గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2013, శనివారం

నాగ మురళి బంధ కందము : రచన శ్రీ కందుల వరప్రసాద్

1 comments

జైశ్రీరామ్
ఆర్యులారా 
శ్రీ కందుల వరప్రసాద్ రచన నాగ మురళి బంధ కందము నందు శివుని ఆభరణమునందు  హరి రూపము, శ్రీ కృష్ణుని వేణువు నందు శివుని నామము గలదు  చిత్రము నందు జూడగలరు .
క : ఉండగ వశి మన వాడై 
యుండగ భయ మేల? ప్రక్క నుండగ ననిశం 
బండగ మన మన కెల్లరకును    
పండుగ కద నార సింహ వైభవము కనన్ !  
చిత్ర కవితాసక్తితో రచనలు చేయుచున్న శ్రీ వర ప్రసాద్కు అభినందనలు
జైహింద్

28, నవంబర్ 2013, గురువారం

శ్రీ కందుల వర ప్రసాదిత ఆటవెలది గర్భ తేటగీతి

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ కందుల వర ప్రసాద్ ఇలా అత్యద్భుతమైన పద్య రచనా ప్రయత్నము చేస్తున్నారువారి అనిభవాన్ని ఇలా వ్రాశారు.   తిలకించండి.
కందుల వర ప్రసాద్ 
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు ధన్యవాదములతో...
మీరు చేస్తున్న సాహిత్య సేవ ముందు నేనొక చిట్టెలుకను . మీ "ఆంద్రామృతం " ను  కొద్దిగా సేవించుటకు అనుమతి నిడుమని ప్రార్థిస్తూ...    
మీ బ్లాగు జూచిన తరువాత నేనొక గర్భ కవిత ( తేట గీతి / ఆట వెలది) వ్రాసితిని.  
మేము ది 18/04/2013 కేరళ నుండి కర్ణాటక వచ్చునపుడు బండిపుర  " వీరప్పన్ " సంచరించు అడవిలో ఏనుగు దాడి జేయ బోయి కనికరించినది. అది మీకు పంపుచుంటిని.   
ఆటవెలది గర్భ తేటగీతి :-
గజగజ వణికితిమి  గజ గమనము గని 
పద పద యనుచు  వడి వడి పరుగిడ నట  
కదలక నిలచె  కడు కనికరమున నది 
మరి మరి దలచితిమి  హరి హర సుత యని.   
ఇంతటి మహనీయమైన పద్య రచనా కృషి చేయుచున్న సాహితీ ప్రియులైన శ్రీ కంది వరప్రసాదును మనసారా అభినందిస్తున్నాను.
ఆటవెలది కంద గర్భ తేటగీతి
కందులవరవంశఘనుఁడ వందును నిను
గర్భకవితవ్రాసిఘనుఁడుగనయితివిగ!
అందిన సుధ చింద నమరి, సింధు వవగ
నిష్ట రచన చేయుమికవని నెద నిలువ.
ఆ.వె.:-
కందులవరవంశఘనుఁడ.వందునునిను
గర్భకవితవ్రాసిఘనుఁడుగనయితివిగ!
అందిన సుధ చింద నమరి, సింధు వవగ
నిష్ట రచన చేయుమికవనినెద .
క:-
కందులవరవంశఘనుఁడ
వందునునినుగర్భకవితవ్రాసిఘనుఁడుగన్!
అందిన సుధ చింద నమరి, 
సింధు వవగనిష్ట రచన చేయుమికవనిన్.
జైహింద్.

24, నవంబర్ 2013, ఆదివారం

అనులోమ విలోమ గీత గర్భ ఆటవెలది- శ్రీ వల్లభ వఝలకవి.

5 comments

జై శ్రీరామ్.
ఆర్యులారా! తెలుగు భాషలోనే  చాలా అపురూపమైన అత్యద్భుతమైన ప్రయోగము ఈ అనులోమ విలోమ గీత గర్భ ఆట వెలది. ఇది సాధించిన శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవిని మనసారా అభినందిస్తూ, ఈ పద్యమును మీ ముందుంచుతున్నాను. ఇక చూడండి.
జైహింద్.

18, నవంబర్ 2013, సోమవారం

శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన నాకు నచ్చిన సమస్య - దానికి నా పూరణము.

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శంకరాభరణం బ్లాగుhttp://kandishankaraiah.blogspot.in/ నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్య గారు రచయితలలో పద్య కవితాసక్తిని పెంపొందించే సదుద్దేశ్యంతో అకుంఠిత దీక్షతో నిరంతరాయంగా పూరణముల కొఱకై రోజుకొక సమస్యను మనముందుంచడం, ఆసక్తిగల కవులు తమ ఆలోచనకు పదును పెట్టుతూ ఆ సమస్యలకు పద్యరూపంలో పూరణ చేయడం తెలుగు భాషాభిమానులందరికీ ఆనందం కలిగిస్తోంది. ఈ విధంగా శ్రమిస్తూ కవులనుత్తేజపరుస్తున్న శ్రీ శంకరయ్య గారిని మనసారా అభినందిస్తూ సమస్యా పూరణములు చేయుచున్న మిత్రులందరికీకూడా మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తున్నాను.ఈ రచయితల సంఖ్య ఇప్పుడు పదులుదాకా వచ్చొంది. ఇదిఇంకా ఇంకా పెరిగి వందలు దాటాలని మనసారా కోరుకొంటున్నాను. శంకరాభరణం ఆంధ్రమాతకు అపురూపమైన అలంకారంగా వర్ధిల్లునుగాక.
శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన
కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్. 
అనే సమస్య నాకు బాగా నచ్చింది. 
దానికి నా పూరణము తిలకించండి.
కమలాప్తనేత్రఁడౌ హరి
కమలాసనవైపు చూడ కలువలకన్నుల్
ప్రముదమున విచ్చి రమ నె.
కమలాప్తుని రశ్మి సోఁకి కలువలు విచ్చెన్. నవంబర్ 16, 2013.
మీరు కూడా శంకరాభరణం చదువుతూ సమస్యలను పూరించడంలో కవుల ప్రతిభా పాండిత్యాలను గాంచి, మీ ప్రశంసలను కూడా అందఁ జేయ వచ్చుచును.
జైహింద్.

17, నవంబర్ 2013, ఆదివారం

శివ భక్తుని గుండెలలో కూడా దాగి ఉండే శ్రీహరి.

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! వీరశైవ భక్తి భావ పూరిత పద్యం తిలకించండి.
క:- కనుచును వినుచును హర భా
వనమే మేల్ తలప! హరుని పదముల్ ఘన రీ
తిని వినుతింతు  రిపుందమ 
ను నిరతము మధురతర సహనుత రీతులతోన్.
ఇంత వీర శైవంలోనూ హరి భక్తి కూడా ఎంత చక్కగా కనఁబడకుండా దాగి ఉందో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
పై పద్యం నక్షత్ర బంధంలో లిఖించినట్లైతే ఆ అంతర్యామి ఏ భక్తుని హృదయాలలోనైనా ఎంత బాగా ఒదిగిపోతాడో అర్థమౌతుంది.
గమనించండి.
కోణములందు:- కరివరద!
కేంద్రములందు:- వినుత హరీ!
కేవలం మన ఆంధ్ర భాషలో మాత్రమే సుప్రశస్తమయిన చిత్ర కవితామృతాన్ని గ్రహించి, విరచించి, ఆంధ్రామృతం ద్వారా అందించే భాగ్యం కలుగఁ జేయుచున్న ఆ పరమాత్మకు, ఆంధ్రామృత పానలోలురకు కృతజ్ఞతలు చెప్పుకొనుట తప్ప మరేవిధముగా ఋణం తీర్చుకో గలను.
ధన్యవాదములు.
జైహింద్.

16, నవంబర్ 2013, శనివారం

శ్రీహరి మత్స్యావతారము దాల్చి భక్తులను కరుణించిన పవిత్రమైన రోజు నేడే.

9 comments

                                                             జైశ్రీరామ్.                                                             
ఆర్యులారా!
ఈరోజు శ్రీహరి మత్స్యావతారము దాత్చి మనలను కరుణించిన పుణ్యప్రదమైన రోజు.
ఈ సందర్భముగా రచించిన విశ్వముఖ మత్స్యత్రయ బంధము తిలకించండి.
కమల దళాక్షుఁ గాంచఁ గల కన్నులు, కన్నులు, మోదమందుచున్,
విమల చరిత్రు గాధ విను వీనులు వీనులు భ్రాంతి చెందుచున్,
ప్రమదము శ్రీహరిన్ బలుకు వాతెర వాతెర, భావమెన్నుచున్                                
సుమతుల నెన్నుచున్ మదిని శోభిలుచున్, పరమాత్మఁ గాంచుచున్.
ఆంధ్రామృత పాఠకులకు ఆ శ్రీహరి దీవెనలు ఎల్లప్పుడూ లభించుగాక.
జైహింద్.  

