చం. సురుచిరమైన నీ ముఖము, సుందర గండ యుగంబు గొప్పగా
మెరియుచు నీదు కమ్మల భ్రమింపగఁ జేసెడుఁ జక్రభాస సు
న్దర మరు తేరిఁ బోల, శశి ధత్ర సుచక్ర ధరా రథాన సుం
దరహరుఁడెక్కియుండ హరినందనుఁడేచుచుఁబ్రేమఁ గొల్పెనే. ॥
59 ॥
భావము.
అమ్మా ! విశాలమైన నీ చెక్కిళ్ళ పై , నీ చెవి తమ్మెల జత ప్రతిఫలిస్తోంది. అందువల్ల నీ చెవితమ్మల జంట ,వాటిరెండుప్రతిబింబాలూకలసిమొత్తంనాలుగుచక్రములుకాగా,నీముఖమునాలుగుచక్రములుగలమన్మథుడు ఎక్కిన రథము వలె నాకు తోస్తున్నది. ఈ నాలుగు చక్రముల రథాన్ని ఎక్కి మన్మథుడు మహా వీరుడై _ సూర్యుడు , చంద్రుడు అనే రెండు చక్రాలు మాత్రమే కల , భూమి అనే రథాన్ని త్రిపుర సంహార సమయంలో యుద్దానికి సిద్ధం చేసికొన్న ప్రమథాధిపతియైన శివుడికి ద్రోహం తలపెట్టాలనీ, శివుడి తోనే పోరాడాలనీపన్నాగంచేస్తున్నాడు.(అనగాశివుడికికూడామోహంకల్పించటానికిప్రయత్నించాడు.అందుకుసుందరమైనదేవిముఖంఅతనికితోడ్పడినది.)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.