జైశ్రీరామ్.
VIDEO
ఓం శ్రీమాత్రే నమః.
మ .
గిరిజా ! సన్నుత ! యో విధిజ్ఞ ! జయసంకేతమ్మ ! నీ యూరువుల్
కరి తొండమ్ముల , నవ్యదివ్య కదళీకాండమ్ములన్ గెల్చునే ,
పరమేశానుని సత్ప్రదక్షిణవిధిన్ బ్రార్థించుటన్ జానువుల్
కరి కుంభమ్ములయెన్ , గణింపఁ దగు సంకాశమ్మె లేదీశ్వరీ ! ॥
82 ॥
భావము
ఓ హిమగిరిపుత్రీ ! వేదార్ధవిధి నెఱిగి అనుష్ఠించే రాణీ , నీ ఊరుపులు అందంలో గజరాజాల తొండములను , బంగారు అరటిస్థంభాల సముదాయములను ధిక్కరిస్తున్నవి . నీ రెండు ఊరుపులు ( తొడల ) చేత జయించి , శోభనములై వర్తులములు కలిగినవీ భర్త ఐన పరమేశ్వరుడికి మొక్కటంచేత గట్టిపడినవైన నీ జానువులు , దిగ్గజాల కుంభస్థలముల జంటలను కూడ జయించి ప్రకాశిస్తున్నాయి .( ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరం ఆమె సౌందర్యంతో తులతూగ గలదు ? తులతూగలేదు అని భావము . జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.