10, నవంబర్ 2013, ఆదివారం

కార్తీక పురాణం 7వ అధ్యాయం

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ వివరించిన శ్రీ స్కాంద పురాణాంతర్గత 
కార్తీక పురాణం ఏడవ అధ్యాయం 
పఠించండి.

వసిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తిక మాసమునందు ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని ఐన లక్ష్మీదేవి నిత్యమూ వాసము చేయును. ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమిమీద జన్మించడు.

కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తికలిగి యుండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసమందు బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాణి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందును.

కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకును. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి పూజిమ్చినవానికి వైకుంఠమందు చిరకాలవాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతోనున్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు.

కార్తీక మాసమందు విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కల్గును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలగును.

కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అనగా ౧,౬,౧౧ తిథులలో అనగా ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులందు సమర్పించు దీపము). ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించడం వలెను.

కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.

కార్తీక మందు విష్ణ్వాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లవలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బులవలె తొలగును.

కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడగును. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మిమ్చి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మించును.

ఈ మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.

స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందు హరిని పూజిమ్చిన పాపవిముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును బొందును. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసమందు నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును.

ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహములేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని పొందును.

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఏడవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.

9, నవంబర్ 2013, శనివారం

కార్తీక పురాణం 6వ అధ్యాయం

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ వివరించిన శ్రీ స్కాంద పురాణాంతర్గత 
కార్తీక పురాణం ఆరవ అధ్యాయం పఠించండి.

వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పుచున్నారు ’ ఓ మహారాజా! కార్తికమాసములో భక్తితో నెలంతా శ్రీ హరికి కస్తూరితోటి, గంధముతోటి, పంచామృతములతోటి స్నానము చేయించువారు పదివేల అశ్వమేధయాగముల ఫలాన్ని పొంది అంత్యమున ఉత్తమ గతులను పొందెదరు. కార్తికమాసమున సాయంకాలసమయంలో శ్రీ హరి సన్నిధిలో దీపదానమిచ్చువారు విష్ణులోకమును పొందెదరు. కార్తిక మాసంలో దీపదానం చేసినవారు జ్ఞానమును పొంది విష్ణులోకాన్ని పొందెదరు. ఈ కార్తీక మాసంలో పత్తిన చక్కగా ధూళి, నలుసులు లేకుండా విడతీసి వత్తిని చేసి, బియ్యపు పిండితో గాని గోధుమపిండితోగాని చేసిన ప్రమిదలో ఆవునేతిని పోసి వత్తిని తడిపి వెలిగించి ఉత్తమ బ్రాహ్మణుని పూజించి ఇవ్వవలెను.

ఇట్లు ఈ నెలంతా చేసి చివర్లో వెండితో ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తిని చేయించి బియ్యపుపిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించినతరవాత బ్రాహ్మణ భోజనము గావించి తరవాత ఈ క్రింది మంత్రమును చెప్తూ దీపమును బ్రాహ్మణునకు దానము చేయవలెను (మంత్రము పైన ఇవ్వబడింది, దాని అర్థము ఇక్కడ పొందుపరచడమైనది) ."దీపము సర్వజ్ఞాన దాయకము, సమస్త సంపత్ప్రదాయకము, ఈ దీపమును నేను దానమిచ్చుచున్నాను, ఈ దీపదానమువల్ల నాకు నిరంతరము శాంతికలుగును గాక". లింగబేధములేక ఎవరైననూ ఈ ప్రకారంగా  కార్తీకమాసమందు ఆచరించిన అనంత ఫలము పొందెదరు. దీపంవలన జ్ఞానం కలుగును, దీపంవలన శృత్యాది శాస్త్రఫలము కలుగును, దీపదానమువలన ఆయుష్షును పొందును, దీపము వలన ఉన్నతలోకములకు పొందవచ్చును.

కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత తెలిసిగానీ తెలియకగానీ చేయబడిన పాపములు నశించును. ఈ విషయమై పూర్వమొక కథ గలదు. వినుము, పూర్వము ద్రావిడదేశమందు సుతులు కానీ, బంధువులు కానీ లేని ఒక స్త్రీ కలదు, ఆ స్త్రీ నిత్యము భిక్షమెత్తుకొనిన అన్నము తినునది. ఎప్పుడూ దూషితాన్నమునే భుజించెడిది, పరిశుభ్రమైన అన్నము తినునది కాదు. చద్ది అన్నముని తిని రోజూ ఇతరలవద్ద ధనము పుచ్చుకొని వారికి వంట చేయుట, బట్టలు కుట్టుట, రుబ్బుట నూరుట వంటి పనులు చేసెడిది. ఇట్లా ధనము సంపాదించి, దూష్యమైన భోజనము చేస్తూ అధిక ధనము కూడబెట్టినది. ఆస్త్రీ ఎన్నడూ భగవన్నామము ధ్యానించలేదు. హరికథలు వినలేదు, పుణ్య తీర్థములకు పోలేదు, ఏకాదశీఉపవాసం చేయలేదు. అనేక వ్యాపారములచే చాలా ద్రవ్యం సంపాదించినది. కానీ తాను తినలేదు పరులకోసం ఉపయోగించలేదు.

ఇలా అజ్ఞాన సముద్రంలో మునిగిన ఆమె ఇంటికి దైవ వశాత్త్ శ్రీరంగమునకు పోతూ ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి అయ్యో ఈమె అన్యాయంగా నరకము నకు పోగలదని దయకలిగి ఆమెతో ఇట్లనె. ’ఓ మూఢురాలా! ఇప్పుడు నేచెప్పేది జాగ్రత్తగా విను. విని ఆలోచించుము. ఈ శరీరం సుఖదుఃఖముల సమన్వయం. చర్మము, మాంసము, ఎముకలతో గూడినది. ఇది దుఃఖములకు నిలయము.  పంచభూతములైన భూమ్యాకాశవాయురగ్నిజలములు వలన కలిగి వాటితో కూడి ఉన్నది. దేహము నశించగానే ఈ పంచ భూతములు ఇంటిపై బడిన వాన చినుకులు ఎలాగైతే వేర్వేరుగా పోవునో అలా వేరువేరగును. ఇది నిశ్చయం.

ఈ దేహము నీటిమీద నురుగువలె నశించును. ఈ దేహము నిత్యము కాదు ఇట్టిదేహము నిత్యమని నమ్మియున్నావు. ఇది అగ్నిలో పడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము.

దేవుడే సత్యమనీ, సమస్త భూతములందు దయగలవాడు అని గుర్తెరుకు. హరిపాదములను ధ్యానించు. కామం-కోరిక, క్రోధము - అత్యంత కోపము,  భయము-ఈశరీరమునకు తత్సంబంధమునకు ఏమగునో అని బెంగ ఆత్మాత్మీయము, లోభము- ద్రవ్యచింతన, ఖర్చు పెడితే ఖర్చవుతుందని ఏదో దాచుకోవాలని ఉబలాటం. మోహము- మమత, అనురాగం, అహం, ద్రవ్యాభిలాషణం- ఇంకా ఇంకా ఇంకా సంపాదించవలెనని కోరిక -  వీటన్నిటిని వదులి నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చెయ్యి.

కార్తీక మాసమందు ప్రాతఃస్నానం చేసి, విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణులకు దీపదానము చేయుము అట్లు చేసిన అనేక జన్మ పాపములు నశించును. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు.’ అని చెప్పి ఆ బ్రాహ్మణుడి తూర్పు దిశగా పయనం సాగించెను. తరవాత ఆ మాటలు నమ్మి విచారణ చేసుకొని, ఆశ్చర్యమును పొంది తాను చేసిన అకార్యములకు బాధ పడి కార్తీక వ్రతమును ఆరంభించెను.

సూర్యోదయ వేళలో చన్నీటి స్నానము, హరి పూజ తరవాత దీపదానము అటు పిమ్మట పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసము నెలరోజులు కార్తీక వ్రతమాచరించి చివరకు బ్రాహ్మణ సమారాధన చేసెను.  ఇతః పూర్వం సరియైన భోజనము లేని కారణము చేతనూ, నెలరోజులు శీతోదకస్నానము చేయుటవలననూ,ఆ స్త్రీకి శీతజ్వరము సోకి గర్భమందు రోగము పుట్టి దివారాత్రులు బాధపడి బంధుహీనయై మృతినొందినైది. అనంతరం ఆమె దివ్య విమానమెక్కి స్వర్గమునకు బోయి శాశ్వత సుఖములను పొందినది.

కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధికమైన ఫలప్రదము. కార్తీక దీపదానము తెలిసికానీ తెలియకకానీ చేసిన పాపములను నశింపచేయును’ అని పూర్వము సాక్షాత్ శంకరుడే పలికెను. రాజా ఈ రహస్యమును నీకు తెలిపితిని దీనిని విన్న వారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని విష్ణుపదమును పొందెదరు.
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఆరవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.

8, నవంబర్ 2013, శుక్రవారం

కార్తీక పురాణం 5వ అధ్యాయం

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ వివరించిన
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఐదవ అధ్యాయం పఠించండి.

