జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
మ. స్మర
బీజంబును, యోని
బీజమును, శ్రీ
మాతృప్రభా బీజమున్,
వరలన్
నీదగు నామమంత్రములకున్
ప్రారంభమున్ నిల్పుచున్
వరచింతామణితావళాంచితులు
సద్భావుల్ శివాగ్నిన్
నినున్
బరమానందము
తోడఁ జేయుదురు
సద్భావంబుతో హోమమున్, ॥
33 ॥
భావము.
ఓ నిత్యస్వరూపిణీ! నీ మంత్రానికి ముందు కామరాజబీజం , భువనేశ్వరీ బీజం,
లక్ష్మీ బీజం, ( ఈ మూడింటి ఐం హ్రీం శ్రీం ) కలిపి నిరవధిక మహాభోగరసికులు సకల సిరులను వాంఛిస్తూ , చింతామణులనే రత్నాలతో కూర్పబడిన అక్షమాలలను చేతుల్లో ధరించి , కామధేనువుయొక్క నేతి ధారలతో శివాగ్నిలో అనేక ఆహుతులర్పిస్తూ , హోమం చేస్తూ నిన్ను సేవించుచున్నారు
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.