు. ఔడు (రూ. అవుడు) అనగా దంతము నకు పేరు. తఱపి, ముదురు - ఈ రెండును లేతది కానిదానికి నామములు. ఇంచు, (ప్ర. ఇక్షువు) చెఱకు = ఈ రెండును ఇక్షువునకు నామములు. పోకార్చె, కోల్పుచ్చె (రూ. కోలుపుచ్చె) - ఈ రెండును నష్టము చేసెననుటకు పేర్లు. గుదె, దుడ్డు - ఈ రెండును గదకు పేర్లు, ఇవము (ప్ర. హిమము) మంచు - ఈ రెండును హిమమునకు పేర్లు. కాన (ప్ర. కాననము) అడవి (ప్ర. అటవి) - ఈ రెండును అరణ్యమునకు పేర్లు. తోడియల్లుడు, జగిలెడు - ఈ రెండును షడ్ఢకునికి పేర్లు.

క. తేనియ యన జు న్నన నభి
ధానంబులు మధువునకును దనరుం బేళ్లై
పానకము చెఱకుపా లనఁ
గా నిక్షురసంబునకును (గంఠేకాలా)                       (48)

టీ. తేనియ, జున్ను - ఈ రెండును మధువునకు పేర్లు. పానకము, చెఱకుపాలు - ఈ రెండును చెఱకురసమునకు నామములు.

క. ఉడిగెను జాలించెను నా
నడరు విరామం బొనర్చె ననుటకుఁ బేళ్లై
తొడరుం బశ్చాద్భాగము
పెడ యనఁగ వెనుక యనఁగఁ బిఱుఁదు యనంగన్         (49)

టీ. ఉడిగెను, చాలించెను - ఈ రెండును విరమించెననుటకు పేర్లు. పెడ, వెనుక, పుఱుఁదు - ఈ మూడును పశ్చాద్భాగమునకు పేర్లు.

క. విడుమర యన విడిదల యనఁ
గడముట్టుట యనఁగ శాంతిగనుటకుఁ బేళ్లౌ
నెడ వంక చక్కి చో టన
నడరు స్థలంబునకు నాఖ్య లై (శితికంఠా)                (50)

టీ. విడుమర, విడుదల, కడముట్టుట - ఈ మూడును శాంతిగనుటకు పేర్లు. ఎడ, వంక చక్కి, చోటు - ఈ నాలుగును స్థలమునకు పేర్లు.

క. చనుఁ గ్రుద్ధుఁ డయ్యె ననుటకుఁ
గినిసెఁ గనలె నలిగెఁ గోపగించె ననంగాఁ
దనరున్ మర్మములకుఁ బే
ళ్లనువు లనఁగ నెఱఁకు లనఁగ నాయము లనఁగన్         (51)

టీ. కినిసె, కనలె, అలిగె, కోపగించె - ఈ నాలుగును క్రుద్ధుడయ్యె ననుటకు పేర్లు. అనువులు, నెఱకులు, ఆయములు -  ఈ మూడును మర్మములకు నామములు.

ఆ. పరఁగుఁ బేళ్లు కార్యకరునకుఁ బార్పత్తె
కాఁ డనంగ మణివకాఁడనంగఁ
దేజరిల్లుచుండు దేవేరి దొరసాని
రాణి యనెడుపేళ్ల రాజపత్ని                             (52)

టీ. పార్పత్తెకాడు, మణివకాడు - ఈ రెండును కార్యకరునకు పేర్లు. దేవేరి, దొరసాని, రాణి - ఈ మూడును రాజపత్ని నామములు.

క. మ్రింగె నన గ్రుక్కగొనియ న
నంగన్ దగుఁ గబళనం బొనర్చె ననుటకున్
బ్రుంగె మునింగె ననంగ (న
నంగహరా) మగ్నమయ్యె ననుటకుఁ బేళ్లౌ                  (53)

టీ. మ్రింగె, గ్రుక్కగొనియె - ఈ రెండును కబళనము చేసెననుటకు పేర్లు. బ్రుంగె, మునింగె - ఈ రెండును మగ్నమయ్యె ననుటకు పేర్లు.

