గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2022, గురువారం

ఇదం తు తే గుహ్యతమం ..|| 9-1 || . రాజవిద్యా రాజగుహ్యం .. || 9-2 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

0 comments

 జైశ్రీరామ్.

 నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీకృష్ఢుడిట్లనుచుండెను.

|| 9-1 ||

శ్లో. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే|

జ్ఞానం విజ్ఞానసహితం యజ్జ్ఞాత్వా మోక్ష్యసేశుభాత్.

తే.గీ.  నీ వశుభవిముక్తిన్బొంది నిరుపమాన 

ముక్తిన్ బొందుదువో యట్టి పూజ్యమయిన

బ్రహ్మ విజ్ఞాన మున్ నీకు వరల జెపుదు

నీర్ష్య లేనట్టి యరైజునా యెరుగుమిదియు.

భావము.

దేనిని తెలుసుకోవడం వలన నీవు అశుభం(సంసారం)నుండి విముక్తుడవు 

అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ(బ్రహ్మ)జ్ఞానాన్ని అసూయా 

రహితుడవైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను.

 || 9-2 ||

శ్లో.  రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్|

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్.

తే.గీ. సహ్య రాజవిద్యా, రాజగుహ్యమిద్ది,

ఉత్తమము పవిత్రంబిద్ది, చిత్తమునను

నిలుచు తెలికగానిద్ది, నిలుపు ధర్మ

మిద్ది, యరయట తేలిక బుద్ధిమంత!

భావము.

ఇది రాజవిద్యా, రాజగుహ్యము, పవిత్రమయినది, ఉత్తమమయినది.  

దీనిని సూటిగా అర్ధం చేసుకోవచ్చును. ధర్మ పరమైనది, అభ్యసించడం 

తేలిక, నిలకడగా ఉంటుంది.

జైహింద్.

27, జూన్ 2022, సోమవారం

చిత్ర కవి శ్రీ చింత రామకృష్ణారావు తో పరిచయం// యాదగిరి దూరదర్శన్

5 comments

జైశ్రీరామ్.
జైహింద్.

నైతే సృతీ పార్థ జానన్యోగీ ..|| 8-27 || . వేదేషు యజ్ఞేషు తపఃసు .. || 8-28 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

 || 8-27 ||

శ్లో.  నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన|

తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున.

తే.గీ.  పార్థ! యీ రెండు మార్గముల్ పరమయోగి

యెరిగి భ్రమియింప డీవింక యెరిగి యన్ని

కాలములలోన యోగివై ఘనత నిలువు

మహిత మార్గమ్ము దీనిని మరువబోకు.

భావము‌.

పార్ధా! ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత 

అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి అగుము.

|| 8-28 ||

శ్లో.  వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ

దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా

యోగీ పరం స్థానముపైతి చాద్యమ్.

తే.గీ.  వేద యజ్ఞ తపో దాన విధుల చేత

పుణ్యఫలమేది కల్గు తత్ పుణ్య ఫలము

నధిగమించు నిది కనంగ నరసి యోగు

లందుదురు దీనినే ముక్తి నందగోరి. 

భావము.

వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప 

బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీనిని ఎరిగిన యోగి 

ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందు కుంటాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః.

జైహింద్.

26, జూన్ 2022, ఆదివారం

లలితాదిత్య శతావధానం.

0 comments

 

జైశ్రీరామ్.

జైహింద్.

జీ.వీ.యస్.ప్రజ్ఞాభారతి/వ్యాసప్రసూనం 28. డా.కిళాంబి జ్యోతిర్మయి.

0 comments

జైశ్రీరామ్..
జైహింద్.

ధూమో రాత్రిస్తథా కృష్ణః ..|| 8-25 || . శుక్లకృష్ణే గతీ హ్యేతే .. || 8-26 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 8-25 ||

శ్లో.  ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్|

తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే.

తే.గీ.  కృష్ణపక్షంబు, పొగ, రాత్రి, తృష్ణ, దక్షి

ణాయనమున యోగి యారునెలలు,

పయనమును జేసి చంద్రుని వరలు జ్యోతి

పొంది వచ్చును తిరిగి తాన్, పుణ్యగేహ!

భావము.

పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో 

ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.

 || 8-26 ||

శ్లో.  శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే|

ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః.

తే.గీ.  శుక్ల, కృష్ణ, మార్గము లవి చూడ రెండు

శాశ్వతంబని తలపనౌన్, చక్కనైన

శుక్లమున జన్మ కలుగదు, చూడ మనకు,

కృష్ణ యందు పునర్జన్మ క్షితిని కలుగు.

భావము.

జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని 

భావించబడుచున్నవి. మొదటి దానివలన పునర్జన్మ కలగదు.

రెండవ దాని వలన కలుగుతుంది.

జైహింద్.

25, జూన్ 2022, శనివారం

యత్ర కాలే త్వనావృత్తిమా ..|| 8-23 || . అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా .. || 8-24 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

 || 8-23 ||

శ్లో.  యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః|

ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ.

తే.గీ. ఎట్టి సమయాన మరణింప నిముడు ముక్తి,

యెట్టి సమయాన మరణింప పుట్టుకొదవు

యోగులకునట్టి కాలమ్ము నూహచేయ

దెల్పెదను నీకు నర్జనా! తెలియునటుల.

భావము.

భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు 

తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి 

జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.

|| 8-24 ||

శ్లో.  అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్|

తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః.

తే.గీ. అగ్ని, పగలుత్తరాయణ మారునెలలు

శుక్లపక్షంబులనుమార్గ సుగతి నెంచి

బ్రహ్మమును జేరుచుందురు బ్రహ్మవిదులు.

నీవు తెలియుమో యర్జునా! నేర్పుమీర.

 భావము.

అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలు అనే మార్గంలో 

బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.

జైహింద్.

24, జూన్ 2022, శుక్రవారం

అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః ..|| 8-21 || . పురుషః స పరః పార్థ .. || 8-22 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

 || 8-21 ||

శ్లో.  అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్|

యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ.

తే.గీ. ఇంద్రియాగోచరంబునై యెసగుచుండు

యరయ నవినాశమగు పరమాత్మ పథము 

జేరుటుత్తమ మది ముక్తి జీవులకిడు,

నేనె యామార్గమర్జునా! ధీనిధాన!

భావము.

ఇంద్రియాలకు గోచరం కానిదీ, నాశనం లేనిదీ, అని చెప్ప బడిన 

ఆ పరమాత్మ భావమే చేరవలసిన ఉత్తమ మార్గమని ఋషులు 

చెబుతారు. దేనిని పొందితే ప్రాణులు జన్మించరో అదే ఆ సర్వోత్తమ

 స్థానము, ఆ సర్వోత్తమ స్థానమే నేను.

 || 8-22 ||

శ్లో.  పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా|

యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్.

తే.గీ.  అన్ని ప్రాణులునెవ్వనియందు కలవొ,

యంతటన్ గలడెవ్వడో యట్టి దైవ

మనుపములగుభక్తులకరయగను లభ్య

మగును, గ్రహియింపుమర్జునా! యభరవినుత!

భావము.

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా 

వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే 

లభిస్తాడు.

జైహింద్.

23, జూన్ 2022, గురువారం

శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

భూతగ్రామః స ఏవాయం ..|| 8-19 || . పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తో .. || 8-20 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 8-19 ||

శ్లో.  భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే|

రాత్ర్యాగమేऽవశః పార్థ ప్రభవత్యహరాగమే.

తే.గీ.  పార్థ! జీవతతియు కర్మ వశము చేత

జన్మలెత్తుచు పోవుచు జరుపుచుండు,

బ్రహ్మకున్ రాత్రి యయినంత ప్రాణికోటి 

నాశనంబగు నిజమిది, జ్ఞాన రూప!

భావము.

అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశంగా అనేక జన్మలు 

ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశిస్తుంది.

|| 8-20 ||

శ్లో.  పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్యక్తాత్సనాతనః|

యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి.

