గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2024, శనివారం

కరతలసంస్కృతం గ్రంథాన్ని ఉచితంగా పొందండి (చదువఁ దలచుకొనినవారు మాత్రమే.) జయతు సంస్కృతమ్.

జైశ్రీరామ్.

జయతు సంస్కృతమ్.

సృష్టి విజ్ఞాన భాండము సంస్కృతము. అది మనము నేర్చుకొనినచో సత్యమగు విషయపరిగ్రహణము సుకరమగును. కాని మనకు సరిగా నేర్చుకొను మార్గము తెలియక కొట్టుమిట్టాడుచు, ఎవరేది చెప్పినా అది నమ్మేస్తూ, అవగాహనారాహిత్యంతో జీవించెస్తున్నాము. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి, అన్నిటికీ మూలమైన స్వంస్కృతాన్ని అభ్యసిస్తే మనమే స్వయముగా ప్రతీ విషయమును సప్రమాణికముగా తెలియజేయుచూ సత్యమార్గములో ప్యనింపజేయవచ్చును. ఐతే మనము పాఠశాలలుకు పోయి నేర్చుకొనే తీరిక లేదు. ఇంటనుండియే మనము నేర్చుకొను మార్గమొకటి నాకు ఆ జగన్మాత కనబరచినది.
శ్రీమాన్. డా.పి. టి. జి. వి. రంగాచార్యులవారు 
కరతలసంస్కృతం 
అనే గ్రఠమును స్వయముగా రచించి పాఠకులకు సంస్కృతాభ్యాసము సుకరము చేసిరి.
ఈ గ్రంథము ముద్రించి చదువుకొను ఉత్సాహమున్నవారికి ఉచితముగా ఇచ్చుచున్నారు. వారు అప్పుడప్పుడు మనము అడిగే సందేహములను కూడా నివృత్తి చేయుచుందురు. కాన ఔత్సాహికులు తప్పక ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొని సంస్కృతమభ్యసించి జ్ఞానముతో ప్రకాశింపవచ్చును.
గ్రంథము కావలసినవారు

శ్రీమతి ఓ. విజయశ్రీ హైదరాబాదు వారిని 94906 83667 ద్వారా
లేదా
డా. పి. జి. టి. వి. రంగాచార్యులు శ్రీరంగపురం వారిని 94404 36557 ద్వారా
సంప్రదించి పొందవచ్చును.
జయతు సంస్కృతమ్.
జయతు భారతమ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.