గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).31వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

31. నిత్యారుణద్యుతిని సత్యప్రబోధవయి స్తుత్యంబుగా వెలుఁగుదే 

నిత్యంబు నిన్ గొలిచి యత్యున్నత స్థితిని స్తుత్యుల్  కనన్ గొలుపుమా. 

భృత్యాళి సమ్మదుల నిత్యంబు వెల్గెడి మహౌన్నత్య వీవె జననీ. 

కాత్యాయనీ కనుమ భృత్యున్ ననున్ సతము స్తుత్యంబుగా నిల సతీ! 

భావము.

ఓ సతీ మాతా! నీవు నిత్యమూ అరుణకాంతితో సత్యప్రబోధన 

చేయుచున్నదానివయి,  ప్రకాశించుచుందువు కదా. పొగడఁబడఁదగువారు 

నిత్యమూ నిన్ను సేవించుచు అత్యున్నతమయిన స్థితి పొందునట్లుగా 

చేయుము తల్లీ! నీ సేవకులయందును, మంచి హృదయులయందును 

నిత్యమూ ప్రకాశించెడి గొప్ప ఔన్నత్యమేది కలదో అది నీవేకదా తల్లీ! ఓ 

కాత్యాయనీమాతా! నీసేవకుఁడనయిన నన్ను నిత్యమూ భూమిపై 

ప్రశంసనీయముగా చూడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.