జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ఉ. తెల్లని
చంద్రకాంత శిల తీరునవెల్గుచు, నష్టసిద్ధులన్
మల్లెలఁ బోలు
యోగులననారతమొప్పుచు వెల్గుచుండు ని
న్నుల్లము పొంగ
నిత్యము మహోన్నత భక్తిని గొల్తురెవ్వ రా
చల్లని సత్కవుల్ కవన
సంపద శారద పూర్ణ తేజమే. ॥ 17 ॥
భావము.
అమ్మా ! చంద్ర కాంత మణుల శిలా కాంతి వంటి కాంతి కలిగి వసిన్యాది అష్ట శక్తులతోనూ ద్వాదశ యోగినులూ కలిగిన నిన్ను ఎవ్వడు చక్కగా ధ్యానము చేయు చున్నాడో అతడు కాళిదాస వ్యాసాదులు మొదలుగా గల మహాత్ముల రచనల వలె మనోహరములయినట్టియు సరస్వతీదేవి ముఖ కమలము యొక్క పరిమళములు గల రచనలు చేయుటకు సమర్ధులు అగుచున్నారు కదా !
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.