వశిష్ఠ మహర్షి తిరిగి చెప్తున్నారు ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మాసమందు పాప క్షయము కొరకు పుణ్య కార్యాచరణము చేయవలెను. పుణ్యకార్యాచరణముచేత పాపము నశించుటయే గాక పుణ్యమధికమగును. కార్తీక మాసమందు శ్రీ హరి సన్నిధిలో భగవద్గీతా పారాయణము చేయుటవలన పాము కుబుసము వలె పాపములు విడువబడును. కార్తీక మాసమున తులసీదళంతోనూ, తెలుపు, నలుపు అయిన గన్నేరు పూలతోను హరిని పూజించిన వైకుంఠముచేరి హరితో కూడగలడు.

కార్తీక మాసమందు భగవద్గీతలోని విభూతి, విశ్వరూప సందర్శన అధ్యాయములను శ్రీ హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠాధీశునితో సమమగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకముగానీ, శ్లోక పాదముగానీ పురాణము చెప్పినవారునూ, విన్నవారునూ కర్మబంధ వినిర్ముక్తులగును.

కార్తిక మాసమందు శుక్ల పక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు హోమ కాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణ కాలమందు మాట్లాడకూడని వారితో నూ యొక్క పాపాత్ములతోనూ అశౌచవంతులతోనూ సంభాషణములను వినిన దోషపరిహారము కొఱకు కార్తీక మాస వన భోజనమాచరించవలెను.

ఈ వన భోజనములెట్లు చేయవలెననగా.. అనేక వృక్ష జాతుల సమూహముచే కూడినదైన వనమునందు, ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామమునుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి శక్తికొలది బ్రాహ్మణులను పూజించి బ్రాహ్మణులతో కలిసి భోజనము చేయవలెను. ఇట్లు కార్తిక మాసమునందు వనభోజనము చేసిన ఆయా కాలములందు చేసిన సమస్త దోషములు, పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉండెదరు. కాబట్టి తప్పక కార్తీక మందు వనభోజనము ఆచరించవలెను.

కార్తీక మహాత్మ్యము భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడైన దుర్యోన సంకటము వలన ముక్తుడాయెను. అని వశిష్ఠమహర్షి పలికెను. అంత జనక మహారాజు ’ ఓ మునీశ్వరా! బ్రాహ్మణునికుమారుడైన ఈ దుర్యోనుడెవ్వడు? వాడేకర్మ చేసెను? దేని చేత విముక్తుడాయెను. ఈ వృత్తాంతమును వినవలెనని కుతూహలముగ నున్నది కనుక దయతో చెప్పుము’ అని ప్రార్థించెను.

విశిష్ఠుడు చెప్పుచున్నాడు ’ జనక మహారాజా! చెప్పెదను వినుము, కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేద వేదాంగ పారీణుడు కలడు, అతనికి దురాచారవంతుడైన ఒక కుమారుడు కలడు, అతని దుర్మార్గము చూసి, తండ్రి నాయనా నీకు పాపములు నశించెడి మాటను చెప్పెదను వినుము’ అని ఇట్లు చెప్పసాగెను. ’అబ్బాయీ కార్తీక మాసమందు ప్రాతః స్నానము చేయుము సాయం కాలములో హరిసన్నిధిలో దీపమాలను సమర్పించుము.’ అంత ఆ కొడుకు ఈ మాట విని అసలీ కార్తీక మాసధర్మమంటే ఏమిటి? ఈ కార్యాన్ని నేనెప్పుడు చేయవలెను (నేను చేయడమా అనినట్లు)’ అని పరుషముగా బదులిడెను.

అంత ఆ తండ్రి కోపగించి ’ఓరి దుర్మార్గుడా! ఎంత మాట అన్నావు! నువ్వు అరణ్యములో చెట్టుతొఱ్ఱలో ఎలుకవై ఉండుము’ అని శపించెను. ఆ శాపమును విన్న దుర్యోనుడు, తండ్రీ నాగతియేమి నాకు ముక్తి ఎప్పుడు అని అడుగగా తండ్రివిని పశ్చాత్తప్తుడై శాపవిమోచనమార్గమును చెప్పెను.’ కుమారా నీవు కార్తీక మాహాత్మ్యమును ఎప్పుడు వినెదవో అప్పుడు నీకు మూషకత్వమునుండి విముక్తి కలుగును’ అని చెప్పెను.

తండ్రి చెప్పిన మాటలు వినగా ఆ కుమారుడు అప్పుడే ఎలుకయై గజారణ్యమందు ఫలములతో గూడి అనేక జంతువుల కాధారమై, సకల వృక్షసమూహమైన ఆ అడవినందు నివసించుచుండెను.

ఇట్లు కొంత కాలము గడచిన తరవాత ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి శిష్యులతో సహా కార్తిక స్నానం చేసి ఒక వృక్షము మొదటి భాగమందు కూర్చొని కార్తీక మహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను. అంత దురాచారుడు, దయాహీనుడు ఐన ఒక వ్యాధుడు వేట నిమిత్తము అటు వచ్చి, అక్కడి బ్రాహ్మణులను పాపాత్ముడై చూసి సంహరించుటకు నిశ్చయించుకొనెను. అంతలోనే విశ్వామిత్ర మహర్షిని చూచినంత పురుషార్థదాయకమైన జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఇదేమిటి మీరేమి చేయుచున్నారు దీని వలన ఫలమేమి అని అడిగగా విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతునకు ఇట్లు చెప్పుచున్నారు...

విశ్వామిత్రుడు ఇలా చెపుతున్నాడు ’ఓ కిరాతా! వినుము, నీ బుద్ధి మంచిదైనది, ఇది కార్తీక ధర్మము, ఈ ధర్మము మనుష్యులకు కీర్తినిచ్చును. కార్తిక మాసమందు మోహముచేత నైనా సరే స్నానాదికములు చేసిన వాడు పాపవిముక్తుడై వైకుంఠలోకమును చేరును. కార్తిక మాసమందు భక్తి శ్రద్ధాసంయుక్తుడై స్నానదానాది వ్రతములను ఆచరించువాడు జీవన్ముక్తుడగును.  అందు సందేహము లేదు.

విశ్వామిత్రమహర్షి ఇట్లు కిరాతునకు చెప్పిన కార్తీక ధర్మము వృక్షమున తొఱ్ఱలో ఉన్న మూషకము విని  వెంటనే మూషక రూపమును వదిలెను. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయిచూడగా, ఆ బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమంతయును తెలిపి విశ్వామిత్ర అనుజ్ఞతో తన ఆశ్రయమైన తన తండ్రిదరికి పోయెను.

కిరాతుడు మూషకము దేహత్యాగము చేసి బ్రాహ్మణ కుమారుడుగ మారుటను బట్టిమ్, కార్తీక వ్రత ధర్మములను పూర్తిగా విశ్వామిత్ర మహర్షి చేత తెలుసుకుని వైకుంఠమును చేరెను. ఉత్తమ గతులను కోరువారు ఈ కార్తీక మహాత్మ్యమును ప్రయత్న పూర్వకముగ వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై అంత్యమును పరమును పొందెదరు. కాబట్టి తప్పక కార్తీక వ్రతమాచరించవలెను. ఇది నిజము నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజానీవు పురాణములందు బుద్ధినుంచుము. అట్లైన పుణ్యగతికి పోయెదవు ఈ విషయమై విచారణతో పనిలేదు ఇది నిశ్చయము.
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఐదవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.

ఆధునికులైన చిత్ర, బంధ, గర్భ కవులను, వారి కవితలను తెలుప కోరుచున్నాను.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! చిత్ర బంధ గర్భ కవితానురక్తులారా! చిత్ర కవులారా! 

జన్మలలోపలన్ మనుజ జన్మము కన్నను శ్రేష్ఠమున్నదే?
సన్మతినెంచినన్ తెలుగు చక్కని భాషగ లోకమెన్నదే?
జన్మకు సార్థకంబనుచు చక్కని చిత్ర కవిత్వ తత్వమున్
చిన్మయమూర్తులెంచి విరచించిరి. మీరును వ్రాయరాదొకో?

సందర్భంబును బట్టి వ్రాసినవియౌన్, సన్మాన్య వృత్తంబులౌన్,
సౌందర్యంబును కోరి వ్రాసినవియౌన్, సన్మూర్త్యుదంతంబులౌన్,
గ్రంథాంతర్గత చిత్ర బంధ తతియౌన్, కానిండు యేదైన. నా
కందింపన్ మిము కోరు చుంటి.దయతో నందింపుడీ చిత్రముల్.

మహనీయాత్ములు, చిత్ర బంధ కవితా మాహాత్మ్య సద్వేద్యులై
యిహమందెట్టి బృహత్కవిత్వ తతులన్ హృద్యద్యాద్భుతంబై కనన్
సహ వాసుల్ రచియించియుందు రనుచున్ సన్మాన్యులౌ వారలన్
గ్రహియింపన్ ఘన వైద్యవంశజ లసత్ కారుణ్యుడెంచెన్, భువిన్.

