జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చం.
చెమరుచు నీదు పార్శ్వముల చీలునొ చోలమనంగ నొత్తు నీ
విమల పయోధరంబులను విస్తృతిఁగొల్పెడి మన్మధుండు భం
గము కలిగింపరాదనుచు కౌనునకొప్ప వళీలతాళితో
సముచితరీతిఁ గట్టినటుచక్కగనొప్పుచునున్నదమ్మరో! ॥ 80 ॥
భావము
ఓ ప్రకాశించే రూపుగల దేవీ! ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వాలలో అంటుకొనివున్న రవికెను పిగుల్చుచున్నవీ , బాహుమూలల సమీప ప్రదేశాలను ఒరయుచున్నవీ , బంగారుకలశంవలె ఒప్పారుచున్నవీ ఐన కుచములను నిర్మిస్తూన్న మన్మధుడు, యీ (స్తనభారంవల్ల ) భంగంకలుగరాదని నడుమును కాపాడటానికి అడవిలతలచేత ముప్పేటగా కట్టబడెనా అన్నట్లు నీ పొట్టమీద మూడుముడతలు తోచుతున్నాయి.జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.