తే.గీ. అట్టి యవ్యక్త ప్రకృతికి, నననురూప

మును వినాశ రహితసనాతనమునయిన

భావమగుబ్రహ్మమునశించబోవదెపుడు

జీవులన్నియు పోయినన్, ధీవిశాల!

భావము.

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు 

గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ 

నశించినా నశించకుండా ఉంటుంది.

జైహింద్.

22, జూన్ 2022, బుధవారం

చోడవరం, మాడుగుల నియోజకవర్గ ప్రాంతాలలో మరోసారి శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని కె.ఎస్.ఎన్.ఎస్.శర్వాణి ఫస్ట్ ఎంపీసీలో 460/470) అగ్రగామిగా 2022 ఫలితాలలో నిలిచింది.

0 comments

 జైశ్రీరామ్.

చోడవరం, మాడుగుల నియోజకవర్గ ప్రాంతాలలో మరోసారి శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని (కె.ఎస్.ఎన్.ఎస్.శర్వాణి ఫస్ట్ ఎంపీసీలో 460/470) అగ్రగామిగా 2022  ఫలితాలలో నిలిచింది.

చిరంజీవి శర్వాణికి శిక్షణనిచ్చిన గురువులకు, కళాశాల యాజమాన్యమునకు, విద్యార్థిని చిరంజీవి శర్వాణికి నా అభినందనలు

జైహింద్.

సహస్రయుగపర్యన్తమహర్యద్ ..|| 8-17 || . అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః .. || 8-18 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

జైశ్రీరామ్.

|8-17 ||

శ్లో.  సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రహ్మణో విదుః|

రాత్రిం యుగసహస్రాన్తాం తేऽహోరాత్రవిదో జనాః.

తే.గీ.  కనగ విధికి వేయి మహాయు గములు పగలు,

కాంచ నటులె వేయి మహాయు గములు రాత్రి,

తెలియు వార లహోరాత్రముల నెరిగిన

వారని తెలియుము పార్థ! నీవు.

భావము.

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా 

యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల 

గురించి తెలిసిన వారు.

|| 8-18 ||

శ్లో.  అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే|

రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే.

తే.గీ.  విధికి పగటివేళ జనించు విపుల వస్తు

జాల మవ్యక్తమందుడి, వేళ మళ్ళి

రాత్రి కన్నియు నవ్యక్త బ్రహ్మ మందు

లీనమైపోవు, తెలియుము జ్ఞాన విభవ!

భావము.

బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు 

జాలమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమైన బ్రహ్మము లోనే అంతా 

లీనమై పోతుంది.

జైహింద్.

21, జూన్ 2022, మంగళవారం

మాముపేత్య పునర్జన్మ ..|| 8-15 || . ఆబ్రహ్మ భువనాల్లోకాః .. || 8-16 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్..

|| 8-15 ||

శ్లో.  మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్|

నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః.

తే.గీ.  పరమపదమైన నామోక్షపదము గన్న

మహితు లరయ నశాశ్వత, మహితమునగు

దుఃఖ మూలమౌపునర్జన్మ తొలగి ముక్తి

పొంది సుఖింతురు పూర్ణ గతిని.

భావము.

పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి 

ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.

|| 8-16 ||

శ్లో.  ఆబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోऽర్జున|

మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే.

తే.గీ.  బ్రహ్మలోకము వరకును వచ్చునవియె

తిరిగి లోకములన్నియున్, తిరిగి జన్మ

మెత్త జేయునవియె నన్ను నెట్టులయిన 

చేరిన విముక్తి కల్గును ధీర పార్థ!

భావము.

అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే 

పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.

జైహింద్.

20, జూన్ 2022, సోమవారం

శతావధాన శరచ్చంద్ర, కాలకంఠ బిరుదాంకితుఁడయిన శతావధాని లైతాదిత్య యొక్క రెండవ శతావధానము మన భాగ్యనగరంలో

0 comments

 జైశ్రీరామ్.


జైహింద్.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ..|| 8-13 || . అనన్యచేతాః సతతం యో .. || 8-14 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 8-13 ||

శ్లో.  ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్|

యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్.

తే.గీ.  బ్రహ్మవాచక మోమ్మును పలుకు నెవరు

నన్స్మరించుచు బలికి ప్రాణములు విడుచు

నతడు పరమగతిని పొందు, నవనిపైన, 

నిజము గ్రహియింపుమర్జునా నీవు సతము.

భావము.

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ 

నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని 

చేరుకుంటాడు.

 || 8-14 ||

శ్లో.  అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః|

తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః.

తే.గీ.  అన్య చింతన లేక న న్ననవరతము

చింతనము చేయు వారల చిత్తమందె

యుండి, సులభుడనై యొప్పి యుందు పార్థ!

నీవు గ్రహియింపు నా మాట నేర్పుమీర.

భావము.

అర్జునా! మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిత్యమూ, 

నిరంతరమూ నన్ను ఎవరు స్మరిస్తారో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను 

సులభుణ్ణి.

జైహింద్.

19, జూన్ 2022, ఆదివారం

యదక్షరం వేదవిదో ..|| 8-11 || . సర్వద్వారాణి సంయమ్య .. || 8-12 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

 || 8-11 ||

శ్లో.  యదక్షరం వేదవిదో వదన్తి

విశన్తి యద్యతయో వీతరాగాః|

యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి

తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే.

తే.గీ.  వేదవేత్త లశ్వరమందు రేదొ మరియు

రాగ దూరులై రచయితల్ సాగు దేని

నొంద బ్రహ్మచర్యమునను, 

తెలిపెదను దాని నెరుగంగ, తెలియుమీవు.

భావము.

వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన 

రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో 

చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.

 || 8-12 ||

శ్లో.  సర్వద్వారాణి సంయమ్య, మనో హృది నిరుధ్య చ|

మూర్ధ్న్యార్ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్.

తే.గీ. ఇంద్రియద్వారముల్ మూసి హృదయమాత్మ

లోన నిలుపుచు, బ్రాణమున్ లో సహస్ర

దళపు పద్మంబునను నిల్పి యోగ

నిష్టతోడ సాధనచేయ నేర్వవలయు.

భావము.

ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో 

తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.

జైహింద్.

18, జూన్ 2022, శనివారం

దిక్పాలకుల సమాచారం

0 comments

జైశ్రీరామ్. 



జైహింద్.


కవిం పురాణ మనుశాసితార ..|| 8-9 || . ప్రయాణకాలే మనసాచలేన .. || 8-10 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 8-9 ||

శ్లో.  కవిం పురాణ మనుశాసితార-

మణోరణీయంసమనుస్మరేద్యః|

సర్వస్య ధాతారమచిన్త్యరూప-

మాదిత్యవర్ణం తమసః పరస్తాత్.

తే.గీ.  శాసకుడు, సనాతనుడును, సర్వవిదుడు,

తలప సూక్ష్మాతిసూక్ష్ముడు, తలప నలవి

కాని రూపుడు, భర్త, ప్రకాశ రవియు,

తపసునకతీతుడతనినితలతురెవరొ,

భావము.

సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, 

అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కల వడూ, 

సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన 

పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,

 || 8-10 ||

శ్లో.  ప్రయాణకాలే మనసాచలేన

భక్త్యా యుక్తో యోగబలేన చైవ|

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్

స తం పరం పురుషముపైతి దివ్యమ్.

తే.గీ. వారు  ప్రాణము విడువేళ ధీర మతిని

భక్తితో యోగ బలముచే ముక్తి  గనుదు

రరయుచున్ హరిన్ భౄమధ్యమందు నపుడు,

ఐహికము వీడి పరకాంక్షులతులితముగ.

భావము. 

అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, 

భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా 

నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.

జైహింద్.

