జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చం. సురుచిరహాసమై విరియు, సుందర దంతపు కాంతి కేసరో
త్కర వర సౌరభాన్వితపు గణ్యపు నీ ముఖపద్మమందునన్
స్మరుని యడంచినట్టి శివ సన్నుతదృక్భ్రమరమ్మువ్రాలెగా,
వరలెడి నీలి ముంగురులు పద్మపు కాంతిని గేలి సేయుగా. ॥ 45 ॥
భావము.
ఓ జగన్మాతా ! చిరు నవ్వుతో వికసింౘుౘున్నదియు దంతముల కాంతులు అనే కేసరములచే సుందర మైనదియు, సువాసన కలదియు అయిన నీముఖ పద్మము నందు, మన్మథుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు కూడా మోహ పడుతున్నాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.