గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 39 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీనీదు స్వాధిష్ఠాన నిరుపమ చక్రాన నగ్ని తత్త్వంబున నమరుయుండు,

నగ్నిరూపుండైన యాశివున్ స్తుతియింతు, సమయ పేరునగల సన్నుత మగు

మహిమాన్వితంబైనమాతృస్వరూపిణీ! నిన్నునున్ దలచుచు సన్నుతింతు,

నేకాగ్రతను జేయునీశుని ధ్యానాగ్నినిని లోకములు కాలుననెడియపుడు

తే.గీనీదు కృపనొప్పు చూడ్కులునిరుపమాన

పూర్ణ శశిచంద్రికలె యార్పు పూర్తిగాను,

లోకములనేలు జనని! సులోచనాంబ!

వందనంబులు చేసెద నందుకొనుము. 39

భావము.

స్వాధిష్ఠానచక్రమునందలి అగ్నితత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడు, అగ్ని రూపుడయిన శివుడిని స్తుతించెదను. అదే విధముగాసమయఅనుపేరుగల మహిమాన్వితమైన నిన్ను స్తుతించెదను. మిక్కిలి గొప్పదై  ఏకాగ్రతతో కూడిన   పరమేశ్వరుని ధ్యానాగ్ని చూపు భూలోకాది లోకములను దహించును. ,  నీ కృపతో కూడిన చూపు శీతలమును ఉపశమనమును కావించుచున్నది.

సీమణిపూర చక్రమే మహిత వాసమ్ముగా కలిగి చీకటినట వెలుగునదియు,

కలిగిన శక్తిచే వెలుగులీనునదియు, వెలుగులీనెడిరత్న ములను గలిగి

యున్న యింద్రధనువు నొప్పుచు, జగతిని శివరవి తప్తమౌ చిక్కుచున్న

ముల్లోకములకును పూర్ణ వృష్టి నొసగు మేఘమౌ జననిని మేలు గొలుతు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.