జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
కం. భాషా సమ్మానంబది
భాసింపగనీయఁబడియె ప్రఖ్యాతిమెయిన్
భాషాసతి పుత్రునకున్
భేషుగ శ్రీ బేతవోలు విఖ్యాతునకున్.
గురుపాదులకు అభినందనలు.
బేతవోలు రామబ్రహ్మంకు భాషా సమ్మాన్ అవార్డు ప్రదానం
ఈనాడు, దిల్లీ: ప్రముఖ రచయిత, సాహితీవేత్త బేత వోలు రామబ్రహ్మం గురువారం ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు-2021 అందుకున్నారు. ప్రాచీన, మధ్యయుగ సాహిత్యానికి ఆయన అందించిన అనుపమాన సేవలకు గుర్తింపుగా సాహిత్య అకాడమీ దీన్ని అందజేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆడిటోరి యంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయనకు అవార్డు ప్రదానం చేసి సత్క రించారు. 1948లో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించిన రామబ్రహ్మం సంస్కృతం, ఆంధ్రంలో విశేష పాండిత్యం గడించారు. ఇప్పటివరకు ఆరు ఆధ్యాత్మిక పుస్తకాలు ప్రచురించారు. సంస్కృత కవిత్వంపై 16, తెలుగు కవిత్వంపై 17 పుస్తకాలు రాశారు. పలు పుస్త కాలు ఇంకా ముద్రణలో ఉన్నాయి. ఇదివరకు ఏపీ belle shot on neblus వైజయంతిక, ఉత్తమ ఉపా నుంచి
ధ్యాయ, శ్రీసర్వా రాయ, కె. రాజమ న్నార్ అవార్డులు అందుకున్నారు. అను వాదంలో కేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సాహిత్య అకాడమీ మాధవ్ కౌశిక్ నుంచి భాషా సమ్మాన్ అవార్డూ స్వీకరిం అవార్డు స్వీకరిస్తున్న రామబ్రహ్మం చారు. ప్రెసిడెన్షియల్ అవార్డు, వాచస్పతి, అవధాని సుధాకర బిరుదులు, రెండు సార్లు స్వర్ణకంకణాలు అందుకున్నారు. హైదరాబాద్ యూనివర్శిటీలో తెలుగు విభాగం ప్రొఫెసర్గా పనిచేసి.
పదవీ విరమణ పొందిన తర్వాత సీసీఎల్టీలో ప్రొఫె సర్గాగా తిరిగి నియమితులయ్యారు. తెలుగు, సంస్కృత ప్రాచీన సాహిత్యంలో ఆయనకు విశేషానుభవం ఉంది. ఈ రంగంలో నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేశారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.