గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2024, బుధవారం

ఆక్రోశపరివాదాభ్యాం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  ఆక్రోశపరివాదాభ్యాం  -  విహింసంత్యబుధా బుధాన్ |

వక్తా పాపముపాదత్తే  -   క్షమమాణో విముచ్యతే || (విదురనీతి)

తే.గీ.  మూఢులాక్రోశధూషణల్ బుధులు బాధ

పడునటులఁ జేయుచుండుటన్ బాపచయము

బుధుల నుండి మూఢులఁ జేరు, బుధులు యోర్మిఁ

బాప ముక్తులై, సన్ముక్తిఁ బడయుదురయ!

భావము.  మూఢులు పండితులను దూషణలతోనూ, తప్పుడు ఆరోపణలతోనూ 

బాధిస్తారు. దూషించేవాడు సత్పురుషులలో ఉండే తక్కువ పాపాలను కూడా 

తన దూషణలకు వినిమయ రూపంలో స్వీకరిస్తాడు. తద్వారా క్షమాగుణంతో 

ఉన్న సత్పురుషుడు పాపాల నుండి విముక్తి పొందుతాడు!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.