జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
సీ. నీదు
మూలాధార నిర్మల
చక్రాన సమయా
యనెడిశక్తిసహితులగుచు
ప్రవర
శృంగారాది నవరసములనొప్పు,
ప్రళయతాండవనాట్యకలిత శివుని
సులలితపు
నవాత్మునిలను నానందభైరవునిగాఁదలచెద,
ప్రళయ దగ్ధ
లోకాల
సృజనకై శ్రీకరముగ
కూడి యిటులొప్పు
మీచేత యీ
జగమ్ము
తే.గీ. తల్లిదండ్రులు
కలదిగా తలతు
నేను,
లోకములనేలు
తలిదండ్రులేకమగుచు
దివ్యదర్శనభాగ్యమీ
దీనునకిడ
వేడుకొందును,
నిలుడిల నీడవోలె. ॥
41 ॥
భావము.
నీ మూలాధార
చక్రమునందు నృత్యాసక్తిగల
‘సమయా’ అనే పేరుగల
శక్తితోకూడి, శృంగారాది
నవరసములతో నొప్పారుచు ప్రళయమునందు అద్భుతమైన
తాండవ నాట్యమును
అభినయించు శివుని
తలచెదను. నవాత్మునిగా తలచెదను. ఆనందభైరవునిగా తలచెదను. ప్రళయాగ్నికి దగ్ధమైన
లోకములను మరల జగదుత్పత్తి
కార్యమును ఉద్దేశించి
ఈ ఆనంద మహాభైరవులచేత
కరుణచేత, ఈ ఇద్దరి కలయికతో
ఈ జగత్తు తల్లీ
తండ్రి కలదని
తెలుసుకొనుచున్నాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.