గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2021, శుక్రవారం

ఆచార్యాః పితరః పుత్రా.. ||1-34||..//..ఏతాన్న హన్తుమిచ్ఛామి.. ||1-35||..//అర్జున విషాద యోగము.

0 comments

 

జైశ్రీరామ్.

శ్లో.  ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ పితామహాః |

మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా ||1-34||

తే.గీ.  తండ్రులున్, మేన మామలు, తాతలు మరి

మామలున్,సుతులును,భావ మరుదులు వర

లుదురు వియ్యంకు లాచార్యులు మనుమలును

నిలిచి రిద్ధాత్రి నిచ్చట న్నీవు కనుమ.

భావము. 

ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ

మామలూమనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ 

మొదలైన వారు.

శ్లో.  ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన |

అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||1-35||

తే.గీ.  కనుమ మధుసూదనా! నీవు కరుణ వీడి

నన్నుఁ జంపినన్ గాని నే నెన్నటికిని

కల త్రిలోకాధిపత్యంబు కలుగవచ్చు

చంపగాబోను, భూమికై చంపఁగలన?

భావము.

మధుసూదనానేను చంపబడినప్పటికీత్రిలోక అధిపత్యానికైనా 

వీరిని  చంపడానికి ఇష్టపడనుఇక భూలోక రాజ్యం కోసం 

చంపుదునా.

జైహింద్

                                                                                                                                

30, డిసెంబర్ 2021, గురువారం

న కాఙ్క్షే విజయం కృష్ణ.. ||1-32||..//..యేషామర్థే కాఙ్క్షితం నో.. ||1-33|..//.. అర్జునుని విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  న కాఙ్క్షే విజయం కృష్ణ రాజ్యం సుఖాని |

కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||1-32||

తే.గీ.  కోరను విజయము, నే నిన్

గోరను రాజ్యంబు సుఖము, కోరెదఁ జెపుమా

గోరిన రాజ్యము భోగము

నేరీతి ఫలము కలుగును కృష్ణా! కృపతో.

భావము.  కృష్ణానేను జయం కోరనురాజ్యం కాని సుఖాలు కాని 

కోరనుగోవిందా  రాజ్యం వలన కానిభోగాల వలన కాని

జీవించడం వలన కాని  ప్రయోజనం ఏమిటి.

శ్లో.  యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని  |

 ఇమేऽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని  ||1-33||

తే.గీ.  రాజ్య, సుఖ, భోగములెవరి రంజనకని

కోరుచుంటిమో, వీడిరి వారు సర్వ

సంపదలను, ప్రాణములను,  శాశ్వతముగ,

నిలిచి యుండిరిచ్చోటనే, నీరజాక్ష!

భావము.

ఎవరికోసం మనం రాజ్యాన్నిసుఖ భోగాన్ని కోరుకుంటామో వారు 

ప్రాణాలనుసంపదలనుత్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు.

జైహింద్

.                                                                                                                                                                      

28, డిసెంబర్ 2021, మంగళవారం

గాణ్డీవం స్రంసతే హస్తాత్..//.. ||1-30||..//..నిమిత్తాని చ పశ్యామి..//.. ||1-31||..//.అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |

శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ మే మనః ||1-30||

తే.గీ.  చేతి గాండీవ మది జారు భీతి గొలుపు,

దేహమే మండుచుండెను దేవదేవ!

నిలుచుటకు శక్తి లేదిక, నిలకడ విడి

మతియు భ్రమియించుచుండెను మాధవుండ!

భావము. 

గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి 

ఓపికలేకుండా ఉన్నదిమనస్సుభ్రమిస్తోంది                                                                                                                                 .

శ్లో.  నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ |

శ్రేయోऽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||1-31||

తే.గీ.  కేశవా! దుశ్శకునములు క్షితిని గనితి,

స్వజన హననంబుచేతను ఫలమదేమి

కలుగునో గాంచ లేకుంటి, కమల నయన!

ఇట్టిదుస్స్థితిన్ గట్టెక్కుటెట్టులొ కద.

భావము. 

కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన 

ఏమి మేలుకలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను.

