గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

ఓమ్ నమోzహం పదార్థాయ మేలిమి బంగారం మన సమ్స్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  ఓమ్ నమోzహం పదార్థాయ - లోకానాం సిద్ధి హేతవే!

సచ్చిదానందరూపాయ - శివాయ పరమాత్మనే.

తే.గీ.  లోకముల మోక్షసిద్ధికి శ్రీకరముగ

హేతువగు సచ్చిదానంద హృదయవర్తి

యాత్మరూప సచ్ఛివున కే నంజలింతు

భక్తిపూర్ణుండనై మదిన్ బ్రబలముగను.

భావము.

లోకము(జను)ల (మోక్ష) సిద్ధికి కారణ మైనది, సచ్చిదానంద స్వరూపమైనది, అగు 

అహం(బ్రహ్మ) పదార్థమునకు నమస్కరించు చున్నాను.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.