గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 68 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చం.  పురహరు బాహు బంధమునఁ బొల్పగు నీదగు కంఠనాళమే

సురనుత! కంటకాంకుర ప్రశోభితవారిజనాళమట్లు కాన్

వరలుచు గంధ పంకమున భాసిలె హారము నాళమట్లుగన్.

నిరుపమ! నిన్ మదిన్ నిలిపి నేను భజించెదఁ గాంచుమా కృపన్. 68

భావము.
భగవతీ ! నీ యీ కంఠం త్రిపురాంతకుడైన శివుడి బాహువులచే గావించబడిన ఆలింగనంతో గగుర్పాటు నొందినదై ముఖ పద్మానికి నాళం వంటిదవుతోంది. నీ కంఠానికి క్రింది భాగాన సొంపారుతూ స్వభావ సిద్ధంగా నే తెల్లనై, స్వచ్ఛమైన నీ యీ ముత్యాల పేరు తీవె నల్ల అగరు గంధపు టసలు నీలి వన్నె చే తామర తూడు ౘక్కదనాన్ని పొందుతూన్నది.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.