జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శా. అమలా!
నీ నగుమోము
చంద్రికలనే యాస్వాదనన్ జేయ,
ను
త్తమ మాధుర్యము నాల్కలన్ నిలిచె మాతా! యీ చకోరాళికిన్,
రమణీ!
చంద్రునినుండియామ్లరుచులన్
బ్రార్థించి యాచంద్రికల్
ప్రముదంబున్ గొను కాంచికన్ నిశలలోభావింప చిత్రంబిదే. ॥ 63 ॥
భావము.
అమ్మా, నీ ముఖ చంద్రుని చిరునవ్వును త్రాగుచున్న చకోరపక్షులకు అతి మథురిమతో నాలుక మొద్దుబారినది, అందువలన ఆ చకోరపక్షులు పులుపు రుచిని కోరుచు చంద్రుని వెన్నెల కోరుచు, అన్నపు గంజి ఇష్టము వచ్చినట్లుగా ప్రతి రాత్రియందు బాగా త్రాగుచున్నవి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.