సీ. ఆఖ్యలై తనరు ధనాగారమునకు ను, గ్రాణం బనంగ బొక్కస మనంగ
నాస్థానమండపాహ్వయము లై తనరు హ, జారం బనంగ మోసల యనంగ
దయకు నీరెం డభిధానంబు లయ్యెను, గనికర మనఁగ నక్కటిక మనఁగ
బాల్యస్థునకుఁ బేళ్లు బరిఢ విల్లును బిన్న, వాఁ డన గొండికవాఁ డనంగ

తే. సంధ్య కాఖ్యలు మునిమాపు సంజ యనఁగఁ
జూద మన నెత్త మనఁగ దురోదరంబు
జడి యనఁగ వాన యనఁగ వర్షంబుపేళ్లు
నొలి యుంకువ యన శుల్క మొప్పు (నభవ)                      (54)

టీ. ఉగ్రాణము, బొక్కసము - ఈ రెండును ధనముంచెడి గృహమునకు పేర్లు. హజారము (రూ. హాజారము), మోసల - ఈ రెండును ఆస్థానమండపమునకు పేర్లు. కనికరము, అక్కటికము - ఈ రెండును దయకు పేర్లు. పిన్నవాడు, కొండికవాడు - ఈ రెండును బాల్యస్థునకు పేర్లు. మునిమాపు, సంజ - ఈ రెండును సంధ్యాకాలమునకు పేర్లు. జూదము (ప్ర. ద్యూతము) నెత్తము - ఈ రెండును ద్యూతమునకు పేర్లు. జడి, వాన - ఈ రెండును వర్షమునకు పేర్లు. ఓలి, ఉంకువ - ఈ రెండును శుల్కమునకు పేర్లు.

సీ. పయ్యెద యనఁగను పైఁట యనంగ సం, వ్యానంబునకు నాఖ్యలై తనర్చు
నొక్కపెట్ట ననంగ నువ్వెత్తుగ ననంగ, యుగపత్పదంబున కొప్పుఁ బేళ్లు
కవఱ లనం బాచిక లనంగ నక్షముల్, బన్న మొచ్చె మనంగఁ బరిభవంబు
వ్యాపార మగు చెయ్ద మనఁ జెయ్ది యనఁగను, గన్ననఁ గీలనఁ గపటచేష్ట

తే. కందుకము బంతి చెం డనఁగను దనర్చు
నఱపఱలు చిద్రుప లన ఖండాహ్వయముల
కాఁచుపడియంబు లనఁగను గైరవళ్ల
నంగ ఖాదిరఘుటిక (లనంగదమన)                    (55)

టీ. పయ్యెద, పైట - ఈ రెండును ఉత్తరీయమునకు పేర్లు. ఒక్కపెట్ట, ఉవ్వెత్తుగ -ఈ రెండును ఒకసారిగ ననుటకు పేర్లు. కవఱలు, పాచికలు -ఈ రెండును అక్షములకు పేర్లు. బన్నము (ప్ర. భంగము) ఒచ్చెము - ఈ రెండును తిరస్కారమునకు పేర్లు. చెయ్దము, చెయ్ది - ఈ రెండును వ్యాపారమునకు పేర్లు. కన్ను, కీలు - ఈ రెండును కపటచేష్టకు పేర్లు. బంతి, చెండు - ఈ రెండును కందుకమునకు పేర్లు. అఱవఱలు, చిద్రుపలు - ఈ రెండును ఖండములకు పేర్లు. కాచువడియములు, కైరవళ్లు - ఈ రెండును ఖాదిరఘటికలకు పేర్లు.

సీ. మాగాని రాజ్యంబు మణివ ముద్యోగంబు, చిట్టలు చిత్రముల్ చిలుకు శరము
ఎత్తికోలు ప్రయత్న మీలువు మానంబు, బారి యనంగ నుపద్రవంబు
విన్నను వనఁగఁ బ్రావీణ్యం బెలర్చును, దార్కాణ మనఁగ నిదర్శనంబు
నిట్టపంట యనంగ నిష్కారణం బంట, బాననం బనఁగ మహాసనంబు

తే. నామ మేకాంతమునకు మంతన మనంగ
నంతిపుర మన శుద్ధాంత మలరుచుండు
నుదిరి యనఁ దప్తకాంచన మెప్పుచుండుఁ
దిరువుట యభిలాషించుట (దేవదేవ)                   (56)

టీ. మాగాని=దేశము, మణివము=ఉద్యోగము, చిట్ట = ఆశ్చర్యము, చిలుకు = బాణము, ఎత్తికోలు = ప్రయత్నము, ఈలువు= అభిమానము, బారి, ఉపద్రవము, విన్ననువు = ప్రావిణ్యము లేక నేర్పు, తార్కాణము = నిదర్శనము, నిట్టపంట = నిష్కారణము, బానసము = వంటయిల్లు, మంతనము = ఏకాంతము, అంతిపురము = అంతఃపురము, ఉదిరి = అపరంజి, తిరివుట = కోరుట.
( సశేషమ్ )
జైహింద్.

