జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ఉ. నీదగు నాభి,
గాంగ నుతనిర్ఝరలో
సుడి, గుబ్బమొగ్గలన్
మోదము నిల్పు రోమలత మూలము, మన్మధతేజసాగ్నికిన్
పాదగునగ్నిగుండ,మనవద్యరతీగృహ
మాత్రిశూలికిన్
శ్రీద సునేత్రపర్వగుహ సీమపు ద్వారమవర్ణ్యమమ్మరో! ॥ 78 ॥
భావము.
ఓ హిమగిరికన్యకా ! నీ నాభి చలనంలేని గంగానది నీటి సుడిగాను , పాలిండ్లనే పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగయొక్క పాదుగాను , మన్మధుడి తేజస్సనే అగ్నికి హోమకుండంగాను , మరుని చెలువ ఐన రతీదేవికి శృంగారభవనంగాను , నీ పతి ఐన సదాశివుడి నయనాల తపస్సిధ్ధికి గుహాద్వారమై , అనిర్వాచ్యమై , అతిసుందరమై సర్వోత్కర్షతో ప్రకాశిస్తొంది .జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.