జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
సీ. ఆజ్ఞా
సుచక్రాన నలమనస్తత్త్వమై,
యలవిశుద్ధినిజూడ నాకసముగ,
వరయనాహతమునవాయుతత్త్వంబుగా,నామణిపూరమందగ్నిగాను,
జలతత్త్వముగ
నీవు కలిగి
స్వాధిష్ఠాన,నరయ
మూలాధారమందు పృథ్వి
గను
నీవె యుంటివి,
ఘనముగా సృష్టితో
పరిణమింపగఁ జేయ
వరలు నీవె
తే.గీ. స్వస్వరూపమున్
శివునిగా సరగున
గని
యనుపమానందభైరవునాకృతి
గను
ధారణను
జేయుచున్ నీవు
స్మేర ముఖిగ
నుండి
భక్తులన్ గాచుచు
నుందువమ్మ. ॥ 35 ॥
భావము.
ఆజ్ఞాచక్రమునందలి మనస్తత్వమును, విశుద్ధిలోని ఆకాశతత్వమును, అనాహతలోని వాయుతత్వమును, మణిపురలోని అగ్నితత్వమును, స్వాధిష్ఠానలోని జలతత్వమును, మూలాధారచక్రములోని పృధ్వితత్వమును,
నీవే తప్ప ఇంకొకరు లేరు. నీవే నీ స్వస్వరూపమును ప్రపంచరూపముతో
పరిణమింపచేయుటకు, చిచ్ఛక్తియుతుడైన ఆ ఆనంద భైరవుని లేదా శివ తత్వమును శివయువతి
భావముచే ధరించుచున్నావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.