13, నవంబర్ 2018, మంగళవారం

ఆంధ్రనామశేషము - 2

1 comments

జైశ్రీరామ్.
ఆంధ్రనామశేషము - 2 - అడిదము సూరకవి
క. వేఱొక టనఁ బైపె చ్చన
మాఱట యిమ్మడి యనన్ సమాహ్వయములు పెం
పారును వస్త్వంతరమున
(కౌరగకేయూరసహిత హతమారజితా)               (15)

టీ. వేఱొకటి, పైపెచ్చు, మాఱట, ఇమ్మడి ఈ నాలుగును వస్త్వంతరమునకు పేర్లు.

సీ. ఆఱడిపోయెను బీఱువోయను రిత్త, వోయెను వీసరవోయె ననఁగ
నుడివోయెఁ బొలివోయె సుడివోయె ననఁగను, వ్యేథమయ్యె నటంట కాఖ్యలయ్యెఁ
గడిమి బీరంబు మగంటిమి గం డన, విక్రమాహ్వయములై వెలయుచుండు
నాస్ఫాలన మొనర్చె ననుటకుఁ జఱచె నా, నప్పళించె ననంగ నాఖ్యలయ్యె

తే. నొగివరుస యోలి సొరిది నానోజ నాఁగఁ
గ్రమమునకు నాఖ్యలయ్యెను (గాలకంఠ)
కొఱ కొఱత తక్కువ వెలితి కొదవ కడమ
యనఁగ నూనంబునకు నాఖ్య లై తనర్చు              (16)

టీ. ఆఱడివోయె, బీఱువోయె, రిత్తవోయె, వీసరవోయె, ఉడివోయె, సోలివోయె, సుడివోయె - ఈ ఏడును వ్యర్థమయ్యె ననుటకు పేర్లు. కడిమి, బీరము, మగటిమి, గండు - ఈ నాలుగును విక్రమమునకు పేర్లు. చఱచె, అప్పళించె - ఈ రెండును అరచేతితో బాదెననుటకు పేర్లు. ఒగి, వరుస, ఓలి సొరిది, ఓజ - ఈ అయిదును క్రమమునకు పేర్లు. కొఱ కొఱత, తక్కువ, వెలితి, కొదవ, కడమ - ఈ ఆరును ఊనమునకు పేర్లు.

తే. నెట్టుకొనెఁ బాలిపడె నొడిగట్టె ననఁగఁ
గడఁగెఁ దొడఁగెను జెలరేఁగెఁ గాలుద్రొక్కెఁ
గవిసెఁ గదిసె ననంగ నాఖ్యలయి యొప్పు
నభిముఖుం డయ్యె ననుటకు (నగనివేశ)            (17)

టీ. నెట్టుకొనె, పాలుపడె, ఒడిగట్టె, కడగె, తొడగె, చెలరేగె, కాలుద్రొక్కె, కవిసె, కదిసె - ఈ తొమ్మిదియు అభిముఖుండయ్యె ననుటకు పేర్లు.

తే. అగపడకపోయె విచ్చుమొగ్గయ్యె ననఁగఁ
గంటఁబడదయ్యెఁ బంచబంగాళమయ్యె
ననఁగ దృగగోచరంబయ్యె ననుటపేళ్లు
(శయఘటితశూల వైయాఘ్రచర్మచేల)               (18)

టీ. అగపడకపోయె, విచ్చు మొగ్గయ్యె, కంటబడదయ్యె, పంచబంగాళమయ్యె - ఈ నాలుగును కంటికి కనపడలేదనుటకు పేర్లు.

క. వెలిచవి చీఁకటిత ప్పనఁ
బొలుపారఁగ జారభావమునకుం బేళ్లౌఁ
బులు కసటు చిలు మనంగను
మలిన మనుట కాఖ్యలయ్యె (మనసిజదమన)              (19)

టీ. వెలిచవి, చీకటితప్పు - ఈ రెండును జారభావమునకు పేర్లు. పులు, కసటు, చిలుము - ఈ మూడును మలిన మనుటకు పేర్లు.