17, జూన్ 2022, శుక్రవారం

తస్మాత్సర్వేషు కాలేషు ..|| 8-7 || . అభ్యాస యోగ యుక్తేన .. || 8-8 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 8-7 ||

శ్లో.  తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ|

మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయః.

తే.గీ. కాన, నీ వన్ని కాలాల కనుము నన్ను,

యుద్ధమును జేయుమట మనో బుద్ధులరసి

నాకునర్పింప నీవంక నన్ను జేరు

దువయ, సందేహమే లేదు, ప్రవర పార్థ!

భావము.

అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం 

చెయ్యి. మనో బుద్ధులను నాకు సమర్పించిన నీవు నన్నే పొందుతావు. 

ఈ విషయంలో సందేహం లేదు.

 || 8-8 ||

శ్లో.  అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా|

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్.

తే.గీ.  అంచితాభ్యాస యోగ యుక్తాత్ములరయ

ఘనతరంబగు చింతనన్ ఘనుడగు పర

మపురుషుని చేరుకొందురు, మరువ కిద్ది,

పార్థ! చింతలన్ విడిచిన్ బరగు సుఖము.

భావము.

అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు 

పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైన పరమ పురుషుణ్ణి 

చేరుకుంటావు.

జైహింద్.

16, జూన్ 2022, గురువారం

రెండు పాదములలో ధకారము, మరిరెండు పాదములలో థ కారము ప్రాస వేయుటకు ప్రమాణముగా స్వీకరింప నగును.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! థ..ధ లకు, ద..ధ లకు ల.డలకు, ల ళ లకు ప్రాసమైత్రియున్నందున వాడబడుచున్ననూ, కొందరు ఒక్క పాదములోనే మైత్రి ఉన్న వర్ణము వాడవలెనని కొందరనుట విని యుంటిని.
భారతములో ద్రోణ పర్వములో ప్రయోగము చూచినచో ఆ సందేహము నివృత్తి యగును.
ఈ విధముగా మను చరిత్రలో కూడా ప్రయోగములున్నవి.
జైహింద్.

 

తుమ్మితే తప్పేంటీ? శుభమే కదా? . ఆసనే శయనే దానే..... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే,

వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”

 తే.గీ.  భోజనమువేళ, పడుకొనఁ బోవువేళ,

దానమిచ్చునప్పుడు వస్త్ర ధారణమున,

కూర్చొనెడివేళ, పెండ్లిలో, ఘోరమైన

తగవులప్పుడు తుమ్ముట తగును, శుభము.

భావము. 

కూర్చునే సమయములో, పడుకునే సమయములో, దాన సమయములో,

భోజన సమయములో, వస్త్ర సంగ్రహ సమయములో, వివాద సమయములో,

వివాహ సమయములో, ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకము.

జైహింద్.

చిత్ర గర్భ కవిత్వం ఒకే పద్యంలో మూడు పద్యాలు .. chintha rao garbha chitr...

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శతావధానశరచ్చంద్ర, కాలకంఠ, శ్రీ గన్నవరం లలితాదిత్యగారిచే సంపూర్ణ శతావధంఅ కార్యక్రమము...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

అన్తకాలే చ మామేవ ..|| 8-5 || . యం యం వాపి స్మరన్భావం .. || 8-6 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరమ్.

 || 8-5 ||

శ్లో.  అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్|

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః.

తే.గీ. అంతకాలంబునన్ నన్ను నరసి కనుచు

దేహమును వీడువారు స్వాధీనమతులు

నాదు తత్వమొందుదురయ, నయవిభాస!

తెలియుమియ్యది నీవు సందేహమేల?

భావము.

అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి 

వెళుతున్నారో, వారు నా తత్వాన్నే పొందుదురు. ఇందులో సందేహంలేదు.

|| 8-6 ||

శ్లో.  యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేబరమ|

తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః|

తే.గీ.  దేహమును వీడు సమయాన దేనిపయిని

చిత్తముండునో దానినే జీవుడొందు,

నన్ను దలచుచున్ గతియించ నన్ను జేరు,

ముక్తి నొసగెడి నన్ గన ముక్తి కలుగు.

భావము.

కుంతీ కుమారా! మరణ సమయంలో ఏ విషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని 

వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.ఆ

జైహింద్.

15, జూన్ 2022, బుధవారం

అక్షరం బ్రహ్మ పరమం ..|| 8-3 || . అధిభూతం క్షరో భావః .. || 8-4 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీకృష్ణభగవానుడనుచున్నాడు.

|| 8-3 ||

శ్లో.  అక్షరం బ్రహ్మ పరమం, స్వభావోధ్యాత్మముచ్యతే|

భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః.

తే.గీ.  బ్రహ్మమది నాశరహితమౌ పరమ మరయ,

నది స్వభావంబుచేత నాధ్యాత్మ మనగ

పిలువబడు, జీవసృష్టిని  వెలయ జేయు

కార్యమే కర్మ మెరుగుమా ఘనుడ పార్థ!

భావము.

నాశరహితమైన యీ బ్రహ్మము గొప్పదయినది. ఆయన యొక్క 

స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి 

కార్యమునే కర్మ అంటారు.

 || 8-4 ||

శ్లో.  అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్|

అధియ జ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాం వర.

తే.గీ. అరయ నధిభూత ము నశించునదియె పార్థ,

పురుషు డధిదైవతంబె యా పురుషులందు

నచట నధియజ్ఞుడను నేనె, యనుపమాన!

జ్ఞాన సంభాసుడా! పార్థ! కాంచుమిటుల.

భావము.

నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం అది భూతం. జీవుడు అధి దైవతం. 

జీవులలో అధి యజ్ఞుణ్ణి నేనే.

జైహింద్.

14, జూన్ 2022, మంగళవారం

అగ్నిపురాణములో వివరించిన కవితా లక్షణములు.

0 comments

  జైశ్రీరామ్.


జైహింద్.

కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం ..|| 8-1 || . అధియజ్ఞః కథం కోऽత్ర .. || 8-2 ||..//.. శ్రీమద్భగవద్గీతే అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

0 comments

 జైశ్రీరామ్.

అథ అష్టమోధ్యాయః - అక్షరబ్రహ్మయోగః.

అర్జున ఉవాచ.

భావము.

అర్జునుడనుచున్నాడు.

|| 8-1 |||

శ్లో.  కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ|

అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే.

తే.గీ.  ఏది బ్రహ్మమౌ? నధ్యాత్మ యేది? కృష్ణ

ఏది కర్మమౌ నధిభూత మేదియగును?

దేనినధిదైవత మనంద్రు? తెలుపుమయ్య!

వ్యక్తమగునట్లు చెప్పుమా యసమతేజ!

భావము.

పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది? ఆధ్యాత్మం ఏది? కర్మ అంటే ఏమిటి? 

అధి భూతమని దేనిని అంటారు? అధి దైవతమని దేనిని అంటారు.

|| 8-2 ||

శ్లో.  అధియజ్ఞః కథం కోऽత్ర దేహేస్మిన్మధుసూదన|

ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః.

తే.గీ. ఎట్టు లుంటివి దేహాన? నెట్టులీవు

నిగ్రహాత్ముల కెట్టుల నేర్పు మీర

ప్రాణములు వీడు సమయాన ప్రణవరూప!

తెలియగాబడుచుంటివి తెలుపుమయ్య!

భావము.

మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నావు? నిగ్రహ వంతులచేత 

మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.

జైహింద్.

13, జూన్ 2022, సోమవారం

జరామరణ మోక్షాయ ..|| 7-29 || . సాధిభూతాధిదైవం మాం .. || 7-30 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 7-29 ||

శ్లో.  జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే|

తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్.

తే.గీ.  సాధకులు జరా మరణముల్, సతవరంబె

విడువనెంచి నన్ గొలుతురో, విశ్వమందు

నాత్మ తత్వ జ్ఞులగుదురా యాత్మనెరిగి, 

కర్మమునుగూర్చెరుగుదురు, ధర్మరూప!

