చం. రణమున నోడి వీడిన శిరస్త్రులు,
చట్టలు నైన్
రాక్షసుల్
ఘనముగఁ గల్గి, యాత్రిపురుఁ
గాటికిఁ బంపిన శంభునిర్మలం
బును గొననట్టి యా స్థిరుఁడు, ముక్తినొసంగెడి
విష్ణువింద్రుఁడున్,
తినుదురు మాత! నీ వదన దివ్యపు
వీడ్యము జ్ఞానదీప్తికై. ॥
65 ॥
భావము.
తల్లీ
! సంగ్రామంలో
రాక్షసులను
జయించడం
చేత
కలిగినఆనందం
వల్ల , కిరీటాన్ని
(కాస్సేపు
అలసట
తీర్చుకోవడానికా
అన్నట్టు ) వదులు
చేసి , చండునికి
శివ
నిర్మాల్యాన్నిచ్చేసి
, నీ
నివాసానికొచ్చే
నీ
పుత్రాది
దేవతలు, నీ
నోటి
తాంబూలాన్ని
కోరుతారు. వాళ్ళేమన్నా
తక్కువ
వాళ్ళా? ఎటువంటి
యుద్ధంలోనైనా
సరే
గెలవడమే
తప్ప
ఓడడం
అనేది
యెరగని
వాళ్ళూ, రాక్షసులను
రాచి
రంపాన
పెట్టడంలో
వాళ్ళకు
వాళ్ళే
సాటియైన
వాళ్ళు
కదా !అయినా , నీ
ప్రసాదమైన
తాంబూలాన్ని
ఆశిస్తున్నారంటే
అందుకు
కారణం
అది
తెల్లగా
_ స్వచ్చంగా
_ పరిమళ
భరితంగా
ఉండి, అందు
లోని
పచ్చ
కర్పూరం
మొదలగునవి
నీవు
బాగా
నమిలి
ఉండడం
వల్ల
పరిపూర్ణ
జీర్ణకారి
కావడమే !
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.