ఆ. వింగడం బనంగ విపరీతమగు నుక్కి
వం బనఁగను గుత్సితంబు పరఁగు
నాఖ్య యగుచుఁ దనరు నామని యనఁగను
మదమునకును (జంద్రమఃకలాప)                       (20)

టీ. వింగడము అనగా విపరీతమునకు, ఉక్కివము అనగా కుత్సితమునకు, ఆము అనగా మదమునకు పేర్లు.

క. ఎల యండ్రు తరుణ మనుటకు
గొల యన దురితంబు పేరు కుడియెడమలనన్
వలపలదాపల లనఁగను
బొలుపుగ నపసవ్యసవ్యములకుం బేళ్లౌ                (21)

టీ. ఎల అనగా తరుణమునకు పేరు. కొల యనగా దురితమునకు పేరు. కుడియెడమలు, వలపలదాపలలు - ఈ రెండును వరుసగా దక్షిణవామభాగములకు పేర్లు.

క. తగు నౌధత్యము పేళ్లై
పొగరన నా మనఁగఁ ద్రుళ్లు పోతర మనఁగా
నెగడును భయంపేళ్ళై
బెగడు దిగులు వెఱపు జంకు బీ తలు కనగన్            (22)

టీ. పొగరు, ఆము, త్రుళ్లు, పోతరము - ఈ నాలుగును గర్వమునకు పేర్లు. బెగడు, దిగులు, వెఱపు, జంకు, బీతు, అలుకు - ఈ ఆరును భయమునకు పేర్లు.

క. అరి యనఁ గప్పం బనఁగాఁ
గరమునకుం బేళ్లు కాఁగు కడవ పనఁటి నాఁ
బరఁగు ఘటాఖ్యలు (నమితా
మరమౌనినికాయ భూతి మండితకాయా)                 (23)

టీ. అరి, కప్పము - ఈ రెండును పన్నుకు పేర్లు. కాగు, కడవ, పనటి (రూ. పంటి) - ఈ మూడును ఘటమునకు పేర్లు.

క. అలరుచుండును గొండ్లి రంతనఁగఁ గేళి
హాని కాఖ్యలు చేటు కీడఱ యనంగ
హెచ్చరిక హాళి సంతసం బెలమి వేడ్క
యనఁగ నానందమున కాఖ్యలై తనర్చు             (24)

టీ. గొండ్లి, రంతు - ఈ రెండును కేళికి పేర్లు. చేటు, కీడు అఱ - ఈ మూడును హానికి పేర్లు. హెచ్చరిక, హాళి,సంతసము (ప్ర. సంతోషము), ఎలము, వేడ్క (రూ. వేడుక) - ఈ అయిదును ఆనందమునకు పేర్లు.

క. సాహిణ మనఁ బాగా యన
వాహాగారంబునకును వర్తిలుఁ బేళ్లై
వ్యూహమున కాఖ్యలయ్యెను
మోహర మన నొ డ్డనంగ మొగ్గర మనఁగన్             (25)

టీ. సాహిణము, పాగా - ఈ రెండును హయమునకు పేరులు. మోహరము, ఒడ్డు,  మొగ్గరము - ఈ మూడును వ్యూహమునకు పేర్లు.

క. ఒనరించె ననఁగఁ గావిం
చె ననంగను సలిపె ననఁగఁ జేసె ననంగాఁ
జను నాచరించె ననుటకుఁ
(గనకాచలచాప చంద్రఖండకలాపా                     (26)

టీ. ఒనరించె, కావించె, సలిపె, చేసె - ఈ నాలుగును ఆచరించె ననుటకు పేర్లు.

తే. చీఁకువా లిరు లనఁగను జీఁకటి యనఁ
దిమిరమునకు నభిఖ్యలై తేజరిల్లి
నాఖ్యలై తనరారు నుపాయమునకు
సుళువనఁగ వెర వనఁగను సూటి యనఁగ            (27)

టీ. చీకువాలు, ఇరులు (ఏకవచన) చీకటి - ఈ మూడును అంధకారమునకునకు పేర్లు. సుళువు, వెరవు, సూటి - ఈ మూడును ఉపాయమునకు పేర్లు.

