గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 55వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

55. ఓం అక్షరాయ నమః.

సుందర వృత్త గర్భ సీసము.

జీవము నీవయ. నీవె జీవన మీయ - వాదేలనయ్య? యో వాఙ్మనోజ్ఞ!

భావము నీవయ. నీవె భావనమీయ - వాణీశు తాతవే, వంకలేల?

రావము నీవయ. నీవె రమ్యతనీయ - వాగ్భాసినై నిన్నుఁ బాడనొక్కొ

నీవె ముకుందుఁడ! నేనె నీవనఁ జేయ - వాఙ్మాధురిన్ నినున్ వరలఁ గొలుతు

గీ. ప్రణవ సుందర సద్వృత్త ప్రభవు నీవు. - సీసమున వెల్గు *నక్షరా* శ్రితుఁడవీవు.  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

55 సీస గర్భస్థ సుందర వృత్తము. ( .. యతి 9)

జీవము నీవయ. నీవె జీవన మీయవా?

భావము నీవయ. నీవె భావనమీయవా?

రావము నీవయ. నీవె రమ్యతనీయవా?

నీవె ముకుందుఁడ! నేనె నీవనఁ జేయవా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!   వాఙ్మనోజ్ఞుఁడా! నీవే మాలో జీవమయి యుంటివి. మాకు

జీవికను ఇచ్చుటకు వాదమెందులకుబ్రహ్మపితవే. భావము మాకు రమ్యగుణమొసగినచో మంచి మాటనైపుణ్యము కలిగి

నిన్ను ప్రశంసించకుందుమా. ముకుందుఁడా! నేను నీవే అనే విధముగా నీవు చేయగలిగినచో నిన్ను ప్రకాశింప జేసి

కొలిచెదను. సుందరమైన ప్రణవ వృత్తరూపుడవు నీవు. సీసపద్యమున ప్రకాశించే నాశ రహితుఁడవు నీవే సుమా

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.