భావము.

జరా మరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి 

సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆబ్రహ్మమూ ఆత్మ తత్వాన్ని 

యావత్తు కర్మనీ తెలుసుకుంటారు.

 || 7-30 ||

శ్లో.  సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః|

ప్రయాణకాలేऽపి చ మాం తే విదుర్యుక్తచేతసః.

తే.గీ. ఆదిభూతంబుతోడనా యాది దైవ

తంబుతోడను నాది యజ్ఞంబుతోడ

కూడియున్న నన్నెవరిల గొప్పగాను

తెలుసుకొందురో తుదిని నన్ తీరుగ గను.

భావము.

సమస్త అధిభూత (పదార్థ క్షేత్రము), అధిదైవ (దేవతలు), మరియు 

అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని 

తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో 

కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయః

జైహింద్.

12, జూన్ 2022, ఆదివారం

ఇచ్ఛాద్వేష సముత్థేన ..|| 7-27 || . యేషాం త్వన్తగతం పాపం .. || 7-28 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 7-27 ||

శ్లో.  ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వన్ద్వమోహేన భారత|

సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప.

తే.గీ. ఓ పరంతపా! రాగంబు నొనరు ద్వేష

ములను పుట్టుమోహంబున పుట్టినపుడె

జీవు లొందెడు భ్రాంతిని, ధీవరేణ్య!

అర్జునా గ్రహియింపుమీ వహము విడిచి.

భావము.

పరంతపా! అర్జునా! రాగద్వేషాల నుండి జనించే ద్వందాల మోహం 

వలన పుట్టుకతోనే అన్ని జీవులూ భ్రాంతిని పొందుతున్నాయి.

 || 7-28 ||

శ్లో.  యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్|

తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః.

తే.గీ.  పుణ్య కర్మల వలన నే గణ్య జనుల

పాపమంతంబగునొ వారు ద్వంద్వ మోహ

ములకు దూరులై చెదరక నిలచు దీక్ష

తోడ నన్ గొలుతురరయుమా, దుర్విదార!

భావము.

పుణ్య కర్మల వలన ఏ జనుల యొక్క పాపం అంత మైనదో, వాళ్ళు, 

ద్వంద మోహాల నుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను 

కొలుస్తారు.

జైహింద్.

11, జూన్ 2022, శనివారం

శతావధాని చిరంజీవి తాతా సందీప్ ప్రతిభను గుర్తించిన సాక్షి దినపత్రిక.

0 comments

 జైశ్రీరామ్.

శతావధాని చిరంజీవి తాతా సందీప్ ప్రతిభను గుర్తించిన సాక్షి దినపత్రికను అభినందించుచున్నాను.

అతి త్వరలో అవధాని సందీప్ రాక్షస సాధనతో సహస్రావధానిగా ప్రకాశించవలెనని, యువతకు ఆదర్శంగా నిలవాలని, మార్గదర్శి కావాలని, 

ఆ జగన్మాత కటాక్షం కలిగి వర్ధిల్లాలని కోరుకొంటున్నాను.

జైహింద్.

నాహం ప్రకాశః సర్వస్య ..|| 7-25 || . వేదాహం సమతీతాని .. || 7-26 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 7-25 ||

శ్లో.  నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః|

మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్.

తే.గీ.  యోగ మాయావృతుడనయి యున్న నేను

కనబడనుగ యందరికిని, కనగ లేదు

మూఢ లోకము నాశనము భువి లేని

వానిగా నన్ను, నర్జునా!  జ్ఞాన భాస!

భావము.

యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికి కనపడను. 

నన్ను ఈ మూఢ లోకం పుట్టుకా నాశనం లేనివాణ్ణిగా తెలుసుకో లేదు.

 || 7-26 ||

శ్లో.  వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున|

భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన.

తే.గీ.   నే నెరుంగుదును, గతించి, లేని వారి,

నున్నవారిని, జనియింప నున్నవారి

నిట్టి నన్నెరింగినవార లేరి జగము

న? నరుడ! కననే రిల నన్ను ఘనతరముగ.

భావము.

నేను గతించిన జీవులను, ఇప్పుడు ఉన్నవాళ్ళనూ, ముందు పుట్టబోయే 

వారినీ ఎరుగుదును. నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు.

జైహింద్.

10, జూన్ 2022, శుక్రవారం

అన్తవత్తు ఫలం తేషాం ..|| 7-23 || . అవ్యక్తం వ్యక్తిమాపన్నం .. || 7-24 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 7-23 ||

శ్లో.  అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్|

దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి.

తే.గీ.  అల్ప బుద్ధులయినవారి కందు ఫలము

లరయ నశియించు, నాదేవతాళి గొలువ

చేరుదురు దేవతలను, నన్ జేరుదు రిల

నన్ను సేవించువారలు మన్ననముగ.

భావము.

అల్ప బుద్ధులైన వారికి లభించే ఫలం నశించి పోయేదిగా 

ఉంటుంది. దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు, 

నన్ను ఆరాధించేవారు నన్ను చేరుతారు.

|| 7-24 ||

శ్లో.  అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః|

పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్.

తే.గీ.  పరమమున్ శ్రేష్ఠతమమునై పరగు నాదు

గుణము నెరుగని వారలు కనుదురు నను

పరిమితాకారుడ ననుచు, తరచి చూడ

జ్ఞాన చక్షువునకు నేను కనబడుదును.

భావము.

పరమము, సర్వశ్రేష్టమునైన నా  స్వభావం ఎరుగని, 

తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరం కాని పరిమితమైన 

రూపంగా భావిస్తారు.

జైహింద్

9, జూన్ 2022, గురువారం

గీతా మహాత్మ్య ము తెలుఁగు పద్యానువాదము.....చింతా రామకృష్ణా రావు.

0 comments

 జైశ్రీరామ్.

గీతా మహాత్మ్య ము

జైశ్రీకృష్ణ.

ధరోవా చ:

భగవా న్! పరమేశా న! భక్తిరవ్య భిచా రిణీ!|

ప్రా రబ్ధం భు జ్య మా నస్య కథం భవతి హేప్రభోప్ర

భో || 1 ||


ప్రా రబ్ధ కర్మ బద్ధు ల

కే రకము గ భక్తి యబ్బు నీశ్వ ర! యను చు న్

చేరి ధర హరిని యడు గగ

నా రా యణు డిట్లు చెప్పె నమ్మి క మీరన్.

భూ దేవి విష్ణు భగవా ను ని గూ ర్చి ఇట్లు ప్రశ్నింప్రశ్నిం చెను . 

ఓ భగవా ను డా ! పరమేశ్వ రా ! ప్రభూప్రభూ! ప్రా రబ్ధము

అను భవిం చే వా నికి అచం చలమైన భక్తి ఎట్లు కలు గగలదు ?


శ్రీవిష్ణు రు వా చ:

ప్రా రబ్ధం భు జ్య మా నోపి గీతా భ్యా సరతస్స దా |

స ము క్త స్స సు ఖీ లో కే కర్మ ణా నోపలిప్య తే || 2 ||

ప్రా రబ్ధ కర్మ బద్ధు లు


తీరికగా గీత చదివి తృ ప్తిగ నా పై

భా రము వేసిన, కర్మ లు

వా రల కం టవు . విము క్తి ప్రా ప్తిం చు ధరా !

ఓ భూ దేవీ! ప్రా రబ్ధము అను భవిస్తు న్న నూ ఎవరు నిరం తరము 

గీతా భ్యా సమం దు నిరతు డై ఉం డు నో

అట్టివా డు ము క్తు డై కర్మ లచే అం టబడక ఈ ప్రపంప్రపంచము 

నం దు సు ఖము గా ఉం డు ను .


మహాపా పా దిపా పా ని గీతా ధ్యా నం కరోతి చేత్ |

క్వ చిత్ స్ప ర్శం న కు ర్వం తి నలినీదళమం భసా || 3 ||

గీతా ధ్యా నము చేయు పు

నీతు ల కఘమం ట బో దు . నీరముఁ గన నే

రీతిని తా మర కం టు నె?

