గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 11 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీశ్రీచక్రమది నాల్గు శివచక్రములు, వాటి నుండియే విడివడియున్న శక్తి

చక్రమ్ములైదుతోఁ జక్కఁగనున్నట్టి, సృష్టికి మూలమై చెలగుచున్న

తత్త్వమ్ముతోఁ గూడి తనరు నీ వాసమౌ శ్రీచక్రమందలి చెలగు కోణ

ములవష్టదళముల నలపద్మషోడశమును మేఖలాతంత్రముగను, మూడు

తే.గీభూపురములును కలిసిన మొత్తమటుల

నలుబదియునాలుగంచులు కలిగియుండె,

నమ్మ నీవాసమపురూపమైనదమ్మ!

నెమ్మి నిన్ను నే బూజింతునమ్మ నమ్మి. 11

భావము.

అమ్మా ఈశ్వరీ ~ శ్రీచక్రం~ నాలుగు శివచక్రాలు, వాటినుండి విడివడిన ఐదుశక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు~ అష్టదళాలు~ షోడశదళ పద్మాలు~ మేఖలాతంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు కలిగివున్నాయి.‌ 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.