సీ. వామ భాగమునందు వరలుచు శివునిలో, సంతృప్తి గనకేమొ శంభురాణి!
మిగిలిన దేహాన మేలుగా
నిలిచినట్లనిపించుచుండెనో యమ్మ!
కమగ,
నా మది ముకురాన నీ మాన్య తేజంబు
కనిపించునట్టులో కంబు కంఠి!
ఉదయభానుని తేజమది నీదు దేహంబు నందుండి
రవి కోరి పొందియుండు
తే.గీ.
నంతచక్కని
కాంతితో సుంత వంగి
స్థనభరంబుననన్నట్లు సన్నుతముగ
మూడు కన్నులతో వంపు తోడనొప్పె,
నీవు శివతత్త్వపూర్ణవో నిరుపమాంబ!. ॥
23 ॥
భావము.
ఓ జగన్మాతా! తల్లీ! అమ్మా! నీవు ముందర శివశంభుడి వామ భాగాన్ని గ్రహించావు.అయినా నీకు తనివి తీర లేదనిపిస్తుంది.ఎందుకంటే తనివితీరని మనస్సుతో అర్థనారీశ్వరుడి ఆ మిగిలిన సగ భాగంకూడా ఆక్రమించావనిపిస్తుంది. నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే నా హృదయఫలకం పైన విరాజిల్లుతున్న నీ దివ్య స్వరూపం అలా గోచరిస్తున్నది. నీ దివ్య స్వరూపం ఉదయ భానుడి కాంతితో సాటి వచ్చే కెంపు కాంతులతో ఒప్పారుతూ వుంది. పాలిండ్ల జంటతో యించుక ముందుకు వంగినట్లు కనపడుతూ వుంది. ఆ నీ దివ్య స్వరూపం మూడు కన్నులు కలిగి, వంపు తిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్న కిరీటంతో సొంపారుతూ, విరాజిల్లితుంది. దీని భావం ఏందంటే అమ్మవారు తనలో శివతత్త్వాన్ని లయం చేసుకున్నారని.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.