జైహింద్.                                                                                                                                 

27, డిసెంబర్ 2021, సోమవారం

కృపయా పరయావిష్టో. ||1-28||.//..సీదన్తి మమ గాత్రాణి .. ||1-29||..//..అర్జునవిషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్

అర్జున ఉవాచ |

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28||

తే.గీ.  చూచి ఘన తరంబగు కృపన్  క్షోభ చెంది,

ఘన విషాదంబులో మున్గి, క్షణము నిలిచి,

కృష్ణునిగని పలికెనిటు, కృష్ణ! గాంచ

నుభయ పక్షాల, బంధువులుండిరకట.

భావము. 

అర్జునుడు ఇలాఅన్నాడుఉదృతమైన కరుణ ఆవహించగా 

విషాదంతో ఇలా అన్నాడుయుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న 

నా బంధువులను చూడగా

శ్లో.  సీదన్తి మమ గాత్రాణి ముఖం  పరిశుష్యతి |

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||1-29||

తే.గీ. కనగ వీరిని కంపంబు కలుగుచుండె,

సిధిలమగుచుండెదేహంబుజిహ్వ యెండె,

గగురుపాటుకులోనైతి, కలతచెంది

మనసుదుర్భలమగుచుండె,మాధవుండ!

భావము.

నాఅవయవాలు శిధిలమై పోతున్నాయినోరు ఎండి పోతుంది

నా శరీరం వణుకుతుందిరోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి.

జైహింద్.

                                                                                                                                   


26, డిసెంబర్ 2021, ఆదివారం

తత్రాపశ్యత్స్థితాన్పార్థః.. ||1-26||..//..శ్వశురాన్సుహృదశ్చైవ..//.. ||1-27||../..అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్

శ్లో.  తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్

ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||1-26||

తే.గీ.  అర్జునుం డటఁ గాంచె తా నపుడు తండ్రు

లను, గురువులను, తన తాతలను సుతులను

మనుమలను తన మేనమామల నెఱింగె,

వారలను మదిఁ గనె తనవారెయనుచు.

భావము. 

అప్పుడు అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, 

మేనమామలను,  కుమారులను, మనుమలను చూచాడు.

శ్లో.  శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |

తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27||

తే.గీ.  అర్జునుం డింకయున్ గాంచె నచట నుండి

నట్టి యుభయపక్షంబుల నలరుచున్న

సైనికులనపుడా బంధుజనులనుమది,

యుద్ధసన్నద్ధులైయున్న యోద్ధుతతిని

భావము. ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి 

ఉన్న యావన్మంది  బంధువులను సమీక్షించి, 

జైహింద్.    

                                                                                                                                     

                                                                                                                           


25, డిసెంబర్ 2021, శనివారం

ఏవముక్తో హృషీకేశో.. ||1-24||..//..భీష్మద్రోణప్రముఖతః .. ||1-25||..// అర్జున విషాదయోగము.

0 comments

 జైశ్రీరామ్.

సఞ్జయ ఉవాచ |

శ్లో.  ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |

సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24||

తే.గీ.  భారతా వినుమనుచును పలికె సంజ

యుండు, విని కృష్ణుఁడా యర్జునుం డనిన ప

లుకులను, రథంబు నిలిపెను ప్రకటితముగ

నుభయసైన్యంబు మధ్యన నొప్పిదముగ. 

భావము. 

సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల 

మధ్య ఉత్తమమైన  రధాన్ని నిలబెట్టి,

శ్లో.  భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |

ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25||

తే.గీ.  ద్రోణ భీష్మాది ప్రముఖుల తోడ నిచట

ఘనుల కనుమంచు సారథి కవ్వడికనె

కౌరవుల సైన్యబలమును కనులఁ గాంచ

వ్యూహమునెఱింగి సాగుచు పోవ నెంచి.

భావము. 

భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ 

కౌరవులను చూడు అన్నాడు. 

జైహింద్.                                                                                                                                                                                                                                                

24, డిసెంబర్ 2021, శుక్రవారం

భక్తిసాధనమ్ అవద్గహాఆంశపూరణలు.