కావున తెల్ప వేడెదను. కల్గినచో తమ విత్ర బంధముల్.
భావన చేసి వ్రాసినవి, పండిత పామర రంజకంబుగా
ధీవరు లెంచ వ్రాసినవి, దివ్య మహాద్భుత చిత్ర గర్భ శ్లే
షావహ మౌక్తికంబులను, హాయిగ వ్రాసినవెల్ల పంపుడీ!

కోరెద పంపగ మిమ్ముల
మీరెఱిగిన వెవరివైన మేలగు కృతులన్
తీరగు బంధము లెన్నుచు
ధీరోత్తములార! పంపి తేజరిలుడయా!

మీరు కాని, మరెవరైన కాని, చిత్ర, బంధ, గర్భ కవితానురక్తితో వ్రాసిన చిత్ర, బంధ, గర్భ చాటు మౌక్తికములు అయి యుండవచ్చును, గ్రంథాంతర్గత ప్రదీపిత చిత్ర, బంధ, గర్భ రచనలయి యుండవచ్చును, ఏవయినను అయి యుండవచ్చును, ఆధునిక కవులు వ్రాసిన ఆ ఆణి ముత్యములను చిత్ర రత్నములను నాకు మీరు తప్పక చూప కలరని మనసారా ఆశించుచున్నాను.
మీ
రామ కృష్ణా రావు.
జైహింద్.

7, నవంబర్ 2013, గురువారం

కార్తీక పురాణం 4వ అధ్యాయం

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ వివరించిన శ్రీ స్కాంద పురాణాంతర్గత 
కార్తీక పురాణం 
నాలుగవ అధ్యాయం పఠించండి.

జనకుడడుగుచున్నాడు ’ఓ మునీంద్రా! నీయొక్క వాక్కు అనే అమృతాన్ని తాగుతున్న నాకు ఇంకా తృప్తి కలుగలేదు. కాబట్టి ఇంకనూ ఈ కార్తీక మహాత్మ్యమును తెలుపుము. కార్తీకమందు ఏ దానము చేయవలెను దేనిని కోరి వ్రతము చేయవలెనో తెలుపుము.

విశిష్ఠుడు చెప్పుచున్నాడు " ఓ రాజా! పాపములను నష్టపరచి, పుణ్యమును వృద్ధిపొందించేది అయిన కార్తీక వ్రతమును ఇంకనూ చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంత్రము శివాలయములందు దీపారాధన చేసిన అనంతఫలదాయకము. కార్తీక మాసములో శివాలయములో గోపురద్వారమునందు శిఖరమునందు లింగ సన్నిధియందు దీపారాధన చేసిన సమస్తపాపములు నశించును. ఎవరు కార్తికమాసమునందు శివాలయములో ఆవునేతితో కానీ, నేతితో కానీ, నువ్వులనూనెతో కానీ, యిప్పనూనెతో కానీ, నారింజనూనెతోగానీ భక్తితోదీప సమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు సమస్త ధర్మవేత్త . వాడు ధర్మాత్ముడును అగును. అందులో సందేహములేదు.

పైన చెప్పిన నూనెలు లభించకున్నచో కనీసము ఆముదముతోనైననూ దీప సమర్పణ చేయుట పుణ్య ఫలము. కార్తీక మాసములో మోహంతో కానీ, గర్వంతో కానీ లేదా నిండు భక్తితో కానీ ఏ భావముచేతనైనా దీపమిచ్చువాడు శివప్రీతిని పొందును.

పూర్వకాలమందు పాంచాల దేశమున కుబేరునితో సమమైన ఐశ్వర్యము గల ఒక రాజు ఉండెడివాడు. అతడు సంతానము లేక పవిత్ర గోదావరీ తీరమున తపస్సు చేయుచుండెను. గోదావరీ స్నానార్థమై పైప్పలుడనే ముని వచ్చి రాజుని చూచి ’ ఓ రాజా! ఎందుకు తపస్సు చేయుచున్నావు’ అని అడిగెను. ఆ మాటవిని ఆ రాజు ’ ఓ మినీశ్వరా ! నాకు సంతానము లేదు, కాబట్టి సంతానము కొరకు తపస్సు చేయుచున్నాను’ అని చెప్పెను.

ఆ బ్రాహ్మణోత్తముడు రాజుతో ఇట్లు చెప్పుచున్నాడు’ రాజా భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము, అట్లయిన నీకు పుత్ర సంతానము కలుగగలదు.’ అది విన్న ఆ రాజు ఆనంద మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతికొరకు దీప దానములను చేసెను. తరవాత ఆ పుణ్యమువలన రాజు భార్య గర్భాన్ని దాల్చి పదోనెలలో రెండవ సూర్యుడా అన్నంతగా వెలుగుతున్న కొడుకుకు జన్మనిచ్చినది. ఆరాజువిని ఆనంద పరవశుడై కార్తీక మాహాత్మ్యము సత్యమే, ఈ కార్తీక వ్రతమును ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములనిచ్చును సమస్త భూతములకు సుఖము కల్గించునది కార్తీక మాసము అని చాటించెను. ఆ రాజు తన కుమారునకు శతృజిత్ అని పేరు పెట్టి బ్రాహ్మణులకు గోభూదానములనిచ్చి తృప్తి పరచెను.

ఓ రాజా! ఆబాలుడు క్రమముగా వృద్ధిచెంది యువకుడై శూరుడై సుందరుడై అలంకారభూషణుడై వేశ్యాంగనాలోలుడై అంతతో తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి వారించిన గురువుల బ్రాహ్మణులను ద్వేషించుచూ జాతి సంకరమును కావించుచూ పరులను నిందుస్తూ, నిష్ఠూరములాడుతూ, పాపుడై, బయపెట్టుటకు నిత్యమూ ఖడ్గమును చేత ధరించి దురాగ్రహముతో తిరుగుతూండెడివాడు.

ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కనిది సింహపు నడుము వలె సన్నని నడుము గలది, పెద్ద కన్నులు కలది, చక్కని అంగసౌష్ఠవము కలది, చక్కని కంఠ స్వరము కలదియై మన్మథోద్రేకము కలది. రాజ కుమారుడు అట్టి బ్రాహ్మణుని భార్యను చూసి ఆమె సౌందర్యమును చూసి సంతోషించి ఆమెయందాసక్తి కలవాడైయ్యెను, ఆమెయును రాజకుమారుని యందాసక్తి కలదయ్యెను. తరవాత బ్రాహ్మణుని భార్య నిశిరాత్రి భర్తను విడిచి రాజకుమారునితో రాత్రిశేషమంతయునూ క్రీడించి ఉదయాత్పూర్వమే తిరిగి ఇంటికి వచ్చుచుండెను. ఈ ప్రకారముగా అనేక దినములు గడచినవి.

ఆసంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను ఆమెతో ప్రియుడైన రాజకుమారుని చంపుటకు చేత కత్తిని పట్టుకుని ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలముకొరకై నిరీక్షించుచుండెను. ఇట్లు కొంత కాలము గడచిన పిదప ఒకప్పుడు కార్తిక పూర్ణిమా సోవవారము నాడు ఆ రాజకుమారుడు బ్రాహ్మణ భార్యయు తమకు సంభోగ స్థానము దొరకక ఒక శివాలయములోనికి పోయి చీకట్లో క్రీడించుటకు వీలు కాక దీపము వెలిగించుటకై బ్రాహ్మణి తన చీర చింపి వత్తిని చేసెను, ఆరాజకుమారుడు ఆముదమును తేగా ఆవత్తితో వారు వారి సుఖము కొరకై మోహముతో దీపమును వెలిగించి అరుగు మీద పెట్టి తరవాత వారిద్దరూ అత్యుత్సాహముతో క్రీడించుచుండిరి.

అంత ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారు వేషములో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని నరికి తరవాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు ఓపిక తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర ఘాతములచేత ఆ జీర్ణదేవాలయమందు ముగ్గురూ విగతజీవులైరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము దైవ వశము చేత అట్టి పర్వమందు వారి ముగ్గురికి శివాలయములో

అంతలో పాశహస్తులై యమ కింకరులు వచ్చిరి, అప్పుడే శివనేత్ర ధారులై శివకింకరులూ వచ్చిరి. శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణిని విమానమును ఎక్కించిరి, యమదూతలు బ్రాహ్మణుని కాళ్లుగట్టి తీసుకొని పోవ ప్రయత్నించిరి. ఇట్లు జారులైన తన భార్య, రాజకుమారుని విమానమెక్కించుట చూసి శివదూతలతో బ్రాహ్మణుడిట్లనె " ఓ శివ దూతలారా! నా భార్య, ఈ రాజ కుమారుడు జారులు, నేను బ్రాహ్మణుడనై సదాచారవంతుడనుకదా, మరి నాగతి ఇదేమి వారికా ఉత్తమగతేమి’ అని అడిగెను.

