జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
సీ. ఆపాద మస్తకంబంతటి కిరణాలఁ బ్రసరించు నమృతమ్ము నసమరీతిఁ
గురిపించుచున్నట్టి నిరుపమ శశిశిలా మూర్తిగా భావించి
స్ఫూర్తితోడ
నే సాధకుండు నిన్ హితముతోఁ బ్రార్థించునట్టివాఁ డసమానుఁడయిన
గొప్ప
గరుడుని యట్టుల నురగ దంష్ట్రల నుండి వెల్వడు విషమును
వింతగాను
తే.గీ. బాపువాఁడగుచుండెను, జ్వరముతోడ
బాధనందువారికి బాధఁ బాయఁజేయు
కంటిచూపుచేఁ దగ్గించఁ గలుగుచుండు
నమ్మ! నావందనములందుకొమ్మ నీవు. ॥
20 ॥
భావము.
అమ్మా ! పాదముల మొదలు శరీరము అంతటి కిరణముల నుండి ప్రసరించు చున్న అమృతము ను కురిపించుచున్న చంద్రకాంత శిల్పా మూర్తిగా నిన్ను ఏ సాధకుడు ప్రార్ధించు చున్నాడో అట్టి వాడు గరుత్మంతుని వలె పాముల నుండీ వెలువడుచున్న విషమును హరింప చేయుచున్నాడు, జ్వరముతో భాధింప పడు వానిని అమృతము ధారగా కలిగిన తన నాడుల యొక్క శీతలమయిన చూపుచేత జ్వరబాధను తగ్గించి సుఖమును కలుగ చేయుచున్నాడు కదా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.