యా తీరు గ నిదియు , తెలియ నద్భు తమిదియే.

తా మరా కు ను నీరం టనట్లు గీతా ధ్యా నము చేయు వా నిని 

మహాపా పము లు కూ డా కొం చమైనను

అం టవు .


గీతా యాః పు స్తకం యత్ర యత్ర పా ఠః ప్రవప్రర్తతే

తత్ర సర్వా ణి తీర్థా ని ప్రయాప్ర యాగా దీని తత్ర వై || 4 ||

గీతా గ్రం థ మదెచ్చ ట,

గీతా పఠనం బదెచట కీర్తి ప్రదప్రమై

భూ తలమం దు న నుం డు ను

ఆ తలము న పు ణ్య తీర్థ మమరిక నుం డు న్.

ఎచ్చ ట గీతా గ్రం ధము ఉం డు నో మరియు ఎచ్చ ట గీతా 

పా రా యణము జరు గు చుం డు నో అచ్చ ట

ప్రయాప్ర యాగ మొదలగు సమస్త తీర్ధము లు ఉం డు ను .


సర్వే దేవా శ్చ ఋషయో యోగినః పన్న గా శ్చ యే |

గోపా ల గోపికా వా పి నా రదోద్ధవ పా ర్షదైః

సహాయో జా యతే శీఘ్రం యత్ర గీతా ప్రవప్రర్తతే || 5 ||

ఎచట గీతపా రా యణ నెలమి జరు పు

నచట దేవతల్, ఋషి వరు లఖిల యోగు


లఖిల నా గు లు గోపిక లఖిల గోప

కు లు ను నా ర దోద్ధవు లు కొలు పు మేలు .

ఎచ్చ ట గీతా పా రా యణము జరు గు చుం డు నో అచటికి 

దేవతలు , ఋషు లు , యోగు లు , నా గు లు ,

గోపికలు , గోపా లు రు భగవత్స్ప ర్శ్యా స్యా సక్తు లగు నా రద, 

ఉద్ధవా దు లు వచ్చి శీఘ్రముఘ్రముగా

సహాయమొనర్తు రు .


యత్ర గీతా విచా రశ్చ పఠనం పా ఠనం శ్రుతం |

తత్రా హం నిశ్చి తం పృ థ్వి నివసా మి సదైవ హి || 6 ||

గీత పఠన పా ఠన శ్రవశ్రణ, కృ తి విచా ర

మెచట జరు గు చు నుం డు నో యచట నేను

నిష్టతో నుం డి కా తు ను నేర్పు మీర.

గమ్య మా ర్గము చూ పు దు .కను మ! పృ థ్వి !


ఓ భూ దేవీ! ఎచట గీతను గూ ర్చి విచా రణ, పఠనము , 

భో ధన, శ్రవశ్రణము జరు గు చుం డు నో అచట నేను

ఎల్లప్పు డు తప్ప క నివసిం తు ను .


గీతా శ్రయేశ్ర

యేహం తిష్ఠా మి గీతా మే చోత్తమం గృ హమ్ |

గీతా జ్ఞా నము పా శ్రిత్య త్రీన్ లో కా న్ పా లయా మ్య హమ్ || 7 ||

గీత నా శ్రయింశ్ర యించి క్రీడింక్రీ డింతు జగము న.

గీతయే గృ హము గ. ప్రీతి నుం దు .

గీత నా శ్రయింశ్ర యించి ఖ్యా తి ము జ్జగము ల

నేలు చుం టి నేను మేలు గా ను .

నేను గీతనా శ్రయింశ్ర యించి ఉన్నా ను , గీతయే నా కు ఉత్తమగు 

నివా స మం దిరము మరియు

గీతా జ్ఞా నము ను ఆశ్రయింశ్ర యించియే మూ డు లో కా లను 

నేను పా లిం చు చు న్నా ను .


గీతా మే పరమా విద్యా బ్రహ్మబ్ర హ్మరూ పా న సం శయః |

అర్ధమా త్రా క్షరా నిత్యా స్వ నిర్వా చ్య పదా త్మి కా || 8 ||

గీతయే నా పరమ విద్య . ఖ్యా తిఁ గనిన.

గీత బ్రహ్మబ్ర హ్మస్వ రూ పము . కీర్తి ప్రదప్రము .


ప్రణప్రవమం దు న నా ల్గవ పా దమైన

అర్థ మా త్ర.త్ర.నిత్య సు శా శ్వి తా ను పమము .


గీత నా యొక్క పరమవిద్య అది బ్రహ్మబ్ర హ్మస్వ రూ పము దీనిలో 

సం దేహము లేదు , మరియు అది

ప్రణప్రవము లో నా లగవ పా దమగు అర్ధమా త్రా స్వ రూ పము , 

నిత్య మైనది, నా శరహితమైనది,

అనిర్వ చనీయమైనది.


చిదా నం దేన కృ ష్ణేన ప్రో క్తా స్వ ము ఖతోర్జు నమ్ |

వేదత్రయీత్ర యీ పరా నం దతత్త్వా ర్ధజ్ఞా నమం జసా || 9 ||

కృ ష్ణుఁ డర్జు ను నకుఁ జెప్పె గీత కృ పను

మూ డు వేదా ల సా రము . మూ డు లో క

ము లకు నా నం దప్రదప్రమిది. కలు గ జేయు

తత్వ విజ్ఞా నము ను తనన్ దలచినం త.

సచ్చి దా నం ద స్వ రూ పు డగు శ్రీ కృ ష్ణ పరమా త్మ చే స్వ యము గా 

అర్జు నను కు ఉపదేశిం ప బడినది. ఇది

మూ డు వేదము ల సా రము , పరమా నం దమయినది, తన్నా 

శ్రయింశ్ర యించిన వా రికి శీఘ్రముఘ్రముగా

తత్వ జ్ఞా నా న్ని కలు గచేయు ను .


యోష్టా దశ జపేన్ని త్యం నరో నిశ్చ లమా నసః |

జ్ఞా నసిద్ధిం స లభతే తతో యా తి పరం పదమ్ || 10 ||

ప్రీతి నష్టా దశా ధ్యా య ఖ్యా తి నెఱిగి,

పఠన చేయు నా నరుఁ డు తా బ్రహ్మబ్ర హ్మ పథము

నొం దు . సం దేహమే లేదు . మం ద మతియు

దీనిని పఠిం చి మోక్షం బు తా ను పొం దు .

ఏ నరు డు నిత్య మూ గీతయం దలి పద్దెనిమిది 

అధ్యా యము లను పఠిం చు నో అతడు జ్ఞా నసిద్ధిని పొం ది

తద్వా రా పరమ పదము ను (మోక్షము ను ) పొం దు ను .


పా ఠే సమర్థస్సం పూ ర్ణే తదర్థం పా ఠమా చరేత్ |

తదా గోదా నజం పు ణ్యం లభతే నా త్ర సం శయః || 11 ||

శక్తి హీను లు గీతను భక్తి తోడ


సగము చదివిన చా లు ను సత్ ఫలమిడు .

గం గి గోదా న ఫలమిచ్చు . గా న చదివి

సత్ ఫలం బు ను గాం తు రు సహృ దయు లిల.

గీతని మొత్తము పఠిం చలేని వా రు అం దు లో సగమైనను 

పఠిం చవలెను దీనివలన అతడికి గోదా న

ఫలము వలన కలు గు పు ణ్య ము లభిం చు నను టలో 

సం దేహము లేదు .


త్రిభా గం పఠమా నస్తు గం గా స్నా నఫలం లభేత్ |

షడం శం జపమా నస్తు సో మయా గఫలం లభేత్ || 12 ||

గీత మూ డవ వం తైన ప్రీతి తోడ

చదు వ స్వ ర్గం గ స్నా న ఫలదము . నిజము .