అనంతరం అతి దీనవదనుడైన బ్రాహ్మణునితో శివదూతలు ఇట్లు పలికిరి. ’ఓ బ్రాహ్మణుడా! నీవన్నమాట సత్యమే, కాని ఇందు ఒక విశేషమున్నది. ఈ నీ భార్య రాకుమారుడు పాపకర్మములు చేసినవారైననూ, కామ మోహముచేత కార్తిక పౌర్ణము సోమవారము నాడు శివాలయమున దీపారాధనము కావించిరి. దీపమునకు వత్తిగా తన చీరను చింపి నీ భార్య ఇచ్చినది, రాకుమారుడు ఆముదమును తెచ్చెను కాబట్టి వారి పాపములన్నీ క్షయములైనవి. ఏ కారణము చేతనైననూ కార్తీక మాసమునందు దీపదానము చేసినవాడు ధన్యుడు సర్వ మహాయోగులందు శ్రేష్ఠుడు అగును. కనుక దీపార్పణము వలన నీ భార్యకు, ఈ రాకుమారునికి కైలాసము. దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది.

శివదూతలు ఈ విధముగా చెప్పగా వినిన రాకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో క్రీడించి, ఈ బ్రాహ్మణునిచేతిలో శివాలయములో హతుడనైన నాకు కైలాసము ఇంత సదాచారవంతునికి నరకమా! ఇది చాలా దుఃఖ కరము. కాబట్టి నా దీపదాన పుణ్యము ఈ బ్రాహ్మణునకిచ్చెదను యేక కాలమున మృతినొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. అని ఆలోచించి తన దీపదాన పుణ్యమునందు కొంత బ్రాహ్మణుని పరం చేసెను. అంత ఆపుణ్య ఫలమున ఆ మువ్వురునూ దివ్య విమానమెక్కి కైలాసమును చేరిరి. మోహముచేత చేయబడిన దీపదాన పుణ్యమే ఈ మువ్వురినీ కైలాసమునకు తీసుకొని పోయినది.

కాబట్టి కార్తీక మాసమందు కార్తీక ధర్మమాచరించవలెను, అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందుగాని, విశ్ణ్వాలయమందుగాని దీపమాలను సమర్పించిన ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్ద్వారా పునరావృత్తి రహిత భగవత్సాన్నిజ్యమును పొందును. సందేహమేమీ లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని, పురుషుడు గానీ తన శక్తి కొలది దీపార్పణం చేసినచో సర్వపాపనాశనము పొందెదడు. కాబట్టి నీవును శివాలయమందు తప్పక కార్తీకమందు దీపమాలలను అర్పించుము.

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి నాలుగవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం మూడవ అధ్యాయం.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ వివరించిన శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం మూడవ అధ్యాయం పఠించండి.
కార్తీక పురాణం మూడవ అధ్యాయం
వశిష్ఠ మహర్షి ఇట్లు పలికెను ’ ఓ రాజా! కార్తీక మాసములో స్నాన, దాన, జపాదులైన పుణ్య కార్యములలో ఏ స్వల్పము చేసినను ఆ అల్పమే అనంత ఫలప్రదాత యగును. స్త్రీలైనా పురుషులైనా సరే అశాశ్వతమైన ఈ శరీర మునకు కలిగే కష్టమునకు భయపడి కార్తీక వ్రతము చేయనిచో వంద మార్లు కుక్కగా జన్మించవలసి వచ్చును. కార్తీక పూర్ణిమ రోజున స్నాన దానాలు ఉపవాసము చేయని మనుష్యుడు కోటి మార్లు చండాలుడై పుట్టును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై యుండును. ఈ విషయమై పూర్వమొక కథ గలదు ఆ విషయము చెప్పెదను వినుము.

ఆ ’ఇతిహాసము’ ఒక తత్త్వనిష్ఠునిదైయున్నది గనుక దానిని చక్కగా వినుము. ఓ రాజా! పూర్వము ఆంధ్ర దేశమున తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, ప్రాణులయందు దయ గలవాడు, తీర్థయాత్రలందు అనురక్తి కలవాడు. రాజా! ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోతూ గోదావరీ తీరంలో ఆకాశాన్ని ముద్దుపెడుతున్నవా అన్నట్లుండు మఱ్ఱిచెట్లమీద ఉన్న 3బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పెకి నిక్కి, నోరు వికటముగా, శరీరము నల్లగా, ఉదరము కృశించి, నేత్రములు గడ్డము ముఖము ఎఱ్ఱగా, దంతములు పొడుగుగా ఉండి వారి చేతులలో ఖడ్గములున్నవి, కాపలములను ధరించి ఉన్నవారు సమస్త జంతువులను భయపెట్టుతున్నవారైరి.

ఆ రాక్షసుల భయముచేత ఆ మఱ్ఱిచెట్టుకు చుట్టూ చాలా దూరము (కొన్ని మైళ్ళ) వరకు  మనుష్యులే కాదు, మృగములు, పశుపక్ష్యాదులు కూడ సంచరించవు. ఆ వట వృక్షం దగ్గర నిత్యమూ పర్వత సమాన శరీరులు అగు పశు పక్ష్యాదులు (తెలియక వెళ్ళినవి) ప్రాణములను గూర్చి భయపడి భయంకరమగు బిగ్గరయగు శబ్దలు చేయుచుండెడివి.

అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవ ప్రేరణచేత ఆ మార్గమునపోతూ మఱ్ఱిచెట్టుమీది ఆ బ్రహ్మరాక్షసులను చూసెను. వారిని చూసి భయపడి, మనస్సు చికాకు పొంది హృదయము చలించినవాడై భయముతో శోకించుచు శ్రీ హరి పాదారవిందములను స్మరించుచూ ’ఓ దేవేశా, లోకేశా, నన్ను రక్షింపుము, ఓ నారాయాణా నన్ను పాలింపుము, నా భయమంతయూ తొలగతోయుమో దేవేశా, నీకన్న నాకు దిక్కెవరు శరణు శరణు’

ఈ ప్రకారము స్తుతించుచూ వారి భయమున పరిగెత్తుతున్న బ్రాహ్మణునిచూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించవలెనని ఎంచి అతని వెంబడి పరిగెత్తసాగిరి. కొంత దూరము పోగానే బ్రాహ్మణుని సమీప స్థితి దర్శనమువల్ల బ్రహ్మరాక్షసులకు స్వస్మృతి కలిగినది. తరవాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందుగ భూమిమీద పడి సాష్ఠాంగ ప్రణామము లాచరించి నమస్కరించి అనేక వాక్యములతో స్తుతించిరి.

ఆ రాక్షసులు ఏక కంఠమున ’బ్రాహ్మణోత్తమా మీదర్శనము వల్ల మేము పాపరహితులమైనాము. మీరాక మాకు ఉపకారమైనది. అది నిజమే కదా, మహాత్ములు జీవించుటు జంతువులకుపకారమే కదా! మహాత్ములు యాత్రచేయుట లోకమునుద్ధరించుటకే కదా!’ అని స్తుతించిరి. ఈ మాటలను విన్న బ్రాహ్మణుడు భయముని వదిలి స్థిమిత పడ్డ మనసుతో ఇట్లు పలికెను ’ మీరెవరు? ఏ దుష్కర్మ చేత ఇలాంటి వికృతరూపము కలిగింది. లోకనింద్యమైన ఏకర్మమును మీరు పూర్వము చేసియున్నారు? మీకు భయముపోవు కాలము సమీపించినది కనుక సందేహములేకుండ సర్వమూ నాకు తెలియ జేయుము’. అంత ఆ రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరు వేరుగా జ్ఞప్తితెచ్చుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లు పలికిరి.

మొదటి వాడు ఇట్లు చెప్పెను ’అయ్యా! నేను పూర్వ జన్మములో ద్రావిడదేశములో మందర గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడనై కఠినమైన మాటలు. ఇతరులను వంచించు మాటలు మాట్లాడడంలో నేర్పరిని. నాకుటుంబ లాభముకొరకు ఇతర బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గానీ సాటి బ్రాహ్మణులకు గానీ ఒక్కనాడునూ అన్నము పెట్టనైతిని, బ్రాహ్మణుల సొమ్ము నా స్నేహితులచేత హరింపబడి నాకుటుంబ నాశనము జరిగినది. బ్రాహ్మణుల ధనమును అపహరించిన సూర్య చంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తరవాత మృతినొంది యమబాధలను ఎన్నిటినో పొందొ రౌరవాది నరకబాధల పొంది తరవాత ఆదోషముచేతనే భూమి యందు బ్రహ్మరాక్షస జన్మనెత్తితిని. కనుక ఓ బ్రాహ్మణోత్తమా ఈ నా దోషము పోవు ఉపాయము తెల్పుము’

అందులో రెండవ రాక్షసుడు తనగురించి ఇలా చెప్పుచున్నాడు. ’ అయ్యా! నేను ఆంధ్రదేశమందుండేవాడను, నేను రోజూ తల్లిదండ్రులతో కలహిస్తూ వారందరినీ దూషిస్తూ ఉండేవాడిని. ఇంతేకాక నేను నాభార్యాపిల్లలు షడ్రసోపేతమైన భోజనము చేయుచూ, నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నం పెట్టేవాడిని. బంధువలను, బ్రాహ్మణులను ఏనాడూ ఆదరించలేదు, ఒకనాడైననూ అన్నము పెట్టలేదు. నేను ఎంతో సంపాదించితిని కానీ నా తల్లిదండ్రులకు సరియైన భోజనమును పెట్టి ఎరుగను. తరవాత నేను మృతిని పొంది యమలోకమున 8 యుగములు బాధలను పొంది తరవాత బ్రహ్మరాక్షసుడనై భూమి మీద జన్మనెత్తితిని. ఓ బ్రాహ్మణోత్తమా! నాకీ పాపముతొలగే ఉపాయము చెప్పి నన్ను మీరే ఉద్ధరించవలెను.’

