జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శా. కన్నుల్
కాంతి విహీనమై జడుఁడునై కాలంబికన్ జెల్లెనం
చెన్నంజాలిన వానిపైన
బడినన్ హృద్యంపు నీ చూపహో!
కన్నెల్ చూడగ నెంచి
వానిని మదిన్ గాంక్షించుచున్ బయ్యెదల్
క్రన్నన్ జారఁగ, నీవి, మేఖలలు జారన్ బర్వునన్ వత్తురే. ॥
13 ॥
భావము.
అమ్మా ! ఏ పురుషుడు ముదుసలి అయి శరీరము ముడుతలు పడి, కళ్ళనిండా పుసులు ఉండి మసక చూపు కలిగి, శృంగార భాషణములు కూడా చేయలేని మూఢుడయిన వాడు అయినా నీ క్రీగంటి చూపులకు పాత్రమయిన వానిని చూచుటకు వందల కొలది మదవతులు తమ జుట్టు ముడులు విడిపోవుచున్ననూ, పయ్యెదలు జారిపోవు చుండగా, బంగారు మొలనూలులు జారిపోవుచుండగా వానిని చూచుటకు పరిగెత్తుకుని వెంట పడుతున్నారు కదా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.