గీతనా రభా గము ప్రీతిఁ జదు వ

సో మ యా గ ఫలం బిచ్చు . శుభము లొ సగు .

గీతయొక్క మూ డవభా గము (ఆరు అధ్యా యము లు ) పఠిం 

చినవా నికి గం గా స్నా న ఫలము

లభిం చు ను , ఆరవ భా గము (మూ డు అధ్యా యము లు )

పఠిం చు వా రికి సో మయా గ ఫలము లభిం చు ను .

ఏకా ద్యా యం తు యో నిత్యం పఠతే భక్తిసం యు తః |

రు ద్రలోద్ర

లోకమవా ప్నో తి గణో భూ త్వా వసేచ్చి రమ్ || 13 ||

ఒక్క అధ్యా యమైనను నిక్క ము గను

గీత ప్రతిప్రదినం బు చదు వఁ బ్రీతి తోడ

రు ద్ర లో కము పొం ది తా రు ద్ర గణము

నం దు నొకడగు .నివసిం చు నం దనిశము .

ఎవడు గీతయొక్క ఒక అధ్యా యము భక్తితో పఠిం చు నో 

అతడు రు ద్రలోద్ర


లోకము ను పొం ది రు ద్ర


గణము లలో ఒకడు గా శా శ్వ తము గా నివసిం చు ను .


అధ్యా యశ్లో కపా దం వా నిత్యం యః పఠతే నరః |

స యా తి నరతాం యా వన్మ ను కా లం వసుం ధరే! || 14 ||

నిత్య మధ్యా య పా దము నేర్పు మీర

చదు వ ను త్కృ ష్ట నర జన్మ చక్క నొదవు

ఒక్క మన్వం తరము . కా న చదు వ వలయు

భక్తి తోడను గీత. సద్భ క్తు లెల్ల.


ఓ భూ దేవీ ఎవరు గీతనం దలి ఒక అధ్యా యము నం దలి 

నా ల్గవ భా గము ను నిత్య మూ పఠిం చు నో

అతడు ఉత్కృ ష్టమైన మా నవ జన్మ ఒక మన్వం తర కా లము పొం దు ను .


గీతా యాః శ్లో కదశకం సప్త పం చ చతు ష్టయమ్ |

ద్వౌ త్రీనేకం తదర్ధం వా శ్లో కా నాం యః పఠేన్న రః || 15 ||

చం ద్రలోద్ర

లోకమవా ప్నో తి వర్షా ణా మయు తం ధ్రు వమ్ |

గీతా పా ఠ సమా యు క్తో మృ తో మా ను షతాం వ్రజేవ్ర


జేత్ || 16 ||


గీత పది, ఏడయిదు నా ల్గు ప్రీతి తోడ

మూ డు , రెం డొకటం దర్థము చదివినను

ఇం ద్ర లో కము న పదివేలేం డ్లు బ్రతుబ్రతుకు .

గీత చదు వు చు మరణిం ప కీర్తిఁ గొలు పు

మను జ జన్మ ము నొం దు ను . మా నవుం డు .


ఎవరు గీతనం దలి పది శ్లో కము లను కా నీ, ఏడు శ్లో కము లను కా నీ, 

ఐదు శ్లో కము లను కా నీ, నా లు గు

శ్లో కము లను కా నీ, మూ డు శ్లో కము లను కా నీ, రెం డు శ్లో కము లను 

కా నీ, ఒక శ్లో కము ను కా నీ, అర్ధ

శ్లో కము ను కా నీ నిత్య ము ఏవరు పటిం తు రో ,౧౫.

వా రు ఇం ద్రలోద్ర


లోకము లో పదివేల సం వత్స రము లు సు ఖము గా జీవిం చు 

నను టలో సం దేహము లేదు

మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తా రో అతడు ఉత్తమ మగు 

మా నవ జన్మ ను పొం దు ట

నిశ్చ యము .౧౬


గీతా భ్యా సం పు నః కృ త్వా లభతే ము క్తిము త్తమాం |

గీతేత్యు చ్చా రసం యు క్తో మ్రియమ్రి మా ణో గతిం లభేత్ || 17 ||

అట్లు మా నవు డై పు ట్టి యను పమగతి

గీత పఠియిం చి ము క్తిని చేత్ఁ గిను ను .

గీత గీతయను చు ప్రా ణ మా తడు విడ

సద్గతిని పొం దు నా తం డసం శయము గ.

అట్లా తడు మా నవు డై జన్మిం చి గీతా భ్యా సము ను మరల 

మరల గా విం చి ఉత్తమమగు మోక్షము ను

పొం దు నను టలో సం శయము లేదు . గీతా గీతా అను చు 

ప్రా ణము ను వదలు వా డు సత్గతిని

పొం దు నను టలో సం దేహము లేదు .


గీతా ర్థశ్రవశ్రణా సక్తో మహాపా పయు తోపి వా |

వైకుం ఠం సమవా ప్నో తి విష్ణు నా సహ మోదతే || 18 ||

గీతా ర్థము వినఁ గో రెడి

పా తకుఁ డు ను ము క్తి పొం ది పరమా త్ము నితో

ప్రీతిగ నుం డు ను సు గతిని.

ఖ్యా తిగ పఠియిం ప గీత యమరు డతఁ డగు న్.

మహా పా పా త్ము డైనను అతడు గీతా ర్ధము ను తెలు సు

 కొను టలో ఆసక్తు డైనచో అతడు విష్ణు లో కము ను

పొం ది శ్రీమహా విష్ణు సన్ని ధిలో ఆనం దము ను అను 

భవిం చు చూ ఉం డు ను .


గీతా ర్థం ధ్యా యతే నిత్యం కృ త్వా కర్మా ణి భూ రిశః |

జీవన్ము క్త స్స విజ్ఞేయో దేహాం తే పరమం పదమ్ || 19 ||

గీతా ర్థ చిం తనం బు న

నా తం డగు కర్మ దూ రుఁ డా తనికబ్భు న్

ఖ్యా తిగ జీవన్ము క్తియు .

భా తిగ నొడఁ గూ డు పరమ పథమతనికిలన్.

ఎవడు గీతా ర్ధము ను నిత్య ము చిం తన చేయు చుం డు నో 

అతడు అనేక కర్మ ల నా చరిం చిననూ

జీవన్ము క్తు డేనని చెప్ప బడెను , మరియు దేహ పతనా నం 

తరము పరమ పదము ను (కైవల్య ము ను )

పొం దు ను .


గీతా మా శ్రిత్య బహవో భూ భు జో జనకా దయః |

నిర్ధూ తకల్మ షా లో కే గీతా యా తాః పరమం పదమ్ || 20 ||

సా క్షులరయ మనకు జనకా ది రా జులీ

లో కమం దను పమ శ్రీకరమగు

గీతనా శ్రయింశ్ర యించి పా తక దూ రు లై

ము క్తి నొం దినా రు పూ జ్య ము గను .

ఈ ప్రపంప్రపంచము న గీతను ఆశ్రయింశ్ర యించి జనకా ది రా జులు 

అనేకు లు పా పరహితు లై ము క్తిని

పొం దియు న్నా రు .


గీతా యాః పఠనం కృ త్వా మా హాత్మ్యం నైవ యః పఠేత్ |

వృ థా పా ఠో భవేత్ తస్య శ్రమశ్ర ఏవ హ్యు దా హృ తః || 21 ||

గీతా పఠనము చేసియు

గీతా పఠన ఫలము న్నొ కిం తచదు వమిన్

గీతా పఠనము వ్య ర్థం

బేతత్ఫ ల శూన్యు లగు దు రెఱు గు డు దీనిన్.

గీతని పఠిం చి పిదప మహత్య ము ను ఎవరు పఠిం చకుం దు రో 

అట్టి వా రి గీతా పఠనము

వ్య ర్ధమే(నిష్ఫ లమే). అట్టివా రి గీతా పఠనము శ్రమశ్ర మా త్రమేత్ర


మేనని చెప్ప బడినది.