తే. చేరువయ్యెను డాసెను దారసిల్లె
ననఁగ సన్నిహితం బౌట కాఖ్య లయ్యె
స్థూల మనుటకు బేళ్లగుఁ దోర మనఁగఁ
గడిఁది బలుఁద యనంగను (గాలకంఠ)              (28)

టీ. చేరువయ్యె, డాసె (రూ. దాసె), తారసిల్లె - ఈ మూడును సమీపించె ననుటకు పేర్లు. తోరము, కడిది, వలుద - ఈ మూడును స్థూలమనుటకు పేర్లు.

తే. వాడెఁ గసుగందె ననఁ బుయిలోడె ననఁగ
విన్నవోయె ననంగను జిన్నవోయె
ననఁగఁ  బేళ్లగు నివి ఖిన్నుఁ డయ్యె ననుట
(కంధకాసురహరణ రౌప్యాద్రిశరణ)                   (29)

టీ. వాడె, కసుగందె, పుయిలోడె, విన్నవోయె, చిన్నవోయె - ఈ నాలుగును ఖిన్నుడయ్యె ననుటకు పేర్లు.

క. గరువము మురిపం బనఁగను
బరఁగున్ గర్వంబు పేళ్లు భటనామము లొం
టరి లెంక బం టనంగను
(బురదానవహరణ శేషభుజగాభరణా)                 (30)

టీ. గరువము, మురిపము - ఈ రెండును గర్వమునకు నామములు. ఒంటరి, లెంక, బంటు (భటశబ్ధభవము) - ఈ మూడును భటుని పేర్లు.

క. అరదంబు తే రనంగను
బరఁగు రథంబునకు బేళ్లు పరి యన్నను గా
లరు లనఁ బాదాతిసంహతి
(పురదానవహరణ శేషభుజగాభరణ)                  (31)

టీ. అరదము (రథ శబ్ధభవము) తేరు - ఈ రెండును రథమునకు నామములు. పరి, కాలరులు - ఈ రెండును కాల్బలమునకు పేర్లు.

క. సందియ మన ననుమాన మ
నం దనరును సంశయంబునకు బేళ్లై గో
బృందాహ్వయంబు లలరును
మం దనఁ గోన యనఁ (జంద్రమఃఖండధరా)          (32)

టీ. సందియము, (సందేహ శబ్ధభవము) అనుమానము - ఈ రెండును సంశయమునకు పేర్లు. మంద, కోన - ఈరెండును గోసమూహమునకు పేర్లు.

క. మొన వాఁగు దండు దళా మనఁ
దనరున్ సైన్యంబుపేళ్లు దళవాయి యనన్
మొనకాఁ డనంగఁ బడవా
లనఁగన్ సేనాధిపతికి నాఖ్యలు వొలుచున్                (33)

టీ. మొన, వాగు, దండు, దళము - ఈ నలుగురును సైన్యమునకు పేర్లు.  దళవాయి, మొనకాడు, పడవాలి - ఈ మూడును సేనాధిపతికి పేర్లు.

తే. మైకొనియె నియ్యకొనె నొడంబడియె నొప్పె
ననఁగ నంగీకరించుట కాఖ్య లయ్యె
సంఘటించుట కాఖ్యలై జానుమీఱుఁ
జెరివెఁ దుఱిమెను గీల్కొల్పెఁ జెక్కె ననఁగ             (34)

టీ. మైకొనియె, ఇయ్యకొనె, ఒడంబడె, ఒప్పె - ఈ నలుగును అంగీకరించె ననుటకు పేర్లు. చెరివె తుఱిమె, కీల్కొల్పె, చెక్కె - ఈ నాలుగును సంఘటించె ననుటకు పేర్లు.

తే. దిట్టపడియె ముక్కాఁకలు దీరె ననఁగ
నాఱితేఱె ననం గడిదేఱె ననఁగ
గసిమసంగె ననంగ నాఖ్యలు దనర్చు
నిపుణుఁ డయ్యె నటంటకు (ద్రిపురవైరి)          (35)

టీ. దిట్టపడియె, ముక్కాకలు దీరె, ఆఱితేఱె, గడిదేఱె, కసిమసంగె - ఈ అయిదును నిపుణుడయ్యె ననుటకు పేర్లు.
( సశేషమ్ )
జైహింద్.