గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2024, శనివారం

లక్ష్మీసహస్రం. 17వ శ్లోకం. 125 - 128. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోసర్వజ్ఞశక్తిశ్శ్రీశక్తి(సర్వజ్ఞః)ర్బ్రహ్మవిష్ణుశివాత్మికా

ఇడాపింగలికామధ్యమృణాలీతంతురూపిణీ 17  

125. ఓం *సర్వజ్ఞశక్త్యై* నమః

నామ వివరణ.

సమస్తమును తెలిసిన శక్తి స్వరూపిణి అమ్మ.

కం*సర్వజ్ఞ శక్తి! * వినుమా.

నిర్వేదము నిన్నుఁ గొలువనీయదు జననీ!

పర్వంబులందునైనను

గర్వము విడనాడి నిన్ను గాంచఁగనిమ్మా.

126. ఓం *శ్రీశక్త్యై* నమః.

నామ వివరణ.

మంగలప్రపూర్ణమయిన శక్తి అమ్మయే.

తే.గీ. మంగలప్రద *శ్రీ శక్తి!* మాతృదేవి!

లోక కల్యాణ కారిణీ! లోకమాత!

మంగలప్రద శక్తిని మాకొసగుము,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *సర్వజ్ఞా*యై నమః

కం. సర్వము నీవే యనుచు

ధర్వుని వేదమ్ము చెప్పు, తత్వజ్ఞులు నిన్

సర్వజ్ఞా యని కొలుతురు,

*సర్వజ్ఞా! * ననునొనర్పు సర్వజ్ఞునిగా.

127. ఓం *బ్రహ్మవిష్ణుశివాత్మికా*యై నమః

నామ వివరణ.

సృష్టి స్థితి లయకారకులయిన త్రిమూర్తుల ఆత్మ అమ్మయే.

తే.గీ*బ్రహ్మవిష్ణుశివాత్మికా* పరమ పథము

బ్రహ్మ జిజ్ఞాసచే గాంచి పరగునట్లు

చేయు తల్లివి, నన్నింక చేదుకొనుము,

బ్రహ్మజీవైక్యసిద్ధిని వరల నిమ్ము.

128. ఓం *ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణ్యై* నమః

నామ వివరణ.

మనలోనుండు ఇడ, పింగల, అను నాడుల మధ్యనుండెడి

సుషుమ్నాడి తామరతూడుదారముఆకారములో ఏది యుండునో రూపము

అమ్మయే.

స్వయంకల్పిత మృణాలి వృత్తము.

గణములు. …..                  …   యతి 9 అక్షరముప్రాస కలదు.

*ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణీ!*

వడిన్ నీవిక రావమ్మ! భవానీ! భాసురాంబికా!

కడన్ నిల్పగ నేలమ్మ! గణించమ్మా ననున్ సతీ!

కడున్ గౌరవ తత్వం బిఁక నీవేయిమ్ము గొప్పగా!


జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.