ఏతన్మా హాత్మ్య సం యు క్తం గీతా భ్యా సం కరోతి యః |

స తత్ఫ లమవా ప్నో తి దు ర్లభాం గతిమా ప్ను యా త్ || 22 ||

గీత మా హాత్మ్య ము చదివి, గీత చదు వు

సజ్జను లు పొం దు దు రు తా ము సత్ఫ లము లు

పైన చెప్పి న ఫలము లు ప్రా ప్తమగు ను .

దు ర్లభం బగు సద్గతి దొరకు నిజము .

గీతా మహత్య ము తో గీతా పా రా యణము చేయు వా రు పైన 

చెప్ప బడిన ఫలము లను పొం ది,

దు ర్లభమగు సద్గతిని పొం దు తు రు .


సూ త ఉవా చ:

మా హాత్మ్య మేతద్గీతా యా మయా ప్రో క్తం సనా తనమ్ |

గీతాం తే చ పఠేద్య స్తు యదు క్తం తత్ఫ లం లభేత్ || 23 ||

శౌ నకా దిమహాఋషి సౌ మ్యు లా ర!

బహు సనా తన గీత మహత్య మేను

తెలిపితిన్. గీత పఠియిం చి దీని నెవరు

చదు వు గీతా ఫలము వా రు సరగు న గను .

సూ తు డు చెప్పె ను .

శౌ నకా ది ఋషు లా రా ! ఈ ప్రకాప్రకారనము గా సనా తనమైన 

గీతా మహత్య ము ను మీకు తెలు పు చు న్నా ను .

దీనిని గీతా పా రా యణా నం తరము ఎవరు పఠిం తు రో అతడు 

పైన చెప్పి న ఫలము ను పొం దు ను .

ఓం ఇతి శ్రీవరా హపు రా ణే గీతా మా హాత్మ్యం సం పూ ర్ణమ్

ఇట్లు వరా హ పు రా ణము నం దలి గీతా మహత్య ము సమా ప్తము .

జైహింద్.

యో యో యాం యాం తనుం భక్తః ..|| 7-21 || . స తయా శ్రద్ధయా యుక్త.. || 7-22 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 7-21 ||

శ్లో.  యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి|

తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్.

తే.గీ.  భక్తు లెవరెవ రేస్వరూపములలోన

శ్రద్ధతోడ దైవారాధ నుద్ధతిగను

కోరకొందురో వారిలో కొలుపు దేను

భక్తి నా దేవతలపైన ప్రబలనిత్తు.

భావము.

ఏయే భక్తుడు ఏయే రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని 

కోరతాడో ఆయా భక్తునికి ఆయాదేవతయందే అచంచలమైన 

శ్రద్ధని నేను కలిగిస్తాను.

 || 7-22 ||

శ్లో.  స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే|

లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్.

తే.గీ.  భక్తు లెవ్వార రెట్టిదైవముల గొలువ

నెంతు రవ్వారికినిభక్తి నెనరగొల్పి 

వారికాదైవ శక్తిగా ప్రబలి నేనె

కోర్కెలను తీర్తు, గ్రహియించుకొనుము పార్థ!

భావము.

అతడు శ్రద్ధతో కూడుకొని ఆరూపాన్ని ఆరాధించ సాగుతాడు. నాచే 

ప్రసాదింప బడిన ఆ కోరికలను,తాను ఆరాధించిన దేవతా

రూపంద్వారా పొందుతాడు.

జైహింద్.

8, జూన్ 2022, బుధవారం

బహూనాం జన్మనామన్తే ..|| 7-19 || . కామైస్తైస్తైర్హృతజ్ఞానాః.. || 7-2o ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

జైశ్రీరామ్. 

|| 7-19 ||

శ్లో.  బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే|

వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః.

తే.గీ. నరుడనేకజన్మల తుదిన్ జ్ఞాని యగుచు

సర్వమున్ వాసుదేవుడే శాశ్వితుడని,

నన్నె కొలుచును, భువిపైననెన్న నిట్టి

వారలరుదుగ నుందురు ప్రస్ఫుటముగ. 

భావము.

అనేక జన్మల తరువాత నరుడు జ్ఞాన వంతుడై సర్వమూ 

వాసుదేవుడని నన్ను కొలుస్తాడు.అలాంటి మహాత్ముడు చాలా 

అరుదుగా ఉంటాడు.

 || 7-20 ||

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేన్యదేవతాః|

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా.

తే.గీ. సహజమైన స్వభావాన సకలవాంఛ

లనిల దీర్చుకొనగ,  జ్ఞాన ఖని నశింప,

నితర దేవతలను గొల్చు క్షితిని జ్ఞాని,

నియమనిష్ఠలతోడను నిరుపమముగ.

భావము.

తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం 

హరించుకు పోగా ఆయా నియమాలని పాటిస్తూ వారు ఇతర 

దేవతలను ఆరాధిస్తారు.

జైహింద్.

7, జూన్ 2022, మంగళవారం

నిన్నటి సభలో భక్తిసాధన నిర్వాహకులు బెఅహ్మశ్రీ పండరి రాధాకృష్ణ, అచ్చతెలుగు అవధాని బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానందప్రసాద్. లతో నేను.

0 comments

 జై శ్రీరామ్.

జైహింద్.

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ..|| 7-17 || . ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ.. || 7-18 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

  జైశ్రీరామ్.

 || 7-17 ||

శ్లో.  తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే|

ప్రియో హి జ్ఞానినోऽత్యర్థమహం స చ మమ ప్రియః.

తే.గీ.  అట్టి నలువురీలో నన్ను ననితరమగు 

భక్తి గలుగుచుసేవించు వాడు శ్రేష్ఠు

డతనికిష్టంబు నేనౌదు డతడె నాకు

నిష్టుడంచు గ్రహింపుము నిష్టతోడ.

భావము.

ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు 

మాత్రమే  భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు. అటువంటి వాడికి నేను 

ఎక్కువ ప్రియుణ్ణి. అతడే నాకు కూడా ఇష్టుడు.

|| 7-18 ||

శ్లో.  ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్|

ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్.

తే.గీ. వీరలందరుదారులే, వీరిలోన

జ్ఞాని నాదౌ స్వరూపమౌన్, కారణమిదె

నన్నె సర్వోత్తమగతిగ నెన్ను జ్ఞాని,

యాశ్రయించును నన్నే నవిశ్రమముగ.

భావము.

వీరందరూ ఉదారులే. జ్ఞాని మాత్రం నాస్వరూపమని నా 

అభిప్రాయము. ఎందుకంటే అతడే సర్వోత్తమైన గతి అని 

నన్నే ఆశ్రయించి ఉంటాడు.

జైహింద్.

6, జూన్ 2022, సోమవారం

ఈ రోజు బర్కత్ పురాలో అవధాన శిక్షణా శిబిర ప్రారంభోత్సవం సందర్భముగా బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మగారు అందిస్తున్న జ్ఞాపిక.

0 comments

 జైశ్రీరామ్.

ఈ రోజు బర్కత్ పురాలో  అవధాన శిక్షణా శిబిర ప్రారంభోత్సవం సందర్భముగా బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మగారు అందిస్తున్న జ్ఞాపిక.
జైహింద్.

న మాం దుష్కృతినో మూఢాః ..|| 7-15 || . చతుర్విధా భజన్తే మాం.. || 7-16 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 7-15 ||

శ్లో.  న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః|

మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః.

తే.గీ. మూఢులున్, దుష్కృతులు, నధములును, మాయ

చేత జ్ఞానము లేనట్టి ఛిద్రమతులు, 

నసుర భావ భరితులౌ నరాధములును,

నన్ను సేవింప జాలరు క్రన్నన భువి.

భావము.

దుర్మార్గులు మూఢులు, మాయ చేత జ్ఞానం నశించిన వారు, 

అసురభావాన్ని ఆశ్రయించిన వారు ఐన నరాధములు 

నన్ను సేవించరు.

 || 7-16 ||

శ్లో.  చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున|

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ.