ఇట్లు రెండవ రాక్షసుడుచెప్పగానే, మూడవ రాక్షసుడు కూడ నమస్కరించి తన స్థితిని చెప్పసాగెను. ’అయ్యా! నేను ఆంధ్రదేశ వాసిని, బ్రాహ్మణుడను, విష్ణ్వాలయమునందు అర్చకుడను. స్నానసంధ్యావందనాదులను విడిచి స్వామి పూజనొదిలి పరనిందలను చేయుచు. విశేషముగా మాట్లాడుచు, కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచుండెడివాడను. దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యా గృహమందు దీపములను బెట్టించి ఆనేతిని వేశ్యానుభవమునకు వెచ్చించి, దేవతానివేదాన్నము అపహరించి వేశ్యకు బెట్టి ఆమెతో నేను సంభోగించేవాడిని. ఆదోషములచేత మరణానంతరము నరకమున అనేక యాతనములు పొంది పిమ్మట భూమిమీద నానాయోనులందు జన్మించి ఇప్పుడు బ్రహ్మరాక్షసునిగా జన్మించితిని. అయ్యా! సమస్త భూతములందు అపార కరుణాపూర్ణుడవైన బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించి నాకు ముక్తిని ప్రసాదించు మార్గము తెలుపుము.

తత్త్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్య చకితుడై ఇట్లనెను ’ మీరు ఏమాత్రము అధైర్య పడవలదు. మీ దుఃఖము పోగొట్టుటకై నేను కార్తీక స్నానమునకు పోయెదను, మీరూ నాతో రండి.’ అని వారిని తనతో తీసుకొని పోయి బ్రహ్మరాక్షసుల కొరకు తాను స సంకల్ప స్నానము చేసి వారితోనూ స సంకల్ప స్నానము చేయించి వారి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను.  ఆ బ్రాహ్మణుడి విధిగా స్నానమాచరించి ఆరాక్షసులకొరకు ఫలితము ఇవ్వగా, ఆ ముగ్గురు దోషరహితులై దివ్య రూపములను ధరించి వైకుంఠమును చేరిరి.

ఓ జనక మహారాజా! విను, మోహముచేతగానీ, అజ్ఞానము చేతగానీ, కార్తీక మాసమున సూర్యోదయ కాలములో కావేరియందు స్నానము చేసి తరవాత శ్రీ హరి పూజను చేసిన వారికి వాజపేయాది యజ్ఞములు చేసిన ఫలితము కలుగును, ఎటువంటి సందేహము లేదు. కార్తీక మాసములో ఏదో ఒక ఉపాయముచేత ప్రయత్నించి కావేరీ స్నానము తప్పక చేయవలెను. కార్తీక మాసమున ప్రాతస్నానం చేయనివారు పది జన్మలందు ఛండాలుడై జన్మించి తరవాత పందిగా జన్మించును. కాబట్టి స్త్రీ పురుషులను బేధములేక  కార్తీక స్నానము తప్పక చేయవలెను, ఈ విషయమై విచారణ అవసరం లేదు.
ఇది సాంతపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి మూడవ అధ్యాయము సమాప్తము.
జైహింద్..

6, నవంబర్ 2013, బుధవారం

కార్తీక పురాణం 2వ అధ్యాయం

0 comments


జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ వివరించిన శ్రీ  స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ద్వితీయ అధ్యాయం పఠించండి.
కార్తీక పురాణం ద్వితీయ అధ్యాయం 
వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పుచున్నారు " ఓ రాజా! కార్తీక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయ కర్మలవల్ల కలిగిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతికొరకు సోమవార వ్రతమాచరించేవారు కైలాస నివాసిఅగుదురు. కార్తీక సోమవారమునాడు స్నానము గాని, దానము గాని, జపముగాని చేసిన 1000 అశ్వమేధయాగ ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు.

కార్తీక సోమవారమునాడు, ౧) ఉపవాసము, ౨)ఏక భుక్తము, ౩) నక్తము-రాత్రి భోజనము, ౪)అయాచిత భోజనము, ౫) స్నానము, ౬)తిలాదానము సమానములని చెప్పబడుచున్నవి.

శక్తి గలవారు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివారు నక్తము అనగా రాత్రి భోజనము చేయవలెను. అందుకు శక్తి చాలని వారు ఛాయానక్తము చేయవలెను అనగా (సూర్యకాంతి కొంచెము తగ్గిన తరవాత తనకొలతకు రెట్టింపుగా తన నీడ రాగానే చీకటి పడకముందే భుజించవలెను. అందుకు శక్తి లేనువారు బ్రాహ్మణులను పిలుచుకువచ్చి వారికి పగలే భోజనం పెట్టి తానూ పగలే భోజనం చేయవలెను.

మానవులు కార్తీకమాసమందు కార్తీక వ్రతములలోదేనినైనౌ ఆచరించని వారైన, ఎనిమిది యుగాలు నరకంలో కుంభీపాకంలోనూ, రౌరవంలోను బాధలు పొందుతారు.

కార్తీక సోమవారం నాడు పూర్వసుహాసిని యధావిధిగా ఉపవసించి శివుని పూజించిన శివలోకమును పొందును

స్త్రీలుగానీ పురుషులు గానీ ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములనుచూసి రాత్రి భోజనము చేస్తారో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును.

కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకము, పూజ చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమై ఒక పురాతనమైన ఒక కథ ఉన్నది, చెప్పెదను వినుము. ఇది విను వారికి చెప్పువారికి పాపనాశన కారిఅగును.

కాశ్మీర దేశమునందొక పురోహితున కూతురు స్వాతంత్ర్య నిష్ఠురియను ఒక స్త్రీ కలదు. ఆమె చక్కని రూపముతోనుండి మంచి యవ్వనముతో గూడి యుండెను. తలదువ్వుకొని, అలంకరించుకొని అతిగా మాట్లాడు జారత్వమును అవలంబించుచుండెను. ఈమె దుర్గుణములు చూసి తల్లిదండ్రులు అత్తమామలు ఈమెను విడచిరి. ఈమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్ర శర్మ. అతడు వేద వేదాంగ పారీణుడు. సదాచారవంతుడు. సమస్తభూతములందు దయగలవాడు. తీర్థయాత్రలు చేసి తీర్థములను సేవించినవాడు. సత్యవాక్కును కలిగిఉండేవాడు. ఎప్పుడూ శుచిగా ఉండేవాడు. ఇన్ని ఉత్తమోత్తమ గుణములున్నప్పటికీ ఈతనిని భార్య ఐన స్వాతంత్ర్య నిష్ఠురి నిత్యమూ కొట్టుచునుండేది. అలా నిత్యమూ ఆమెచేత దెబ్బలుతిని గృహస్థ ధర్మమునుండి వెల్వడక భార్యను విడువలేక ఆమెవలన కష్టములను పొందుచున్నాడు.

ఆమె పరమ కర్కశురాలైయుండెను. భర్తయైన మిత్రశర్మ ఈమెతో సంభోగవాంచచేత ఈమెతో అనురాగముతో ఉండెను. అంత ఒకనాడు ఈమె దుర్జనులైన తన ప్రియులిచ్చిన ద్రవ్యము ఆభరణములు తీసుకొని, వారి కోరిక మేరకు ఆమెయందు వారికి నిరంతర సంభోగము మిత్రశర్మ వలన భంగము కలుగుతున్నందున అతనిని చంపమని చెప్పగా సమ్మతించినది. ఆ కర్కశ రాత్రి తన భర్తతో క్రీడించి తరవాత తన భర్త నిద్రించగానే తానులేచి ఒక పెద్దరాతిని తెచ్చి భర్తశిరస్సున కొట్టగా మిత్రశర్మ మరణించెను. తరవాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడుబడిన నూతిలో పడవేసెను.

