జైశ్రీరామ్.
VIDEO
ఓం శ్రీమాత్రే నమః.
చం . కలిగెడి
యా మహా
ప్రళయ కాలమునందున
బ్రహ్మ , విష్ణు
రు
ద్రులు ,
యముఁడున్ , గుబేరుఁడు , నరుల్దివిజాధిపుడింద్రుడున్ ,
మునుల్
కలియుటనిక్కమెన్నగను
కాలగతిన్ , బ్రళయంబునందునన్
గలియుచు
నిన్ను గూడి
కరకంఠుడు తాను
సుఖించునేకదా .
॥ 26 ॥
భావము .
అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ , విష్ణువు కూడా అంతమును పొందెదరు . అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు . ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందు చున్నాడు . ఇంద్రుడు మున్నగు దేవతలు , మునులు కూడా అంతము చెందుచున్నారు . అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా ! జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.