గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 79 || రత్నాదేవి . .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శైలతనూజ! నీ నడుము చెన్నగు నీ స్తనభారమోపమిన్

బేలవమై కృశించి జడిపించును తా విఱుగంగనున్నటుల్

వాలిన యేటిగట్టుపయి వాలినచెట్టును బోలి, నీకికన్

మేలగుగాత, నీ నడుము మేలుగ వర్ధిలుగాక నిచ్చలున్. 79

భావము.

శైలతనయా ! నారీ తిలకమా ! సన్ననిదీ , పాలిండ్ల భారంచేత బడలినదీ క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నదీ , కట్టతెగిన ఏటిగట్టునందలి చెట్టుతో సమానమైన స్ధితిని పొందినదీ , ఐన నీ నడుము చిరకాలం సురక్షితంగా వుండుగాక ...

అమ్మా జగజ్జననీ, స్వభావ సిద్ధముగా పలుచగానున్న,  అలసట పొందినదైన, కొంచెముగా వంగిన, కొంచెము విడిగానున్న ఇడా పింగళా(స్తనద్వయ)మధ్య ప్రదేశము అయిన అనాహత చక్రము,  తెగిన నదీ గట్టునందలి వృక్షము వలె నున్న నీ నడుమునకు అనగా స్వాధిష్టాన చక్రమునకు క్షేమము అగుగాక.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.