0 comments

జై శ్రీరామ్.
    
 భక్తిసాధనమ్ అవద్గహాఆంశపూరణలు.

జైహింద్.

యావదేతాన్నిరీక్షేऽహం ||1-22|| // యోత్స్యమానానవేక్షేऽ ||1-23||// అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  యావదేతాన్నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ |

కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||1-22||

తే.గీ.  యుద్ధమును చేయఁ గోరుచు నున్నదెవరొ

యెవరితో యుద్ధమునుచేయ నెదురునిలువ

వలెనొ వారినే నే జూడ వలయునిపుడె

యనెను కృష్ణునిజూచుచు నర్జునుండు. 

భావము.  

యుద్ధంచేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిలో నేను ఎవరితో 

యుద్ధం చేయాలో వారిని చూడాలి                                                                                                                               

శ్లో.  యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేऽత్ర సమాగతాః |

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||1-23||

తే.గీ.  దుష్టుఁడగు ధార్తరాష్ట్రుని తోడనుండి

తృప్తి కలిగింప వానికి నాప్తులగుచు

నుండిరిచ్చట, యిచ్చటనున్న నేను

చూడగావలె వారిని చూపుమనెను.

భావము.    

దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి 

ఎవరెవరు ఇక్కడ  సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను.                              

జైహింద్.                                                                                                                             

23, డిసెంబర్ 2021, గురువారం

చిరంజీవి కోళ్ళ దివ్యతేజ గానం చేసిన గంగాధరా శంకరా భక్తి గీతం.

0 comments


జైశ్రీరామ్.


శ్రీ గంగాధరునాశ్రయించు సుకవుల్, జిజ్ణాసులౌగాయకుల్
రాగద్వేష విదూరులై శివగురున్ బ్రార్థించి,తద్దైవమౌ
భోగాలంకృతుసత్ కృపన్ బడసి ప్రాపున్ బొందది శాంతంబుగా
సాగించందగువార లిద్ధరణిపై శశ్వత్ సుఖంబందగన్.
జైహింద్.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం.. ||1-19||//అథ వ్యవస్థితాన్దృష్ట్వా.. ||1-20||హృషీకేశం తదా వాక్య. ||1-21||//అర్జున విషాదయోగము..

0 comments

 జై శ్రీరామ్.

శ్లో.  స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |

నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్ ||1-19||

తే.గీ.  భూమి నాకాశమునశంఖపూరణరుతి

మించి భీతిలగ ప్రతిధ్వనించెనపుడు,

ధార్తరాష్ట్రుల హృదయముల్ దర్పముడుగ

చీల్చి నిస్తేజులుగ చేసె చెన్ను గాను.

భావము.   

ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

శ్లో.  అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |

ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||

తే.గీ.  అప్పు డచట ప్రబలిన యాహవమున

నగచరసుకేతనుండగునర్జునుండు

యుద్ధ సన్నద్ధచిత్తులై యొప్పియున్న

ధార్తరాష్ట్రుల గాంచిసత్ స్ఫూర్తిని గని,  

భావము. ఓ రాజా! అప్పుడు కపిధ్వజుఁడయిన అర్జునుఁడు యుద్ధ సన్నద్ధులై 

యున్న ధ్రుతరాష్రునకు సంబంధించినవారిని చూచి స్ఫూర్తి పొంది,

(తరువాత పద్యముతోనన్వయము.)

 

శ్లో.  హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |

అర్జున ఉవాచ |

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||

తే.గీ.  ఓ మహారాజ! యచటమహోహ్వలముగ

నొప్పియున్నట్టి కృష్ణని నొకపరిగని

అర్హునుండనెతన రథమాహవమున

నడుమ నిలుపుమనుచుభక్తిపొడమ మదిని.

భావము. ఓ మహారాజా! అప్పుడు శ్రీకృష్ణునితో అర్జునుఁడు తన రథమును 

ఉభయ సైన్యమునకు మధ్య నిలుపమనెను.

