జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః
తే.గీ. గమక గీతైక నిపుణ! నీ
కంఠ రేఖ
లు తగె మూడు సూత్రపు ముడులువలెనమ్మ!
షడ్జ, మధ్యమ,
గాంధార, సంస్తుతగతి
కమరు హద్దన నొప్పె, మహత్వముగను. ॥ 69 ॥
భావము.
సంగీత గానములో ముఖ్యమైన నేర్పరితనముగలదానా, నీ కంఠములో మూడు ముడతలు, పెళ్లిసమయములో కట్టిన ముప్పేటల సూత్రమును గుర్తుచేయుచున్నవి. కల్యాణి మొదలగు అనేక రాగములకు ఆశ్రమస్థానములైన షడ్జ మధ్యమ గాంధారముల ఉనికికై ఏర్పరచిన సరిద్దులవలె ప్రకాశించు చున్నవి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.