జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చం.
పొరపడి నీ సపత్ని తలపున్ బ్రకటించియు మిన్నకున్న, నీ
చరణముతోడ తన్నితివి శంభుని, యందేలధ్వానమేర్పడన్,
మురియుచునున్న శంకరునిముంచుచు ప్రేమను కిల్కిలధ్వనుల్
సరసన కాముడొప్పె గుణసంస్తుత! శాంభవి! నీవెఱుంగవా? ॥
86 ॥
భావము
.
తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక వెలవెలబాటుచే లొంగిన భర్తను , నీ చరణకమంలంతో నుదుట తాడనం జరుపగా గాంచి శివుడికి శత్రువైన మన్మధుడు ( ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని ) నీ కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.. ... జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.