(లేదా)

శ్లో.  అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |

ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||

శ్లో.  హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |

అర్జున ఉవాచ |

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||

తే.గీ.  యుద్ధస్న్నద్ధులై యట నున్న ధార్త

రాష్ట్ర సుతులను గాంచిన ప్రవరుఁడయిన

అర్జునుఁడు తాను పార్థుతోననియె రథము

సేనలకు మధ్యనిలుపుమంచోనరేంద్ర! 

భావము.    

అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు 

విల్లు ఎక్కుపెట్టిన  పాండవ మధ్యముడు ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, 

(అర్జున ఉవాచ)

అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు అని అర్జునుడు పలికెను..

జైహింద్.

22, డిసెంబర్ 2021, బుధవారం

కాశ్యశ్చ పరమేష్వాసః ||1-17|| // ద్రుపదో ద్రౌపదేయాశ్చ ||1-18|| //అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్ .  

శ్లో. కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||1-17||

ఆ.వే.  మహిత రథి శిఖండి,మరియు  దృష్టద్యుమ్ను

డునపరాజితుడతడుకనగనట 

సాత్యకియు విరాట్టుసధనుకాశీరాజు

శంఖనాదమచటసలిపిరపుడు.    

భావము.  

ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, 

విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ శంఖనాదము చేసిరి.

శ్లో.  ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |

సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18||

ఆ.వె.  తవిలి ద్ఉపదరాజు ద్రౌపదీ సుతులును,

వరసుభద్ర సుఁతుడు వరలిరచట,

రాజులందరచట ప్రారణమ్భ సూఇగా

శంఖ నాదములను సలిపినారు.

భావము. 

ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన 

అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.

జైహింద్.  

                                                                                                                             


21, డిసెంబర్ 2021, మంగళవారం

పాఞ్చజన్యం హృషీకేశో ||1-15|| // అనన్తవిజయం రాజా ||1-16|| అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్

శ్లో.  పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |

పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః ||1-15||

తే.గీ.  పాంచజన్యంబు పూరించెభవ్యుఁడు హరి,

దేవదత్తమర్జనుఁడూదె దిశలుమ్రోగ,

పొండ్రకమ్మూదె భీముఁడు,భయముకలుగ,

యుద్ధమున సైన్యమంతయున్ సిద్ధపడగ.   

భావము.                                                                                           

పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే 

మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు.

శ్లో.  అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |

నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||1-16||

తే.గీ.  కుంతికొడుకుధర్మజుడటనంతవిజయ

మూదె,నకులుఁడూదె సుఘోషమోదమలర,

ఊదె మణిపుష్పకంబునుయోధుఁడయిన

మాద్రితనయుఁడు సహదేవమహితుఁడెలమి.

భావము.       

కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే 

వాటినినకుల సహదేవులు ఊదారు.

జైహింద్.

20, డిసెంబర్ 2021, సోమవారం

తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ ||1-13|| // తతః శ్వేతైర్హయైర్యుక్తే ||1-13|| అర్జున విషాద యోగము

0 comments

 జైశ్రీరామ్

శ్లో.  తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |

సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13||                                                          

తే.గీ.  శంఖముల్ భేరులే గాక సమరమునకు

సిద్ధమని దెల్ప పణవముల్, చెలగిమ్రోగె

గోముఖంబులు,తప్పెటల్, కూడి మ్రోగ

వినగ గజిబిజిగాఁ దోచె, విశ్వమునను.

భావము.                                                                                                                                    ఆ

వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ,

మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.


శ్లో.  తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |

మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14||

కం.  శ్వేతాశ్వరథముపై వి

ఖ్యాతిగ హరియును కిరీటి యలరుచు శంఖం

బాతత గతిఁ బూరించిరి,

జ్ణాతంబవ సైనికులకు జయనాదముగా.

భావము.                                                                                                                                   

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు

దివ్యశంఖాలను ఊదారు. 

జైహింద్.

