గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 32 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శివుఁడున్ శక్తియు కానుఁడున్ క్షితిరవుల్, శీతాంశుఁడట్లే స్మరుం

డవలన్ హంసయు, శక్రుఁడున్, గన ఘనంబౌనా పరాశక్తియున్,

భవుడౌ మన్మధుఁడున్, దగన్ హరియునీభవ్యాళి సంకేతవర్ణో

ద్భవ హృల్లేఖలు చేరగా తుదిని నీ భాస్వంత మంత్రంబగున్. 32

భావము.

జననీ! శివుడు, శక్తి, కాముడు, క్షితి; రవి, శీతకిరణుడు, స్మరుడు, హంసుడు, శుక్రుడు; పరాశక్తి, మన్మథుడు, హరి అనేవారి సంకేతాలైన వర్ణాలు, మూడు హృల్లేఖలు, చివరలో చేరగా వర్ణాలు మాతా! నీ నామరూపాలవుతున్నాయి (నీ మంత్రమవుతున్నవి). (మంత్రం హ్రీం, హ్రీం, హ్రీం, అని. ఇదే పంచదశీ మంత్రం లేక పంచదశాక్షరీ మంత్ర మవుతోందని తెలియనగును).

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.