జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శా. నీ సౌందర్యము
పోల్చఁ జాలరుభవానీ! బ్రహ్మయున్ సత్ కవుల్,
నీ సౌందర్యము గాంచి
యప్సరసలున్ నిన్బోలలేనందునన్
ధ్యాసన్ నిల్పి
మహేశ్వరున్ మనమునన్ ధ్యానించి తాదాత్మ్యతన్
భాసింపంగను
జూతురైక్యమగుచున్,
భద్రేభయానా! సతీ! ॥ 12 ॥
భావము.
ఓహిమవత్పర్వత రాజ తనయా ! నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలయిన కవి పుంగవులు కూడా సమర్ధులు కాకుండిరి. ఎందువలన అనగా సృష్టి లోని సౌందర్య రాశులు అయిన అప్సరసలు కూడా నీ అందమునకు ఆశ్చర్యము పొంది, తాము నీతో సరిపోలము అని మనస్సులో శివునితో ఐక్యము కోరుతున్నారుట.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.