అలా భర్తను చంపి తరుణులను పరస్త్రీసంగమాభిలాషులను కామశాస్త్ర ప్రావీణులను, వర్ణసంకర కారకులు ఐన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండెను. అంతియేగాక, భర్తయందనురాగముతోనున్న భార్యలను దుర్భోదలచేత యితరులచే సంభోగము చేయించుచు, ఏక పత్నీ వ్రతుల వ్రతమును భంగ పరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేస్తూ ద్వేషపూరితయై దేవతలను ద్వేషించుచుండెను.

ఆమె నిరంతరమూ దయాశూన్యమనస్కయై, గర్వముచేకానీ, పరిహాసానికి కానీ హరి నామ స్మరణము , విష్ణు పాదాబ్జముల ధ్యానమూ చేయకుండినది. ఇలా ఉండగానే, ఈమెకు యవ్వనమయు పోయినది, వ్రణములు కలిగి వ్యాధులు ప్రబలినవి. ఆమెకు ఉన్న వ్రణముల నుండి పురుగులు వచ్చి దుర్గంధము వచ్చుచుండెడిది. ఆమె కొరకై వచ్చెడి జారులందరూ రూపవంతులై మదయుక్తులై వచ్చి ఆమెను చూసి నిరాశతో తిరిగిపోయెడివారు.

ఆమె పాపాధిక్యముచేత చాలా బాధనుపొంది ఆ వ్రణ బాధతోనే శరీరము విడిచెను. అక్కడకు భయంకరమైన యమభటులు వచ్చి ఆ కర్కశను పాశములతో బంధించి కట్టి యముని వద్దకు తీసుకొని పోయిరి. అంత ఆ సమవర్తి ఆమెను చూసి కృద్ధుడై ఈమెను భయంకరమగు ముళ్ళతో కూడి, ఎర్రగా కాలి మండుచుండగా దానిని ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను వేసెను. అంత ఆ ఆజ్ఞమేరకు భటులు ఆ కర్కశకు చేసిన పాపములను చెప్పుచూ ఆ కాలుతున్న స్తంభమును సంభోగించమనిరి.

తరవాత యమ కింకరులు యమ దండములచేత కర్కశ తల మీద కొట్టి తరవాత కుంభీపాకమునందు వేసి బాధించిరి. ఆమె పాదములు రెండు పట్టుకుని రాతిమీద పెట్టి కిట్టిరి, రక్తము కాచి త్రాగించిరి సీసము కాచి రెండు చెవులా పోసిరి. యమ కింకరులు యమాజ్ఞమేరలు చిత్రగుప్తాజ్ఞమీదను అనేక నరక బాధలకు కర్కశను గురిచేసిరి. అలా ఆ కర్కశ తన పితృపితామహులతో కూడ తన ముందు పది తరములు తరవాత పది తరములతో కలిసి ఘోరమైన నరకబాధలను పొంది తరవాత తిరిగి భూమి పై జన్మించినది.

భూమి మీద పదిహేను జన్మలు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంట కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగు చుండెను.

ఓ జనక మహారాజా! ఇట్లుండగా ఒకానొకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం రోజున పగలంత ఉపవాసముచేసి ఇంట్లో శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్రమండలమును చూసి ఇంట్లోనికి పోయొ దేవ నివేదన చేసి ఆ తరవాత భూత బలిదానము కొరకు బచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి లోనికి వెళ్ళెను.

ఆ కుక్క ఆనాడు పగలంతయు ఏమీ దొరకనందున కృశించినదై కార్తీక సోమవారము నక్షత్ర మండల దర్శన కాలమైన తరవాత ప్రదోషంబున ఆ బలిని భక్షించెను. ఆ బలిని భక్షించుటచే ఆ కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమా రక్షింపు రక్షింపుమని అరచెను. ఆ మాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యపోయి, ’ఓ కుక్కా మా యింట్లో ఏమి తప్పు చేసినావు రక్షింపుమని అడిగావు’ అని అడిగెను. అంత ఆ కుక్క ’ ఓ బ్రాహ్మణోత్తమా నేను పూర్వ జన్మమునందు బ్రాహ్మణ స్త్రీని పాపములు చేసినదానను, కులటను, వర్ణసంకరమునకు కారణమైతిని, అన్య పురుషులను మరిగి నా నిజ భర్తను చంపినాను.

ఇన్ని పాపములు చేసిన చచ్చి యమలోకమునకు బోయి అక్కడ అనేక బాధలు పొంది తిరిగి భూమి వచ్చి 15 మాట్లు కుక్కగా పుట్టి నాను. నాకు ఇప్పుడు నా ఆజాతి స్మరణ మెట్లు కలిగెనో చెప్పుము విని సంతోషించెదను

ఆ బ్రాహ్మణోత్తముడీ మాటవిని జ్ఞాన దృష్టితో చూసి, తెలుసుకుని ఇట్లనె. ఓ కుక్కా! ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజించక యిప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు నీ స్వంత స్మృతి కలిగినది. ఆ మాటలు విని ఆ కుక్క ’వేద వేదాంగ పారీణుడైన ఓ బ్రాహ్మణోత్తమా ఈ కుక్క జాతినుంచి నాకెట్లు మోక్షమో చెప్పుమా అని అడిగెను’

కుక్క ఇలా ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యము ఆ కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యము ఇవ్వగానే కుక్కదేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించెడి వస్త్రములు కలదై మాలలను, ఆభరణములను ధరించి తన పితరులతో కూడి కైలాసమునకు వెళ్ళి అక్కడ పార్వతీ దేవివలె శివునితో గూడి ఆనందించుచుండెను.

కాబట్టి కార్తీకమాసమందు సోమవార వ్రతమాచరించవలెను. ఎవరు ఈ కార్తీక సోమవార వ్రతమును చేయునో వారికి మోక్షము కరతలామలకము. జనక మహారాచా పుణ్య ప్రదమైన కార్తీక వ్రతంబును నీవునూ చేయుము.
ఇది సాంతపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి రెండవ అధ్యాయము సమాప్తము.
జైహింద్.

శ్రీ వల్లభవఝల కృత సుదర్శన చక్ర బంధ శార్దూలము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల చిత్ర కవి కృత సుదర్శన చక్ర బంధ శార్దూలమును తిలకించండి.
శ్రీ వల్లభ వఝలవారికి అభినందనలు.
జైహింద్.

4, నవంబర్ 2013, సోమవారం

’భగినీ హస్త భోజనం’ కార్తీక శుక్ల విదియ తిథి రోజున

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ గారి యొక్క  ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగ వివరణము
కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను జరుపుకుంటారు.
ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా దేవి (నది)ని స్మరించి పూజించాలి.
సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజుగారు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమే తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా వరం కోరుకోమనగా. యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు.
అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది.  తరవాత యమునమ్మను పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు.
దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ.
అందువలన అవకాశం లేనివారికెలాగూలేదు, ఉన్నవారందరూ ఈ పండుగను జరుపుకొని, రక్త సంబంధాలనీ, ఆత్మ సంబంధాలనీ, కుటుంబ బాంధవ్యాలనీ పెంపొందించెదరు గాక.
తరవాత సోదరుడు తన సోదరిని పరివారంతో సహా తన ఇంటికి మరునాడు ఆహ్వానించి అంతే ఆప్యాయంగా ఆదరించి ఇతోధికంగా కానుకలిచ్చి గౌరవించి పంపడం ఆచారం ఈ రోజును సోదరీ తృతీయ అని పిలుస్తారు.
అంటే ప్రస్తుతం 05/11/2013 మంగళవారం నాడు (రేపు) యమ ద్వితీయ, ఎల్లుండి సోదరీ తృతీయ.
నాగేంద్ర కుమార్ గారికి ధన్యవాదములు.
జైహింద్.

పాఠకులకు శ్రీ వల్లభవఝల వారి దీపావళి శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆంధ్రామృత పాఠకులకు మన చిత్రకవి శ్రీమాన వల్లభవఝలవారు శుభాకాంక్షలు తెలియఁ జేశారు. తిలకించండి.
హృదయ నైర్మల్యమునకద్దమిది యనంగ
నారసింహుల సత్ కాంక్షతీరు దోచె.
ధన్యవాదమ్ములయ్య సద్గణ్య మహిత!
అందిరందరు పాఠకులద్భుతముగ.
జైహింద్.

న కార్తిక సమో మాసః ప్రథమోధ్యాయః.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! పవిత్రమైన భక్తిభావ రంజితమైన హృదయోల్లాస జనకంగా పవిత్ర కార్తీక మాసమును్ కాలపురుషుఁడు మన ముందుకు తెచ్చాడు. ఈ మాసము చాలా పవిత్రమైన మాసము.
స్కాంద పురాణమున కార్తీక మాసము నిరుపమానమైనదిగా ఈ విధంగా చెప్పబడింది.
శ్లో: న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్
గీ: లేదు కార్తీక మును మించి లేదు లేదు.
లేదు కృతయుగ సమమెంచ లేదు లేదు.
లేదు వేదమున్ బోలగ లేదు లేదు.
లేదు గంగమ్మనే మించ లేదు లేదు.
భావము: కార్తీక మాస సమమైన మాసము, కృత యుగమునకు సమమైన యుగము, వేదమునకు సమమైన శాస్త్రము, గంగకు సమమైన తీర్థము లేదనితాత్పర్యము.

