జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శా. అమ్మా! నిత్యవు! నీపదాబ్జ జనితంబౌకాంతులే సిద్ధులో
యమ్మావాటికి మద్ధ్యనున్న నిను తామంచుం గాంచు భక్తుండు తా
నెమ్మిన్ సాంబు సమృద్ధినైన గొనఁ డా నిత్యాత్మునే యెన్నుచున్
సమ్మాన్యంబుగ హారతిచ్చతనికిన్, శంభుస్థ కాలాగ్నియున్. 30.
భావము.
ఓ ఆద్యంతాలు లేని మాతా! నీ పాదాలనుండి జనించిన కాంతులైన అణిమాది అష్టసిద్దులచే పరివేష్టింప బడియున్న నీదివ్యరూపాన్ని ఏ భక్తుడైతే పూర్తి తాదాత్మ్యంతో ధ్యానిస్తాడో అతడు త్రినయనుడని పేరుగల సదాశివుడి నిండు ఐశ్వర్యాన్ని కూడా తృణీకరించగలడు. . ఆ సాధకుడికి మహాప్రళయకాలంలో జ్వలించిన అగ్ని నీరాజనం
గావించటంలో ఆశ్చర్యమేముంది? ( శ్రీదేవితో తాదాత్మ్యం
పొందిన సాధకుడు శ్రీదేవియే .ఆమెకు ప్రళయాగ్ని నీరాజనాలర్పిస్తుంది ) . జగత్తు
ప్రణమిల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.