గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 16 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంకవుల మనంబులన్ జలజ గౌరవ సద్వన సూర్యకాంతివౌ

ప్రవర మనోజ్ఞమౌ యరుణ పావననామ! నినున్ భజించుచున్

బ్రవరులు బ్రహ్మరాణివలె భాసిలు దివ్య రసప్రథాన సు

శ్రవణ కుతూహలంబయిన చక్కని వాగ్ఝరితో రహింతురే. 16

భావము.

అమ్మా ! కవి శ్రేష్ఠుల చిత్తములనెడి పద్మ వనములకు బాల సూర్యుని కాంతివగు అరుణ అను నామము కల నిన్ను కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మ ప్రియురాలు అగు సరస్వతీదేవి వలె మిక్కిలి శృంగార రస ప్రధానములతో గంభీరములు అయిన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింప చేయు చున్నారు కదా !

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.