జైశ్రీరామ్.
శ్లో. దినాంతే చ పిబేత్ దుగ్ధం - నిశాంతే చ పిబేత్ పయ:l
భోజనాంతే పిబేత్ తక్రం - కిం వైద్యస్య ప్రయోజనంll
తే.గీ. రాత్రి శయనవేళను పాలు త్రాగుటొప్పు,
నిద్ర లేచి త్రాగుట యొప్పు నీరు సతము,
భోజనము చేసి మజ్జిగ పొలుపు మీర
త్రాగుటొప్పును, క్షేమంబు తప్పకొదవు.
భావము. రాత్రి పడుకోబోయే ముందు పాలు త్రాగాలి. ఉదయం నిద్ర లేవగానే
మంచి నీరు త్రాగాలి. భోజనానంతరం మజ్జిగ త్రాగాలి. ఈ మూడు పనులు
నిత్యం చేస్తూ ఉంటే వైద్యునితో పనిలేక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.