జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చం. శివునకు
దేహమీవెగ, ప్రసిద్ధిగ
నీవల సూర్య
చంద్రులన్
గవలిగ
వక్షమందుగల కాంతవు
నిన్ శివుఁడంచు
నెంచినన్
బ్రవిమల
శేషి యా
శివుఁడు, వర్ధిలు
శేషము నీవె
చూడగా,
భవుఁడు
పరుండు,నీవు
పరభవ్యునిసంతసమమ్మరో! సతీ! ॥
34 ॥
భావము.
ఓ భగవతీ! నవాత్మకుఁడయిన శంభునకు సూర్యచంద్రులు వక్షోరుహములుగా కలిగి ఉన్న
నీవు శరీరమగుచున్నావు. కాబట్టి అతఁడు శేషి.
నీవు
శేషము అగుచున్నారు. ఆయన పరుఁడు. నీవు పరానందవు. మీ యిద్దరికినీ ఉభయ సాధారణ సంబంధము కలదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.