శ్రీ స్కాందపురాణమునందలి కార్తికమహాత్మ్యమున 
ప్రథమాధ్యాయము.
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం. 
శ్లో! వాగీశాద్యస్సుమనస స్సర్వార్థానాముపక్రమే!
యన్నత్వాకృతకృత్యాస్స్యుస్తంనమామి గజాననమ్!
నైమిశారణ్యములో సత్ర యాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు మహానుభావుడైన 
సూతమహర్షిని ఉద్దేశించి " ఓ సూత మహర్షీ! జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షిచేత చెప్పబడిన   కార్తీక మహాత్మ్యమును విస్తరముగా మేము మీవలన తెలుసుకొనగోరితిమి, కనుక దయతో సెలవీయండి " అని అడిగిరి. అంత సూత మహాముని " ఓ శౌనకాది మహామునులారా! వినండి, ఈ కార్తీక మాహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుగారికి చెప్పెను, అలానే ఇతః పూర్వము చతుర్ముఖ బ్రహ్మగారు నారదునికి, పార్వతీ దేవికి మహాదేవుడు, లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పెను. దీనివలనసమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవాడు జనన మరణ సంసార బంధనమును త్రెంచుకొని మోక్షమును పొందుటకు అర్హుడగును. ఒకానొకప్పుడు దైవ వశము చేత  సిద్ధాశ్రమమునకు వెళుతున్నటువంటి వశిష్ఠ మహర్షి జనకమహారాజు గృహమునకేగెను. అంత జనక నృపుడు వచ్చిన బ్రహ్మర్షిని చూసి సింహాసనమునుంచి త్వరగా దిగి దండప్రణామము చేసి సంతోషముతో పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సునందుంచుకొని బంగారపు ఆసనమును ఇచ్చి ’వికసించిన తామరలవంటి కన్నులు కలిగి, సమస్త జీవులయందుని దయగలిగి, అంతరింద్రియనిగ్రహముగలవాడై సదాచారవంతుడై బాలసూర్యుని పగిది కాంతి కలిగి సమస్తగుణ సంపన్నుడగు ఆ బ్రహ్మర్షితో భక్తిభావముతో ఇట్లడిగెను. జనకమహారాజు ’ బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువల్ల నేను ధన్యుడనైతిని, నేను చేయతగిన పుణ్యమింకేమీలేదు. మాపితృదేవతలందరూ ఇప్పుడు తృప్తిని పొంది ఉన్నారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము, గనుక ఇప్పుడు మీరు మాయింటికి విచ్చేయడం వల్ల నాకు శుభములు సమకూరును’ అని పలికెను.సూతమహర్షి ’జనకుడిట్లు పలికిన తరవాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖముకలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వు నవ్వుతూ రాజుతో ఇట్లు పలికె’ నని శౌనకాది మహామునులతో చెప్పెను. ఓ రాజోత్తమా! నీకు క్షేమమగుగాక, నేను మాఆశ్రమమునకు బోవుచున్నాను, రేపు ఆశ్రమమందు యజ్ఞము జరుగవలెను, దానికి ఇప్పుడు ద్రవ్యముని నీవు ఇచ్చుటకు తగి ఉన్నావు.అంత రాజు బ్రహ్మర్షి వశిష్ఠునుద్దేశించి ఇలా పలికుచున్నాడు ’ ఓ మహర్షీ ! మీ యజ్ఞమునకు దాసుడనై ద్రవ్యమునివ్వగలవాడను. నాకు మీ వలన వినువారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములను  వినగోరుచున్నాను. మీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలమిచ్చెడి సూక్ష్మ ధర్మము చెప్పుమా. ఓ మునీశ్వరా! కార్తికమాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లు అధికమైనదో దానిని వినగోరుచున్నాను. నాకు తెల్పుము మీ కంటే ధర్మమును చెప్పువారెవ్వరూలేరు.అంత వశిష్ఠమహర్షి ఇలా పలుకుచున్నాడు ’ ఓ రాజా! పూర్వమందు పుణ్యకార్యములాచరించినందుకు సత్వశుద్ధిగలుగును, సత్వ శుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును, కనుక లోకోపకారార్థమై ఇప్పుడు నీవడికిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము, విన్నంతనే పాపములు నశించును.రాజా! సూర్యుడు తులాసంక్రమణమందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో యేవి చేసినా అవి అక్షయమగును అని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులాసంక్రమణము మొదలుకొనిగాని, కార్తీక శుక్ల పాడ్యమి మొదలుకొని గానీ ఆరంభించవలెను.కార్తీక వ్రతము మొదలు పెట్టేముందు ఓ దామోదరా! నేను కార్తీక వ్రతమారంభించుచున్నాను దానిని నిర్విఘ్నంగా పూర్తిచేయించుము అని సంకల్పించి కార్తీక స్నానమారంభించాలి.కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచరించుటచే అట్టి వారికి ఇట్టిట్టిదని చెప్పలేని మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశియందు కార్తీకమందు చెరువులలోనూ, బావులలోను, నీటిగుంటలలోను, కాలువలలోనూ నిత్యమూ వసించి ఉండును.రాజా! సదాచారపరులైన సకల వర్ణమువారునూ ఈ కార్తీక మాసమున గంగకు వెళ్ళి నమస్కరించి ఆ శ్రీ హరిని స్మరించి కాళ్ళూ చేతులు కడుక్కొని, ఆచమించి భైరవుని ఆజ్ఞ గైకొని మొలలోతునీటిలో మునిగి గంగాస్నానం చేయవలెను.దేవ, ఋషి, పితృదేవతా గణములకు తర్పణము ఇచ్చి, శ్రీ హరి మీద భక్తితో అఘమర్షణ మంత్రములు చదువుతూ బొటనవేలితో ఆలోడనము చేసుకొని, భూమి మీదకు వచ్చి యక్ష్మ తర్పణము చేసి (ఉదకాంజలి) వస్త్రమును విడచి యధా శాస్త్ర ప్రమాణం పొడి వస్త్రం ధరించవలెను.తరవాత ఊర్ధ్వపుండ్ర ధారణమును చేసికొని, సంధ్యావందనము, గాయత్రి, బ్రహ్మ యజ్ఞము ఇత్యాది నిత్య కర్మానుష్ఠానములు చేసుకొనవలెను. స్వంత తోటలోని పువ్వులతో శంఖ చక్రములు ధరించిన శ్రీ హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను.తరవాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరవాత పురాణ శ్రవణం చేయవలెను.
సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములనన్నిటినీ ఆపి విష్ణ్వాలయమునకు గానీ, శివాలయమునకు గానీ వెళ్ళి తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణువు యొక్క గానీ శివుని యొక్కగానీ స్త్రోత్ర, జప, ధ్యానాదులను చేసుకొని నమస్కారము చేయవలెను.ఈ ప్రకారం ఎవరు ఈ కార్తీకమాసమందు భక్తితో వ్రతము చేయుచున్నాడో వాడు పునరావృత్తి రహితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వ జన్మార్చితములూ, ఈ జన్మార్జితములూ అయిన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన యెడల నశించును.
బ్రాహ్మణుడుగానీ, క్షత్రియుడుగానీ, వైశ్యుడుగానీ, శూద్రూడు గానీ, తపస్విగానీ, స్త్రీలు గానీ, ఎవరైనా సరే భక్తిశ్రద్ధలతో కార్తీకవ్రతమును చేసిన వారికి పునరావృత్తిలేదు. ఏవరు కార్తీక వ్రతవంతుని జూచి సంతోషించునో అంత మాత్రమునకే ఆ దినమున వానికి కల్గిన పాపములు నశించును. ఇందుకు సందేహములేదు.శ్రీ స్కాందపురాణమందలి కార్తీకమాహాత్మ్యమున మొదటి అధ్యాయము సమాప్తము.
జైహింద్

2, నవంబర్ 2013, శనివారం

దివ్వెల పండుగ అందరిలో ఆనందం నింపాలి నిండుగా.

2 comments

జైశ్రీరామ్.
దీపావళి సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.
నరకుని చంపి బ్రోచె కరుణామయి సత్య జగంబునెల్ల. యా
నరకుడె మాయ రూపమున నర్తన నాత్మలఁ జేయుచుండగా
ధరణిజ యాత్మ నిల్చి పర తత్వము నిల్పగ నా దురాత్మకున్
స్థిరముగ మాపి గొల్పె గుణ దీధితి వెల్గుల దివ్వెలన్ మదిన్.

ఆ జగన్మాత మనలోని నరకాసుర సంహారమొనర్చి, జ్ఞాన జ్యోతులను వెవెలిగించి హృదయముల నానందమయోజ్వల కాంతి పూర్ణముగా చేయును గాక.
శుభమస్తు.
జైహింద్.