జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చం.
జనకుని నుండి పొందిన బ్రశస్త నితంబ ఘనంబుఁ జేసి ధా
రణమును చేయఁగల్గుటగు ప్రాభవమొప్పధరన్, నితంబ స
ద్ధన మరణంబుగాగ, సుకృతంబయె నీకది, భూ ధరంబునన్,
మనమున నిన్నునెన్ను నను మానిని నెమ్మిని మున్నునమ్ముమా. ॥ 81 ॥
భావము
ఓ తల్లీ ! శైలజా! నీ జనకుడు హిమవంతుడు తన నితంబ ( కొండ నడుమ పైనున్న చదునైన ) ప్రదేశం నుంచి గొప్పబరువును , వైశాల్యాన్ని గ్రహించి నీకు అరణముగా ( వివాహసమయంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే కానుక) ఇచ్చాడు. కాబట్టే నీ పెరుగుదల ఘనత బరువై, విశాలమై, ఈ భూమండలాన్నంతా కప్పుతూ తనబరువుచే భూమిని తేలికైన దాన్నిగా చేస్తున్నది.దీన్లో సందేహం లేదు.జైహి<ద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.