19, డిసెంబర్ 2021, ఆదివారం

అయనేషు చ సర్వేషు ||1-11|| // తస్య సఞ్జనయన్హర్షం ||1-12|| అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్ 

శ్లో. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |

భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||1-11||                                                                       

కం. మీరలువ్యూహములన్నిట                                                                                                        

మీరక మీ స్థానములనుమెలగుచు భీష్మున్                                                                

నేరుపుతో రక్షింపుడు                                                                                     

చేరగసద్విజయ పథముశ్రీమంతముగా.                                                                    

భావము.                                                                                                                                    

అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా 

భీష్ముణ్ణే రక్షించాలి

శ్లో. తస్య సఞ్జనయన్హర్షం కురువృద్ధః పితామహః |

సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||1-12||                                                       

కం. అతనికి హర్షము  గూర్చుచు                                                                                

పితామహుఁడు సుప్రతాప వీరుఁడు భీష్ముం                                                                   

డతులిత  శంఖానాదము                                                                           

క్షితి,కురువృద్ధుండు చేసె కీర్తిప్రసదుఁడై                                                                                             

భావము.                                                                                                                      

అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా 

సింహగర్జన చేసి శంఖం ఊదాడు.

జైహింద్. 

18, డిసెంబర్ 2021, శనివారం

దత్త జయంతి సందర్భముగా శుభాకాంక్షలు.

0 comments

జై శ్రీరామ్.

 జై గురుదత్త.

మీకు దత్త జయంతి సందర్భముగా శుభాకాంక్షలు. 

ఉ.  దత్త జయంతి నేడు గుణధాముల కందుత దత్త దీవనల్,

మత్తును వీడ జేయుత,సమస్తజగత్పతిపైన భక్తినే

యెత్తరినైన గొల్పుత,శుభైకమహత్ఫలదాత యౌచు సం

పత్తినొసంగి మిమ్మిలను వర్ధిల జేయుత దత్తుడెప్పుడున్.

సద్విధేయుడు

చింతా రామకృష్ణారావు

జైహింద్.

అస్మాకం తు విశిష్టా యే ||1-7|| //భవాన్భీష్మశ్చ కర్ణశ్చ ||1-8|| // అన్యే చ బహవః శూరా ||1-9||//అపర్యాప్తం తదస్మాకం // ||1-10|| శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్

ఓం నమో భగవతే వాసుదేవాయ.

శ్రీమద్భగవద్గీత

అర్జున విషాద యోగము.

శ్లో.  అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |

నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7||

తే.గీ. బ్రాహ్మణోత్తమా! తెలియుఁడు ప్రస్తుతమున

ఘనులు మన పక్షమందున కలిగిరెవరొ,

నాదు సైన్యంబునందలి నాయకులను

తెలిపెదను నమీకునేనిటఁ దెలియుటకని.

 

భావము.

బ్రాహ్మణోత్తమా! మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా 

సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.

శ్లో.  భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ ||1-8||

 

తే.గీ. భీష్ముఁడును, మీరు, కర్ణుండు, వీరవరుఁడు

కృపుఁడు, సోమదత్తజుఁడు భూరిశ్రవుడును,

ఘనఁడుద్రోణ సుతుండు, వికర్ణుఁడునిట

కలరు మనసైన్యమందున ఘనసు చరిత!

భావము.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ

వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.

శ్లో.  అన్యే బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |

నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||1-9||

తే.గీ.  కువలయమున శూరులు యుద్ధ కోవిదులును,                                                                 

త్యక్తజీవులై రెందరో ధరణిపైన                                                                                            

ప్రేమతోడ నాకొఱకని వీరవరులు,                                                  

చూడుడందరిన్మీరలు,శుభసుచరిత!

భావము.

ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను 

ధరించి  నాకోసం జీవితాలని త్యాగం చేశారు.

                                                                                                                శ్లో. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |                                                                  

 పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||1-10||

తే.గీ. భీష్మ రక్షిత సైన్య మభేజ్యమనగ

కలిగె మనకు ననల్పమై, కనుఁడు మీరు,

భీమ రక్షిత సైన్య మవిస్త్రుత మటఁ

గలిగె వారికి నల్పమై, ఘన సుచరిత!

భావము.

భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత 

రక్షింపబడే వారి బలం పరిమితమైనది.

జైగహింద్.