గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).32వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

32. పంకేరుహానన! కుశంకల్ మదిన్ విడిచి కైంకర్యమున్ సలుపనా. 

ఓంకార రూపము నుటంకించి తెల్పెదను శ్రీంకార తేజమగు నిన్. 

సంకాశమే కనని ఐంకార భాసినివి. యింకేలనీ వ్యవధు లో 

హ్రీంకార తేజస యహంకారమున్ తుడిచి కైంకర్యమున్ గొను సతీ! 

భావము.

ఓ సతీ మాతా! ఓ పద్మముఖీ! మనసున్బుండి చెడు అనుమానములు 

విడిచిపెట్టి నీ సేవచేయనా తల్లీ!ఓంకార రూపమును ఉటంకించిమరీ 

శ్రీంకారమున ప్రకాశించెడి నిన్ను తెలిపెఅదనమ్మా. పోలికయే లేనట్టి 

ఐంకారమున ప్రకాశించుదానవు. ఇంక ఎందులకీ విడంబనము? ఓ హ్రీంకార 

తేజమా! నాలోని అహంకారమును తుడిచివైచి,నా సేవలను స్వీకరింపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.