జైశ్రీరామ్
శ్లో. దేహో దేవాలయః ప్రోక్తో - జీవః ప్రోక్త స్సనాతనః
త్యజేదజ్ఞాన నైర్మాల్యం - సోఽహం భావేన పూజయేత్.
తే.గీ. దేహమే గుడి తలపగ, దేహమునను
జీవుఁడెన్నఁగ దైవమే, శ్రీకరుండ!
విడిచి యజ్ఞాన నైర్మాల్య వితతి, సతము
దైవమును నీవె నేనని తలచి కొలుము.
భావము. దేహమే దేవాలయము. జీవుఁడు సనాతనుఁడైన ఈశ్వర స్వరూపము.
అజ్ఞానమనెడి నైర్మాల్యమును తీసివేసి నీవే నీను అనే భావముతో ఆత్మస్వరూపుని
పూజించవలెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.