జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
సీ. హేమాద్రి పుత్రి! నిన్నేమని పొగడుదు, నీచూపు పడెనేని నిత్య శుభము
లందగవచ్చును, మందస్మితా! నీదు కడగంటి చూపునన్ కంతుడిలను
పూలవిల్లే కల్గి, పూర్తిగా
తుమ్మెదల్ నారిగా కల్గియనారతంబు
నైదు బాణములనే, యాయుధంబుగ కల్గి, జడుఁడుగా నుండియు వడివడిగను
తే.గీ. మలయ మారుత రథముపై మసలుచుండి
సృష్టినే
గెల్చుచుండె, నీ దృష్టికొఱకు
భక్తులల్లాడుచుంద్రు
నీ ప్రాపుఁ గోరి,
చూచి రక్షించు,
నేనునున్
వేచియుంటి. ॥
6 ॥
భావము.
అమ్మా ! హిమవత్పర్వత రాజ పుత్రీ ! పూవులతో కూడిన విల్లు, తుమ్మెదల తో చేయబడిన నారి, అయిదు బాణములు, జడత్వము కలవాడునూ,మలయ మారుతమే యుద్ధ రధముగా గల మన్మధుడు సైతము నీ కడగంటి చూపు వలన ఈ జగత్తునే జయించుచున్నాడు కదా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.