గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2024, సోమవారం

సుకృతేన కులే జన్మ. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  సుకృతేన కులే జన్మ - సుకృతేన సుభాషితమ్ |

సుకృతేన సతీ భార్యా - సుకృతేన కృతీ సుతః ||

(హరిహర సుభాషితం)

శ్లో.  సత్ కులోద్భవ మొక పుణ్య సాధ్య ఫలము,    

పూర్ణ వాగ్ధాటి లభియించు పుణ్యముననె, 

సాధ్వి పుణ్యఫలముననే సతిగ దొరకు,

పుణ్యముననే వివేకియౌ పుత్రుఁడొదవు.

భావము.  సత్కులములో జన్మించడమూ, మంచి మాటకారితనమూ, 

సాధ్వియైన భార్యా, వివేకవంతుడైన పుత్రుడూ పుణ్యం వలన మాత్రమే 

లభ్యమగును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.