తే.గీ.  ఆర్తు, డర్థార్థి, జిజ్ఞాసు, వవని జ్ఞాని,

యనెడి నలువురు సేవింతు రనితరమగు

భక్తితో నర్జునా! నన్ను, శక్తికొలది,

నీవు గ్రహియింపుమిద్దియు నిండుమదిని.

భావము.

భరత కుల శ్రేష్టుడైన ఓ అర్జునా! ఆర్తుడూ, జిజ్ఞాసువూ, అర్ధార్ధీ, జ్ఞాని 

అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు.

జైహింద్.

5, జూన్ 2022, ఆదివారం

శ్రీ మాతృకావర్ణమాలికా ( 1) బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వరశర్మ

0 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వరశర్మగారికి ధన్యవాదములు.
జైహింద్.

త్రిభిర్గుణమయైర్భావైరేభిః ..|| 7-13 || . దైవీ హ్యేషా గుణమయీ మమ.. || 7-14 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

|| 7-13 ||

శ్లో‌.   త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్|

మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్.

తే.గీ.  త్రిగుణపూర్ణ భావాళిచే బ్రగణితముగ

భ్రాంతిలో బడి లోకము ప్రస్ఫుటముగ

వీటికన్ననతీతమై వెలుగుచున్న

నవ్యయుండగు నన్నువా రరయబోరు.

భావము.

మూడుగుణాలతో నిండి ఉన్న ఈభావాల చేత ప్రపంచం యావత్తూ 

బ్రాంతిలో పడి, వీటికన్నా అతీతమూ, అవ్యయమూ అయిన 

నన్ను గుర్తించలేదు .

 || 7-14 ||

శ్లో.  దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా|

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే.

తే.గీ.  భువిని త్రిగుణాన్వితపు మాయ నెవడుదాటు?

నేను సృష్టించితిని దీని నెనరున నను

నెవరు సేవింతురో వారు నేర్పు మీర

దాట గలుగుదు రీ మాయ, తత్వమరసి. 

భావము.

దివ్యమైన, త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాట రానిది. 

ఎవరు నన్నే  సేవిస్తారో వారు ఈ మాయని దాట గలరు.

జైహింద్.

4, జూన్ 2022, శనివారం

భక్తిసాధన చేయుఁడు భవ్యమతులు.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

బలం బలవతాం చాహం ..|| 7-11 || . యే చైవ సాత్త్వికా భావా.. || 7-12 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్

 || 7-11 ||

శ్లో.  బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్|

ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ.

తే.గీ.  కామరాగముల్ లేకుండ కలిగి యున్న

బలము నేనును బలునందు భరతకులజ!

ధర్మబద్ధమౌ కామము తలప నేనె

జీవులందున, గనుమిది, భావమరసి.

భావము.

ఓ భరతశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగాలు లేని బలాన్ని 

నేను. జీవులలో ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.

|| 7-12 ||

శ్లో.  యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే|

మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి.

తే.గీ.  నా వలన వచ్చుచుండెడి భావములవి,

తామసిక, రాజసికములు, తలప సాత్వి

కములు, నా లోన నుండెడున్ ఘనతరముగ,

నేను వాటిలో లేనని నీవెరుగుము.

భావము.

ఇంకా ఏవి తామసిక, రాజసిక, సాత్విక భావాలో అవన్నీ నా వలన 

వస్తాయని గ్రహించు. అయితే నేను వాటిలో లేను. అవినాలో ఉన్నాయి.

జైహింద్.

3, జూన్ 2022, శుక్రవారం

6 . 6 . 2022 నుండి ఉచిత అవధాన శిక్షణా శిబిరము...ంఇర్వహణ..గ్రహ్మశ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మ.

1 comments

 జైశ్రీరామ్.



జైహింద్.


పుణ్యో గన్ధః పృథివ్యాం ..|| 7-9 || . బీజం మాం సర్వభూతానాం.. || 7-10 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్..

|| 7-9 ||

శ్లో.  పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ|

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు.

తే.గీ.  నేనె పృథ్విలో వాసనన్, నేనె యగ్ని

లోని వేడిని, జీవులలోని ప్రాణ

మేనె, తపము తాపసులలో నేనె యెరుగ

అన్నియున్నేనె, యెరుగుమో యర్జునుండ!

భావము.

నేను పృథ్విలోని వాసనని. అగ్నిలోని వేడిని. జీవుల లోని ప్రాణాన్ని. 

తపస్సు చేసేవారిలో తపస్సుని.

 || 7-10 ||

శ్లో.  బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్|

బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్.

తే.గీ.  జీవులన్నింటిలోనున్న‌ జీవమగు స

నాతనమగు బీజము నేనె, జ్ఞానులందు

తెలివి నేనేను, ప్రతిభులన్ దెల్లమయెడి

ప్రతిభ నేనౌదునర్జునా పరులు కారు.

భావము.

అర్జునా! అన్ని జీవులలో సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో. 

బుద్ధిమంతుల లోని తెలివిని. ప్రతిభా వంతుల లోని ప్రతిభను నేను.

జైహింద్.

2, జూన్ 2022, గురువారం

మత్తః పరతరం నాన్యత్కిఞ్చి..|| 7-7 || . రసోహమప్సు కౌన్తేయ.. || 7-8 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 7-7 ||

శ్లో.  మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ|

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.

తే.గీ.  ఓ ధనుంజయా!నన్నుమించొక్కటైన

లేదు, లోకాన, సర్వమున్ నాదు కృషిని

నడుచు, సర్వమున్, నా యందె నడపబడును

దారమున మణులట్టుల ధీరవర్య!

భావము.

ధనుంజయా! నాకన్నా ఏక్కువైనదీ ఏదీలేదు. జగత్తు యావత్తు దారంలో 

మణులవలె నాలో గుచ్చబడి ఉన్నది.

|| 7-8 ||

శ్లో.  రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః|

ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు.

తే.గీ. నీరు రుచి నేనె, వేద యోంకార మేనె,

తలప నెలవంక , సూర్యుల వెలుగు నేనె,

నేనె మనుజులన్ దీక్షయు, నింగిలోన

శబ్దమేనేను, గ్రహియించు జయనిధాన.

భావము.

కౌంతేయా! నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రులలోని వెలుగును, 

వేదాలలోని ఓంకారాన్ని, ఆకాశంలో ఉన్న శబ్ధ గుణాన్ని. 

మానవులలోని పట్టుదలను.

జైహింద్.

1, జూన్ 2022, బుధవారం

అపరేయమితస్త్వన్యాంషు..|| 7-5 || . ఏతద్యోనీని భూతాని.. || 7-6 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

జైశ్రీరామ్.

 || 7-5 ||

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|

జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్.

తే.గీ.  ఓమహాబాహుడా! యల్ప యొప్పిదమిది,

యిదియె కాక వేరగు జీవి యయిన ప్రకృతి

నాది, గనుమిది,  దాననే నడచుచుండు

జగము, లేదన్యమెంచినన్, ప్రగణితముగ.

భావము.

ఓ మహానుభాహుడా! ఇది అల్పమైనది.ఇంతకన్నా వేరై జీవుడిగా మారినదీ 

నా పరమైన ప్రకృతి అని తెలుసుకో. దాని వలననే ఈ జగత్తు భరించబడుతుంది.

|| 7-6 ||

ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ|

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా.

తే.గీ. అన్ని ప్రాణులకునుమూల మరసిచూడ

యిట్టి యీ నా ప్రకృతిమూల మిదియె నిజము,

సృష్టి యుత్పత్తి నాశముల్ చేయుదేను

నేనె మూలమంచెరుగుము నీఖిలమునకు.

భావము.

ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకీ మూలమని తెలుసుకో. యావత్తు 

జగత్తు యొక్క ఉత్పత్తి, నాశనములకు మూలము నేనే అని తెలుసుకో.

జైహింద్.